
ఆస్టిన్: అమెరికా టెక్సాస్ స్టేట్‌లో వ్యభిచార ముఠాను అక్కడి పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించి.. అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నారు.
బలవంతపు వ్యభిచారాన్ని కట్టడి చేసేందుకు హాయ్‌లాండ్ విలేజ్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్‌లోని డెంటన్‌లో ఈ ముఠా అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి తెలుగు వారిగా అక్కడి పోలీసులు గుర్తించారు. వీళ్లంతా ఉన్నత విద్య కోసమే వచ్చినట్లు నిర్ధారించారు.
**PRESS RELEASE** pic.twitter.com/LnYMYNoktZ
— Denton Co Sheriff (@DentonCoSheriff) August 19, 2024
