కృష్ణా జిల్లాలో దారుణం.. సామూహిక లైంగిక దాడి | Girl Kidnap Incident At Krishna District Full Details About This Case Inside | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో దారుణం.. సామూహిక లైంగిక దాడి

Mar 19 2025 8:45 AM | Updated on Mar 19 2025 9:57 AM

Kidnap Incident At Krishna District Full Details

సాక్షి, కృష్ణా: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు వ్యక్తులు మైనర్‌ను నాలుగు రోజుల పాటు నిర్భంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన మైనర్(14) ఈనెల తొమ్మిదో తేదీన గన్నవరం మండలం వీరపనేని గూడెంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అనంతరం, ఈనెల 13 న స్నేహితురాaలి ఇంటి నుంచి బయటికి వచ్చింది.  రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన బాలికను ఇద్దరు యువకులు ట్రాప్‌ చేశారు. ఆమెను బైక్‌పై కొంత దూరం తీసుకెళ్లి మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం, మరో నలుగురు ఆమెను నాలుగు రోజులు పాటు నిర్బంధించిన లైంగిక దాడి చేశారు.

అనంతరం, ఈనెల 17న రాత్రి సమయంలో విజయవాడలోని మైలవరంలో కామాంధులు ఆమెను వదిలిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌కి జరిగిన విషయాన్ని ఆమె తెలిపింది. దీంతో, సదరు ఆటోడ్రైవర్‌.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన ఆత్కూరు పోలీసులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement