సాంకేతికత పరంగా ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో జపాన్ ఒకటి. అయితే ఈ దేశంలోని ఒక నగరంలోని జనం ఎస్క్‌లేటర్లపై నడవడంపై నిషేధం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎస్క్‌లేటర్లపై ఎవరైనా నడిస్తే చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది.
ఈ విషయం తెలిశాక ప్రజారోగ్యం దృష్ట్యా ఇలా చేసి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే జనం మెట్లను ఎక్కువగా ఉపయోగించాలి. వారంతా ఫిట్‌గా ఉండాలనే ఆలోచనతో ఇలా చేసివుంటారని అనుకుంటారు. అయితే ఇలా అనుకోవడంలో అస్సలు నిజం లేదు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది.
జపాన్ టుడే తెలిపిన వివరాల ప్రకారం నగోయా నగరం ఈ చట్టాన్ని చేసింది. 2023, అక్టోబర్ 1 నుంచి ఇక్కడ ఎస్క్‌లేటర్లపై నడవడంపై నిషేధం విధించారు. ఎస్కలేటర్ల నుండి పడిపోకుండా జనాన్ని రక్షించడం, ఈ తరహా ప్రమాదాలను నివారించడమే దీని ఉద్దేశ్యం. జపాన్‌లో ఎస్క్‌లేటర్ వినియోగంలో ఒక నియమం ఉంది. ప్రజలు ఎస్క్‌లేటర్ల ఎడమ వైపున నిలబడాలి. తద్వారా జనం త్వరగా ఎక్కడానికి లేదా దిగడానికి కుడి వైపున ఉన్న మార్గం తెరిచి ఉంటుంది.
ఎస్క్‌లేటర్లు వినియోగించేవారు భయాందోళనలకు గురైనపుడు ఇతరులను నెట్టడంలాంటివి జరుగుతుంటాయి. ఫలితంగా పలువురు గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. వృద్ధులు, వికలాంగులను ఇలాంటి ప్రమాదాల నుండి రక్షించడానికి ఈ నియమం అమలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా నగోయా నగరంలో ఎస్క్‌లేటర్ల ప్రమాదాలు ఎక్కువయ్యాయి.
జపాన్ ఎలివేటర్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2018-2019 సంవత్సరంలో 805 ఎస్క్‌లేటర్ల ప్రమాదాలు సంభవించాయి. ఎస్క్‌లేటర్ల దుర్వినియోగం కారణంగానే ఇలా జరిగినట్లు తేలింది. అప్పటి నుంచి అధికారులు ఎస్క్‌లేటర్ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు 2021 అక్టోబర్‌లో సైతామా నగరంలో కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేశారు. అయితే దానికి చట్టరూపమివ్వలేదు. తాజాగా ఎస్క్‌లేటర్ల వినియోగంపై నగోయా నగరం ఒక చట్టాన్ని రూపొందించింది. ఎస్కలేటర్ల వాడకం మానేయాలని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రధాన రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ప్రకటనల బోర్డులు ఏర్పాటుచేశారు.
ఇది కూడా చదవండి: హర్దీప్ నిజ్జర్ హత్య వెనుక చైనా హస్తం?
Comments
Please login to add a commentAdd a comment