కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు మనుషుల జీవితంలో భాగమైపోయాయి. అయితే వీటి పోషణ ఆశామాషీ కాదు. చాలా ఖర్చవుతుంది. కానీ మరేం పర్వాలేదు.. మాకు అయ్యే ఖర్చును మేమే సంపాదించుకుంటాం అంటున్నాయి చైనాలోని పెట్స్. వీటికి జాబ్స్ ఇస్తున్నాయి అక్కడి కొన్ని కేఫ్‌లు.
చాలా మంది చైనీయులు తమ పెట్స్‌ను వెంటబెట్టుకుని రెస్టారెంట్‌లకు, కేఫ్‌లకు వెళ్తుంటారు. ఇందుకోసమంటూ చైనాలో ప్రత్యేకంగా పెట్ కేఫ్‌లు ఉన్నాయి. తమ యజమానులతో పాటు పెట్స్ కూడా చిల్ అయ్యేందుకు, వినోదం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఇందుకోసం పెట్ డాగ్స్, క్యాట్స్‌ను నియమించుకుంటున్నాయి ఈ కేఫ్‌లు.
తమ పెంపుడు కుక్కలు, పిల్లులను ఈ కేఫ్‌లలో పని చేయడానికి పంపుతున్నారు వాటి యజమానులు. దీని ద్వారా అవి తోటి జంతువులతో కలవడంతోపాటు తిండిని సంపాదించుకోవడానికి వీలు కలుగుతోంది. Zhengmaotiaoqian లేదా earn snack money అని పిలుస్తున్న ఈ ట్రెండ్ చైనాలోని పెంపుడు జంతువులను ప్రేమించే కమ్యూనిటీలో విజయవంతమైంది.
పెంపుడు జంతువుల "ఉద్యోగుల" కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటనలు, సీవీలు జియావోహోంగ్‌షూ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. జేన్ జుయే అనే ఆమె తన రెండేళ్ల పెంపుడు కుక్కను ఫుజౌలోని డాగ్ కేఫ్‌కి పంపుతోంది. దీని వల్ల తనకు ఏసీ ఖర్చులు ఆదా అవుతున్నట్లు సీఎన్‌ఎన్‌కి చెప్పారు. అయితే అన్ని పెట్స్‌కూ జాబ్స్ దొరకడం కష్టం. జిన్ జిన్ అనే వ్యక్తి తన రెండేళ్ల పిల్లికి జాబ్ కోసం వెతుకుతున్నారు. జియావోహోంగ్‌షూలో సీవీ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment