
తల్లిని చంపేసిన డ్రగ్స్ బానిస (ప్రతీకాత్మక చిత్రం)
ముంబై : 23 ఏళ్ల లక్ష్య సింగ్ అనే మోడల్ డ్రగ్స్‌కు బానిసైయ్యాడు. ఆ మత్తులో తానేమి చేస్తున్నో కూడా తెలియలేదు. తనకు తెలియకుండానే తల్లి సునీతా సింగ్(45)ను బాత్‌రూంలో తోసేసి, చంపేశాడు. డ్రగ్స్‌కు బానిసైన కొడుకును కాపాడే ఉద్దేశ్యంతో తల్లి వారిస్తున్న క్రమంలో, ఆ తల్లీకొడుకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆ గొడవ మరింత పెరిగడంతో, కోపోద్రిక్తుడైన మోడల్ తల్లిని బాత్‌రూంలోకి నెట్టాడు. దీంతో ఆమె తల వాష్‌బేసిన్‌కు తగిలి చనిపోయింది.
బుధవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. కానీ ఆ సమయంలో తల్లి చనిపోయిన విషయాన్ని లక్ష్య సింగ్ గమనించలేదు. ఆ తర్వాతి రోజు ఉదయం లక్ష్య సింగ్ బాత్‌రూం తలుపు తెరవగానే తన తల్లి చనిపోయి ఉందని తెలిపాడు. వీరితో పాటు ఆ ఫ్లాట్‌లో నిందితుడి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఉంది. లోఖడ్‌వాలా ఏరియాలో క్రాస్ గేట్ బిల్డింగ్‌లో వీరు నివాసం ఉంటున్నారు. కొడుకుతోపాటు అతని కాబోయే భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వీరిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏమిటన్నది విచారణలో తేలుస్తామని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment