satilite images
-
‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు గాను జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగంలో భాగంగా ఇన్శాట్-3డీఎస్లోని 6-ఛానల్ ఇమేజర్, 19-ఛానల్ ఇమేజర్ భూ చిత్రాలను తీసింది. ఆ చిత్రాల సాయంతో దేశ వాతావరణ పర్యవేక్షణ, అంచనా సామర్థ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.ఇన్శాట్-డీఎస్ తీసిన చిత్రాలు వాతావరణ అంచనా, వాతావరణ పర్యవేక్షణ, వాతావరణ పరిశోధనల కోసం కీలకమైన డేటాను అందించడానికి ఉపయోగపడతాయని ఇస్త్రో ప్రకటించింది. 6-ఛానల్ ఇమేజర్ భూమి ఉపరితలం, వాతావరణ చిత్రాలను ఒడిసిపట్టింది. ఈ చిత్రాల సాయంతో భూమి ఉపరితల ఉష్ణోగ్రత, వృక్ష ఆరోగ్యం, నీటి ఆవిరి పంపిణీ వంటి వివిధ వాతావరణ, ఉపరితలాల సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. 19-ఛానల్ ద్వారా సేకరించే చిత్రాల సాయంతో భూమి వాతావరణం ద్వారా విడుదలయ్యే రేడియేషన్‌ను వివిధ వాతావరణ భాగాలు, నీటి ఆవిరి, ఓజోన్, కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువుల వంటి లక్షణాల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గురించి తెలుసుకునేందుకు సహా పడతాయి. -
అంతరిక్షం నుంచి అయోధ్య చిత్రాలు..!
లక్నో: రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22(సోమవారం)న జరగనుంది. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి తీసిన రామ మందిర దృశ్యాలను ఇస్రో పంచుకుంది. ఇస్రో ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)ఈ దృశ్యాలను తీసింది. డిసెంబర్ 16, 2023న నిర్మాణంలో ఉన్న ఆలయం ఫొటోలు తీసింది. ఉపగ్రహ చిత్రాలలో నూతనంగా అభివృద్ధి చేసిన దశరథ్ మహల్, సరయు నది కూడా రామమందిరం సమీపంలో చూడవచ్చు. కొత్తగా పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను NRSC షేర్ చేసిన చిత్రాలలో కూడా చూడవచ్చు. ఆలయ మొదటి దశ పూర్తి కావొస్తోంది. జనవరి 22న బాలరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశంలో ప్రముఖులతో కలిపి మొత్తం 7000 మందికి ఆహ్వానాలు అందాయి. సాంప్రదాయ నగారా శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు-పడమర దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్, అవునా.. నిజమా?!
గ్రహాంతర జీవనం.. మనిషికి ఎప్పటికీ ఓ ఆసక్తికర అంశమే. ముఖ్యంగా గ్రహాంతర జీవుల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం.. అందుకోసం బిలియన్ల డాలర్లు వెచ్చించే చేసే పరిశోధనలు ఆ ఆసక్తి ఏపాటిదో చెప్పకనే చెప్తుంటాయి. అయితే ఇన్నేళ్లలో ఏలియన్ లైఫ్ గురించి ఓ క్లారిటీ కాదు కదా కనీసం ఓ అంచనా కూడా రాలేకపోయారు. అయినప్పటికీ రకరకాల థీయరీలు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చిన ప్రచారం ఏంటంటే.. సెప్టెంబర్ 2న నల్లని ఆకారంలో ఉన్న వస్తువు ఒకటి అంతరిక్షంలో కనిపించింది. ‘బ్లాక్ నైట్ శాటిలైట్ కాన్స్పిరెన్సీ థియరీ’.. ప్రకారం ఇది అన్ఐడెంటిఫైడ్ అండ్ మిస్టీరియస్ శాటిలైట్ అంటూ ఓ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రచారం మొదలైంది. ఇక సైంటిస్టులేమో ‘బ్లాక్ నైట్ శాటిలైట్’ అని పేరు కూడా పెట్టారు. ఇంకో విశేషం ఏంటంటే.. 1930 నుంచి ఈ శాటిలైట్ నుంచి వింత రేడియో సిగ్నల్స్ వెలువడుతున్నాయి. అలా ఇది గ్రహాంతరవాసులకు చెందిన శాటిలైట్‌గా ప్రచారం మొదలుపెట్టారు. నాసా, సొవియట్ యూనియన్లు స్పేస్‌లోకి ఉపగ్రహాలు పంపక ముందు నుంచే ఇది పని చేస్తుందన్నమాట. టిక ఈ మిస్టరీ శాటిలైట్ గత పది రోజుల్లో విపరీతంగా షేర్ అయ్యింది. మరి నాసా దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం.. అదసలు శాటిలైట్ కాదని తేల్చేసింది నాసా. 1998లో స్పేస్ షెట్టల్ మిషన్‌లో భాగంగా.. ఇదొక శకలంగా గుర్తించారు. డిసెంబర్ 11, 1998న దీనిని ఫొటో తీశారు కూడా. ఇలాంటి శకలాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నాసా చెబుతోంది. ఒక్కోసారి రాకెట్ల నుంచి వదిలే శకలాలు కూడా ఇలా భూ కక్క్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. లేదంటే విశ్వంలో విస్పోటనాల వల్ల కూడా శకలాలు విడుదల కావొచ్చని చెప్తున్నారు. పైగా భూ కక్క్ష్యలో ఇలాంటి ముక్కలు పాతిక వేల దాకా ఉన్నట్లు నాసా చెబుతోంది. కాబట్టి.. భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్ అనేది ఉత్త ప్రచారమే అని నాసా తేల్చేసింది. చదవండి: వారెవ్వా.. ఖగోళంలో మునుపెన్నడూ చూడని దృశ్యం ఇది -
Mars: మార్స్ మీద మంచు.. ఇసుక
ఇసుక తిన్నెల్లో మంచుతో ఫొటో బాగుంది కదూ.. ఎక్కడిదీ ఫొటో తెలుసా? ఆ.. ఏముందీ.. ఏదో ఓ ఎడారిలో తీసి ఉంటారు అనుకుంటున్నారా.. కాదు.. ఇది ఎడారిలోనో, ఆ చుట్టూ ఉన్న ఏదో ఓ దేశంలోనో తీసిన ఫొటో కాదు. అసలు భూమి మీద ఏ ప్రాంతం కూడా కాదు.. మనకు కోట్ల కిలోమీటర్ల దూ రంలో ఉన్న అంగారక గ్రహం (మార్స్) మీద తీసిన ఫొటో ఇది. అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ‘మార్స్ ఆర్బిటార్’ శాటిలైట్ తీసిన ఫొటో ఇది. మార్స్ మీద ఉన్న ఓ పేద్ద బిలంలో ఉన్న ఇసుక తిన్నెలను ‘మార్స్ ఆర్బిటార్’కు అమర్చిన హైరైజ్ కెమెరాతో చిత్రీకరించారు. సౌర కుటుంబంలో మన భూమి మాత్రమేనా.. మరో గ్రహం మీద మనిషి బతకగలడా.. అంతరిక్ష శాస్త్రవేత్తల్లో చాలా మందిని తొలిచేస్తున్న ప్రశ్నలివి. శాస్త్రవేత్తలకే కాదు చాలా మంది సాధారణ జనానికీ ఇదే ఆసక్తి. అందుకే భూమితో పోలిస్తే దగ్గరి పోలికలు ఉండే అంగారకుడిపై శాస్త్రవేత్తలు ఏనాడో దృష్టి పెట్టారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా చాలా దేశాలు మార్స్ దగ్గరికి శాటిలైట్లను, ఆర్బిటర్లను పంపాయి. అలా నాసా పంపిన ‘మార్స్ ఆర్బిటర్’ అంగారకుడికి సంబంధించిన ఎన్నో రహస్యాలను గుర్తించింది. ఈ క్రమంలోనే తాజాగా ఫొటోలు పంపింది. ఆ ఫొటోలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. అంగారకుడిపై మంచు ఏర్పడుతూ, అప్పుడప్పుడూ కరిగి ప్రవహిస్తోందని గుర్తించారు. అందుకే కాలువల్లాంటి నిర్మాణాలు ఏర్పడినట్టు తేల్చారు. ఇక్కడ చదవండి: మార్స్‌పై తొలి నగరం ఇలా ఉంటుందా..! మార్స్ సంచలన నిజాలు బయటపెట్టిన నాసా...! -
ఉత్తరాఖండ్: ‘కలవరపెడుతోన్న సరస్సు’
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ధౌలిగంగా నది భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందగా.. 204 మంది గల్లంతయ్యారు. ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్ట్ తపోవన్ సొరంగంలో ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. ప్రమాదం తర్వాత హిమాలయ మంచు పర్వతాల్లో ఓ ‘ప్రమాదకర సరస్సు’ ఏర్పడినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు, సరస్సుకు సంబంధించిన మరింత సమాచారం కోసం విశ్లేషణ జరపడంతోపాటు వరద ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. దుర్ఘటన జరిగిన రైనీ గ్రామానికి సమీపంలో కొత్తగా ఓ సరస్సు ఏర్పడినట్లు నిపుణులు గుర్తించారు. దాదాపు 350 మీటర్ల పొడవు.. 60 మీటర్ల ఎత్తులో ఈ ప్రమాదకర సరస్సు ఏర్పడినట్లు వెల్లడించారు. మరో ఆందోళనకర అంశం ఏంటంటే సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ఇది ఇలానే కొనసాగితే మరో ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచు కరుగుతున్న కొద్ది నీటిమట్టం పెరుగుతోంది. ఫలితంగా సరస్సు ఏ క్షణమైనా ఉప్పొంగి మరోసారి వరదలు సంభవించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇదే జరిగితే ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని.. వీటి నుంచి బయటపడేందుకు ప్రణాళిక రచిస్తున్నామని ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ, ‘‘రైనీ గ్రామానికి సమీపంలో ఏర్పడిన సరస్సు గురించి మాకు తెలిసింది. మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీనిపై పని చేస్తోన్న శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎయిర్ డ్రాఫ్ట్ నిపుణులను పంపి పరిస్థితిని సమీక్షిస్తాం’’ అన్నారు. ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంతంలో సరస్సు ఏర్పడిందని తెలిసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్త దళాలను అక్కడకు పంపాము’’ అన్నారు. చదవండి: ఉత్తరాఖండ్ జలవిలయం: ఓ కుక్క కథ! జల విలయం నేర్పుతున్న గుణపాఠం -
చైనా దుస్సాహసం.. భారత్‌లో గ్రామం
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా డ్రాగన్ మరో దుస్సాహసానికి దిగింది. అరుణాచల్ ప్రదేశ్ వెంబడి భారత భూభాగంలోకి 4.5కిలోమీటర్ల మేర చొచ్చుకురావడమే కాక అక్కడ ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. దాదాపు 101 ఇళ్లు ఉన్న ఈ గ్రామం శాటిలైట్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతున్నాయి. అయితే గతేడాది నవంబర్లోనే చైనా డోక్లాం ఘర్షణ స్థావరానికి అతి సమీపంలో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. తాజాగా వాస్తవ సరిహద్దుకు కేవలం 4.5కిలోమీటర్ల దూరంలోనే మరో గ్రామాన్ని ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇక తాజాగా చైనా నిర్మించిన గ్రామం భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎగువ సుబన్సిరి జిల్లా సారి చు నది ఒడ్డున ఏర్పడింది. ఇక్కడ ఎల్లప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. (చదవండి: ఆగని డ్రాగన్ ఆగడాలు) ఇక ప్రస్తుతం చైనా గ్రామాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతానికి సంబంధించి 2019, ఆగస్టు నాటి శాటిలైట్ ఫోటోల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోగా.. 2020, నవంబర్ నాటి చిత్రాల్లో వరుసగా ఉన్న ఇళ్లు దర్శనమిచ్చాయి. అంటే ఏడాది వ్యవధిలోనే చైనా ఇక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ ఫోటోలని బట్టి తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించగా.. సరిగా స్పందించలేదని తెలిసింది. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపట్టిన నిర్మాణ పనులను ఇండియా జాగ్రత్తగా గమనిస్తోంది. గతకొన్నేళ్లుగా చైనా సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపడుతోంది’’ అని తెలిపినట్లు సమాచారం. (చదవండి: మా ఓపికను పరీక్షించొద్దు!) గతంలోనే హెచ్చరించిన బీజేపీ ఎంపీ ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చేపట్టిని నిర్మణాల గురించి గతేడాది నవంబర్లోనే ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ తపిర్ గావో ప్రస్తావించారు. లోక్‌సభలో చైనా చొరబాట్ల గురించి, ప్రత్యేకంగా ఎగువ సుబున్సిరి జిల్లా గురించి హెచ్చరించారు. ఇక తాజాగా దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా ఎగువ సుబన్సిరి జిల్లాలో నది వెంబడి 60-70 కిలోమీటర్లు లోనికి ప్రవేశించింది. ఇక్కడ ఓ డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం కూడా చేపడుతోంది’ అన్నారు. ఇక గతేడాది గల్వాన్ ఘర్షణ అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. -
ఇకపై ఫోన్లు పనిచేయవ్... కారణం?
లండన్: ఇప్పటి వరకు ప్రపంచం అంతా కరోనా మహమ్మారి పై పోరాడుతూ దానికి ఒక పరిష్కారం వెతకడంలో సతమతమవుతోంది. అయితే ఇప్పుడు మరో సమస్య రాబోతుందని శాస్త్రవేత్తలంటున్నారు. అయితే ఈ సమస్య వైరస్‌లకు, బ్యాక్టీరియాలకు సంబంధించినది, ఆరోగ్యానికి సంబంధించినది కాదు. టెక్నాలజీకి సంబంధించింది. మొబైల్ ఫోన్... ఇప్పుడు ఇది మన సాధారణ జీవితంలో ఒక భాగమైపోయింది. మొబైల్ లేనిదే బయటకు వెళ్లలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే మొబైల్ ద్వారానే నేడు ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా పుట్టికొచ్చిన సమస్య ద్వారా మొబైల్ ఫోన్లు, శాటిలైట్లు ఆగిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... (‘రీ ఓపెన్ అమెరికా’పై బాట్స్ ఉద్యమం) భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఇది మనల్ని సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటమే కాకుండా మన మొబైల్ సిగ్నల్, శాటిలైట్ సిగ్నల్స్ అందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు అందులో కొంత భాగం బలహీన పడిపోయిందంట. అయితే ఎందుకు అలా జరుగుతోంది అన్న విషయం మాత్రం ఎవరికి అంతుచిక్కడం శాటిలైట్ల డేటా ఆధారంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా మధ్య ఈ బలహీనత ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సౌత్ అట్లాంటిక్ ఎనామలీ అని పిలిచే ప్రాంతం కొన్నేళ్లుగా విస్తరిస్తూ ఉందంట. దీని అర్థం ఏంటంటే... అయస్కాంత క్షేత్రాల బలహీనత రానూరానూ ఎక్కువ ప్రాంతానికి విస్తరిస్తోందని అర్థం. ఇంతకుముందు 24000 నానాటెస్లాస్ ఉండే అయస్కాంత క్షేత్ర బలం కాస్త ఇప్పుడు 22000 నానోటెస్లాస్‌కి చేరిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సైంటిస్టులు చెప్పారు. ఈ ఎనామలీ ఏరియా... ఏటా 20 కిలోమీటర్లు అదనంగా పడమర వైపు విస్తరిస్తోందని తెలిపారు. తాజాగా... నైరుతీ ఆఫ్రికాలో మరో కొత్త ఎనామలీ మొదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకే ఎనామలీ రెండుగా ముక్కలైందని వారు భావిస్తున్నారు. దీనిలో ప్రధాన సమస్య ఏంటంలే ఈ ఎనామలీ ఈమధ్య కాలంలో చాలా వేగంగా విస్తస్తోంది. దీనికి సంబంధించి ఈఎస్ఏ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.... భూమిలో ఉత్తర, దక్షిణ ధ్రువాల అయస్కాంత క్షేత్రం తలకిందులుగా అవ్వడమే అయస్కాంత క్షేత్రం బలహీనంగా అవ్వడానికి కారణం. దీని అర్థం ఉత్తర ధ్రువంలో ఉండే అయస్కాంత క్షేత్రం దక్షిణ ధ్రువానికీ, దక్షిణ ధ్రువంలో ఉండే అయస్కాంత క్షేత్రం ఉత్తర ధ్రువానికీ చేరినట్లన్నమాట. ఇలా ప్రతి 250000 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది అని తెలిపారు. ఇదిలా ఉండగా ఒక వేళ ఈఎస్ఏ చెప్పిందే నిజమైతే ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ల కమ్యూనికేషన్ కొంతవరకూ దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే టెలికం నెట్వర్కులు, మొబైల్ ఫోన్లు కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతవరకూ పనిచేయకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఈ రెండు ఎనామలీలు ఉన్న ప్రాంతాల్లో వెళ్లే విమానాలు సరిగా పనిచేయకపోవచ్చని కూడా పరిశోధకలు చెబుతున్నారు. అయితే మరోవైపు వేరే రకమైన వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి శాటిలైట్లు, మొబైళ్లకు ఏ సమస్య రాలేదు కాబట్టి, ఇకపై కూడా రాకపోవచ్చనే అంచనా వేస్తోన్నారు. అయస్కాంత క్షేత్రం తలకిందులు అవ్వడం అనేది ఒక్క రోజులో జరగదు, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. (ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా) -
డోక్లాంలో మళ్లీ రోడ్డేసిన చైనా
-
డోక్లాంలో మళ్లీ రోడ్డేసిన చైనా
న్యూఢిల్లీ: సిక్కింకు తూర్పు దిక్కున డోక్లాం ప్రాంతంలో చైనా తాజాగా రెండు రోడ్లను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలు తెలుపుతున్నాయి. గతంలో సరిహద్దులోచైనా రోడ్డు నిర్మాణ పనులను భారత్ వ్యతిరేకించడంతో డోక్లాంలో ఇరు దేశాలు సైనికులను మోహరించడం తెలిసిందే. 70 రోజుల ప్రతిష్టంభన తర్వాత ఇరుదేశాలూ ఆ ప్రాంతంలో సైన్యాన్ని ఉపసంహరించాయి. ఆ తర్వాత కూడా చైనా 1, 1.2 కిలో మీటర్ల పొడవైన రెండు రోడ్లను సరిహద్దులో నిర్మించినట్లు, గతంలో సైనికులను మోహరించిన చోటుకు అవి వరసగా 4.5 కిలోమీటర్లు, 7.3 కి.మీ దూరంలో ఉన్నట్లు తాజాగా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. గత 13 నెలల కాలానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలించగా, ఈ రెండు రోడ్లు అక్టోబర్ 17 నుంచి డిసెంబర్ 8 మధ్య నిర్మితమైనట్లు స్పష్టమవుతోంది. -
అగ్రరాజ్యమా? మంచుయుగపు దేశమా?
చరిత్ర కనీవినీ ఎరగని రీతిలో అమెరికాను అతలాకుతలం చేసింది జోనాహ్. దాదాపు 50 గంటలపాటు తన ప్రకోపాన్ని కుమ్మరించిన ఆ మంచు తుఫాను పలు రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలను తోడేసింది. తుఫాన్ ఉధృతి తగ్గి, మేఘాలు కాస్త పక్కకు జరిగిన సమయంలో నాసా ఉపగ్రహం ల్యాండ్ స్టార్ 8.. విలయం తాలూకు ఫొటోలను చిత్రీకరించింది. అంతరిక్షం నుంచి తీసిన ఫొటోల్లోనూ జోనాహ్ మంచు తుఫాను బీభత్సం కళ్లకు కట్టినట్లు కనిపించడం గమనార్హం. వాషింగ్టన్ తోపాటు వర్జీనియా, మేరీలాండ్ రాష్ట్రాలనూ పైనుంచి ఫొటోలు తీసి పంపింది ల్యాండ్ స్టార్. తుఫాను ధాటికి ప్రపంచ ప్రఖ్యాత మిచిగావ్ సరస్సుకూడా గడ్డకట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ సరస్సులో చిక్కుకుపోయిన భారీ నౌకను ఓ ఔత్సాహికుడు డ్రోన్ సహాయంతో ఫొటోలు తీశాడు.