escalator
-
అరే.. పెద్ద కష్టమే వచ్చిందే..
-
ఎస్క్లేటర్పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి?
సాంకేతికత పరంగా ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో జపాన్ ఒకటి. అయితే ఈ దేశంలోని ఒక నగరంలోని జనం ఎస్క్‌లేటర్లపై నడవడంపై నిషేధం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎస్క్‌లేటర్లపై ఎవరైనా నడిస్తే చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. ఈ విషయం తెలిశాక ప్రజారోగ్యం దృష్ట్యా ఇలా చేసి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే జనం మెట్లను ఎక్కువగా ఉపయోగించాలి. వారంతా ఫిట్‌గా ఉండాలనే ఆలోచనతో ఇలా చేసివుంటారని అనుకుంటారు. అయితే ఇలా అనుకోవడంలో అస్సలు నిజం లేదు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. జపాన్ టుడే తెలిపిన వివరాల ప్రకారం నగోయా నగరం ఈ చట్టాన్ని చేసింది. 2023, అక్టోబర్ 1 నుంచి ఇక్కడ ఎస్క్‌లేటర్లపై నడవడంపై నిషేధం విధించారు. ఎస్కలేటర్ల నుండి పడిపోకుండా జనాన్ని రక్షించడం, ఈ తరహా ప్రమాదాలను నివారించడమే దీని ఉద్దేశ్యం. జపాన్‌లో ఎస్క్‌లేటర్ వినియోగంలో ఒక నియమం ఉంది. ప్రజలు ఎస్క్‌లేటర్ల ఎడమ వైపున నిలబడాలి. తద్వారా జనం త్వరగా ఎక్కడానికి లేదా దిగడానికి కుడి వైపున ఉన్న మార్గం తెరిచి ఉంటుంది. ఎస్క్‌లేటర్లు వినియోగించేవారు భయాందోళనలకు గురైనపుడు ఇతరులను నెట్టడంలాంటివి జరుగుతుంటాయి. ఫలితంగా పలువురు గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. వృద్ధులు, వికలాంగులను ఇలాంటి ప్రమాదాల నుండి రక్షించడానికి ఈ నియమం అమలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా నగోయా నగరంలో ఎస్క్‌లేటర్ల ప్రమాదాలు ఎక్కువయ్యాయి. జపాన్ ఎలివేటర్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2018-2019 సంవత్సరంలో 805 ఎస్క్‌లేటర్ల ప్రమాదాలు సంభవించాయి. ఎస్క్‌లేటర్ల దుర్వినియోగం కారణంగానే ఇలా జరిగినట్లు తేలింది. అప్పటి నుంచి అధికారులు ఎస్క్‌లేటర్ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు 2021 అక్టోబర్‌లో సైతామా నగరంలో కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేశారు. అయితే దానికి చట్టరూపమివ్వలేదు. తాజాగా ఎస్క్‌లేటర్ల వినియోగంపై నగోయా నగరం ఒక చట్టాన్ని రూపొందించింది. ఎస్కలేటర్ల వాడకం మానేయాలని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రధాన రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ప్రకటనల బోర్డులు ఏర్పాటుచేశారు. ఇది కూడా చదవండి: హర్దీప్ నిజ్జర్ హత్య వెనుక చైనా హస్తం? -
ఈ మాత్రం దానికి ఎస్కలేటర్ ఎందుకో? గిన్నిస్ రికార్డు మళ్లీ..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్. ఎత్తయిన అరుగులు ఉన్న ఇళ్లకు ఉండే మెట్ల కంటే తక్కువ మెట్లతో ఈ ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఎస్కలేటర్‌గా గిన్నిస్‌బుక్‌లో చోటు పొందింది. జపాన్‌లోని కవాసాకి నగరంలో ఉందిది. కవాసాకి రైల్వే స్టేషన్ దక్షిణం వైపు ద్వారం నుంచి బయటకు వస్తే, ఎదురుగా కనిపించే ‘మోర్’’ డిపార్ట్మెంట్ స్టోర్‌లో ఉంది ఈ బుల్లి ఎస్కలేటర్. దీనికి ఉన్నవి కేవలం ఐదు మెట్లు మాత్రమే! చిన్నపిల్లలు కూడా ఆమాత్రం మెట్లు ఎక్కగలిగినప్పుడు ఈ ఎస్కలేటర్‌ను ఎందుకు ఏర్పాటు చేశారో ఎవరికీ అర్థంకాదు. అయినా, వింతగా ఉండటంతో దీనిని చూడటానికి జనాలు ఇక్కడకు వస్తుంటారు. -
ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..?
బ్యాంకాక్: నడిచే ఎస్కలేటర్ లో పొరపాటున కాలు పడి ఇరుక్కోవడంతో 57 ఏళ్ల మహిళ మోకాలి పైభాగం వరకు కాలును తొలగించిన సంఘటన థాయ్ లాండ్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. దీంతో పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో సౌకర్యాలపై అనుమానాలు కమ్ముకుని, ఇకపై బ్యాంకాక్ పర్యటన అంటే పర్యాటకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది. డాన్ ముయాంగ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కారంత్ తనకుల్జీరపత్ తెలిపిన వివరాల ప్రకారం నఖోన్ సి తమ్మారత్ వెళ్తోన్న ఒక మహిళ నడిచే ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్ లోపల ఇరుక్కుపోయింది. చాలాసేపు నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ మహిళకు విముక్తి కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేశామని అన్నారు. ఇరుక్కున్న కాలిని విడిపించేందుకు చాలాసేపు శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించి అనంతరం దగ్గర్లోని బుమ్రుంగ్రాండ్ అంతర్జాతీయ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు కారంత్. ప్రమాదానికి గల కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మా వలన ఆ మహిళకు జరిగిన నష్టానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని.. జరిగిన తప్పిదానికి మేము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తోపాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కారంత్. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నప్పటికీ కాలు తీసేయడంతో ఆమె గుండె బద్దలైందని ఒకే కాలితో జీవితాంతం ఎలాగన్న ఆలోచన తనను లోలోపలే తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
మహిళను ఆస్పత్రి పాలు చేసిన సూట్‌కేస్
-
Viral Video: ఎస్కలేటర్‌పై యువతి పిచ్చి చేష్టలు.. తిక్క కుదిరింది..!
-
యాక్సిడెంట్ అయింది! వైద్యం చేయండి డాక్టర్: జింక
మన కళ్లముందే రోడ్డుపై ఎన్నో మూగజీవాలు రోడ్డు ప్రమాదాలకు గురవడం చూసి ఉంటాం. ఎవరో కొంతమంది సహృదయులు వాటిని చేరదీసి పశువైద్యశాలకు తరలించడం వంటివి చేస్తారు. లేదంటే అవి అలా గాయాలతోనే బాధపడుతూ ఉండిపోతాయి. కానీ ఇక్కడొక జింక మనిషిమాదిరి ఆసుపత్రికి వచ్చి మరీ చికిత్స చేయించుకుంది. (చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?) అసలు విషయంలోకెళ్లితే... అమెరికాలో ఒక జింకను కారు ఢీ కొట్టడంతో దానికి గాయాలవుతాయి. అయితే ఆ జింక వెంటనే సమీపంలోని లూసియానాలో ఉన్న బాటన్ రూజ్‌లోని అవర్ లేడీ ఆఫ్ ది లేక్ రీజనల్ మెడికల్ సెంటర్లోకి ప్రవేశిస్తుంది. పైగా చికిత్స కోసం ఆ మెడికల్ సెంటర్లో అటూ ఇటు పరిగెడతూ చాలా కష్టపడుతుంది. అంతేకాదు ఆవరణలో పడుతూ లేస్తూ ఆయాస పడుతుంది. అక్కడ ఉన్న ఎస్కలేటర్‌ను సైతం ఏదోరకంగా ఎక్కి రెండో అంతస్తుకి చేరుకుంటుంది. దీంతో అక్కడ ఉన్న వైద్యులు, సందర్శకులు ఆశ్చర్యపోతారు. అయితే అక్కడ ఉన్న పశువైద్యుడు జింకను పరిశీలించి వైద్యం చేస్తాడు. మా వైద్యులు ఎప్పడూ సదా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉంటారంటూ అవర్ లేడీ ఆఫ్ లేక్ రజినల్ మెడికల్ సెంటర్ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు కూడా ఓసారి వీక్షించండి. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ) -
ఎస్కలేటర్‌లో చిక్కుకున్న బాలిక
విశాఖ పట్నం: విశాఖ పట్నంలోని ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లిన కుటుంబానికి అనుకోని సంఘటన ఎదురైంది. పై అంతస్థులో షాపింగ్ చేయడానికి.. ఎస్కలేటర్‌పై వెళ్తున్న ఒక పాప డ్రెస్సు ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న ఎస్కలేటర్‌లో ఇరుక్కుంది. దీంతో బాలిక ఎటు కదల్లేక అక్కడే ఉండిపోయింది. దీంతో వెంటనే ఆ బాలిక తండ్రి షాపింగ్‌మాల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది బాలిక డ్రెస్సును బైటకు తీసి ఎస్కలేటర్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో.. బాలిక క్షేమంగా బయటపడటంతో షాపింగ్‌కు వచ్చిన కస్టమర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ -
పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది
బుర్రకు దెబ్బ తగిలి సంజయ్ రామస్వామి గతాన్ని మర్చిపోయి గజినీ అయినట్లు. ఈ పావురం ఎగరటం మర్చిపోయి సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. హోమ్ జిమ్ చేయాలనుకునే వారికి స్పూర్తిగా నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఓ పావురం ఎగరటం మార్చిపోయినట్లు ఎస్కలేటర్ హ్యాండ్డ్రేల్ను పైకి వెళ్లటానికి ఉపయోగించుకుంది. మొదట దానిపై కూర్చుని కిందకు జారిన అది ఆ తర్వాత ట్రేడ్‌మిల్‌పై మనిషి పరిగెత్తినట్లు, హ్యాండ్డ్రేల్పై పరిగెత్తింది. చివరకు అలుపొచ్చి ఎడమవైపు దానిపైకి దూకింది. అక్కడకూడా పరుగులు పెట్టి, చివరగా కుడివైపు హ్యాండ్డ్రేల్పైకి వచ్చేసింది. అప్పుడు మాత్రం తను అనుకున్న గమ్యస్థానం వైపు అది వెళుతున్నందుకు గమ్మున ఉండిపోయింది. ( ఏమి ఆట: కరోనా కాలంలో బొమ్మలాట! ) ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో వీక్షణలు, దాదాపు 700 కామెంట్లు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ పావురం ఎగరటం మర్చిపోయిందా?.. పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది.. నేను ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ వీడియో ఇదే!.. పావురానికి ట్రెడ్మిల్గా మారిన ఎస్కలేటర్‌ను చూడండి.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
పావురం ఎగరటం మర్చిపోయిందా?
-
అక్కడ.. అందుకే ఎస్కలేటర్లు పనిచేయట్లేదు!
మెక్సికో: ప్రపంచం అంతటా ఎస్కలేటర్లు వాడటం సర్వసాధారణమైపోయింది. దాదాపు అన్ని దేశాల్లోనూ.. షాపింగ్ మాల్స్ మొదలు.. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అయితే మెక్సికోలో ఈ మధ్య తరచూ ఎస్కలేటర్లు పాడవుతున్నాయి. దీంతో అక్కడి ప్రయాణికులు అధికారులపై ఫైర్ అయ్యారు. అయితే... ప్రయాణికుల వల్లే ఎస్కలేటర్లు పనిచేయకుండా పోతున్నాయని అధికారులు సరికొత్త వాదన వినిపించారు. ప్రయాణికులు ఎస్కలేటర్లపై మూత్ర విసర్జన చేస్తున్నారని.. దీంతో వాటి పనితీరు దెబ్బ తినడమే కాకుండా, తుప్పుపట్టి పనికి రాకుండా పోతున్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి ఫెర్మిన్ రామీర్జ్ అనే అధికారి మాట్లాడుతూ.. ‘పలువురు ప్రయాణికులు ఎస్కలేటర్లపై మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో అవి పని చేయకుండా మొరాయిస్తున్నాయి. ఎస్కలేటర్లను పరీక్షించే సమయంలో అది విసర్జితాలతో తడిసిపోయి ఉంటున్నాయి. నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం’ అని ఆయన పేర్కొన్నాడు. పలు స్టేషన్లలో బాత్రూం సదుపాయం అందుబాటులో లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతుందని కొందరు నెటిజన్లు ట్విటర్లో అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా... రానున్న రెండేళ్లలో మెక్సికోలో 55 ఎస్కలేటర్లను మార్చివేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఇలా కూడా కేసు పెడతారా?
మీరెప్పుడైనా ఎస్కలేటర్ ఎక్కారా.. ఎక్కితే గ్రిప్ కోసం పక్కన హ్యాండ్రైల్ ఉంటుంది కదూ. దాన్ని పట్టుకుని వెళితే సురక్షితంగా దిగొచ్చు కదా.. అదే విషయాన్ని అక్కడ సైన్ బోర్డులపై కూడా రాస్తుంటారు. అయితే కొందరు దాని సాయం లేకుండా వెళ్తుంటారు. అలవాటు ఉంటే పెద్ద సమస్యేమీ కాదు. పెద్ద నేరమేమీ కాదు. కానీ కెనడాలో మాత్రం ఓ రకంగా నేరమే. ఓ మహిళ దీనిపై ఏకంగా పదేళ్లుగా పెద్ద పోరాటమే చేశారు. అది 2009. కెనడా లావల్లోని ఓ సబ్వేలో బెలా కోసియాన్ అనే మహిళ ఎస్కలేటర్ ఎక్కారు. ఆ ఎస్కలేటర్ ముందు ‘హ్యాండ్‌రైల్‌ను పట్టుకోండి’అని ఓ బోర్డుపై రాసి ఉంది. అదే విషయాన్ని ఓ పోలీస్ అధికారి ఆమెకు చెప్పాడు. అయితే ఆమె దాన్ని పట్టించుకోలేదు. పైగా అధికారితో వాదనకు దిగారు. ఎస్కలేటర్ హ్యాండ్‌రైల్‌ను పట్టుకోనందుకు రూ.7 వేలు, ఆమె వివరాలు చెప్పనందుకు మరో రూ.23 వేలు ఫైన్ వేశాడు ఆ పోలీస్ అధికారి. అంతేకాదు ఓ 30 నిమిషాల పాటు జైలులో ఉంచారు. దీనిపై ఆమె అక్కడి ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రెండు కోర్టులలో కేసు ఓడిపోయారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నారు. ఆ కోర్టు.. ఈ కోర్టు తిరుగుతూ చివరికి కెనడా సుప్రీం కోర్టును చేరింది ఆ కేసు. చివరికి ఆమెకు అనుకూలంగానే తీర్పు వెలువడింది. -
అలంకారప్రాయంగా ఫుట్ఓవర్ బ్రిడ్జీలు
సాక్షి,బీబీనగర్: జాతీయ రహదారి విస్తరణ జరిగిన అనంతరం ప్రజలు రహదారులను దాటేందుకు ఏర్పాటు చేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జీలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. మండలంలోని కొండమడుగు మెట్టు ,గూడూరు గ్రామాల వద్ద పుట్ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయగా ఇవి రెండు బస్‌స్టాప్‌లకు దూరంగా ఉండడంతో ప్రయాణికులు వాటిని వినియోగించుకోవడం లేదు. జాతీయ రహదారిపై ఉన్న బస్‌స్టాప్‌లకు ఆమడ దూరంలో ఫుట్ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయడంతో ప్రజలు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిరుపయోగంగా మారుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.. ప్రయాణికులకు అనువైన చోట ఫుట్‌ఓవర్‌బ్రిడ్జీలు నిర్మించకపోవడంతో ప్రయాణికులు వాటిని వినియోగించడంతో లేదు. దీంతో బ్రిడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. బస్‌స్టాప్‌కు, చౌరస్తాలకు దూరంగా ఉండడంతో రాత్రి వేళల్లో మందు బాబులు వాటి పైన కూర్చొని మద్యం తాగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణికులకు ఉపయోగపడాల్సిన ఫుట్‌ఓవర్‌బ్రిడ్జీలు అనుకూలమైన చోట ఉండకపోవడంతో పార్టీల బ్యానర్లు కట్టుకోవడానికి, మద్యం బాబులకు, భిక్షాటకులకు ఉపయోగపడుతున్నాయని పలువురు వాపోతున్నారు. నిత్యం జరుగుతున్న ప్రమాదాలు.. ఫుట్ఓవర్ బ్రిడ్జీలు దూరంగా ఉండడంతో ప్రయాణికులు వాటిని వినియోగించుకోకుండా నేరుగా ప్రదాన చౌరస్తాల వద్ద రోడ్డును దాటుతూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు.కొండమడుగు మెట్టు, బీబీనగర్, గూడూరులో రోడ్డును దాటుతూ ప్రాణాలు కోల్పొయిన సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా బీబీనగర్‌లో నిత్యం రోడ్డును దాటుతూ గాయాల బారిన పడుతున్న ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఎస్కలేటర్ ఏర్పాటు ఎప్పుడో..? ఫుట్ ఓవర్ బ్రిడ్జీల మెట్లు ఎక్కడానికి వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతుండడంతో సమస్యను గుర్తించిన స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రదాన చౌరస్తాల వద్ద ఎస్కలేటర్లను ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులకు విన్నవించారు. దీంతో కొండమడుగు, బీబీనగర్, వద్ద ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం కోసం స్థలాలను పరిశీలించినప్పటికి నేటికీ ఆదిశగా చర్యలు లేవు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం బీబీనగర్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేకపోవడం, సర్వీస్ రోడ్లపై సరైన వసతులు లేకపోవడంపై హైవే అధికారులకు విన్నవించి వినతి పత్రం అందజేశాం. ఫుట్ఓవర్ బ్రిడ్జీలు బస్‌స్టాప్‌లకు దూరంగా ఉండడంతో ఎవరూ వినియోగించుకోలేకపోతున్నార – భాగ్యలక్ష్మి, సర్పంచ్, బీబీనగర్ -
స్పీడందుకున్న ఎస్కలేటర్.. 20 మందికి గాయాలు
-
స్పీడందుకున్న ఎస్కలేటర్.. 20 మందికి గాయాలు
రోమ్ : నిర్దేశిత వేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణించిన ఓ ఎస్కలేటర్ 20మందిని గాయలపాలు చేసింది. ఈ ఘటన ఇటలీలోని రిపబ్లికన్ మెట్రో స్టేషన్లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిర్దేశిత వేగంతో కదులుతున్న ఎస్కలేటర్ ఆకస్మాత్తుగా ఒవర్ స్పీడ్ అందుకుంది. దాంతో దానిపై ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఫలితంగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక మెట్రో అధికారులు విచారణ చేపట్టారు. ఓ అధికారి మాట్లాడుతూ ‘ప్రమాదం జరగటానికి కాసేపటి క్రితం మద్యం సేవించిన కొందరు యువకులు ఎస్కలేటర్‌పై గంతులు వేశారని.. అందుకే అది అదుపు తప్పి ఉండొచ్చని భావిస్తున్నట్లు’ వెల్లడించారు. -
షాకింగ్ వీడియో; సెల్ఫీలు దిగుతూ..
గంగా నగర్(రాజస్తాన్): సెల్ఫీ పోజులు ఆ దంపతులకు కోలుకోలేని విషాదాన్ని మిగిల్చాయి. రాజస్తాన్‌లోనే అత్యంత సుందర నగరంగా పేరుపొందిన గంగా నగర్ (శ్రీగంగా నగర్)లో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ అయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే రాహుల్ వాల్మికి- మీరా దంపతులకు 10 నెలల కూతురుంది. నెలవారీ వైద్యపరీక్షల కోసం మే 10న పాపను ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం ఆస్పత్రి పక్కనే ఉన్న సీజీఆర్ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. సరదాగా సెల్ఫీలు దిగుతూ మాల్ మొత్తం కలియదిరిగారు. మూడో అంతస్తు నుంచి ఎస్కలేటర్‌పైకి వెళ్లే క్రమంలో మరో సెల్ఫీదిగబోయారు. కదులుతున్న ఎస్కలేటర్‌పైకి అడుగుపెట్టిన మరుక్షణమే.. తల్లి చేతుల్లో నుంచి పాప జారిపోయింది. ఎస్కలేటర్‌కు, ర్యాంప్‌కు మధ్యనున్న ఖాళీ భాగం గుండా జారిపడి నేలను ఢీకొట్టిందా చిట్టితల్లి. అంతే, శరీరం ఛిద్రమై విపరీతంగా రక్తస్త్రావం అయింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తూ జరిగింది కావడంతో ఈ ఘటనపై ఫిర్యాదుగానీ, కేసు నమోదుగానీ జరగలేదని పోలీసులు చెప్పారు. కొద్ది రోజుల కిందట ముంబైలోనూ ఇదే తరహాలో ఎస్కలేటర్‌పై నుంచి జారిపడి ఓ చిన్నారి మృతిచెందింది. -
విషాదాన్ని మిగిల్చిన సెల్ఫీలు
-
ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.!
-
ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.!
చైనా: ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరో చేసిన నిర్లక్ష్యంతో మన ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే పెద్దలు బయటకు వెళ్లె ముందు ఒళ్లంతా కళ్లు పెట్టుకుని ఉండాలని చెబుతుంటారు. చైనాలోని షెన్జెన్ నగరంలో ఉన్న క్యుజు మెట్రో స్టేషన్లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెట్రో స్టేషన్లో ఎస్కలేటర్ వైపు వెళ్తున్న ఓ మహిళ ఫ్లోర్ కిందకి పడిపోయింది. అప్పటికే పాడైపోయిన ఫ్లోర్‌ని గమనించకపోవడంతో ఈ ఘటన జరిగింది. ఆమెతో పాటే ఉన్న వ్యక్తి తన కళ్ల ముందే లోపలికి పడివోడంతో గుండె గుబేలు మనింది. కొన్ని సెకండ్లపాటు ఆమె కనిపించకపోవడంతో ఆతనికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఉన్న కొందరు సహయం చేయడంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. -
ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయింది
కౌలలాంపూర్: ఎస్కలేటర్‌లో ఇరుక్కున్న బాలుడి ఆర్తనాదాలతో ఓ షాపింగ్ కాంప్లెక్స్ మారుమోగింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన పశ్చిమ మలేసియాలో బుధవారం చోటుచేసుకుంది. ఫ్లోర్ పైకి వెళ్తున్న సమయంలో మూడేళ్ల బాలుడు ఎస్కలేటర్ మీద కూర్చున్నాడు. అయితే చివరకు వచ్చినా కూడా లేవకపోవడంతో అతని పాంటు అందులో ఇరుక్కుపోయింది. దీంతో అతను పైకి లేవడానికి అవకాశం లేకుండా పోయింది. అతని పురుషాంగం చివర మెట్లకు, ఫ్లోర్ కిందభాగానికి మధ్యలో ఇరుక్కుపోయింది. బాలుడు ఎస్కలేటర్‌లో ఇరుక్కోవడం గమనించిన ఓ వ్యక్తి ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కాడు. ఎస్కలేటర్ ఆగినా, అప్పటికే ఆ బాలుడి పురుషాంగం ఎస్కలేటర్‌లో చిక్కుకోవడంతో ఆ బాలుడి రోదనలు మిన్నంటాయి. బాలున్ని రక్షించేందుకు వచ్చిన రెస్యూటీం ఎస్కలేటర్‌ను విడివిడిగా చేసి విప్పారు. 30 నిమిషాల పాటు భద్రతా సిబ్బంది కష్టపడి బాలుడిని బయటకు తీశారు. వెంటనే అతడిని మలేసియాలోని తాయిపింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగానే ఉంది. ఎస్కలేటర్‌లో పైకి వెళుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని రక్షణ చర్యల్లో పాల్గొన్న అధికారి నసీర్ వహబ్ తెలిపారు. పైకి చేరుకున్నసమయంలో ముందుగా బాలుడి ప్యాంటు చిక్కుకొని, తర్వాత పురుషాంగం కూడా ఇరుక్కుందని తెలిపారు. పిల్లలను కదిలే ఎస్కలేటర్ పై కూర్చోనివ్వొదని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
ఎస్కలేటర్ ప్రమాదంలో గాయపడ్డ బాలిక
బీజింగ్: ఎస్కలేటర్ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక గాయపడిన ఘటన చైనా రాజధాని బీజింగ్ లో చోటుచేసుకుంది. ఫుజింగ్ మెన్ ప్రాంతంలోని పార్క్ సన్ షాపింగ్ సెంటర్ లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్కలేటర్ ను నిర్వహించే వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎస్కలేటర్ ఫ్లోర్ ప్యానల్ తీసుకుని పోయి వార్నింగ్ సైన్స్, సేఫ్టీ బారియర్స్ పెట్టలేదు. ఎస్కలేటర్ గ్యాప్ లో బాలిక కాలు ఇరుక్కుపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమెకు 25 సెంటీమీటర్ల మేర కాలిగాయమయిందని వైద్యులు తెలిపినట్టు బీజింగ్ టైమ్స్ వెల్లడించింది. రెండు గంటల పాటు సర్జరీ చేసి కుట్లువేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై షాపింగ్ మాల్ వర్గాలు క్షమాపణ చెప్పాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని హామీయిచ్చాయి. -
ఒంగోలు రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్ ప్రారంభం
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఓంగోలు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డివిజినల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్‌లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు, సదుపాయాల గురించి ఎంపీ... డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణికులు దిగేందుకు కూడా ఓ ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయాలని, స్టేషన్‌కు రెండో వైపున టికెట్ కౌంటర్ ఏర్పాటుతోపాటు, జిల్లాలో రాజస్థాన్ ప్రజలు ఎక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రానికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి డీఆర్ఎంను కోరారు. వీటి పట్ల డీఆర్ఎం సుముఖంగా స్పందించారు. -
ఎస్కలేటర్‌లో పడి..
షాంఘై: చైనాలోని షాంఘై నగరంలో ఎస్కలేటర్ ప్రమాదం స్థానికులను భీతావహం సృష్టించింది. స్థానిక షాపింగ్ మాల్లోని ఎస్కలేటర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో ఎస్కలేటర్‌ను శుభ్రం చేస్తున్న 35 ఏళ్ల జాంగ్ అందులో చిక్కుకుపోయాడు. అతని ఎడమకాలు మోకాలి కింది భాగం నుజ్జునుజ్జవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతణ్ని ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై విచారణ చేపట్టామని షాంఘై అధికారులు ప్రకటించారు. కాగా ఇటీవల చైనాలో ఈ తరహా ప్రమాదం ఇది నాలుగవదని తెలుస్తోంది. -
నెల్లూరు రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తాం
నెల్లూరు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం నెల్లూరు రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. బిట్రగుంటలో రైల్వే ప్రాజెక్ట్‌కు కృషి చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యకర్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మంత్రి కామినేని శ్రీనివాస్, దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ పాల్గొన్నారు.