చరిత్ర కనీవినీ ఎరగని రీతిలో అమెరికాను అతలాకుతలం చేసింది జోనాహ్. దాదాపు 50 గంటలపాటు తన ప్రకోపాన్ని కుమ్మరించిన ఆ మంచు తుఫాను పలు రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలను తోడేసింది. తుఫాన్ ఉధృతి తగ్గి, మేఘాలు కాస్త పక్కకు జరిగిన సమయంలో నాసా ఉపగ్రహం ల్యాండ్ స్టార్ 8.. విలయం తాలూకు ఫొటోలను చిత్రీకరించింది.
అంతరిక్షం నుంచి తీసిన ఫొటోల్లోనూ జోనాహ్ మంచు తుఫాను బీభత్సం కళ్లకు కట్టినట్లు కనిపించడం గమనార్హం. వాషింగ్టన్ తోపాటు వర్జీనియా, మేరీలాండ్ రాష్ట్రాలనూ పైనుంచి ఫొటోలు తీసి పంపింది ల్యాండ్ స్టార్. తుఫాను ధాటికి ప్రపంచ ప్రఖ్యాత మిచిగావ్ సరస్సుకూడా గడ్డకట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ సరస్సులో చిక్కుకుపోయిన భారీ నౌకను ఓ ఔత్సాహికుడు డ్రోన్ సహాయంతో ఫొటోలు తీశాడు.