వాషింగ్టన్ డీసీ : రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (సీఏటీఎస్) 2020- 2021 ఏడాదికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. అధ్యక్షురాలిగా సుధారాణి కొండపు ఉపాధ్యక్షులుగా సతీష్ వడ్డీ, కార్యదర్శి గా దుర్గాప్రసాద్ గంగిశెట్టి, కోశాధికారిగా పార్థసారథి బైరెడ్డి, సాంస్కృతిక కార్యదర్శిగా హరీష్ కుమార్ కొండమడుగు, కమ్యూనిటీ సర్వీస్ కార్యదర్శిగా రామచంద్రరావు ఆరుబండి ఎన్నికయ్యారు. ధర్మకర్తలుగా ప్రవీణ్ కాటంగురి, గోపాల్ నున్న, వెంకట్ కొండపోలు నియమితులయ్యారు.
కార్యక్రమంలో పాల్గొన్న కాట్స్ మాజీ అధ్యక్షుడు రవి బొజ్జ నూతన అధ్యక్షురాలికి పదవీ బాధ్యతలు అప్పగించారు. సహాయ కార్యదర్శి శ్రీనివాస్ వూట్ల నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. సలహాదారులు భువనేష్ బూజాల, మధు కోల, భాస్కర్ బొమ్మారెడ్డి, అనిల్ నీరుకొండతో పాటు కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, చిత్తరంజన్ నల్లు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
అనుభవజ్ఞుల సలహాలతో, కొత్తగా కార్యవర్గంలో చేరినవారి ఆలోచనలను రంగరిస్తూ పనిచేస్తామని సుధారాణి అన్నారు. తెలుగు భాష, సాహితీ రంగాలకు పెద్దపీట వేస్తూ, అంతరించిపోతున్న జానపదాలు, నాటకాలను పునరుజ్జీవం చేసే కార్యక్రమాలను చేస్తామని పేర్కొన్నారు. డీసీ మెట్రో ప్రాంతానికి చెందిన తెలుగు వారందరికీ మరింత చేరువయ్యే క్రీడా,సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రతీ నెలా చేపట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సుధారాణి వెల్లడించారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవా కార్యక్రమాలను తమ పరిధిలో మరింత విస్తృత పరిచేలా కాట్స్ కార్యవర్గం నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె చెప్పారు.
కాట్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
Published Fri, Jan 24 2020 9:46 PM | Last Updated on Fri, Jan 24 2020 9:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment