గ్రహాంతర జీవనం.. మనిషికి ఎప్పటికీ ఓ ఆసక్తికర అంశమే. ముఖ్యంగా గ్రహాంతర జీవుల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం.. అందుకోసం బిలియన్ల డాలర్లు వెచ్చించే చేసే పరిశోధనలు ఆ ఆసక్తి ఏపాటిదో చెప్పకనే చెప్తుంటాయి. అయితే ఇన్నేళ్లలో ఏలియన్ లైఫ్ గురించి ఓ క్లారిటీ కాదు కదా కనీసం ఓ అంచనా కూడా రాలేకపోయారు. అయినప్పటికీ రకరకాల థీయరీలు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి.
తాజాగా వచ్చిన ప్రచారం ఏంటంటే.. సెప్టెంబర్ 2న నల్లని ఆకారంలో ఉన్న వస్తువు ఒకటి అంతరిక్షంలో కనిపించింది. ‘బ్లాక్ నైట్ శాటిలైట్ కాన్‌స్పిరెన్సీ థియరీ’.. ప్రకారం ఇది అన్‌ఐడెంటిఫైడ్ అండ్ మిస్టీరియస్ శాటిలైట్ అంటూ ఓ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ప్రచారం మొదలైంది. ఇక సైంటిస్టులేమో ‘బ్లాక్ నైట్ శాటిలైట్’ అని పేరు కూడా పెట్టారు. ఇంకో విశేషం ఏంటంటే.. 1930 నుంచి ఈ శాటిలైట్ నుంచి వింత రేడియో సిగ్నల్స్ వెలువడుతున్నాయి. అలా ఇది గ్రహాంతరవాసులకు చెందిన శాటిలైట్‌గా ప్రచారం మొదలుపెట్టారు. నాసా, సొవియట్ యూనియన్‌లు స్పేస్‌లోకి ఉపగ్రహాలు పంపక ముందు నుంచే ఇది పని చేస్తుందన్నమాట. టిక ఈ మిస్టరీ శాటిలైట్ గత పది రోజుల్లో విపరీతంగా షేర్ అయ్యింది. మరి నాసా దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం..
అదసలు శాటిలైట్ కాదని తేల్చేసింది నాసా. 1998లో స్పేస్ షెట్టల్ మిషన్‌లో భాగంగా.. ఇదొక శకలంగా గుర్తించారు. డిసెంబర్ 11, 1998న దీనిని ఫొటో తీశారు కూడా. ఇలాంటి శకలాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నాసా చెబుతోంది. ఒక్కోసారి రాకెట్ల నుంచి వదిలే శకలాలు కూడా ఇలా భూ కక్క్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. లేదంటే విశ్వంలో విస్పోటనాల వల్ల కూడా శకలాలు విడుదల కావొచ్చని చెప్తున్నారు. పైగా భూ కక్క్ష్యలో ఇలాంటి ముక్కలు పాతిక వేల దాకా ఉన్నట్లు నాసా చెబుతోంది. కాబట్టి.. భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్ అనేది ఉత్త ప్రచారమే అని నాసా తేల్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment