CATS
-
కుక్కలు, పిల్లులకు జాబ్స్.. ఉద్యోగులవుతున్న పెట్స్!
కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు మనుషుల జీవితంలో భాగమైపోయాయి. అయితే వీటి పోషణ ఆశామాషీ కాదు. చాలా ఖర్చవుతుంది. కానీ మరేం పర్వాలేదు.. మాకు అయ్యే ఖర్చును మేమే సంపాదించుకుంటాం అంటున్నాయి చైనాలోని పెట్స్. వీటికి జాబ్స్ ఇస్తున్నాయి అక్కడి కొన్ని కేఫ్‌లు.చాలా మంది చైనీయులు తమ పెట్స్‌ను వెంటబెట్టుకుని రెస్టారెంట్లకు, కేఫ్‌లకు వెళ్తుంటారు. ఇందుకోసమంటూ చైనాలో ప్రత్యేకంగా పెట్ కేఫ్‌లు ఉన్నాయి. తమ యజమానులతో పాటు పెట్స్ కూడా చిల్ అయ్యేందుకు, వినోదం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఇందుకోసం పెట్ డాగ్స్, క్యాట్స్‌ను నియమించుకుంటున్నాయి ఈ కేఫ్‌లు.తమ పెంపుడు కుక్కలు, పిల్లులను ఈ కేఫ్‌లలో పని చేయడానికి పంపుతున్నారు వాటి యజమానులు. దీని ద్వారా అవి తోటి జంతువులతో కలవడంతోపాటు తిండిని సంపాదించుకోవడానికి వీలు కలుగుతోంది. Zhengmaotiaoqian లేదా earn snack money అని పిలుస్తున్న ఈ ట్రెండ్ చైనాలోని పెంపుడు జంతువులను ప్రేమించే కమ్యూనిటీలో విజయవంతమైంది.పెంపుడు జంతువుల "ఉద్యోగుల" కోసం రిక్రూట్మెంట్ ప్రకటనలు, సీవీలు జియావోహోంగ్‌షూ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. జేన్ జుయే అనే ఆమె తన రెండేళ్ల పెంపుడు కుక్కను ఫుజౌలోని డాగ్ కేఫ్‌కి పంపుతోంది. దీని వల్ల తనకు ఏసీ ఖర్చులు ఆదా అవుతున్నట్లు సీఎన్ఎన్కి చెప్పారు. అయితే అన్ని పెట్స్‌కూ జాబ్స్ దొరకడం కష్టం. జిన్ జిన్ అనే వ్యక్తి తన రెండేళ్ల పిల్లికి జాబ్ కోసం వెతుకుతున్నారు. జియావోహోంగ్షూలో సీవీ పెట్టారు. -
ఉద్యోగానికి ఓకే
సమోయెడ్ జాతికి చెందిన ఓకే అనే రెండేళ్ల శునకం మొన్నటి దాకా ఓ కెఫెలో ఉద్యోగం చేసింది. తాజాగా మరో చోట ఇంటర్వ్యూకెళ్లి, ఎంపికైంది. త్వరలోనే కొత్త ఉద్యోగంలో చేరబోతోంది. డటౌ అనే తెల్ల పిల్లి కూడా తక్కువేం కాదు. అది నెలకు ఐదు క్యాన్ల ఆహారాన్ని సంపాదించుకుంటోంది. అదీ అన్ని పన్నులూ పోను..! ఇది కాకుండా.. ఆరోగ్యంగా, అందంగా, బుద్ధిగా ఉండే పిల్లులకి రోజూ స్నాక్స్ ఇస్తాం. యజమాని స్నేహితులకి 30 శాతం డిస్కౌంట్ ఇస్తాం అంటూ ఓ కెఫె నిర్వాహకుడు ఆఫర్ ఇచ్చారు. మరోచోట కెఫె నిర్వాహకుడు తమకు కావాల్సిన అర్హతలుండే పిల్లులు, కుక్కల కోసం ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు..! చైనాలో కొత్త ట్రెండిది. చైనీయుల్లో కుక్కలు, పిల్లుల్ని పెంచుకోవాలనే ఉబలాటం ఇటీవల అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ ఏడాది చివరికల్లా ఆ దేశంలో పిల్లల కన్నా పెంపుడు జంతువులే (పెట్స్) ఎక్కువుంటాయని ఓ సర్వేలో తేలింది. అయితే, తట్టుకోలేని జీవన వ్యయం.. బిజీబిజీగా మారిన జీవితంతో పెంపుడు జీవుల్ని కెఫెల్లో ఉద్యోగాలకు కుదుర్చుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లిన సమయాల్లో ఇవి కెఫెల్లో ఉంటాయి. తిరిగి రాగానే తమతోపాటే ఉంటాయి. దీంతోపాటు, కెఫెల్లో పార్ట్‌టైం, ఫుల్‌టైం ఉద్యోగాలతో ఎంతో కొంత ఆదాయం కూడా ఉంటోంది. దీంతోపాటు, చైనాలో మొదటిసారిగా గ్వాంగ్ఝౌలో 2011లో క్యాట్ కెఫె ప్రారంభించారు. ఇలాంటి కెఫెల సంఖ్య ఏటా 200 శాతం పెరుగుదల నమోదవుతోంది. 2023 లెక్కల ప్రకారం చైనాలో 4 వేల పైచిలుకు పిల్లులకు సంబంధించిన కంపెనీలు నడుస్తున్నాయి. పిల్లులు, కుక్కలతో గడపడం ఇష్టపడే కస్టమర్లు ఈ తరహా కెఫెలకు వస్తుంటారు. వీరి నుంచి సుమారు రూ.350 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తుంటారు. తమ మధ్య తిరుగాడుతూ ఉండే పిల్లులు, కుక్కలతో వీరు సరదాగా ఆడుకుంటారు.‘తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపిన మాదిరిగానే ‘ఓకే’ను నేను కూడా కెఫెలో పార్ట్‌టైం జాబ్‌కి పంపిస్తున్నా’అని ఆ శునకం యజమాని 27 ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి జ్యూ తెలిపారు. కొత్త జీవితానికి అది అలవాటు పడుతుందన్నారు. ‘జాబ్కెళ్లేటప్పుడు ఉదయం నాతోపాటే ఓకే కూడా కెఫెకు వస్తుంది. వచ్చే టప్పుడు తిరిగి సాయంత్రం ఇంటికి తెస్తాను. నేను, నా భర్త వీకెండ్స్‌లో బయటికి వెళ్లినప్పుడు ఓకేను కెఫె నిర్వాహకులే చూసుకుంటారు. పైపెచ్చు, పగలంతా మేం జాబ్లకెళితే ఓకే బద్ధకంగా నిద్రతోనే గడిపేస్తుది. ఆ సమయంలో దాని కోసం ప్రత్యేకంగా ఏసీ ఆన్ చేసి ఉంచడం తప్పనిసరి. ఫుజౌ నగరంలో అసలే నిర్వహణ ఖర్చులెక్కువ. ఓకే కూడా జాబ్ చేస్తే దాని ఖర్చులు అంది సంపాదించుకుంటుంది కదా’అని చెప్పుకొచ్చారు జ్యూ. ఓకేను ఇటీవలే ఓ కెఫె యజమాని గంటపాటు పరిశీలించారు. కస్టమర్లతోపాటు తోటి కుక్కలతో మసలుకునే తీరును గమనించి, ఓకే చెప్పారని జ్యూ తెలిపారు. ‘ఓకే స్టార్ ఆఫ్ ది కెఫె’అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. జిన్జిన్ అనే బీజింగ్‌కు చెందిన టీచర్‌కు టీఝాంగ్ బ్యుయెర్ అనే పిల్లి ఉంది. తనకున్న రెండు పిలుల్ని పోషించేందుకు నెలకు 500 యువాన్ల(సుమారు రూ.6 వేలు) వరకు ఖర్చువుతోందని ఆమె అంటున్నారు. ఆహారం తింటూ రోజంతా బద్ధకంగా ఇంట్లోనే ఉంటోంది. అందుకే, ఆహారం, స్నాక్స్ ఖర్చుల కోసం బ్యుయెర్ను కూడా కెఫెల్లో పనికి పంపించేందుకు సిద్ధం చేస్తున్నానన్నారు. ‘అక్కడైతే అటూఇటూ తిరుగుతుంటే తిన్నది అరుగుతుంది. పైపెచ్చు హుషారుగా కూడా ఉంటుంది’అన్నారు జిన్జిన్. ఇప్పుడు చైనాలో కెఫె యజమానులు తమకు కావాల్సిన పిల్లులు, కుక్కల కోసం సోషల్ మీడియాలో యాడ్లు ఇస్తున్నారు. క్యాట్ కెఫెలో పనిచేస్తే ఎంత శాలరీ ఇస్తారు?అని ఒకరు ప్రశ్నించగా, ఓ కెఫె యజమాని ఇచి్చన సమాధానం వైరల్‌గా మారింది. ‘మా క్యాట్ కెఫెలో పనికి పంపుతామంటూ చాలా మంది యజమానులు మమ్మల్ని అడుగుతున్నారు. ఇక శాలరీ విషయానికొస్తే మేం చెప్పే దొక్కటే. మా పాత ఉద్యోగులు కొందరికి ఇచ్చినంత!’అని తెలిపారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
Covert Creatures: పావురాల నుంచి డాల్ఫిన్ల దాకా..
బెలుగా జాతికి చెందిన అరుదైన పెద్ద గూఢచారి తిమింగలం ‘హవాల్దిమీర్’దక్షిణ నార్వే తీరంలో బుల్లెట్ గాయాలతో విగతజీవిగా కనిపించడం ఇటీవల అంతర్జాతీయ వార్తాంశంగా నిలిచింది. దీంతో అసలు మనిషి ఇంతవరకు ఏ జాతుల జీవులను నిఘా కోసం గూఢచారులుగా వినియోగించుకున్నాడన్న చర్చ మొదలైంది. గూఢచారులుగా ఈ జంతువులు నిర్వర్తించిన విధుల్లేంటి. వాటిల్లో అత్యుత్తమ గూఢచారి ఏది? వంటి ఆసక్తికర అంశాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.. గూఢచార జీవులు... అత్యాధునిక పరికరాలు, చిన్న నిఘా కెమెరాలు రాకముందు సుదూర ప్రాంతాలకు రహస్య సమాచారాన్ని సురక్షితంగా చేరవేయడం ఓ సవాలుగా ఉండేది. దీంతో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిఘా కోసం జర్మన్ సైన్యం ప్రత్యేకంగా బుల్లి కెమెరాలు రూపొందించి వాటిని పావురాలకు కట్టింది. వాటిల్లో రికార్డయ్యే సమాచారంతో శత్రు జాడ తెల్సుకునేది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలూ గూఢచర్యానికి పావురాలనే నమ్ముకున్నాయి. 1970లలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తన ప్రత్యేక నిగా ఆపరేషన్ ‘టకానా’లో భాగంగా బుల్లి కెమెరాలు అమర్చిన పావురాలను సోవియట్ రష్యాలోకి పంపింది. ఇలా పావురాలు మాత్రమే కాదు.. పిల్లులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇంకొన్ని రకాల పక్షులు, చనిపోయిన జంతువులు కూడా కోవర్ట్ ఆపరేటర్లుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాయి. డాల్ఫిన్లతో ప్రత్యేకంగా.. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ నావికాదళం సముద్ర క్షీరదాలతో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఒకటి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం. అమెరికా నావికాదళం సముద్ర క్షీరదాల కార్యక్రమం(ఎంఎంపీ) కింద సముద్రజలాల్లో నిఘా కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది. 1960లలో ప్రాజెక్ట్ ఆక్సిగాస్లో భాగంగా శత్రు నౌకలకు పేలుడు పరికరాలను అమర్చేందుకు సీఐఏ డాల్ఫిన్లకు శిక్షణ ఇచి్చంది. ఈ కార్యక్రమానికి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరిగే రెండు ‘బాటిల్‌నోస్’డాల్ఫిన్లను ఉపయోగించారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులుగా డాల్ఫిన్లు ప్రసిద్ధి చెందాయి. క్రిమియాలోని సెవాస్టోపోల్ నల్లసముద్రంలోని నౌకాదళ స్థావరంలో శత్రు డైవర్లను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా గత సంవత్సరం ఒక క్షీరద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతంచేసింది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సెవాస్టోపోల్ నౌకాశ్రయంలో తేలియాడే క్షీరదాల బోనుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బ్రిటిష్ సైనిక నిఘా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. పిల్లుల చెవులకు మైక్రో ఫోన్లు పిల్లులను తెలివైన జంతువులుగా భావిస్తారు. సీఐఏ 1960వ దశకంలో పిల్లులను ఉపయోగించి ‘ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టీ’అనే ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీని కోసం 2 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్లను ఏర్పాటు చేసింది. ఇవి సోవియట్ దౌత్యవేత్తలు, ఏజెంట్ల సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేస్తాయి. పిల్లి పెంపుడు జంతువు. అది బహిరంగ ప్రదేశాలు, కొన్ని రహస్య ప్రదేశాల్లో అవి ప్రత్యక్షమవడం శత్రు దేశాలకు అనుమానాలు పెంచే అవకాశం ఉంటుంది. అదీగాక పిల్లులను నియంత్రించడం అంత సులభం కాదు. శిక్షణాసమయంలో వాటిని శిక్షకులు నియంత్రించలేక చేతులెత్తేశారు. పిల్లులు వాటికి సూచించిన ప్రాంతాలకు కాకుండా తమకిష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో చేసేదిలేక చివరికి 1967లో ఈ కార్యక్రమానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. టాప్ ఏజెంట్.. పావురం పిల్లులు, చనిపోయిన ఎలుకల వంటివాటిని రంగంలోకి దింపి పని కానిచి్చనప్పటికీ వివిధ దేశాల నిఘా సంస్థలు శతాబ్దాలుగా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది పావురం మీదనే. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన అత్యంత విజయవంతమైన గూఢచారి కార్యక్రమం ‘ఆపరేషన్ కొలంబా’పావురాలతోనే విజయంవంతమైంది. జర్మన్ సైనిక కార్యకలాపాలను, సున్నితమైన సైనిక స్థానాలపై నిఘాను హోమింగ్ జాతి పావురాలు సేకరించాయి. పేపర్‌పై రాసిన సందేశాలను సూక్ష్మ డబ్బాల్లో పెట్టి పక్షి కాలికి కట్టేశారు. ఈ రహస్య సందేశాలలో నాజీ దళాల కదలికలు, నాజీల కొత్త ఆయుధాలపై నివేదికలు, ప్రణాళికాబద్ధమైన రాకెట్ దాడుల వివరాలను వేగులు సేకరించి పావురాల ద్వారా ప్రధాన కేంద్రానికి రహస్యాన్ని పంపేవారు. రచయిత గోర్డాన్ కోరేరా ‘ఆపరేషన్ కొలంబా: ది సీక్రెట్ పీజియన్ సరీ్వస్’పుస్తకంలో ఇలాంటి ఎన్నో వివరాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ 1941 నుంచి 1944 మధ్య నాజీ ఆక్రమిత ఐరోపాపై 16,000 హోమింగ్ జాతి పావురాలను వాడారు. అన్నింటికన్నా ముఖ్యంగా పక్షుల ద్వారా గూఢచర్యం విజయవంతంకావడంతో నూతన టెక్నాలజీలకూ కపోతమే స్ఫూర్తిగా నిలిచింది. గత నెలలో చైనా అచ్చం పావురంలాగా ఉండే చిన్నపాటి నిఘా డ్రోన్‌ను ఆవిష్కరించడం తెల్సిందే. గూఢచార పావురాలని... భారత ఉపఖండంలో సందేశాలను పంపించడానికి పావురాలను ఉపయోగించినట్టుగా చరిత్ర చెబుతోంది. 2020 మేలో కశ్మీర్‌లోని ఓ గ్రామంలో నంబర్ల సెట్ ఉంగరం కలిగిన పావురం కనిపించింది. దానిని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి పావురమై ఉంటుందని, దానిపై ఉన్నది కోడ్ అని అనుమానించిన పోలీసులు.. డీ క్రిప్ట్ చేయడానికి ప్రయట్నించారు. చివరికది గూఢచారి పావురం కాదని తేలడంతో విడిచిపెట్టారు. 2016 అక్టోబర్‌లో భారత ప్రధానిని బెదిరిస్తూ మరో పావురం కనిపించింది. పంజాబ్‌లోని పఠాన్ కోట్లో ఈ పావురాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2023 మేలో ముంబైలో దొరికిన పావురాన్ని చైనా గూఢచారిగా అనుమానిస్తూ ఎనిమిది నెలల పాటు బోనులో ఉంచి దాని ఆనుపానాలు సేకరించారు. ఆ పావురం కాలుకు ఉంగరాలు కట్టి, దాని రెక్కల కింది భాగంలో చైనీస్ భాషలో ఏదో రాశారు. అయితే అది తైవాన్‌లో రేసింగ్ పోటీలో పాల్గొన్న పక్షి అని ఫిబ్రవరిలో తేలడంతో ఎట్టకేలకు దానిని అధికారులు వదిలేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పిల్లులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇల్లు, తిండి ఫ్రీ!
పిల్లులను చాలామంది ఎంతో ప్రేమగా పెంచుకుంటుంటారు. అయితే పిల్లులను ప్రభుత్వ విధుల్లో వినియోగించే దేశమొకటుందని మీకు తెలుసా? ఇంతకీ ఆ దేశంలో పిల్లులు ఏ పనులు చేస్తాయి? ఈ వివరాలు మీ కోసం.. పిల్లులను ప్రభుత్వ కార్యకాలాపాల్లో వినియోగించే దేశం ఇజ్రాయెల్. ఇక్కడి రైల్వే స్టేషన్లలో పిల్లులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నాయి. ఇజ్రాయిల్‌లో పిల్లుల జనాభా 20 లక్షలకు పైగానే ఉంది. జనాభాలో మనుషులతో పోటీ పడుతున్న పిల్లులకు ఉపాధి కల్పించాలని అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ నేపధ్యంలో వాటిని రైల్వే స్టేషన్ విధులలో నియమించింది. ఈ పిల్లులు ప్రయాణికుల టిక్కెట్లను తనిఖీ చేస్తుంటాయి. మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వం ఈ పిల్లులకు టిక్కెట్లను తనిఖీ చేయడంపై శిక్షణ ఇస్తుంది. ఎవరైనా టికెట్ చూపించడానికి ఇష్టపడకపోతే, ఆ పిల్లులు వారికి ఎదురుతిరుగుతాయి. ఈ పిల్లులకు ఆహారంతోపాటు అవి ఉండేందుకు ప్రత్యేక స్థలం కూడా కేటాయిస్తారు. రైల్వే స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఈ పిల్లులను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతుంటారు. ఇజ్రాయెల్‌లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే అక్కడి ప్రభుత్వం పిల్లులను రైల్వేశాఖ విధుల్లో వినియోగిస్తోంది. దీనివలన ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం తగ్గుతోంది. శిక్షణ పూర్తయిన పిల్లులను విధుల్లో నియమిస్తారు. ఈ పిల్లులకు టిక్కెట్ చూపకుండా ఏ ప్రయాణికుడు కూడా రైల్వే ప్లాట్ఫారందాటి బయటకు వెళ్లలేరని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
మహానగరాన్ని వణికిస్తున్న పిల్లి!
ఓ పిల్లి కారణంగా ఒక మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు. కాగా ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు భద్రతా ఫుటేజీలో కనిపించింది. ఒక కార్మికుడు ఆ పిల్లి పంజా గుర్తులను గమనించి, దానిని ఉన్నతాధికారులకు తెలిపాడు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది. ఫుకుయామా సిటీ హాల్లోని ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆ పిల్లి కోసం వెదకగా, ఇంకా దాని జాడ తెలియలేదన్నారు. అది సజీవంగా ఉందా లేదా అనేది కూడా సందేహాస్పదంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ అకిహిరో కొబయాషి మాట్లాడుతూ కర్మాగారంలో రసాయన వ్యాట్‌ను కప్పి ఉంచే షీట్ పాక్షికంగా చిరిగిపోయిందని తెలిపారు. దానిలో పిల్లి పడి, తరువాత ఎటో వెళ్లిపోయిందని, దానికోసం తమ సిబ్బంది వెదుకుతున్నారని చెప్పారు. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన రసాయన ప్రమాద అంచనాలో నిపుణురాలు లిండా షెంక్ మాట్లాడుతూ సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయన్నాన్ని నాకి, చనిపోయివుంటుందన్నారు. -
ఆకలికి తాళలేక పిల్లిని తినేశాడు..చివరికి మానసిక వైద్యశాలలో..
ఓ వ్యక్తి ఆకలికి తాళ్లలేక చనిపోయిన పిల్లిని తినేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన కేరళలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అతను సైక్రియాట్రిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎందువల్ల ఈ జుగుప్సా కరమైన చర్యకు దిగాడు?. ఇలా పచ్చిమాంసం తినడం ఎంతవరకు మంచిది అంటే.. ఈ భయానక ఘటన కేరళలోని కుట్టిపురంలో చోటు చేసుకుది. 27 ఏళ్ల వ్యక్తి కుట్టిపురంలోని బస్టాండ్‌లో చనిపోయిన పిల్లి మాంసాన్ని తింటూ కనిపించాడు. దీంతో షాక్‌కి గురయ్యిన స్థానికలు పోలీసులుకు సమాచారం అందించారు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లి పలు పరీక్షలు చేయించారు. ప్రాథమిక పరీక్షల్లో అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలడంతో పోలీసులు అతడిని మానసిక వైద్యశాలలో అడ్మిట్ చేశారు. అతడు గత ఐదు రోజుల నుంచి భోజనం చేయకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఏదీఏమైనా వండకుండా ఇలా పచ్చి మాంసం తినడం మంచిదేనా? ఏవైనా సమస్యలు వస్తాయా? అంటే.. చాలా దేశాల్లో పచ్చిగా మాంసాన్ని తినేసే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా చైనా వంటి దేశాల గురించి చెప్పనక్కర్లేదు. వాళ్లు చాలా వరకు పచ్చిగా తినేందుకే ఇష్టపడతారు. ఐతే ఇలా తినడం ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆరోగ్యం చెడిపోతుందని అన్నారు. పచ్చి మాంసంలో బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్న జీవులు లేదా టాక్సిన్లతో చాలా విషపూరితంగా ఉంటుంది. వాటి ప్రేగులు కత్తిరించబడితే మరింత ప్రమాదం అని చెబుతున్నారు. ఒక వేళ ఆ మాంసానికి హానికరమైన వ్యాధికారకాలు వ్యాపిస్తే వధ సమయంలో ఆహార కాలుష్యం ఏర్పడుతుంది. అదీగాక సాల్మోనెల్లా, క్లోస్ట్రిడియా పెర్ఫ్రింజెన్స్, ఇ కోలి లిస్టేరియా మోనోసైటోజెన్‌లు క్యాంపిలోబాక్టర్ వంటి వ్యాధి కారకాలు పచ్చి మాంసలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి. ఇలా తింటే వచ్చే సమస్యలు.. వికారంతో వాంతులు అవ్వడం అతిసారం తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిరి తీవ్రమైన జ్వరం తీవ్రమైన తలనొప్పి ఈ లక్షణాలు తిన్న 24 గంటల్లో కనిపిస్తాయి. వ్యాధికారకాన్ని బట్టి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్‌కి చికిత్స చేయగలిగనప్పటికీ పలు సందర్భాల్లో ప్రాణాంతకం అయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అందువల ఉడికించి తింటే వ్యాదికారక క్రిములు నాశనంమయ్యి తినేందుకు సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఈ పచ్చి మాంసంలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని చెప్పారు. కొన్ని దేశాల్లో పచ్చిగా తినే సంప్రదాయం ఉంది. ఇలా తినడం ఎంత మాత్ర సురక్షితం కానప్పటికీ అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించే మార్గాలు కొన్ని ఉన్నాయన్నారు. అవి అనుసరిస్తే ప్రమాదం ఉండదని సూచించారు. పచ్చిగా తినాలనుకుంటే తాజా మాంసాన్ని, అదికూడా ముక్కలుగా ఉన్నదాన్ని ఎంచుకోమని చెబుతున్నారు. (చదవండి: ఆయుష్షు పెంచే డ్రగ్ ట్రయల్!..ఏకంగా వెయ్యి కుక్కలపై..) -
రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!
ఆధునిక పాశ్చాత్య వంటకం అయిన పిజ్జా గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు.నేటి జనరేషన్ తెగ ఇష్టంగా ఆస్వాదించే వంటకం. ఐతే ఆ వంటకం వేల ఏళ్ల క్రిందటే ఉందట. ఆ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారు జరిపిన తవ్వకాల్లో దీన్ని కనుగొన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన రోమన్ నగరమైన పాంపీలో చేపట్టిన తవ్వకాల్లో ఓ గోడ బయటపడింది. ఆ గోడపై ఉన్న పెయింటింగ్‌లో పిజ్జాని పోలే ఓ వంటకం ఉంది. ఆ గోడపై ఉన్న పెయింటింగ్‌లో ఓ వెండి ప్లేటులో వైన్ గ్లాస్, దానిమ్మ పళ్లు, పిజ్జా వంటకం ఉంది. ఇది ఆనాటి కాలంలో ఎంత లగ్జరీగా ఉండేవారు అని చెప్పేందుకు ఆ వెండి ప్లేటే ఒక ఉదాహరణ. ఇక ఆ ప్లేటులో ఉన్న పిజ్జా మాదిరిగా ఉన్నా ఆ పదార్థం బట్టి ఆ కాలంలో చెఫ్‌లు దీన్ని తయారు చేసేవారని తెలుస్తుంది. పిజ్జా అనేది ఇటలీలో పుట్టిన పేద వంటకం. చెఫ్ నియాపోలిటన్ సాంప్రదాయ కళగా చెబుతుంటారు. ప్రస్తుతం ఆ పిజ్జా ప్రజలు ఇష్టంగా ఆస్వాదించే వంటకంగానే కాకుండా స్టార్ రెస్టారెంట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వంటకంగా కూడా నిలిచింది. (చదవండి: ఆ ఏడు 'పిల్లుల పేర రూ. 2.4 కోట్ల ఆస్తి! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం..) -
పార్క్ చేసిని కారులో ఏకంగా 47 పిల్లులు ! ఫోటో వైరల్
ఎవరికైన ఒకటో రెండో లేక మహా అయితే నాలుగు పెంపుడు జంతువులు ఉంటాయి. అంతేగానీ ఎవరు పెద్ద మొత్తంలో జంతువులను పెంచుకోరు. పైగా వాటి ఆలనాపాలన చూసుకోవడం కష్టమవుతుంది కూడా. ఐతే ఇక్కడోక యజమాని దగ్గర ఉన్న పెంపుడు జంతువుల సంఖ్యను చూసి ఆశ్చర్యపోతారు! పైగా వాటితో ఎక్కడ నివశిస్తున్నాడో వింటే నోరెళ్లబెడతారు. వివరాల్లోకెళ్తే...అమెరికాలోని మిన్నెసోటాలోని ఒక ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఏకంగా 47 పిల్లులు ఉన్నాయి. భారత్‌లో 40 ఉంటే అధిక ఉష్ణోగ్రతలు అంటాం. కానీ అమెరికాలో కేవలం 30 డిగ్రిల ఉష్ణోగ్రత నమోదైతే చాలు ప్రజల గగ్గోలు పెట్టేస్తారు. ప్రస్తుతం అక్కడ మిన్నెసోటాలో సుమారు 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ప్రలెవ్వరూ బయటకు అడుగుపెట్టను కూడా పెట్టడం లేదు. ఐతే ఒక వ్యక్తికి 47 పెంపుడు పిల్లులు ఉన్నాయి. ఈ మధ్య అతనికి కొన్ని కారణాల వల్ల ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా పోయింది. ఐతే తన పెంపుడు పిల్లులను విడిచిపెట్టేందకు ఇష్టపడలేదు. దీంతో అతను ఆ 47 పిల్లులను తీసకుని తన కారులోనే నివశిస్తున్నాడు. ఈ మేరకు ఒకతను కారు కిటికి తట్టినప్పుడూ ఆ యజమాని విషయమంతా చెప్పాడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో యానిమల్ హ్యూమన్ సొసైటీ(ఏహెచ్ఎస్) రంగంలోకి దిగి ఆ 47 పిల్లులను స్వాధీనం చేసకుని వాటికి అవసరమైన సంరక్షణను అందించింది. అవన్నీ ఒకచోట చాలా రోజులుగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాయని ఏహెచ్ఎస్ తెలిపింది. (చదవండి: టిఫిన్ ప్లేట్లో బల్లి...కస్టమర్‌కి ఎదురైన చేదు అనుభవం) -
నైపుణ్య శిక్షణను పంచుకునేందుకు ‘క్యాట్స్’ ఆసక్తి : ఏపీఎస్ఎస్డీసీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కిల్ కాలేజీలకు నైపుణ్య శిక్షణ విధానాన్ని అందించేందుకు అమెరికాలోని నార్త్ కొరోలినాలోని కెరీర్ అకాడమీ అండ్ టెక్నికల్ స్కూల్(క్యాట్స్) ఆసక్తి కనబరిచింది. అమెరికా పర్యటనలో భాగంగా క్యాట్స్ కేంద్రాన్ని ఏపీ నైపుణ్యాభివృద్థి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి సందర్శించారు. అక్కడ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. ఆటోమోటివ్ టెక్, వెల్డింగ్, అత్యవసర వైద్య చికిత్స, అగ్ని మాపక అకాడమీ, నర్సింగ్, క్యూలినరీ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్ వంటి విభాగాల్లో శిక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాట్స్ ప్రిన్సిపాల్ లర్రీ ఈ రోగర్స్, ప్రోగ్రామ్ క్యాంప్స్ డైరెక్టర్ డెబ్రాలెస్టర్, ఇతర టెక్నికల్ సిబ్బందిని కలిశారు. అక్కడ అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణ విధానాన్ని మనతో పంచుకునేందుకు ఆసక్తి కనబరిచారని ఏపీఎస్ఎస్డీసీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. (క్లిక్: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 25న హెచ్‌సీఎల్ ‘వాక్ ఇన్ డ్రైవ్’) -
పిల్లులూ పేర్లు గుర్తిస్తాయ్
టోక్యో: పేరులో ఏముంది లెమ్మని అనుకోలేం. ఎందుకంటే పిల్లులు కూడా పేర్లను బాగా గుర్తు పడతాయని తాజా అధ్యయనంలో తేలింది. తమతో కలిసిమెలిసి ఉండే ఇతర పిల్లులు, యజమానుల పేర్లను పిల్లులు పసిగట్టేస్తాయని జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. పిల్లుల జ్ఞాపకశక్తిపై వారు రెండు వేర్వేరు అధ్యయనాలు చేశారు. ఒకదాంట్లో వాటితో కలిసిమెలిసి తిరిగే ఇతర పిల్లి ఫోటోను వాటి దగ్గరుంచారు. కొన్నిసార్లు ఫోటోలోని పిల్లి పేరును, మరికొన్ని సార్లు వేరే పేరును పిలిచారు. ఫోటోలోని పిల్లి పేరు పిలవగానే అవి ఫొటోవైపే కన్నారప్పకుండా చూశాయి. వేరే పేరుతో పిలిస్తే పట్టించుకోలేదు. అలాగే యజమానుల ఫోటోలను వాటి దగ్గరుంచి పేరు పెట్టి పిలిచినా గుర్తించగలిగాయని శాస్త్రవేత్తలు వివరించారు. 40 పిల్లులపై ఈ అధ్యయనం చేసినట్టు వాళ్లు చెప్పారు. -
పిల్లులను ఎలా చంపాలి.. అని ఇంటర్నెట్లో వెతికి మరీ..
లండన్: పెంపుడు పిల్లులను హతమారుస్తూ నరరూప రాక్షసుడిలా ప్రవర్తించిన ఓ వ్యక్తికి స్థానిక కోర్టు శిక్ష విధించింది. ఐదేళ్ల... మూడు నెలల కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. వివరాలు... స్టీవ్ బొకే(54) అనే వ్యక్తి గతంలో నేవీలో పనిచేసేవాడు. అనంతరం సెక్యూరిటీ గార్డుగా కొన్నాళ్లపాటు జీవితం గడిపాడు. ఈ క్రమంలో ఏడాది వ్యవధిలో(2018- 19) బ్రిగ్టన్ పట్టణంలో దాదాపు తొమ్మిది పిల్లులను హత్య చేయడమే గాకుండా, మరో ఏడింటిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే, చాలా రోజులపాటు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరిగిన బొకేను ఎట్టకేలకు ఓ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్టు చేశారు. కత్తితో ఓ పిల్లిని కసితీరా పొడిచిన దృశ్యాల ఆధారంగా, సదరు ఇల్లు గల యజమాని బొకేను గుర్తించి, సమాచారం ఇవ్వడంతో.. ఈ క్యాట్ కిల్లర్‌ను పట్టుకున్నారు. విచారణలో భాగంగా అతడి లాప్‌టాప్‌ను పరిశీలించగా.. పిల్లులను ఎలా చంపాలన్న అంశం గురించి అతడు నెట్లో సర్చ్ చేసినట్లు గుర్తించారు. అయితే, ఇన్ని ఆధారాలు దొరికినప్పటికీ తాను అమాయకుడినని నమ్మించేందుకు బొకే విశ్వప్రయత్నాలు చేశాడు. ఆఖరికి అతడి ఫోన్లో ఓ పిల్లిని చంపుతున్న ఫొటో లభ్యమవడం, అతడి ఇంట్లో పిల్లి రక్తంతో నిండిన కత్తి దొరకడంతో పోలీసులు బొకేను నిందితుడిగా తేల్చారు. ఈ క్రమంలో శుక్రవారం కేసు విచారణకు రాగా.. సదరన్ ఇంగ్లండ్‌లోని హెవ్ క్రౌన్ కోర్టు అతడిని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా జడ్జి జెరెమీ గోల్డ్ మాట్లాడుతూ... ‘‘ఇది నిజంగా క్రూరమైన చర్య. అతడు నేరానికి పాల్పడ్డట్లు రుజువైంది’’ అని పేర్కొంటూ జైలు శిక్ష ఖరారు చేశారు. ఇక విచారణ జరుగుతున్న సమయంలో... బొకే కారణంగా పెంపుడు పిల్లులను పోగొట్టుకున్న యజమానులు... ‘‘మా గుమ్మాల ముందు కత్తిపోట్లతో రక్తమోడుతున్న పిల్లులను చూసినప్పుడు పడిన బాధ వర్ణనాతీతం. అతడికి ఎట్టకేలకు పడటం సంతోషకరం’’ అని పేర్కొన్నారు. అయితే, తాను అత్యంత క్రూరంగా పిల్లులను హత్య చేయడానికి గల కారణాలను మాత్రం బొకే వెల్లడించకపోడం గమనార్హం. -
ఈ అద్దాలు పెట్టుకుంటే మనకూ పిల్లి కళ్లు!
పిల్లులు రాత్రి పూట కూడా చూడగలవు.. మరి మనం.. ఇదిగో ఈ కళ్లద్దాలు పెట్టుకుంటే.. మనం కూడా పిల్లిలా రాత్రి పూట చూసేయొచ్చట.. అదేంటో మరి తెలుసుకుందామా.. ఇలా చూసేద్దాం.. చీకట్లో ఏ వస్తువునూ చూడలేం.. రాత్రి అతినీల లోహిత కిరణాలు వెలువడుతాయి. వాటిని మానవ నేత్రం చూడలేదు. కానీ నానో టెక్నాలజీని ఉపయోగించి రాత్రి కూడా చూడగలిగేలా మన వెంట్రుక కన్నా వంద రెట్లు పలుచటి పొర (అల్ట్రాథిన్ క్రిస్టల్ ఫిల్మ్)ను ఆస్ట్రేలియన్ నేషన్ వర్సిటీ, నాటింగ్‌హామ్ ట్రెంట్ వర్సిటీల ఆధ్వర్యంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి పరిచింది. ఆ పొరను మన కళ్లద్దాలకు పెట్టుకుంటే సరి.. రాత్రి చీకట్లోనూ ఎంచక్కా చూసేయొచ్చు. ఇంతకీ ఇవెలా పనిచేస్తాయి? గాలియం ఆర్సెనైడ్ పదార్థంతో ఈ ఫిల్మ్‌ను తయారుచేశారు. దీనిద్వారా ప్రసరించే కాంతి తాలూకు రంగు లేదా ఫ్రీక్వెన్సీ (పౌనఃపున్యం)ని ఇది మార్చుతుంది. అంటే రాత్రి వెలువడే అతినీల లోహిత కిరణాలను.. మనం చూడగలిగే కాంతి (విజిబుల్ లైట్)గా మార్చగలదు. అయితే చీకట్లో ఏదైనా వస్తువు వెలుతురులో ఉన్నట్లు కాకుం డా ఆకుపచ్చని రంగులో కన్పిస్తుంది. సాధారణంగా నైట్ విజన్ అద్దాలతో చూసినప్పుడు కని పించినట్లే ఉంటుందని పరిశోధకులు చెప్పారు. నైట్ విజన్ అద్దాలు బరువుగా ఉంటాయని.. ఇవి చాలా తేలిక, ఖర్చు తక్కు వని తెలిపారు. ఈ రెండింటిలో అతినీల లోహిత కిరణాలను మార్చే పద్ధతి వేర్వేరుగా ఉంటుందని పరిశోధకులు డ్రాగోమిర్ నెషేవ్ వివరించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: 118 ఏళ్ల కింద.. టైమ్ ఎలా సెట్ చేశారు? -
అయ్యో.. కుళ్లిన శవం, పీక్కుతిన్న పెంపుడు పిల్లులు
స్పెయిన్‌లో ఘోరం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న ఓ పెద్దావిడ చనిపోగా, ఆ విషయం మూడు నెలల దాకా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. ఇక ఆమె పెంచుకుంటున్న పిల్లులు ఆకలికి తాళలేక ఆమె మృతదేహాన్నే పీక్కుతిన్నాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మాడ్రిడ్: క్లారా ఇనెస్ టోబోన్(79) అనే ఆవిడ నగరంలోని ఓ అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉంటోంది. ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు ఆమె కొన్ని పిల్లుల్ని పెంచుకుంటోంది. పోయిన సొమవారం ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తలుపులు బద్ధలు కొట్టిన పోలీసులు అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. ఆమె రెండు పెంపుడు పిల్లులు.. కుళ్లిన ఆమె శవాన్ని పీక్కుతింటూ కనిపించాయి. కరోనా అనే అనుమానంతో.. ఇక ఈ కేసులో దారుణమైన విషయం ఒకటి బయటపడింది. క్లారా, కొలంబియా నుంచి మాడ్రిడ్‌కు వలస వచ్చింది. 1996 నుంచి శాన్ కుగట్ సెల్ వాల్లెస్లో ఒంటరిగా ఉంటోంది. పోయినేడాది ఆమె జబ్బుపడింది. దీంతో ఆమెకు కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఎవరూ సాయం అందించలేదు. కొన్ని నెలల క్రితం ఆమె దగ్గుతూ కనిపించిందని కొందరు చెప్పారు. వీధిలో పిల్లులకు ఆహారం పెట్టిందని, మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకుందని, ఆమెను చూడడం అదే చివరిసారని చుట్టుపక్కల వాళ్లు చెప్తున్నారు. కాగా, క్లారా మృతదేహాం నడుం పైభాగం వరకు పూర్తిగా కుళ్లిపోయి ఉంది. ఆమె పెంపుడు పిల్లులో అయిదు అక్కడే చచ్చిపడి ఉన్నాయి. చచ్చిన పిల్లుల కడుపులో ఆమె అవశేషాలున్నాయా? అనేది గుర్తించేందుకు వాటి శవాల్ని ల్యాబ్‌కు పంపించారు. ఆమె శవాన్ని పీక్కతుంటూ కనిపించిన రెండు పిల్లులూ.. దీనావస్థకి చేరుకున్నాయి. దీంతో వాటిని యానిమల్ షెల్టర్‌కు తరలించారు. క్లారా కరోనాతో చనిపోయిందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. కాగా, ఆమెకు బంధువులు ఎవరూ లేరని, డైజెనెస్ సిండ్రోమ్ డిజార్డర్(శుభ్రత పాటించకపోవడం, చెత్తను పోగు చేసుకోవడం)తో ఆమె బాధపడుతోందని, అందుకే ఆమెకు దగ్గరగా ఎవరూ వెళ్లేవాళ్లు కారని ఆ హౌజింగ్ అసోషియేషన్ హెడ్ చెబుతున్నాడు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో అరుదైన ప్రయోగం -
వ్వావ్! ఫ్రెండ్ షిప్ అంటే ఈ పిల్లులదే..
మీరు ఊసరవెల్లి సినిమాలో ‘లవ్ అంటే కేరింగ్.. ఫ్రెండ్ అంటే షేరింగ్’ అనే పాటను వినే ఉంటారు. ఈ ప్రేమలు మనుషుల్లోనే కాకుండా జంతువుల మధ్యలోనూ ఉంటాయి. ఇప్పటికే.. వీటికి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ ఇంటి యజమాని తమ పిల్లుల ముందు గిన్నెలో ఆహరం పెట్టాడు. అయితే అవి రెండు ఏ మాత్రం కొట్టుకోకుండా, ఆహరాన్నిఒకదానికి మరొకటి సహయం చేసుకుంటూ తిన్నాయి. దీనిలో ‘ఒక పిల్లి తను ఆహరం తిన్న తర్వాత.. ఆ గిన్నెను ఎదురుగా ఉన్న మరో పిల్లి ముందు జరిపింది. ఆ రెండో పిల్లి కూడా ఆహరం తిన్నాక తిరిగి మొదటి దాని ముందుకు గిన్నె జరిపింది. ఇలా అవి రెండు ఆహరాన్ని కిందపడేయకుండా తిన్నాయి. షైయిల్డ్ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడిది నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ వాట్ ఎ కేరింగ్.. షేరింగ్’..‘క్యూట్ క్యాట్స్’...‘మీ ఫ్రెండ్షిప్కి హ్యట్సాఫ్’..అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు! -
‘వుహాన్’ పిల్లులకు కరోనా వైరస్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ పెంపుడు కుక్కలకు, పిల్లులకు సోకుతోందన్న వార్తలు ఆ మధ్యన వెలుగులోకి వచ్చాయి. అయితే మనుషుల నుంచి వాటికి వైరస్ సోకిందా లేదా వాటి నుంచే మనుషులకు వైరస్ సోకిందా ? అన్న వాదనలూ వినిపించాయి. అయితే వాటికి సరైన రుజువులు దొరకలేదు. కరోనా వైరస్ ఆవిర్భవించిన చైనాలోని వుహాన్ పట్టణంలో ప్రజలు పిల్లులను ఎక్కువగా పెంచుకుంటారు. అందుకని అక్కడి పిల్లులపై కోవిడ్ పరీక్షలు జరపాలని హువాఝంగ్ వ్యవసాయ యూనివర్శిటీ పరిశోధకులు నిర్ణయించారు. మూడు యానిమల్ షెల్టర్స్ నుంచి మూడు పెట్ హాస్పిటల్స్ నుంచి కరోనా సోకిన రోగుల ఇళ్ల నుంచి 141 పిల్లులను సేకరించి వాటి నుంచి అన్ని రకాల శాంపిల్స్ తీసి పరీక్షలు జరిపారు. వాటిలో 14.7 శాతం పిల్లుల్లో కరోనా యాంటీ బాడీస్ బయట పడగా, 10.8 శాతం పిల్లుల్లో స్థిరమైన యాంటీ బాడీస్ దొరికాయి. అత్యధిక యాంటీ బాడీస్ ఉన్న మూడు పిల్లులు కరోనా రోగుల ఇంట్ల నుంచి సేకరించినవని పరిశోధకులు తెలిపారు. కరోనా రోగుల్లోకెల్లా వారి నుంచి కరోనా సోకిన పెంపుడు పిల్లుల్లో ఆ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వారు చెప్పారు. రోగుల నుంచి తుంపర్ల కారణంగానే పెంపుడు పిల్లులకు వైరస్ సోకిందని ల్యాబ్ పరీక్షల్లో తేలిందని, అందుకని పెంపుడు జంతువులతోని కూడా యజమానులు భౌతిక దూరం పాటించాలని పరిశోధకులు సూచించారు. జంతువుల నుంచి జంతువులకు అంటే పిల్లుల నుంచి పిల్లులకు లేదా కుక్కల నుంచి పిల్లులకు ఈ వైరస్ సోకుతుందా, లేదాఅన్న విషయాన్ని తేల్చుకోవాలంటే మరిన్ని పరిశోధనలు అవసరమని వారు చెప్పారు. ఇంతకుముందు అమెరికాలో కూడా 17 పెంపుడు పిల్లులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఈ అధ్యయనంకు సంబంధించిన పూర్తి వివరాలను ‘ఎమర్జింగ్ మ్రైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్’ జర్నల్‌లో ప్రచురించారు. (చదవండి: చెన్నైలో 21.5 శాతం మందికి కోవిడ్-19) -
అమ్మో, ఆ జంతువులకు కూడా కరోనా వచ్చింది
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు అనేక మంది మరణించారు. ఇంకా చాలా మంది ఈ వైరస్ సోకి చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలో ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ భయపెడుతున్నాయి. అయితే కరోనా వైరస్ పిల్లులకు కూడా సోకుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. న్యూ లాబ్రేటోరి ఎక్స్పరిమెంట్ ప్రకారం కోవిడ్-19 వ్యాధిని కలిగించే సార్స్- కో వి-2 వైరస్ పిల్లులను కూడా ప్రభావితం చేస్తోందని పేర్కొంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసెన్‌లో ముద్రించబడిన స్టడీ ప్రకారం వైరస్ సోకిన పిల్లులలో లక్షణాలు ఏమి కనిపించడం లేదని పేర్కొన్నారు. తరువాత ఆ వైరస్ పోతుందని తెలిపారు. మనుషుల నుంచి మాత్రమే ఇప్పటి వరకు ఇతర మనుషులకు ఈ వైరస్ సోకుతుందని ఆ జర్నలో పేర్కొన్నారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్లు ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు దొరకలేదన్నారు.పాతోబయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ యోషిహోరో కవోకా మాట్లాడుతూ వైరస్ సోకిన పిల్లులను మనుషుల నుంచి దూరంగా ఉంచామని, అయితే తరువాత రోజు మాత్రం వాటి నాశిక ద్వారా మరో రెండు పిల్లులకు వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. తరువాత మూడు రోజులకి అక్కడ ఉన్న పిల్లులన్నింటికి ఈ వైరస్ సోకిందన్నారు. తరువాత వీటిని వేరే చోట ఉంచితే మొత్తం ఆరు రోజుల్లో అక్కడ ఉన్న పిల్లులన్నింటినికి కరోనా వైరస్ సోకింది. ఈ స్టడీ మాత్రమే కాకుండా వేరే పరిశీలనలకు కూడా పిల్లులు ద్వారా వైరస్ వ్యాపించి చెందుతుందని పేర్కొన్నాయి. అయితే కరోనా వైరస్ సోకి ఐసోలేషన్‌లో ఉన్న వారు కేవలం వారి కుటుంబ సభ్యలకు, ఇతర మానవులకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. -
వైరల్ : రాజ్, సిమ్రాన్‌ల ప్రేమ, కలహం
-
వైరల్ : రాజ్-సిమ్రాన్‌ల ప్రేమ, కలహం
‘దిల్ వాలే దుల్హేనియా లేజాయేంగే’ సినిమా చూసిన వారికి రాజ్, సిమ్రాన్‌ల గురించి తెలిసే ఉంటుంది. గొడవలతో మొదలయ్యే ప్రేమ కథ ఇద్దరిది. ఇప్పుడు మనం చెప్పుకోబేయే క్యారక్టర్ల కథ కూడా కొంచెం అటోఇటుగా అలాంటిదే. అయితే ఇక్కడ ప్రేమ, కలహం తాలూకు అనుభవాలు మనుషులవి కావు! రెండు పిల్లులవి. ‘లవ్-హేట్ రిలేషన్షిప్’ అన్న శీర్షికతో రెడ్డిట్‌లో ఆదివారం విడుదలైన రెండు పిల్లులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 15 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో చూసిన వారి పెదాలపై నవ్వులు పూయిస్తోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘రాజ్, సిమ్రాన్‌ల ప్రేమ, కలహం.. మా పిల్లులు కూడా ఇలానే చేస్తుంటాయి. ప్రేమించుకుంటాయి, గొడవపడతాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : కేంద్రమంత్రితో మాట్లాడిన ఈటెల రాజేందర్ కరోనా : రంగంలోకి దిగిన స్పైడర్ మ్యాన్! -
కాట్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
వాషింగ్టన్ డీసీ : రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (సీఏటీఎస్) 2020- 2021 ఏడాదికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. అధ్యక్షురాలిగా సుధారాణి కొండపు ఉపాధ్యక్షులుగా సతీష్ వడ్డీ, కార్యదర్శి గా దుర్గాప్రసాద్ గంగిశెట్టి, కోశాధికారిగా పార్థసారథి బైరెడ్డి, సాంస్కృతిక కార్యదర్శిగా హరీష్ కుమార్ కొండమడుగు, కమ్యూనిటీ సర్వీస్ కార్యదర్శిగా రామచంద్రరావు ఆరుబండి ఎన్నికయ్యారు. ధర్మకర్తలుగా ప్రవీణ్ కాటంగురి, గోపాల్ నున్న, వెంకట్ కొండపోలు నియమితులయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న కాట్స్ మాజీ అధ్యక్షుడు రవి బొజ్జ నూతన అధ్యక్షురాలికి పదవీ బాధ్యతలు అప్పగించారు. సహాయ కార్యదర్శి శ్రీనివాస్ వూట్ల నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. సలహాదారులు భువనేష్ బూజాల, మధు కోల, భాస్కర్ బొమ్మారెడ్డి, అనిల్ నీరుకొండతో పాటు కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, చిత్తరంజన్ నల్లు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అనుభవజ్ఞుల సలహాలతో, కొత్తగా కార్యవర్గంలో చేరినవారి ఆలోచనలను రంగరిస్తూ పనిచేస్తామని సుధారాణి అన్నారు. తెలుగు భాష, సాహితీ రంగాలకు పెద్దపీట వేస్తూ, అంతరించిపోతున్న జానపదాలు, నాటకాలను పునరుజ్జీవం చేసే కార్యక్రమాలను చేస్తామని పేర్కొన్నారు. డీసీ మెట్రో ప్రాంతానికి చెందిన తెలుగు వారందరికీ మరింత చేరువయ్యే క్రీడా,సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రతీ నెలా చేపట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సుధారాణి వెల్లడించారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవా కార్యక్రమాలను తమ పరిధిలో మరింత విస్తృత పరిచేలా కాట్స్ కార్యవర్గం నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె చెప్పారు. -
మార్జాలరాజ్యం.. కోశ్లాండియా!
అది పశ్చిమ సైబీరియాలోని ఓ చిన్న గ్రామం. పేరు ప్రిగోరోడ్ని. రెండేళ్ల కిందటివరకు ఏ గుర్తింపూలేని గ్రామం అది. అయితే ఆ గ్రామాన్ని ప్రపంచానికి పిల్లులు పరిచయంచేశాయి. ఎందుకంటే అక్కడిపిల్లుల సంఖ్య ఎంతో తెలుసా.. పదిలక్షల పైమాటే. సంఖ్యలోనే కాదు.. అందంలోనూ ఏమీ తీసిపోనట్లు ఉంటాయి అవి. ప్రిగోరోడ్ని గ్రామాన్ని ‘కోశ్లాండియా’అని పిలుస్తారు. దీనికిపిల్లుల స్వర్గధామం అనిఅర్థం. ఈ గ్రామం ఇంత ఫేమస్ కావడానికి.. పిల్లుల ఊరు కావడానికి కారణం లెబిడివా అనే 59 ఏళ్ల మహిళ.. ఆమె భర్త సెర్గెయ్. 2003లో ఇంట్లో పెంచుకునేందుకు వారు ఓ పిల్లిని తెచ్చుకున్నారు. ఫిలైన్ జాతికి చెందిన ఈ పిల్లికి బబుష్కా అని ముద్దు పేరు పెట్టుకున్నారు. ఓ ఏడాది తర్వాత ఈ పిల్లి ఐదు బుజ్జి పిల్లులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అక్కడ దాదాపు 10 లక్షల పిల్లులు ఉండొచ్చని లెబిడివా చెబుతున్నారు. రెండేళ్ల కింద వీటి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఊరు ప్రపంచానికి తెలిసింది. ఇంకేముంది ఈ పిల్లులు.. అవి ఉన్న ఆ ఊరు నెట్లో హల్చల్ చేస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. -
రోజుకు పది లక్షల పక్షుల బలి
పిల్లులు పక్షుల్ని చంపుకుతింటాయనే విషయం తెలిసిందే. కానీ ఆస్ట్రేలియాలో పిల్లులకు రోజుకు పది లక్షల పక్షులు బలవుతున్నాయనే విషయం తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. ఆస్ట్రేలియా బయోలాజికల్ కన్జర్వేషన్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం... అడవి పిల్లుల బారిన పడి ఏడాదికి 316 మిలియన్ పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక పెంపుడు పిల్లులకు 61 మిలియన్ పక్షులు ఆహారంగా మారుతున్నాయి. ‘పిల్లులు పక్షులను చంపుతాయనే విషయం తెలుసు. కానీ ఇంత భారీస్థాయిలో ఈ విధ్వంసం జరుగుతోందనే విషయం ఆందోళన కలిగించేదే. ఇదిలాగే కొనసాగితే చాలా పక్షుల జాతులు అంతరించిపోయే ప్రమాదముంది’అని చార్లెస్ డార్విన్ యూనివర్సిటీ పరిశోధకుడు వొయినార్స్కి అభిప్రాయపడ్డారు. దాదాపు వందకు పైగా అధ్యయనాల ఫలితాలను క్రోడీకరించి, ఈ నిర్ణయానికి వచ్చామని, పిల్లుల సంఖ్యను తగ్గించడం ద్వారా జీవావరణంలో సమతుల్యతను కాపాడవచ్చని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కోట్ల సంఖ్యలో ఉన్న పిల్లులకు ఆహారంగా పక్షులు మినహా మరేమీ లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. -
కుక్కల 'వైన్' వచ్చేసింది!
వాషింగ్టన్: జంతుప్రేమికులకు అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన ఓ కంపెనీ తీపి కబురు అందించింది. కుక్కల కోసం ప్రత్యేకమైన మద్యాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు అపోలో పీక్ ప్రకటించింది. జిన్ ఫ్యాన్ టెయిల్, చార్ డాగ్ నాయ్ పేర్లతో రెండు రకాలను వినియోగానికి అందుబాటులోకి తెచ్చింది. 350 ఎంఎల్ రేంజ్ లో బాటిళ్లు లభ్యకానున్నట్లు చెప్పింది. కుక్కులకు హనికలిగించే ద్రాక్ష, ఆల్కహాల్ కు సంబధించిన మిశ్రమాలేవి వీటి తయారీ ఉపయోగించలేదని పేర్కొంది. ఈ వైన్ తయారీ కోసం పెప్పర్ మింట్, చామోమైల్ లను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ పదార్ధాలు కుక్కలను కంట్రోల్ చేసేందుకు ఉపకరిస్తాయని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో పిల్లుల కోసం ప్రత్యేక వైన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. చామోమైల్ కలిగివున్న పదార్ధాలను తీసుకోవడం వల్ల పెంపుడు జంతువులు పాయిజనింగ్ కు గురయ్యే అవకాశం ఉందని ఓ అమెరికన్ పత్రిక ప్రచురించింది. దీనిపై స్పందించిన అపోలో పీక్ యాజమాన్యం అప్పుడప్పుడు మాత్రమే పెట్ కు వైన్ ఇవ్వడం వల్ల దాన్ని నిరోధించవచ్చని పేర్కొంది. -
జంతు ప్రేమికులకు సరికొత్త అవకాశం!
జంతు ప్రేమికులు ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. పెట్స్ ను పెంచుకోవాలని ఇష్టం ఉన్నా తీరిక, సమయం తోపాటు వాటిని పెంచేందుకు సరిపడేంత డబ్బు లేక మనసులోనే ఇష్టాన్ని దాచుకొని బాధపడుతుంటారు. అటువంటి వారికి ఇప్పుడు 'క్యాట్ కేఫ్' లు అందుబాటులోకి వచ్చేశాయి. సరదాగా వాటితో గడపాలన్న కోరిక తీర్చుకునేందుకు కేవలం ఓ రెస్టరెంట్ కో, పార్కుకో వెళ్ళినట్లుగా క్యాట్ కేఫ్ లకు వెళ్ళి కాస్తా రిలాక్స్ అయ్యే అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అందుబాటులోకి తెచ్చారు. మంచి కాఫీ, కేక్ తోపాటు రెస్టారెంట్లలో దొరికే ఇతర పదార్థాలను వేడి వేడిగా అందిస్తూనే... పెట్స్ తో కాసేపు సరదాగా గడిపి, ఒత్తిడిని సైతం తగ్గించుకునే మార్గాలను కనిపెట్టారు. క్యాట్ లవర్స్ కు ఇప్పుడు ఆకట్టుకునే వివిధ రకాల పిల్లులను అందుబాటులో ఉంచుతున్నాయి క్యాట్ కేఫ్ లు. ఇళ్ళల్లో పెంచుకునే పెంపుడు పిల్లుల్లానే ఇక్కడ ఎంతో ఆకర్షణీయంగా ఉండే పిల్లులకు సమయానికి తగ్గ అద్డెను చెల్లించి హాయిగా కాసేపు వాటితో గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. స్వతహాగా ఇంట్లో పిల్లులను పెంచుకునే సామర్థ్యం, అవకాశం లేనివారు ఈ కేఫ్ లను ఆశ్రయించేందుకు వీలుగా వీటిలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను కూడా కేఫ్ యాజమానులు అందుబాటులో ఉంచుతున్నారు. పిల్లులతో ఆడుకునేందుకు వచ్చిన వారికి వేడి వేడి కాఫీ, స్నాక్స్, కేక్స్ కూడా అందిస్తున్నారు. యాజమానుల పర్యవేక్షణలో ఉండే ఆరోగ్యవంతమైన ఆకర్షణీయమైన పిల్లలను జంతు ప్రేమికులకు అందుబాటులో ఉంచడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కేఫ్ యజమానులు మాగజైన్లు, న్యూస్ పేపర్లు, టీవీల్లోనే కాక, ఇంటర్నెట్ లో కూడా విభిన్న ప్రకటనలతో జంతుప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సెలవు రోజుల్లోనూ, సాయంత్ర సమయాల్లోనూ విజిటర్స్ కు ప్రత్యేక ఆఫర్లు కూడ ఇస్తున్నారు. సిద్ధహస్తులు తయారు చేసే కాఫీ పానీయాలతోపాటు... ప్రత్యేక సర్వీసును కూడ అందిస్తామంటూ ఆకట్టుకుంటున్నారు. మా వద్దకు రండి... మీ ఒత్తిడి తగ్గించుకోండి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అంతేకాదు పిల్లులను పెంచుకోవాలనుకునేవారికి అందుబాటులో ఎన్నో రకాల మేలిమి జాతి పిల్లులు అందుబాటులో ఉన్నాయంటూ స్వాగతం పలుకుతున్నారు. పిల్లులను దత్తత చేసుకునేవారికి అడాప్షన్ ప్రాసెస్ కేవలం ఇరవై నిమిషాల్లో పూర్తయిపోతుందని, మీకు నచ్చిన పిల్లిని పెంచుకునే అవకాశం ఉందని పిల్లి ప్రేమికులకు వివరిస్తున్నారు. కొందరు తమ ప్రచారం, ప్రకటనల్లో భాగంగా ఆకట్టుకునే పిల్లుల వీడియోలనూ పోస్టు చేస్తున్నారు. జపాన్, సింగపూర్, థైవాన్, థాయిలాండ్ తోపాటు యూరప్, అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఈ క్యాట్ కేఫ్ లు అందుబాటులో ఉన్నాయి. పిల్లి ప్రేమికులు కేఫ్ కు వచ్చినప్పుడు పాటించాల్సిన నిబంధనలను కూడా కేఫ్ యాజమానులు ముందుగానే సూచిస్తున్నారు. పిల్లులను కొట్టడం, వినోదంకోసం విన్యాసాలు చేయించడం, గట్టిగా కౌగలించుకోవడం నిషిద్ధమని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లులను సందర్శించేందుకు వచ్చేవారు కుక్కలను తీసుకొని రావడాన్ని నిషేధిస్తున్నారు. అంతేకాదు ఇష్టం ఉన్నవారు పిల్లలకు డొనేట్ చేయొచ్చునని, అలాగే వారింట్లో పెంచుకునే పిల్లలను కూడా తమ సంస్థలకు దత్తత ఇవ్వొచ్చని చెప్తున్నారు. -
అక్కడ కుక్క, పిల్లులకూ శ్మశానాలు
బీజింగ్: మనం పెంచుకుంటున్న కుక్క, పిల్లి, చిలుక మరణిస్తే ఏం చేస్తాం? వాటిని తీసుకెళ్లి మున్సిపాలిటీ వ్యాన్‌లో పడేస్తాం లేదా ఇంటి వెనకాల పెరట్లో గుంత తీసి పాతేస్తాం. కానీ చైనాలో అలా చేయడం నేరం. అందుకనే అక్కడ పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక శ్మశానాలే వెలిశాయి. వెలుస్తున్నాయి కూడా. అలాంటి వాటిలో ఒకటి బీజింగ్ శివారులో వెలసిన ‘బైఫూ పెట్ హెవెన్’. అది 6.7 హెక్టార్లు విస్తరించి ఉంది. పెట్ హెవెన్‌లో వేలాది చెట్లను పెంచారు. చెట్టు వద్దనే పెంపుడు జంతువులను ఖననం చేయాల్సి ఉంటుంది. ఒక్కో చెట్టుకు 20వేల రూపాయల నుంచి 44 వేల రూపాయలను వసూలు చేస్తారు. తాము 2005లో ఈపెట్ సర్వీసును ప్రారంభించామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు వేల చెట్లు అమ్ముడు పోయాయని, ప్రజలు దాదాపు 20వేల పెంపుడు జంతువులను ఖననం చేశారని బైఫూ పెట్ హెవెన్ వ్యవస్థాపకుడు చెన్ షావోచున్ తెలిపారు. చైనాలో ఏటా 42.5 లక్షల పెంపుడు కుక్కలను, 20 లక్షల పిల్లులను ఖననం చేస్తున్నారని ‘డాగ్స్ ఫాన్స్’ మేగజైన్ వెల్లడించింది. ఈ ఖననాల సంఖ్య ఏడాదికి 30 శాతం పెరుగుతోందని తెలిపింది. దేశవ్యాప్తంగా కోటి పెంపుడు కుక్కలను, పిల్లులు, పక్షులు, ఇతర జంతువులను కలుపుకుంటే దాదాపు పది కోట్ల జంతువులను ఖననం చేసి ఉంటారని 2014లో జరిపిన ఓ సర్వే తెలిపింది. ‘అదర్ సైడ్’ అనే మరో పెట్ క్రిమేషన్ కంపెనీ ఇటీవల చైనా నగరాల్లో విస్తరిస్తూ వస్తోంది. తాము పెంపుడు జంతువు బరువునుబట్టి చార్జీ తీసుకుంటామని, స్థానిక కరెన్సీ ప్రకారం వంద యాన్ల నుంచి వెయ్యి యాన్ల వరకు వసూలు చేస్తామని క్రిమేటర్ వాంగ్ జిలాంగ్ తెలిపారు. తాను ఇప్పటి వరకు కుక్కలు, పిల్లులే కాకుండా చిలుకలు, కుందేళ్లు, తాబేళ్లను కూడా ఖననం చేశానని ఆయన అన్నారు. తమ జంతువుల శ్మశానానికి వచ్చే వారిలో పేదలు, ధనవంతులు అనే తేడా ఉండదని, ఎవరైనా బరువునుబట్టి చెల్లింపులు సమర్పించుకోవాల్సిందేనని ఆయన అన్నారు. పెంపుడు జంతువులను పెరట్లో పాతిపెట్టినా, చెత్త కుప్పల్లో పడేసినా అంటురోగాలు వ్యాపిస్తాయనే ఉద్దేశంతో వాటిని నిషేధిస్తూ చైనా చట్టాలు తీసుకొచ్చింది. 2014లో ఈ చట్టాలను మరింత కఠినతరం చేసింది. అప్పటి నుంచి చైనా ప్రజల్లో చైతన్యం పెరిగింది. జంతువులను చిన్నపాటి జబ్బు చేసినా ఆస్పత్రికి తీసుకెళ్లే అలవాటు కూడా బాగా పెరిగింది. దేశంలో బ్యాచ్‌లర్ కుటుంబాల సంఖ్య పెరుగుతున్నట్లుగానే పెంపుడు జంతువుల సంఖ్య కూడా పెరుగుతోందని పెకింగ్ యూనివర్శిటీ సోషియాలోజి ప్రొఫెసర్ జీ జ్యూలాన్ తెలిపారు. పెంపుడు జంతువుల పెరుగుతున్న అవసరాలను దష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిధులతో మరిన్ని ప్రత్యేక శ్మశానాలు ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. cremation, dogs, cats, Beijing, pet heven, కుక్క, పిల్లులకు శ్మశానాలు, బీజింగ్, బైఫూ పెట్ హెవెన్ -
ఎలుకలు, పిల్లులు, కుక్కలను రానివ్వొద్దు
అవసరమైతే వీటి నియంత్రణకు ప్రత్యేక ఏజెన్సీ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ తాజా నివేదిక హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల దాడిలో శిశువు మృతి చెందిన ఘటన అటు ఆస్పత్రికి, ఇటు సిబ్బందికి ఇప్పటికీ భయాందోళన కలిగిస్తూనే ఉంది. బోధనాసుపత్రుల్లో ఇప్పటికీ ఎలుకలు వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి. శిశువుల వార్డులో తల్లిదండ్రులతో పాటు నర్సులకు నిద్ర కరువైంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఆవరణలో ఎలుకలు, పిల్లులు, కుక్కలు, పందులు, పందికొక్కులు వంటివాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అవసరమైతే వీటి నిర్మూలనకు ప్రత్యేక ఏజెన్సీని నియమించైనా ఇలాంటి వాటిని నియంత్రించాలని సూచించారు. మళ్లీ వస్తూనే ఉన్నాయి.. ప్రధానంగా ఆస్పత్రుల్లో ప్రతి వార్డులోనూ ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని, ఎన్ని పట్టినా మళ్లీ వస్తూనే ఉన్నాయని, వీటికోసం ఇప్పటికే మందులు ఉపయోగించడం, బోన్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని సూచించారు. రోగులు, రోగుల సహాయకుల భోజన వసతులకు ప్రత్యేక గదులు కేటాయించి, భోజనానంతరం వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు పడేసేందుకు చర్యలు తీసుకుంటే బావుంటుందని నివేదికలో పేర్కొన్నారు. గుంటూరు ఘటన అనంతరం పారిశుధ్య కాంట్రాక్టర్ పూర్తిగా ఎలుకల మీదనే దృష్టి సారించారని, ఎలుకల నివారణకు మరో ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో దోమల కారణంగా ఇన్‌పేషెంట్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటికైనా నెట్ (దోమతెర)లు ఏర్పాటు చేస్తే బావుంటుందని సూచించారు. ఇకపై పారిశుధ్య కాంట్రాక్టర్ పనితీరు, 96 శాతానికి మించితేనే 100 శాతం బిల్లులు ఇవ్వాలని నివేదికలో పేర్కొన్నారు.