sri ganganagar district
-
వేసవిలో అక్కడకు వెళితే మాడి మసైపోతారు
శ్రీగంగానగర్ (రాజస్థాన్): వేసవికాలం రాకముందే దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల వడగాడ్పులకు జనం విలవిలలాడిపోతున్నారు. వేసవి ప్రవేశించకముందే ఇలా ఉంటే, ఇక మున్ముందు ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే మనదేశంలోని ఒక జిల్లాలో వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఆ సమయంలో అక్కడికి ఎవరైనా వెళితే మాడిమసైపోవాల్సిందే..రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా(Sri Ganganagar District)లో వేసవిలో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతం భారత్‌లో అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా గుర్తించారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ జిల్లాలో వేసవికాలం దడ పుట్టిస్తుంది. గతంలో ఈ జిల్లా బికనీర్‌లో భాగంగా ఉండేది. ఆ తరువాత దీనిని మరో జిల్లాగా మార్చారు. శ్రీగంగానగర్ జిల్లాకు దక్షిణాన బికనీర్, పశ్చిమాన పాకిస్తానీ పంజాబ్, ఉత్తరాన భారత పంజాబ్ ప్రాంతంలోని ఫాజిల్కా జిల్లాలు ఉన్నాయి.వేసవి కాలంలో శ్రీగంగానగర్ జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకుపైగా ఉంటుంది. ఫలితంగా జిల్లాలో మధ్యాహ్నం సమయంలో రోడ్లపై ఒక్కరు కూడా కనిపించరు. రాజస్థాన్(Rajasthan)లోని ఈ జిల్లా గోధుమ, ఆవాలు, పత్తి పంటలకు ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో పంజాబీ ప్రజలు ఈ జిల్లాలో నివసిస్తున్నారు. ఇక్కడి మహిళలు ఎంబ్రాయిడరీ చేసిన స్కార్ఫ్‌లను ధరిస్తుంటారు. శ్రీ గంగానగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలకు ఒక కారణం ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చే వేడిగాలులు కారణంగా ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 50 డిగ్రీలు కూడా దాటుతుంటాయి. శ్రీగంగానగర్‌లో సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు అటుఇటుగా నమోదువుతుంటుంది. ఇది కూడా చదవండి: ఏప్రిల్ 19 నుంచి కట్రా- శ్రీనగర్ ‘వందేభారత్’ -
షాకింగ్ వీడియో; సెల్ఫీలు దిగుతూ..
గంగా నగర్(రాజస్తాన్): సెల్ఫీ పోజులు ఆ దంపతులకు కోలుకోలేని విషాదాన్ని మిగిల్చాయి. రాజస్తాన్‌లోనే అత్యంత సుందర నగరంగా పేరుపొందిన గంగా నగర్ (శ్రీగంగా నగర్)లో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ అయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే రాహుల్ వాల్మికి- మీరా దంపతులకు 10 నెలల కూతురుంది. నెలవారీ వైద్యపరీక్షల కోసం మే 10న పాపను ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం ఆస్పత్రి పక్కనే ఉన్న సీజీఆర్ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. సరదాగా సెల్ఫీలు దిగుతూ మాల్ మొత్తం కలియదిరిగారు. మూడో అంతస్తు నుంచి ఎస్కలేటర్‌పైకి వెళ్లే క్రమంలో మరో సెల్ఫీదిగబోయారు. కదులుతున్న ఎస్కలేటర్‌పైకి అడుగుపెట్టిన మరుక్షణమే.. తల్లి చేతుల్లో నుంచి పాప జారిపోయింది. ఎస్కలేటర్‌కు, ర్యాంప్‌కు మధ్యనున్న ఖాళీ భాగం గుండా జారిపడి నేలను ఢీకొట్టిందా చిట్టితల్లి. అంతే, శరీరం ఛిద్రమై విపరీతంగా రక్తస్త్రావం అయింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తూ జరిగింది కావడంతో ఈ ఘటనపై ఫిర్యాదుగానీ, కేసు నమోదుగానీ జరగలేదని పోలీసులు చెప్పారు. కొద్ది రోజుల కిందట ముంబైలోనూ ఇదే తరహాలో ఎస్కలేటర్‌పై నుంచి జారిపడి ఓ చిన్నారి మృతిచెందింది. -
తల్లిని ఆమె ప్రియుడిని చంపిన కొడుకులు
జైపూర్(రాజస్థాన్): భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటూ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను ఆమె కుమారులే కొట్టిచంపారు. రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గొగామెది గ్రామానికి చెందిన బల్జీత్ కౌర్(39)కు భర్త, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్ అయిన భర్తతో విభేదాలు రావటంతో ఒక కుమారుడు, కుమార్తెతో కలిసి వేరుగా మరో గ్రామంలో ఉంటోంది. అక్కడే గత నాలుగు నెలలుగా సుఖ్‌పాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. అయితే, ఇది నచ్చని కుమారులు విశాల్ సింగ్(21), హర్దీప్ సింగ్(19) తల్లిని, ఆమె ప్రియుడిని అంతం చేసేందుకు పథకం పన్నారు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి ఉందంటూ గొగామెది గ్రామానికి సోమవారం రాత్రి రప్పించారు. అక్కడే వారితో వాదులాటకు దిగారు. వెంట ఉంచుకున్న పదునైన ఆయుధంతో యువకులిద్దరూ కలిసి బల్జీత్‌కౌర్‌తోపాటు సుఖ్‌పాల్‌ను కొట్టి చంపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.