
సాక్షి, కృష్ణా: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నాగాయలంక మండలంలోని ఎదురుమొండిలో ఓ కుమారుడు తన తల్లిదండ్రులపై గొడ్డలితో కిరాతకంగా దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి వీర్లంకమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తండ్రి నాగేశ్వరరావును అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు తల్లి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిద్రపోతున్న వీరరాఘవయ్య
కొడుకు వీరరాఘవయ్య తన భార్యతో ఉన్న కుటుంబ కలహాలను మనసులో పెట్టుకొని తన తల్లిదండ్రులపై దాడిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాడి చేసే సమయంలో వీరరాఘవయ్య మద్యం సేవించినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. తల్లి చనిపోయిన తర్వాత వీరరాఘవయ్య హాయిగా నిద్రపోవటం గ్రామస్తుల్ని ఆశ్చర్య పరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment