
గంగా నగర్(రాజస్తాన్): సెల్ఫీ పోజులు ఆ దంపతులకు కోలుకోలేని విషాదాన్ని మిగిల్చాయి. రాజస్తాన్‌లోనే అత్యంత సుందర నగరంగా పేరుపొందిన గంగా నగర్ (శ్రీగంగా నగర్)లో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ అయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
స్థానికంగా నివసించే రాహుల్ వాల్మికి- మీరా దంపతులకు 10 నెలల కూతురుంది. నెలవారీ వైద్యపరీక్షల కోసం మే 10న పాపను ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం ఆస్పత్రి పక్కనే ఉన్న సీజీఆర్ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. సరదాగా సెల్ఫీలు దిగుతూ మాల్ మొత్తం కలియదిరిగారు. మూడో అంతస్తు నుంచి ఎస్కలేటర్‌పైకి వెళ్లే క్రమంలో మరో సెల్ఫీదిగబోయారు. కదులుతున్న ఎస్కలేటర్‌పైకి అడుగుపెట్టిన మరుక్షణమే.. తల్లి చేతుల్లో నుంచి పాప జారిపోయింది. ఎస్కలేటర్‌కు, ర్యాంప్‌కు మధ్యనున్న ఖాళీ భాగం గుండా జారిపడి నేలను ఢీకొట్టిందా చిట్టితల్లి. అంతే, శరీరం ఛిద్రమై విపరీతంగా రక్తస్త్రావం అయింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తూ జరిగింది కావడంతో ఈ ఘటనపై ఫిర్యాదుగానీ, కేసు నమోదుగానీ జరగలేదని పోలీసులు చెప్పారు. కొద్ది రోజుల కిందట ముంబైలోనూ ఇదే తరహాలో ఎస్కలేటర్‌పై నుంచి జారిపడి ఓ చిన్నారి మృతిచెందింది.
Comments
Please login to add a commentAdd a comment