మహానగరాన్ని వణికిస్తున్న పిల్లి! | City of Japan on High Alert Because of a Cat | Sakshi
Sakshi News home page

మహానగరాన్ని వణికిస్తున్న పిల్లి!

Published Thu, Mar 14 2024 11:36 AM | Last Updated on Thu, Mar 14 2024 12:40 PM

City of Japan on High Alert Because of a Cat - Sakshi

ఓ పిల్లి కారణంగా ఒక మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్‌ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. 

జపాన్‌ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు. కాగా ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు భద్రతా ఫుటేజీలో కనిపించింది. ఒక కార్మికుడు ఆ పిల్లి పంజా గుర్తులను గమనించి, దానిని ఉన్నతాధికారులకు తెలిపాడు. 

ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది. ఫుకుయామా సిటీ హాల్‌లోని ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో  ఆ పిల్లి కోసం వెదకగా, ఇంకా దాని జాడ తెలియలేదన్నారు.  అది సజీవంగా ఉందా లేదా అనేది కూడా సందేహాస్పదంగా ఉందన్నారు.

ఫ్యాక్టరీ మేనేజర్ అకిహిరో కొబయాషి మాట్లాడుతూ కర్మాగారంలో రసాయన వ్యాట్‌ను కప్పి ఉంచే షీట్ పాక్షికంగా చిరిగిపోయిందని తెలిపారు. దానిలో పిల్లి పడి, తరువాత ఎటో వెళ్లిపోయిందని, దానికోసం తమ సిబ్బంది వెదుకుతున్నారని చెప్పారు. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రసాయన ప్రమాద అంచనాలో నిపుణురాలు లిండా షెంక్ మాట్లాడుతూ సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయన్నాన్ని నాకి, చనిపోయివుంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement