బైక్ కొనివ్వలేదని తల్లిని చంపేశాడు | Son killed mother in Ranga reddy distrct | Sakshi

బైక్ కొనివ్వలేదని తల్లిని చంపేశాడు

Published Tue, Oct 21 2014 11:40 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Son killed mother in Ranga reddy distrct

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని రామయ్య గూడలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. బైకు అడిగితే కొనివ్వలేదని ఓ యువకుడు ఆగ్రహించి కన్నతల్లిపై కర్రతో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి మరణించింది. దాంతో ఆమె కుమారుడు అక్కడి నుంచి పరారైయాడు.

స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement