సెక్స్రాకెట్ నిర్వహిస్తున్న తల్లిసోదరిని.. | Youth kills mother, sister for running 'prostitution racket'; arrested | Sakshi
Sakshi News home page

సెక్స్రాకెట్ నిర్వహిస్తున్న తల్లిసోదరిని..

Published Tue, Sep 27 2016 12:48 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

సెక్స్రాకెట్ నిర్వహిస్తున్న తల్లిసోదరిని..

సెక్స్రాకెట్ నిర్వహిస్తున్న తల్లిసోదరిని..

ఇటీవల రాజస్థాన్లో జంట మహిళలను చంపిన కేసులో మిస్టరీ వీడింది. ఓ యువకుడు తల్లిసోదరిని హత్య చేశాడు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నందుకు తల్లి, సోదరిని కాల్చిచంపనట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు నిందితుడిని, అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు దేశ రాజధాని ఢిల్లీ శివారు నగాఫ్గఢ్లో నిందితుడు సుమిత్ తల్లి, సోదరి సెక్స్ రాకెట్ నిర్వహించేవారు. ఈ పని మానుకోవాలని సుమిత్ పలుమార్లు తల్లిసోదరిని హెచ్చరించాడు. అయినా వారు మారకపోవడంతో ఇద్దరినీ హతమార్చాలని పథకం వేశాడు. ఇందుకు స్నేహితుల సాయం కోరాడు. టూర్ వెళదామని చెప్పి సుమిత్ తల్లి (38), సోదరి (16)ని రాజస్థాన్ తీసుకెళ్లాడు. స్నేహితులు ప్రదీప్ కుమార్, ధరమ్వీర్లను కూడా వెంట తీసుకెళ్లాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి మనేసర్లో సుమిత్ తుపాకీ తీసుకుని తల్లి సోదరిని కాల్చిచంపాడు. పోలీసులు దర్యాప్తు చేసి సుమిత్, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. 16 ఏళ్ల క్రితం తన తల్లి తండ్రిని చంపిందని, తన సోదరిని కూడా సెక్స్ రాకెట్లోకి దించిందని సుమిత్ పోలీసుల విచారణలో చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement