తల్లిని ఆమె ప్రియుడిని చంపిన కొడుకులు | Youths kill mother and her lover in Sriganganagar district | Sakshi
Sakshi News home page

తల్లిని ఆమె ప్రియుడిని చంపిన కొడుకులు

Published Tue, Jun 27 2017 3:47 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

తల్లిని ఆమె ప్రియుడిని చంపిన కొడుకులు

తల్లిని ఆమె ప్రియుడిని చంపిన కొడుకులు

జైపూర్‌(రాజస్థాన్‌): భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటూ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను ఆమె కుమారులే కొట్టిచంపారు. రాజస్థాన్‌ శ్రీగంగానగర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గొగామెది గ్రామానికి చెందిన బల్జీత్‌ కౌర్‌(39)కు భర్త, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్‌ అయిన భర్తతో విభేదాలు రావటంతో ఒక కుమారుడు, కుమార్తెతో కలిసి వేరుగా మరో గ్రామంలో ఉంటోంది. అక్కడే గత నాలుగు నెలలుగా సుఖ్‌పాల్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. అయితే, ఇది నచ్చని కుమారులు విశాల్‌ సింగ్‌(21), హర్దీప్‌ సింగ్‌(19) తల్లిని, ఆమె ప్రియుడిని అంతం చేసేందుకు పథకం పన్నారు.

ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి ఉందంటూ గొగామెది గ్రామానికి సోమవారం రాత్రి రప్పించారు. అక్కడే వారితో వాదులాటకు దిగారు. వెంట ఉంచుకున్న పదునైన ఆయుధంతో యువకులిద్దరూ కలిసి బల్జీత్‌కౌర్‌తోపాటు సుఖ్‌పాల్‌ను కొట్టి చంపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement