Mother killed
-
‘తల్లి’ మరణంపై కూతురు బొమ్మ.. కేసులో బిగ్ ట్విస్ట్
ఝాన్సీ: ‘పాపా కిల్డ్ మమ్మీ, హ్యాంగ్డ్ బాడీ’ అంటూ నాలుగేళ్ల బాలిక వేసిన బొమ్మతో ఆమె తల్లి మరణోదంతం కొత్త మలుపు తిరిగింది. తల్లిని చంపేస్తానని తండ్రి గతంలోనూ బెదిరించాడని బాలిక చెప్పింది. అంతేగాక తననూ చంపేస్తానన్నాడని చెప్పుకొచ్చింది. దాంతో అత్తింటివారి ‘ఆత్మహత్య’ కథనాన్ని పోలీసులు అనుమానించారు.ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని తికంగఢ్ జిల్లాకు చెందిన సోనాలికి ఝాన్సీలోని కొత్వాలీకి చెందిన సందీప్ బుధోలియాతో 2019లో వివాహమైంది. రూ.20 లక్షల కట్నమిచ్చారు. కారు అడగ్గా తమ శక్తికి మించినదని తల్లిదండ్రులు చెప్పారు. అప్పట్నుంచీ సోనాలిపై వేధింపులు మొదలయ్యాయి."🚨 Jhansi: A 4-year-old girl's drawing exposed the murder of her mother, Sonali Budholia. She alleged her father, Sandeep Budholia, killed her after years of dowry harassment & abuse. 💔 Police are investigating. #JusticeForSonali #StopDowry #UttarPradesh" pic.twitter.com/ayZG51DKxO— HK Chronicle (@HK_Chronicle_) February 18, 2025నాలుగేళ్లకు పాప పుట్టడంతో.. భర్త, అత్తామామలు సోనాలిని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. సోనాలి తండ్రే ఆస్పత్రి బిల్లు చెల్లించి కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు. కొంతకాలానికి అత్తింటివారు వచ్చి తల్లీకూతుళ్లను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం, సోనాలి ఆరోగ్యం బాగాలేదంటూ భర్త ఇటీవల ఆమె తల్లిదండ్రలకు ఫోన్ చేశాడు. కాదు, ఉరేసుకుందంటూ ఆ వెంటనే సమాచారమిచ్చాడు. వెళ్లి చూసేసరికి సోనాలి చనిపోయి ఉంది. దాంతో కూతురిని అత్తింటివారే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.అయితే తండ్రే తన తల్లిని చంపాడని వారి నాలుగేళ్ల దర్శిత చెప్పింది. ‘మమ్మీపై డాడీ దాడి చేసి చంపేశాడు. తర్వాత ‘కావాలంటే నువ్వు చచ్చిపో అని నన్ను అన్నాడు. అమ్మకు ఉరేసి రాయితో తలపై కొట్టాడు. తర్వాత కిందకు దించి సంచిలో పడేశాడు’ అంటూ బొమ్మగీసి మరి చూపించింది. ‘నువ్వు మా అమ్మను తాకితే నీ చెయ్యి విరగ్గొడతానని గతంలో నాన్నను తిట్టా. దాంతో ‘మీ అమ్మను చంపేస్తా, నిన్నూ చంపేస్తా’ అని అన్నాడు’ అని కన్నీరు పెట్టుకుంది. కూతురి వాంగ్మూలం, మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కడతేర్చిన కూతురు..
భోపాల్: యువకుని ప్రేమ మాయలో పడి కన్నతల్లినే కడతేర్చింది ఓ యువతి. ప్రియుడితో కలిసి ఆమెను దారుణంగా హత్య చేసింది. కత్తిపోట్లతో విరుచుకుపడి క్రూరంగా చంపేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఆదివారం జరిగింది. నిందితురాలు మైనర్(17). ఆమె బాయ్‌ఫ్రెండ్ వయసు 25 ఏళ్లు. ఇద్దరినీ పోలీసులు సోమవారం అరేస్టు చేశారు. అయితే నిందితులిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మాయి తల్లి వీరిద్దరి రిలేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. అతన్ని కలవొద్దని చెప్పింది. కానీ రెండు నెలల క్రితం ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది అమ్మాయి. ఆమె మైనర్ అయినందున తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీంతో పోలీసులు ప్రియుడ్ని అరెస్టు చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలై మళ్లీ అమ్మాయిని తరచూ కలుస్తున్నాడు. దీంతో తల్లి హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తన ప్రేమకు తల్లే అడ్డుపడుతోందని భావించిన అమ్మాయి ఆమెపై కక్ష పెంచుకుంది. పథకం పన్ని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. చివరకు కటకటాల పాలైంది. చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
దారుణం: తల్లిని చంపి.. హాయిగా నిద్రపోయాడు..
సాక్షి, కృష్ణా: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నాగాయలంక మండలంలోని ఎదురుమొండిలో ఓ కుమారుడు తన తల్లిదండ్రులపై గొడ్డలితో కిరాతకంగా దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి వీర్లంకమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తండ్రి నాగేశ్వరరావును అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు తల్లి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిద్రపోతున్న వీరరాఘవయ్య కొడుకు వీరరాఘవయ్య తన భార్యతో ఉన్న కుటుంబ కలహాలను మనసులో పెట్టుకొని తన తల్లిదండ్రులపై దాడిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాడి చేసే సమయంలో వీరరాఘవయ్య మద్యం సేవించినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. తల్లి చనిపోయిన తర్వాత వీరరాఘవయ్య హాయిగా నిద్రపోవటం గ్రామస్తుల్ని ఆశ్చర్య పరుస్తోంది. -
మొబైల్ మత్తులో తల్లిని చంపిన డిగ్రీ విద్యార్థి
సాక్షి, మండ్య: మొబైల్ ఫోన్ వ్యసనం ఓ యువకున్ని హంతకునిగా మార్చింది. ఎప్పుడూ ఫోనేనా, బుద్ధిగా చదువుకో, ఇంట్లో పనులు చేయవచ్చు కదా అని బుద్ధిమాటలు చెప్పిన తల్లిని అంతమొందించాడో తనయుడు. మొబైల్ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని క్రూరునిగా మారాడు. గత గురువారం మండ్యలోని విద్యా నగరలో ఇంట్లోనే ఒక మహిళ హత్యకు గురైంది. కత్తిపోట్లతో రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహం ఫోటోలు తీవ్ర కలకలం సృష్టించాయి. హతురాలిని శ్రీలక్ష్మి (45)గా గుర్తించారు. విచారణలో నేరం రట్టు ఇంత దారుణంగా ఎవరు చంపి ఉంటారని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కుమారుడు మను శర్మ (21)నే హంతకుడని శనివారం గుర్తించడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చాకుతో పొడిచి ఇంటి నుంచి వెళ్ళియాడు. పోలీసులు ఇంటికి వచ్చి హత్యాస్థలిని పరిశీలిస్తున్న సమయంలో తిరిగి వచ్చిన మను శర్మ ఏమీ తెలియనివాడిలా నటించాడు. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో దొరికిపోయిన మనుశర్మ తానే తల్లీని హత్య చేసినట్లు ముందు ఒప్పుకున్నాడు. (చెంపలు వాయించింది) ఏం జరిగిందంటే మధుసూదన్, శ్రీలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు అయిన మను శర్మ బీఎస్సి చివరి ఏడాది చదువుతున్నాడు. ఇతను ఎప్పుడూ మొబైల్ఫోన్లో లీనమయ్యేవాడు. యువతితో కూడా ఫోన్లో మాట్లాడేవాడు. ఇది మంచిది కాదు అని తల్లి మనుశర్మను మందలించేది. అతడు బయటకి వెళ్లకుండా కట్టడి చేసేది. గురువారం అతని కోసం స్నేహితుడు రాగా, బటయకు వెళ్ళవద్దని తల్లి హెచ్చరించింది. తరువాత తల్లీ కొడుకు మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో తల్లి అతని తలపైన గట్టిగా కొట్టడంతో మనుశర్మ వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకొని వచ్చి తల్లి మీద దాడికి దిగాడు. కత్తితో విచ్చలవిడిగా పొడిచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య జరిగిన కొంత సమయానికి భర్త మధుసూదన్, మరో కుమారుడు ఆదర్శ వచ్చి చూడగా శ్రీలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలన చేస్తున్న సమయంలో మను శర్మ వచ్చాడు. పోలీసుల విచారణలో చిక్కుముడి వీడింది. నిందితున్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
తల్లిని హతమార్చిన డిగ్రీ విద్యార్థి
బెంగళూరు: మొబైల్ ఫోన్ వ్యసనం ఓ యువకుడిని హంతకునిగా మార్చింది. ఎప్పుడూ ఫోనేనా, బుద్ధిగా చదువుకో, ఇంట్లో పనులు చేయవచ్చు కదా అని బుద్ధిమాటలు చెప్పిన తల్లిని అంతమొందించాడో తనయుడు. మొబైల్ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని క్రూరునిగా మారాడు. మండ్యలోని విద్యా నగరలో గత గురువారం ఇంట్లోనే ఒక మహిళ హత్యకు గురైంది. కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం ఫోటోలు తీవ్ర కలకలం సృష్టించాయి. హతురాలిని శ్రీలక్ష్మి (45)గా గుర్తించారు. విచారణలో నేరం రట్టు ఇంత దారుణంగా ఎవరు చంపి ఉంటారని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కుమారుడు మను శర్మ (21)నే హంతకుడని శనివారం గుర్తించడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చాకుతో పొడిచి ఇంటి నుంచి వెళ్ళియాడు. పోలీసులు ఇంటికి వచ్చి హత్యాస్థలిని పరిశీలిస్తున్న సమయంలో తిరిగి వచ్చిన మను శర్మ ఏమీ తెలియనివాడిలా నటించాడు. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో దొరికిపోయిన మనుశర్మ తానే తల్లీని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మధుసూదన్, శ్రీలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు మను శర్మ బీఎస్సీ చివరి ఏడాది చదువుతున్నాడు. అతను ఎప్పుడూ మొబైల్ ఫోన్లో లీనమయ్యేవాడు. స్నేహితురాలితో గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవాడు. ఇది మంచిది కాదు అని తల్లి మనుశర్మను మందలించేది. అతడు బయటకి వెళ్లకుండా కట్టడి చేసేది. గురువారం అతని కోసం స్నేహితుడు రాగా, బయటకు వెళ్ళవద్దని తల్లి హెచ్చరించింది. దీంతో తల్లీ కొడుకు మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో తల్లి మనుశర్మ తలపైన గట్టిగా కొట్టింది. దీంతో మనుశర్మ వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకొని వచ్చి తల్లి మీద దాడికి దిగాడు. కత్తితో విచ్చలవిడిగా పొడిచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య జరిగిన కొంత సమయానికి భర్త మధుసూదన్, మరో కుమారుడు ఆదర్శ వచ్చి చూడగా శ్రీలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలన చేస్తున్న సమయంలో మను శర్మ వచ్చాడు. పోలీసుల విచారణలో చిక్కుముడి వీడింది. నిందితున్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
పెంచలేక చంపేసింది..!
కృష్ణాజిల్లా, పెడన : ఆర్థిక కారణాలతో పెంచలేక ఆ తల్లి తన కుమార్తెను కడతేర్చింది. భర్త చనిపోవడంతో పోషించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఆమె తన కుమార్తెకు విషమిచ్చి చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాలిలా ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు విగతజీవులుగా మారిన చిన్నారుల ఘటన వెనుక కారణం ఆర్థిక పరిస్థితులేనని తెలుస్తోంది. చిన్నారి మోకా ప్రశాంతికి (5) మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహంలోని కొన్ని శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే, విషం ఇచ్చి చంపినట్లు పోస్టుమార్టంలో తేలినట్లు సమాచారం. నివేదిక వచ్చేందుకు నాలుగైదు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టుమార్టం పూర్తయిన చిన్నారి ప్రశాంతి మృతదేహానికి స్థానికులు, బంధువులు ఘనంగా అంత్యక్రియలను నిర్వహించారు. డీఎస్పీ మహబూబ్‌బాషా ఆరా... మచిలీపట్నం డీఎస్సీ మహబూబ్‌బాషా బుధవారం పెడన పోలీస్ స్టేషన్‌కు వచ్చి చిన్నారుల మృతిపై ఆరా తీశారు. జరిగిన ఘటనలను ఎస్ఐ అభిమన్యు డీఎస్పీకి వివరించారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మచిలీపట్నం, పెడన అర్బన్ సూపర్వైజర్ విజయలక్ష్మి, 15వ వార్డు అంగన్వాడీ ఆయాతో కలిసి పోలీస్ స్టేషన్లో ఉన్న చిన్నారుల తల్లి నాంచారమ్మకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నారులు ఏ విధంగా చనిపోయారనే దానిపై వారు ప్రశ్నలను అడిగి పలు విషయాలను రాబట్టినట్లు సమాచారం. చాలా సేపు నోరు విప్పని నాం చారమ్మ చివరికి పెంచుకోలేక పిల్లలను చంపుకున్నాననే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితులే కారణమా..! మోకా రామాంజనేయులు ఉరఫ్ సుబ్బారావు, నాంచారమ్మలది ప్రేమ వివాహం. రామాంజనేయులు స్వస్థలం బందరు మండలం పోలాటితిప్ప. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పట్టుబడిపోతుండటంతో ఆటోను నడుపుకుంటూ పెడనలో ఉండే నాంచారమ్మను వివాహం చేసుకున్నా డు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు... ప్రశాంతి (5), దివ్య (3). భర్త తాగుడుకు బానిస కావడంతో నాంచారమ్మ కూడా కలంకారీ పనికి వెళ్తోంది. మద్యానికి బానిసైన రామాంజనేయులు ఈ ఏడాది జనవరి ఒకటిన చనిపోయాడు. అంత్యక్రియలు పూర్తయ్యాక కలంకారీ పనికి వెళ్లేందుకు నాంచారమ్మ సిద్ధమైంది. అయితే భర్త చనిపోయిన భార్యకు మూడు నెలల వరకు వారి సంప్రదాయం ప్రకారం కలంకారీ పనికి రానీయలేదని సమాచారం. దీంతో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతుండటంతో నాంచారమ్మ ఇద్దరు ఆడ పిల్లలతో తీవ్ర మానసిక వేదనకు గురైంది. అదీ కాకుండా పెద్ద పిల్ల ప్రశాంతి ఎప్పుడూ నాన్న ఏడీ, నాన్న ఏడి.. అంటూ కోరుతుండటంతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో తల్లి మానసిక క్షోభను అనుభవించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మేం కూడా చనిపోతామనే విషయాన్ని చెప్పుకుని బంధువుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఉరేసుకునేందుకు ప్రయత్నించి విఫలం.. భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగా వదిలి నాంచారమ్మ ఉరేసుకునేందుకు ప్రయత్నించి విఫలమైందని బంధువులు చెబుతున్నారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఏమైనా సాయం కావాల్సి వస్తే చేస్తామని నాంచరమ్మ సోదరీమణులు భరోసా ఇచ్చారు. అదీ కాకుండా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ ఆయాలు సైతం కలిసి పిల్లలను ఇబ్బంది రాకుండా చూసుకోవాలని, లేనిపక్షంలో చిల్డ్రన్స్ హోంకు పంపించాలని కూడా సూచించారు. పిల్లలను చూసుకుంటానని చెప్పిన నాంచారమ్మ ఆ తర్వాత ఏం చేసిందనేది మిస్టరీగానే ఉంది. మానసిక పరిస్థితి బాగోలేక పిల్లలకు విషమిచ్చి చంపేసిందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. -
మొగల్తూరులో విషాదం
సాక్షి, మొగల్తూరు: ఏం కష్ట మొచ్చిందో ఆ తల్లికి.. పేగుబంధంపైనా పెనుకసిని చూపింది. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను కడితేర్చింది. పిల్లల చిరునవ్వులను చూసి నిత్యం మురిసిపోయిన ఆమె అతి కర్కశంగా వారి మెడకు తువ్వాలు బిగించి, బిగించి ఊపిరి తీసింది. చివరకు తనూ ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. ఏం జరిగిందంటే..! పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గాంధీబొమ్మల సెంటర్ సమీపంలో నివాసం ఉండే నల్లిమిల్లి లక్ష్మీప్రసన్న(28) ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. తను చని పోవడానికి ముందు పెద్ద కుమార్తె రోజాశ్రీలక్ష్మి (7), చిన్న కుమార్తె జాహ్నవి (5) లను కూడా దారుణంగా తువ్వాలుతో గొంతుబిగించి చంపేసింది. ఆర్థిక ఇబ్బందులు, భర్త వేధింపులు, కుటుంబ కలహాల వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో మొగల్తూరులో విషాదఛాయలు అలముకున్నాయి. రైస్ మిల్లు జయమాని అయిన లక్ష్మీప్రసన్న భర్త నల్లిమిల్లి వెంకటరామాంజనేయరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి 7.15గంటల సమయంలో మిల్లు నుంచి ఇంటికి వచ్చిన రామాంజనేయరెడ్డి ఇంట్లో భార్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని, మంచంపై ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడిఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మొగల్తూరు ఎస్సై వచ్చి వెంటనే రామాంజనేయరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ముందు పిల్లలను చంపి.. ముందు పిల్లల గొంతులను తువ్వాలుతో బిగించి లక్ష్మీప్రసన్న చంపిందని, తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు చిన్నారులకు మెడపై గాయాలు ఉండడమే కాకుండా, ముక్కునుంచి రక్తం కారుతున్నట్టు గుర్తించారు. పిల్లలు ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అదే గదిలో ఫ్యాన్‌కు చీరతో లక్ష్మీప్రసన్న ఉరివేసుకుందని భావిస్తున్నారు. ఆదివారం ఇంట్లో పెద్ద గొడవ? లక్ష్మీప్రసన్న ఇంట్లో ఆదివారం జరిగిన పెద్ద గొడవే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. కొన్నినెలలుగా భర్త వేధింపులే ఈ గొడవకు కారణమని సమాచారం. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. వెంటక రామాంజనేయరెడ్డి కుటుంబానిది ఆచంట మండలం పిట్టలవేమవరం. ఆయన తండ్రి సత్యనారాయణరెడ్డి 15ఏళ్ల క్రితం మొగల్తూరు వచ్చేశారు. అతనికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక్కడ రైస్‌మిల్లు వ్యాపారం ప్రారంభించారు. తండ్రీ, కొడుకులు ఇద్దరూ కలసి రైసుమిల్లు నడిపేవారు. అయితే 3 నెలల క్రితం సత్యనారాయణరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. 10 రోజుల కిత్రం రామాంజనేయరెడ్డి తల్లి రామలక్ష్మి కూడా చనిపోయారు. రామలక్ష్మి పెద్దకార్యం ఆదివారం జరిగింది. ఈ సందర్భంలో లక్ష్మీప్రసన్నతో భర్త, ఆడపడుచులు గొడవ పడినట్టు లక్ష్మీప్రసన్న తల్లి కనకదుర్గ చెబుతోంది. సోమవారం ఉదయం ఇంట్లో శాంతిహోమం నిర్వహించారు. అది ముగిసిన తరువాత సాయంత్రం 6 గంటలకు మిల్లుకు వెళ్లానని, మళ్లీ రాత్రి 7.15 గంటలకు ఇంటికి వచ్చి చూడగా భార్యాపిల్లలు మృతిచెంది పడి ఉన్నారని రామాంజనేయరెడ్డి చెబుతున్నాడు. మంచంపై విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులు ఆత్మహత్యా... హత్యలా..? అల్లుడికి ఉన్న అప్పులు, వేధింపులే తమ కుమార్తె ప్రాణం తీశాయని లక్ష్మీప్రసన్న తల్లి కనకదుర్గ ఆరోపిస్తోంది. అల్లుడు తండ్రి సత్యనారాయణరెడ్డి చనిపోయే నాటికి మిల్లుపై రూ.7 కోట్ల వరకూ అప్పులు చేశారని చెబుతోంది. అప్పటి నుంచి డబ్బులు తేవాలని, లేకుంటే నిన్ను చంపి వేరే పెళ్లి చేసుకుంటానని అతను తన కుమార్తెను బెదిరిస్తున్నాడని కనకదుర్గ చెబుతున్నారు. అప్పటికీ ఇటీవల రూ.70 లక్షలు సర్దామని, అయినా ఆదివారం జరిగిన గొడవలో తమ కుమార్తెపై అల్లుడు, అతని బంధువులు విరుచుకుపడ్డారని వివరించింది. అయితే అసలు ఏం జరిగిందనేది రామాంజనేయరెడ్డి నోరు తెరిస్తేనే గానీ తెలియదు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని నరసాపురం సీఐ కృష్ణమోహన్ చెప్పారు. చిన్న గొడవ కూడా బయటకు వచ్చేది కాదు లక్ష్మీప్రసన్న కుటుంబం 15 ఏళ్లుగా ఇదే ఇంట్లో అద్దెకు ఉంటోంది. గొడవలు జరుగుతున్నట్టుగా గానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టుగా గానీ ఏమీ తెలిసేది కాదని స్థానికులు చెబుతున్నారు. రామాంజనేయరెడ్డికి, ఆలమూరుకు చెందిన లక్ష్మీప్రసన్నతో 2011లో పెళ్లైంది. పెద్దపాప 2వ తరగతి, చిన్న పాప ఎల్కేజీ. పిల్లలతో కలసి చుట్టుపక్కల వారితో లక్ష్మీప్రసన్న చాలా కలివిడిగా ఉండేదని సమాచారం. -
కుమార్తె హత్య కేసులో తల్లి అరెస్ట్
విశాఖపట్నం, రాంబిల్లి(యలమంచిలి): దిమిలిలో సంచలనం రేపిన చిన్నారి రమ్య హత్య కేసులో ఆమె తల్లి బండి ఉమను బుధవారం అరెస్ట్ చేసినట్టు సీఐ కె.కె.వి. విజయనా«థ్ తెలిపారు. ఈ నెల 21న బండి రమ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎస్ఐ వి.చక్రధరరావుతో కలిసి సీఐ రాంబిల్లిలో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తన ఏడేళ్ల కుమార్తె పీకనులిమి చంపినట్టు ఉమ అంగీకరించిందన్నారు. ఉమను కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండు విధించారని చెప్పారు. అనంతరం ఆమెను విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్టు తెలిపారు. ఉమ, భర్త అప్పారావుల మధ్య సఖ్యత లేదని సీఐ తెలిపారు. ఆ కోపం పిల్లలపై చూపేదని, రెండుమూడు సార్లు భర్తను సైతం కొట్టి గాయపరిచినట్టు తమ విచారణలో తేలిందన్నారు. స్కూల్‌కు వెళ్లనని చెప్పడంతో పీకనులిమి వేసినట్టు ఉమ అంగీకరించిందని, ఈ సమయంలో తన నాలుగేళ్ల కుమారుడు మనోజ్ అక్కను అమ్మ చంపేస్తోందని అరచినట్టు కూడా ఉమ అంగీకరించిందన్నారు. తర్వాత ఏమీ తెలియనట్టు రమ్యపై దుప్పటి కప్పినట్టు తెలిపారు. కొంత సేపటికి ఇంటికి వచ్చిన పెద్ద కుమార్తె వాణిని... నిద్రిస్తున్న చెల్లిని లేపని, బడికి సమయం అవుతోందని ఉమ తెలిపింది. అయితే అప్పటికే రమ్య మృతి చెంది ఉంది. దీంతో ఏమీ తెలియనట్టు ఉమ నటించి, తన కూతురు చనిపోయిందని ఇరుగు పొరుగుకు చెప్పిందని సీఐ తెలిపారు. ఈ లోగా తమకు అందిన సమాచారం మేరకు దిమిలి వెళ్లి విచారణ చేపట్టి ఉమను అరెస్ట్ చేసినట్టు సీఐ విజయనాథ్ తెలిపారు. -
డ్రగ్‌కు బానిసైన మోడల్, తల్లిని చంపేశాడు
ముంబై : 23 ఏళ్ల లక్ష్య సింగ్ అనే మోడల్ డ్రగ్స్‌కు బానిసైయ్యాడు. ఆ మత్తులో తానేమి చేస్తున్నో కూడా తెలియలేదు. తనకు తెలియకుండానే తల్లి సునీతా సింగ్(45)ను బాత్రూంలో తోసేసి, చంపేశాడు. డ్రగ్స్‌కు బానిసైన కొడుకును కాపాడే ఉద్దేశ్యంతో తల్లి వారిస్తున్న క్రమంలో, ఆ తల్లీకొడుకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆ గొడవ మరింత పెరిగడంతో, కోపోద్రిక్తుడైన మోడల్ తల్లిని బాత్రూంలోకి నెట్టాడు. దీంతో ఆమె తల వాష్‌బేసిన్‌కు తగిలి చనిపోయింది. బుధవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. కానీ ఆ సమయంలో తల్లి చనిపోయిన విషయాన్ని లక్ష్య సింగ్ గమనించలేదు. ఆ తర్వాతి రోజు ఉదయం లక్ష్య సింగ్ బాత్రూం తలుపు తెరవగానే తన తల్లి చనిపోయి ఉందని తెలిపాడు. వీరితో పాటు ఆ ఫ్లాట్‌లో నిందితుడి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఉంది. లోఖడ్‌వాలా ఏరియాలో క్రాస్ గేట్ బిల్డింగ్‌లో వీరు నివాసం ఉంటున్నారు. కొడుకుతోపాటు అతని కాబోయే భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వీరిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏమిటన్నది విచారణలో తేలుస్తామని పోలీసులు చెప్పారు. -
కన్నతల్లిని కడతేర్చిన 15 ఏళ్ల బాలుడు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలుడు స్కూల్‌కు వెళ్లనందుకు మందలించిన కన్నతల్లినే కడతేర్చాడు. శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. 35 ఏళ్ల కుమారి ఉయ్క తన ఇద్దరు పిల్లలతో(ఒక కొడుకు, కూతురు) కలిసి జిల్లాలోని పిండ్రాయి సరఫ్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. కుమారి భర్త జొగేశ్ ఉయ్కే కొన్నేళ్ల క్రితమే మరణించడంతో పిల్లల్ని పోషించడానికి ఆమె కూలీ పనికి వెళ్తుండేవారు. ఎంత కష్టపడైనా సరే పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలని భావిస్తున్న ఆమెకు 9వ తరగతి చదువుతున్న కొడుకు సక్రమంగా స్కూల్‌కు వెళ్లకపోవడం తీవ్ర బాధ కలిగించేది. ఎప్పటిలాగే ఆ బాలుడు శుక్రవారం కూడా బడికి వెళ్లలేదు. స్కూల్‌కు వెళ్లకుండా తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న కుమారి తన కొడుకును అక్కడి నుంచి ఇంటికి తీసుకువచ్చింది. ఆ తరువాత స్కూల్‌కు వెళ్లనందుకు అతన్ని కర్రతో కొట్టారు. దీనిపై ఆగ్రహించిన ఆ బాలుడు పక్కనే ఉన్న ఇనుప రాడుతో తన తల్లిపై దాడి చేశాడు. దీంతో కుమారి అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. ఆ తరువాత బాలుడు ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి తన రక్తపు మరకలు అంటిన బట్టలను మార్చుకుని దగ్గర్లోని బంధువుల ఇంటికి పారిపోయాడు. తొలుత దీనిని అనుమానస్పద మృతిగా భావించి విచారణ చేపట్టిన హివర్‌కేది పోలీసులు.. ఆ ఇంట్లో దొరికిన ఆధారాలను బట్టి కుమారి కొడుకే ఈ హత్య చేశాడనే నిర్దారణకు వచ్చారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతన్ని జువైనల్ కోర్టు ముందు హాజరు పరిచి జువైనల్ హోమ్‌కు తరలించినట్టు తెలిపారు. -
మతిస్థిమితం లేని తనయుడు చేతిలో తల్లి హత్య
గజపతినగరం రూరల్ : మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన మీసాల పైడమ్మ (62) మతిస్థిమితం లేని తన కుమారుడు చేతిలో మంగళవారం హతమైంది. వివరాల్లోకి వెళ్తే... ముచ్చర్ల గ్రామానికి చెందిన పైడమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికి వివాహమైంది. పైడమ్మ భర్త సన్యాసప్పడు రెండు సంవత్సరాల కిందటే మృతి చెందడంతో ఆమె ముచ్చర్ల గ్రామంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా విశాఖపట్నంలో మతిస్థిమితం లేని తన కుమారుడు సీతంనాయుడు ఇటీవల ముచ్చర్ల గ్రామంలోని తన తల్లి వద్దకు చేరాడు. ఒక్కోసారి బాగానే మంచివాడుగా ఉంటుండే వాడని కొన్నిసార్లు పిచ్చివాడుగా తిరుగుతుండేవాడని గ్రామస్తులు, బంధువులు చెబుతున్నారు. పైడమ్మ కొన్ని నెలలుగా వేమలి గ్రామంలో తన కుమార్తె అచ్చియ్యమ్మ ఇంటి వద్ద ఉండేదని ఇటీవల ముచ్చర్ల గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. తల్లి వద్దకు చేరిన కొడుకు సీతంనాయుడు ఒక్కసారిగా మానసిక స్థితి కొల్పోయి తన తల్లిని ఇంట్లో పెట్టి తలుపులు వేసి చెక్కతో తలపైన, వంటిపైన కొట్టడంతో పైడమ్మ పడిపోయింది. కొన ఊపిరితో ఉన్న పైడమ్మను గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేక మృతి చెందింది. పోలీసుల సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. గజపతినగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో డీఎస్పీ ఆరా! గజపతినగరం రూరల్: మీసాల పైడమ్మ హత్యకు గురవడం వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు బొబ్బిలి డీఎస్పీ గౌతమి శాలి మంగళవారం ఆరా తీశారు. గజపతినగరం సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం తీసుకువచ్చిన పైడమ్మను ఆమె పరిశీలించారు. సీతంనాయుడు పైడమ్మపై దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది ఆరా తీసినట్టు తెలిపారు. నిందితుడు సీతంనాయుడును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సీఐ కాళిదాసు ముచ్చర్ల గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
తల్లిని ఆమె ప్రియుడిని చంపిన కొడుకులు
జైపూర్(రాజస్థాన్): భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటూ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను ఆమె కుమారులే కొట్టిచంపారు. రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గొగామెది గ్రామానికి చెందిన బల్జీత్ కౌర్(39)కు భర్త, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్ అయిన భర్తతో విభేదాలు రావటంతో ఒక కుమారుడు, కుమార్తెతో కలిసి వేరుగా మరో గ్రామంలో ఉంటోంది. అక్కడే గత నాలుగు నెలలుగా సుఖ్‌పాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. అయితే, ఇది నచ్చని కుమారులు విశాల్ సింగ్(21), హర్దీప్ సింగ్(19) తల్లిని, ఆమె ప్రియుడిని అంతం చేసేందుకు పథకం పన్నారు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి ఉందంటూ గొగామెది గ్రామానికి సోమవారం రాత్రి రప్పించారు. అక్కడే వారితో వాదులాటకు దిగారు. వెంట ఉంచుకున్న పదునైన ఆయుధంతో యువకులిద్దరూ కలిసి బల్జీత్‌కౌర్‌తోపాటు సుఖ్‌పాల్‌ను కొట్టి చంపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సెక్స్‌రాకెట్ నిర్వహిస్తున్న తల్లిసోదరిని..
ఇటీవల రాజస్థాన్‌లో జంట మహిళలను చంపిన కేసులో మిస్టరీ వీడింది. ఓ యువకుడు తల్లిసోదరిని హత్య చేశాడు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నందుకు తల్లి, సోదరిని కాల్చిచంపనట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు నిందితుడిని, అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు దేశ రాజధాని ఢిల్లీ శివారు నగాఫ్గఢ్లో నిందితుడు సుమిత్ తల్లి, సోదరి సెక్స్ రాకెట్ నిర్వహించేవారు. ఈ పని మానుకోవాలని సుమిత్ పలుమార్లు తల్లిసోదరిని హెచ్చరించాడు. అయినా వారు మారకపోవడంతో ఇద్దరినీ హతమార్చాలని పథకం వేశాడు. ఇందుకు స్నేహితుల సాయం కోరాడు. టూర్ వెళదామని చెప్పి సుమిత్ తల్లి (38), సోదరి (16)ని రాజస్థాన్ తీసుకెళ్లాడు. స్నేహితులు ప్రదీప్ కుమార్, ధరమ్వీర్లను కూడా వెంట తీసుకెళ్లాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి మనేసర్‌లో సుమిత్ తుపాకీ తీసుకుని తల్లి సోదరిని కాల్చిచంపాడు. పోలీసులు దర్యాప్తు చేసి సుమిత్, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. 16 ఏళ్ల క్రితం తన తల్లి తండ్రిని చంపిందని, తన సోదరిని కూడా సెక్స్ రాకెట్లోకి దించిందని సుమిత్ పోలీసుల విచారణలో చెప్పాడు. -
అయ్యో ‘పాప’ం.. అంజలి
కురవి : తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయింది.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో మంచం పట్టిన తల్లి ఆదివారం మృతిచెందింది. ఇప్పుడు ఆలన పాలన చూసేవారు లేక అనాథగా మిగిలింది ఐదేళ్ల చిన్నారి. స్థానికుల సహాయంతో ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి తల్లి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లా కురవి మండలం తట్టుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జిలకర నారాయణ, సుభద్ర కూతురు స్వరూప(40). చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. నారాయణ ఆమెను పెంచి పెద్దచేసి వివాహం చేశాడు. కొన్ని రోజుల తర్వాత భర్తను వదిలేసిన స్వరూప ఆ తర్వాత చిన్నా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి కూతురు అంజలి జన్మించింది. స్వరూప, చిన్నా హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తూ జీవించేవారు. నాలుగేళ్ల క్రితం చిన్నా అనారోగ్యంతో మృతి చెందగా, స్వరూప అంజలితో హైదరాబాద్‌లోనే ఉంటూ కూలీ పని చేస్తుండేది. నాలుగు నెలల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో పుట్టిల్లయిన తట్టుపల్లికి వచ్చింది. అప్పటికే తండ్రి మరణించగా, అతడి ఇంట్లోనే కూతురుతో కలిసి ఉంటోంది. కాగా, స్వరూప ఆరోగ్యం మరీ క్షీణించడంతో ఐదేళ్ల కుమార్తె అంజలి ఇంటింటికీ తిరిగి అన్నం అడుక్కుని వచ్చి తల్లికి తినిపించేది. మిగిలిన అన్నం తాను తినేది. ఈ క్రమంలో ఆదివా రం స్వరూప కూడా మృతిచెందింది. చందాలు పోగుచేసి అంత్యక్రియలు.. తల్లి అంత్యక్రియల కోసం ఇంటì æపక్కన ఉండే ఎ మ్మార్పీఎస్ నాయకుడు మందుల శ్రీను, వెంపటి చంద్రయ్య, అనుముల రాములు, ఎడెల్లి వెంకన్న త దితరుల సహాయంతో అంజలి ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసింది. వెయ్యి రూపాయలు పోగయినా, అవి సరిపోకపోవడంతో స్థానిక జర్నలిస్టులు అధికారులకు తెలియజేశారు. దీంతో తహసీల్దార్ జన్ను సంజీవ రూ.3 వేలు, సీఐ శ్రీనివాస్ రూ.3 వేలు, ఎస్సై అశోక్, సీనియర్ పాత్రికేయుడు దొంతు రమేష్, సర్పంచ్ లక్పతి రూ.2 వేల చొప్పున అందజేయగా, అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అనాథగా మిగిలిన అంజలి... చిన్నప్పుడే తండ్రిని.. ఇప్పుడు తల్లిని కోల్పోయిన అంజలి అనాథగా మిగిలింది. ఆకలికి తట్టుకోలేక తల్లి మృతదేహం పక్కనే కూర్చుని అన్నం తింటుండడాన్ని చూసిన స్థానికులు బోరున విలపించారు. దీనంగా తల్లి మృతదేహాన్ని పట్టుకుని లే..లెమ్మంటూ పిలుస్తుండడాన్ని చూసిన వారు తట్టుకోలేకపోయారు. నా అనే వాళ్లు లేని అంజలికి ఇప్పుడు దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అంజలి విషయాన్ని జర్నలిస్టులు చైల్డ్‌లైన్ సంస్థకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్ అధికారులు లేదా ఎవరైనా దాతలు అంజలిని తీసుకెళ్లి పోషించాలని స్థానికులు కోరుతున్నారు. లేదా ఏదైనా హాస్టల్లో చేర్పించి చదివించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
'డబ్బుకోసం ఏమైనా చేస్తా'
మాన్సా: డ్రగ్స్ బారినపడి కన్నతల్లిని హత్య చేశాడు ఓ మైనర్. మత్తుపదార్థాలకు బానిసగా మారిన అతడు డ్రగ్స్ కొనుగోలుచేసేందుకు డబ్బు ఇవ్వడానికి తల్లి నిరాకరించడంతో అతడు ఇంట్లోని లైసెన్స్డ్ తుపాకీతో కాల్చి చంపాడు. మైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, తుపాకీని కుమారుడికి అందుబాటులో ఉండేలా ఉంచినందుకు తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కలవారు చెప్పిన ప్రకారం పదహారేళ్లేకే డ్రగ్స్ బానిస అయిన ఆ కుర్రాడు డబ్బులు ఇవ్వాలని ప్రతిరోజు తన తల్లిని వేధించేవాడు. చేయి కూడా చేసుకునేవాడు. ఘర్షణపడని రోజే లేదంట. అంతేకాదు.. డబ్బుకోసం తాను ఎలాంటి దారుణాలైనా చేస్తానని గట్టిగా అరిచిమరి కన్నతల్లిపై కాల్పులు జరిపి కడతేర్చాడట. కడుపులో కాల్పులు జరిపిన అనంతరం పారిపోయి తిరిగి ఇంటికి రాగా పోలీసులు అరెస్టు చేశారు. అతడికి కనీసం 25 ఏళ్లపాటు జైలు శిక్ష వేయాలని ఇరుగుపొరుగు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భార్య వివాహేతర సంబంధాన్ని తల్లి దాచిందని..
వేలూరు: భార్య వివాహేతర సంబంధ విషయం తనకు చెప్పకుండా దాచిందని కన్న తల్లినే కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. అనంతరం భార్యను కూడా చంపడానికి వెళ్తున్న అతన్ని గ్రామస్తుల సమాచారంతో పోలీసులు అరెస్టు చేశా రు. ఈ ఘటన ఆర్కాడు తాలూకాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్కాడు తాలుకా తిమిరి సమీపంలోని తామరపాక్కం గ్రామానికి చెందిన పూంగావనం(53) కుమారుడు రమేష్. ఇతను కూలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే రమేష్ భార్య ప్రియ, అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు జరగడంతో కొన్ని రోజుల క్రితం ప్రియ తిరువణ్ణామలై జిల్లా ఆరణిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రియను వెళ్లి తీసుకురావాలని రమేష్ తల్లి పూంగావనంను కోరాడు. వివాహేతర సంబంధం ఉన్న విషయం తనకు ముందే తెలుసని అయితే ఎక్కడ గొడవలు చోటుచేసుకుంటాయో అని చెప్పలేదని పూంగావనం జవాబిచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన రమేష్ భార్య వివాహేతర సంబంధం విషయం ఎందుకు దాచావంటూ ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం భార్యను కూడా చంపడానికి బయలుదేరాడు. అయితే గ్రామస్తులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో వారు రమేష్‌ను మార్గమధ్యంలోనే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
అమ్మను చంపి.. ఐఏఎఫ్ అధికారి ఆత్మహత్య
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భారత వైమానిక దళంలో పనిచేసే ఓ అధికారి అనారోగ్యంతో బాధపడుతున్న కన్నతల్లిని పీకపిసికి చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పై నుంచి దూకి కింద పడి ఉన్న అతడిని ఇరుగుపొరుగులు గమనించి ఆస్పత్రిలో చేరచగా అక్కడ తీవ్ర గాయాలతో మరణించాడు. జగదేవ్ సింగ్ యాదవ్ (38) జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జూనియర్ వారంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన తల్లి సంతరా దేవి (70)తో కలిసి ఉంటున్నాడు. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతడొక్కడే తల్లిని చూసుకుంటుండగా, అతడి భార్య, పిల్లలు బెంగళూరులో ఉంటున్నారు. ఏమైందో తెలియదు గానీ, ఇంటిపై నుంచి దూకేసిన అతడికి చాలా ఫ్రాక్చర్లు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అతడి మరణవార్తను తల్లికి చెబుదామని ఇంటికి వెళ్తే.. అక్కడ ఆమె మంచం మీద చనిపోయి పడి ఉన్నట్లు పొరుగువారు చెప్పారు. ఆమె మంచం పక్కనే కంప్యూటర్ కేబుల్ పడి ఉందని, దాంతోనే అతడు తల్లిని చంపేసి ఉంటాడని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒంటరితనానికి తోడు తల్లి అనారోగ్యం చూసి తట్టుకోలేకనే అతడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని అంటున్నారు. -
అమ్మను చంపాడని.. మామను కాల్చేశాడు
దాదాపు పదేళ్ల క్రితం తన తల్లిని చంపాడన్న కోపంతో.. మామను కాల్చిచంపిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తన మామ సందీప్ కటారియా (35)ను కాల్చి చంపిన నేరంలో లలిత్ అలియాస్ జానీని పోలీసులు అరెస్టు చేశారు. కటారియాకు శ్రీ రాధాకృష్ణ కౌ కేర్ సెంటర్ ఉంది. దాదాపు పది సంవత్సరాల క్రితం ఆస్తి తగాదాల నేపథ్యంలో లలిత్ తల్లిని కటారియా, మరికొందరు కలిసి కాల్చి చంపారు. అప్పటికి లలిత్ వయసు ఎనిమిదేళ్లు. తన తల్లిని చంపాడన్న కోపంతో ఉన్న లలిత్.. ఇప్పటికే 2013-14 మధ్య రెండుసార్లు కటారియాను చంపేందుకు ప్రయత్నించాడు. అయితే, అప్పట్లో ఈ దాడుల వెనక ఉన్నది అతడన్న విషయం కటారియాకు తెలియదు. చివరకు గో సంరక్షణ కేంద్రంలో ఉన్న కటారియాను లలిత్ తన నలుగురు స్నేహితులతో కలిసి కాల్చి చంపాడు. ఇద్దరు గేటు వద్ద వేచి ఉండగా, మరో ఇద్దరితో కలిసి అతడు లోపలకు వెళ్లి కాల్పులు జరిపాడు. నిందితులందరూ 20 ఏళ్ల వయసులోని వారేనని, అందరూ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తిలో గోసంరక్షణ కేంద్రం పెట్టుకుని, అందులోనే తమను పనికి పెట్టి తక్కువ జీతాలు ఇస్తున్నాడని కూడా లలిత్‌కు కోపం ఉండేదని స్థానికులు అంటున్నారు. -
కొడుకు చేతిలో తల్లి హతం
రూ.5వేల కోసం ప్రాణం తీశాడు నడింపల్లిలో ఓ కొడుకు ఘాతుకం అచ్చంపేట రూరల్ : మద్యం తాగేందుకు బానిసగా మారిన ఓ కొడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని విచక్షణారహితంగా కొట్టిచంపాడు. ఈ విషాదకర సంఘటన మంగళవా రం రాత్రి అచ్చంపేట మండలం నడిం పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోడ జంగమ్మ(52)కు కొడుకు గోపాల్, ఇద్దరు కూతుళ్లు ఉన్నా రు. భర్త చెన్నయ్య 25 ఏళ్ల క్రితమే చనిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ ఊళ్లోనే ఉంటుంది. గోపాల్ భార్యాపిల్లలతో హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుం టూ అక్కడే ఉంటున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో గోపాల్ సెల్‌ఫోన్ దొంగిలించడంతో గమనించి కొందరు చితకబాదారు. 15రోజుల క్రితం నడింపల్లికి వ చ్చాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడం తో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మం గళవారం ఉదయం నుంచి మద్యం తాగుతూనే ఉన్నాడు. రాత్రి ఇంటికొచ్చిన తల్లిని రూ.ఐదువేలు ఇవ్వాలని అడిగాడు. నిరాకరించడంతో తల్లిపై కక్ష పెంచుకున్నాడు. జంగమ్మ నిద్రిస్తున్న సమయంలో ఇంటిలో ఉన్న కర్రతో తలపై బలంగా బాదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అ క్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గోపాల్ ఇంటినుంచి బయటకు వచ్చి మా అ మ్మకు తలనొప్పిగా ఉందని ఇరుగుపొరు గు వారికి చెప్పాడు. ఇది గమనించిన స్థా నికులు గోపాల్ తల్లిని చంపాడని భావిం చి ఇంటిలో బంధించారు. బుధవారం ఉ దయం పోలీసులకు అప్పజెప్పారు. మృతురాలి చిన్నకూతురు లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మణిదీప్ తెలిపారు. కాగా, గ్రామంలో వి చ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని, మద్యానికి బానిసైన యువకులు తల్లిదండ్రులను, భార్యలను వేధిస్తున్నారని చర్య లు తీసుకోవాలని పోలీసులను కోరారు. -
తల్లిని నరికి చంపిన కొడుకు
ఉండి :మండలంలోని పాములపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి ఒక వ్యక్తి తల్లిని నరికి చంపాడు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా అమరావతి నుంచి ఉండి మండలం పాములపర్రు గ్రామానికి కొన్నేళ్ల క్రితం కాలువ లక్ష్మి(55) కుటుంబం వలసవచ్చింది. భర్త మరణంతో లక్ష్మి తన కుమారులు దేవదాసు, చిన్నరాజులతో ఉపాధి వెదుక్కుంటూ ఇక్కడకు వచ్చింది. ఏమైందో తెలియదుగాని ఆదివారం రాత్రి లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దేవదాసు తలపై నరికి చంపాడు. తల్లిని చంపిన అనంతరం పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడు దేవదాసు పిచ్చి పట్టిన వాడని కొందరు అంటున్నారు. గతంలో గ్రామంలో ఒక వ్యక్తిని గాయపరిస్తే దేవదాసును విశాఖపట్నంలోని పిచ్చాసుపత్రికి తరలించి చికిత్స చేయించారని స్థానికులు చెబుతున్నారు. ఐదేళ్ల నుంచి చికిత్స పొందుతున్నట్టు ఆధారాలు లభించాయని పోలీసులు పేర్కొంటున్నారు. తన అన్న దేవదాసు తల్లిని చంపాడని మృతురాలి చిన్న కుమారుడు కాలువ చిన్నరాజు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపారు. -
బైక్ కొనివ్వలేదని తల్లిని చంపేశాడు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని రామయ్య గూడలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. బైకు అడిగితే కొనివ్వలేదని ఓ యువకుడు ఆగ్రహించి కన్నతల్లిపై కర్రతో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి మరణించింది. దాంతో ఆమె కుమారుడు అక్కడి నుంచి పరారైయాడు. స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కొడుకులే కాలయములై..
మద్యం మత్తు మానవత్వాన్ని మంటగలిపింది.అనుబంధం.. ఆత్మీయతలనే కాదు.. పేగుబంధాల్ని సైతం తెంపేసింది. కొడుకు కఠినాత్ముడైనా.. ఇద్దరు భార్యలూ అతన్ని వదిలేసినా.. మమకారాన్ని చంపుకోలేక అతడి ఆలనాపాలనా చూస్తూ వేళకు అన్నం పెడుతున్న తల్లిని కొడుకే పొట్టనపెట్టుకున్నాడు. మరో ఘటనలో తాగి వచ్చాడన్న కారణంగా తండ్రిని కన్నకొడుకు కర్రతో కొట్టి చంపేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు మనసున్న ప్రతివారిని కంటతడి పెట్టించాయి. ఆరవలిల(అత్తిలి) : మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడన్న కారణంతో కన్న తండ్రిని తనయుడే కర్రతో కొట్టి చంపిన ఘటన అత్తిలి మండలం ఆరవల్లిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఆరవల్లి ఎస్సీ కాలనీకి చెందిన మేడిద కాంతారావు (46) రోజూ తాగివచ్చి తరచూ కుటుంబ సభ్యులతో ఘర్షణ పడుతుంటాడు. ఎప్పటిలా శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన కాంతారావు తన రెండో కుమారుడైన నాగబాబు(20)తో గొడవ పడ్డాడు. ఓ దశలో కత్తితో కుమారుడిపై దాడి చేశాడు. దీంతో నాగబాబు కత్తులకు పదునుపెట్టే కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాంతారావు అక్కడికక్కడే మృతి చెందాడు. కాంతారావు కొబ్బరి కాయలు దింపు, ఒలుపు పనులకు వెళుతుండగా, కుమారుడు వ్యవసాయ పనులకు వెళుతుంటాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతుని భార్య కాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. దొండపూడి (గోపాలపురం) :కన్నతల్లిని అతికిరాతకంగా చంపిన తనయుడి ఉదంతమిది. గోపాలపురం మండలం దొండపూడిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలవరం సీఐ జీఆర్ఆర్ మోహన్ తెలిపిన వివరాలిలా ఉన్నారుు. దొండపూడికి చెందిన దోలి వీర్రాజుకు రెండు వివాహాలయ్యూరుు. మొదటి భార్యకు ఇద్దరు, రెండో భార్యకు ఇద్దరు సంతానం. అతడి దుందుడుకు వైఖరిని తట్టుకోలేక వారిద్దరూ అతన్ని వదిలేసి పిల్లలలో వేర్వేరుగా బతుకుతున్నారు. వీర్రాజు దొండపూడి గ్రామంలో సిమెంట్ వరలు, దిమ్మెలు తయూరు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో తల్లి సుబ్బలక్ష్మి (60) బాగోగులు చూస్తోంది. వేరే ఇంట్లో తన బతుకు తాను బతుకుతున్న సుబ్బలక్ష్మి రోజూ వంటచేసి మధ్యాహ్నం, సాయంత్రం క్యారేజీలో భోజనం తీసుకెళ్లి కుమారుడికి పెడుతోంది. మద్యానికి బానిసైన వీర్రాజు తరచూ ఆమెనూ దూషిస్తూ, చీటికిమాటికీ విరుచుకుపడుతుండేవాడు. ఇదిలావుండగా, సుబ్బలక్ష్మి పెద్దకుమారుడు, వీర్రాజుకు అన్న అరుున వెంకటేశు కుమార్తెకు ఈనెల 15న వివాహమైంది. అన్నదమ్ములిద్దరికీ మాటలు లేకపోవడంతో అన్న కుమార్తె వివాహానికి వెళ్లొద్దని తల్లి సుబ్బలక్ష్మికి వీర్రాజు హుకుం జారీ చేశాడు. అతడి స్వభావం గురించి తెలిసిన తల్లి సుబ్బలక్ష్మి ఆ మాటలను పట్టించుకోకుండా మనుమరాలి పెళ్లికి వెళ్లింది. శనివారం రాత్రి ఎప్పటిలా వీర్రాజుకు భోజనం తీసుకెళ్లింది. తాగిన మైకంలో ఉన్న వీర్రాజు ఆ పెళ్లికి ఎందుకు వెళ్లావంటూ ఒక్క ఉదుటున తల్లిపై విరుచుకుపడ్డాడు. తల్లి జట్టుపట్టుకుని ఆమె తలను సిమెంట్ అరుగుకు వేసి పదేపదే బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై వీఆర్వో వి.వల్లభాచార్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడు వీర్రాజును ఎస్సై డి.హరికృష్ణ అదుపులోకి తీసుకున్నారు. -
కన్నకొడుకునే చంపేసిన కఠినాత్మురాలు