Mumbai model
-
డ్రగ్‌కు బానిసైన మోడల్, తల్లిని చంపేశాడు
ముంబై : 23 ఏళ్ల లక్ష్య సింగ్ అనే మోడల్ డ్రగ్స్‌కు బానిసైయ్యాడు. ఆ మత్తులో తానేమి చేస్తున్నో కూడా తెలియలేదు. తనకు తెలియకుండానే తల్లి సునీతా సింగ్(45)ను బాత్రూంలో తోసేసి, చంపేశాడు. డ్రగ్స్‌కు బానిసైన కొడుకును కాపాడే ఉద్దేశ్యంతో తల్లి వారిస్తున్న క్రమంలో, ఆ తల్లీకొడుకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆ గొడవ మరింత పెరిగడంతో, కోపోద్రిక్తుడైన మోడల్ తల్లిని బాత్రూంలోకి నెట్టాడు. దీంతో ఆమె తల వాష్‌బేసిన్‌కు తగిలి చనిపోయింది. బుధవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. కానీ ఆ సమయంలో తల్లి చనిపోయిన విషయాన్ని లక్ష్య సింగ్ గమనించలేదు. ఆ తర్వాతి రోజు ఉదయం లక్ష్య సింగ్ బాత్రూం తలుపు తెరవగానే తన తల్లి చనిపోయి ఉందని తెలిపాడు. వీరితో పాటు ఆ ఫ్లాట్‌లో నిందితుడి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఉంది. లోఖడ్‌వాలా ఏరియాలో క్రాస్ గేట్ బిల్డింగ్‌లో వీరు నివాసం ఉంటున్నారు. కొడుకుతోపాటు అతని కాబోయే భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వీరిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏమిటన్నది విచారణలో తేలుస్తామని పోలీసులు చెప్పారు. -
ఈవెంట్ అని చెప్పి.. అపహరించి..
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో ముంబై మోడల్ కిడ్నాప్‌నకు గురైంది. ఇరువురి మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాలే దీనికి కారణం. ఈవెంట్లో పాల్గొనడానికని చెప్పి పిలిపించి నిర్బంధించారు. ఆపై ఆమెతోనూ బేరసారాలు చేశారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు వేట ముమ్మరం చేసి, ఇద్దరు నిందితుల్ని పట్టుకుని 2 రోజుల క్రితం నాంపల్లి పోలీసులకు అప్పగించారు. కొసమెరుపు ఏమిటంటే.. ‘ఖాళీ బ్యాగ్’తో పోలీసులు రంగంలోకి దిగినట్లు గుర్తించిన నిందితులు మోడల్‌ను గుట్టుచప్పుడు కాకుండా ముంబై పంపించేశారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన సల్మాన్, మహ్మద్ స్నేహితులు. ఇరువురూ చేసిన ‘దందాల’నేపథ్యంలో సల్మాన్‌కు మహ్మద్ రూ.5 లక్షల వరకు బాకీ పడ్డాడు. దీని వసూలు సాధ్యం కాకపోవడంతో సల్మాన్.. కిడ్నాప్‌నకు పథక రచన చేశాడు. స్నేహితుడితోనే యువతిని రప్పించి... ముంబైలోనూ పరిచయాలున్న మహ్మద్ అక్కడ నుంచి యువతుల్ని ఈవెంట్స్‌లో పాల్గొనడానికి రప్పించేవాడు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఓ ఈవెంట్ ఉందని, మోడల్‌ను సమకూర్చమని మహ్మద్‌ను కోరాడు. దీంతో మహ్మద్.. పూజ అనే మోడల్ని వారం రోజుల క్రితం సిటీకి రప్పించాడు. ఈమెకు మాయమాటలు చెప్పి అపహరించుకుపోయిన సల్మాన్ తనకు అల్లుడి వరుసయ్యే షబ్బీర్‌తో కలసి పాతబస్తీలో నిర్బంధించాడు. తనకు రావాల్సిన రూ.5 లక్షలు ఇవ్వకపోతే పూజను చంపేస్తానంటూ మహ్మద్‌కు సమాచారం ఇచ్చాడు. అలాగే కిడ్నాప్ విషయాన్ని ముంబైలో పూజను పంపిన దళారికి తెలియజేయడంతో అతను మహ్మద్‌పై ఒత్తిడి పెంచాడు. ఓ దశలో పూజకు అసలు విషయం చెప్పి తనకు సహకరిస్తే రూ.లక్ష ఇస్తానంటూ సల్మాన్ ఒప్పందం చేసుకున్నాడు. పూజను తాళ్లతో బంధించినట్లు కొన్ని ఫొటోలు తీసి వాటిని వాట్సాప్ ద్వారా మహ్మద్‌తో పాటు ముంబైలోని దళారికీ పంపాడు. స్థానిక పోలీసులకు చిక్కకపోవడంతో... దళారి నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో మహ్మద్ కిడ్నాప్‌పై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహ్మద్‌తో కలసి ఓ వ్యూహం పన్నారు. రూ.5 లక్షల్ని ఇస్తానంటూ సల్మాన్‌ను రప్పించడానికి ప్రయత్నించారు. డబ్బు బ్యాగ్‌ను మలక్‌పేటలో ఓ చోట విడిచి వెళ్లాల్సిందిగా మహ్మద్‌కు సల్మాన్ సూచించాడు. ఖాళీ బ్యాగ్‌ను అక్కడ పెట్టి, తీసుకోవడానికి వచ్చిన సల్మాన్‌ను పట్టుకోవాలని పోలీసులు ఆ రహదారిలో కాపుకాశారు. అయితే వేరే సందు నుంచి వచ్చిన సల్మాన్, షబ్బీర్ బ్యాగ్‌తో ఉడాయించారు. ఖాళీ బ్యాగ్ ఉండటంతో అనుమానించి... ఖాళీ బ్యాగ్ చూసి పూజ ప్రాణాలకు హాని చేసే ప్రమాదం ఉండటంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సల్మాన్, షబ్బీర్ల ఆచూకీ కనిపెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. పూజ అక్కడ లేకపోవడంతో ఇద్దరినీ వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఖాళీ బ్యాగ్ పెట్టినప్పుడే అనుమానం వచ్చిందని, దీని వెనుక పోలీసులు ఉన్నారని భావించి భయంతో వెంటనే పూజను బస్సులో ముంబై పంపేశానని సల్మాన్ చెప్పాడు. పూజ అక్కడ భద్రంగా ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం సల్మాన్, షబ్బీర్‌లను నాంపల్లి పోలీసులకు అప్పగించారు. 2రోజుల క్రితం వీరిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
మతం మారాలంటూ మోడల్‌కు టార్చర్
ముంబై : లవ్ జిహాద్‌కు చెందిన మరో షాకింగ్ కేసు ముంబైలో వెలుగులోకి వచ్చింది. మతం పేరుతో తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా హింసిస్తున్నారంటూ మాజీ మోడల్ ఫిర్యాదు చేసింది. హిందూ మత ఆచారాలను పాటించే కుటుంబ నేపథ్యానికి చెందిన రష్మి షాబెస్కర్, 13 ఏళ్ల క్రితం ముస్లిం మతానికి చెందిన అబ్బాయిని పెళ్లాడింది. పెళ్లి సమయంలో ఆమెతో పాటు తన మత ఆచారాలకు ఆయన అంగీకారం తెలిపాడు. కానీ గత కొన్నేళ్లుగా రష్మిని ఇస్లాంలోకి మారాలంటూ వేధించడం ప్రాంరభించాడు. మతం మారడం ఇష్టలేని రష్మి, ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో, ఆమె భర్త మరో 28 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ తన సోదరుడి గర్ల్‌ఫ్రెండే కావడం గమనార్హం. గెస్ట్‌గా వారి ఇంట్లో ఉంటుండటంతో పాటు, ఆమె ఇస్లాంలోకి మారడానికి ఇష్టపడటంతో, తన భర్త ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్టు రష్మి చెప్పింది. తర్వాత ఆమెను వివాహం కూడా చేసుకున్నట్టు తెలిపింది. అంతేకాక తాను ఇస్లాంలోకి మారడం లేదని తన కొడుకును కూడా దూరం చేశారని, ఇప్పుడు 7ఏళ్ల వయసున్న తన కొడుకు తనను తల్లిగా స్వీకరించడం లేదని కన్నీరుమున్నీరైంది. దేవాలయానికి వెళ్తుండటం వల్ల తనని ఓ రాక్షసురాలిగా తన కొడుకు భావిస్తున్నాడని, అంతలా తన బిడ్డను దూరం చేసేశారని ఆవేదన వ్యక్తంచేసింది. రష్మి ఫిర్యాదు మేరకు, ఆమె భర్త, ఆయన కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ ప్రారంభించారు. -
మతం మారాలంటూ మోడల్‌కు అత్తింటి టార్చర్
-
బాంబు ఉందంటూ జోక్.. మోడల్ అరెస్ట్
ముంబై: తన స్నేహితురాలి దగ్గర బాంబు ఉందని అబద్ధం చెప్పి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు అనవసరంగా అధికారులను కంగారు పెట్టి, విమానం ఆలస్యంగా బయల్దేరడానికి కారణమైన ఓ మోడల్‌ను భద్రత సిబ్బంది ఆరెస్ట్ చేసింది. ఆమెకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. గురువారం రాత్రి కంచన్ ఠాకూర్ (27) అనే మోడల్ తన ముగ్గురు స్నేహితులతో కలసి ఎయిరిండియా విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఆమె బోర్డింగ్ గేట్ దాటిన తర్వాత విమాన భద్రత సిబ్బంది దగ్గరకు వెళ్లి తన స్నేహితురాలి హ్యాండ్ బ్యాగ్‌లో బాంబు ఉందని, జాగ్రత్తగా తనిఖీ చేయాలని కోరింది. దీంతో అక్కడున్నవారు భయపడిపోయారు. భద్రత సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ అధికారులకు తెలియజేశారు. సీఐఎస్ఎఫ్ అధికారులు వెంటనే వచ్చి మోడల్, ఆమె స్నేహితులను ప్రశ్నించారు. నలుగురిని, వారి లగేజీని వదిలి వెళ్లాల్సిందిగా ఎయిరిండియా సిబ్బందికి సూచించారు. దీంతో కంగారు పడిపోయిన మోడల్ తాను జోక్ చేశానని, స్నేహితురాలి బ్యాగ్‌లో బాంబు లేదని చెప్పింది. ఈ దశలో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి, మోడల్‌కు వాగ్వాదం జరిగింది. మోడల్‌తో పాటు ఆమె స్నేహితులను వదిలేసి గంట ఆలస్యంగా విమానం బయల్దేరింది. షెడ్యూల్ సమయం ప్రకారం రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఉండగా, 10 గంటలకు వెళ్లింది. పోలీసులు మోడల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలైంది. ముంబై విడిచి వెళ్లవద్దంటూ మోడల్‌ను, ఆమె స్నేహితులను అధికారులు ఆదేశించారు. మోడల్ స్నేహితురాలు ఒకరు అనారోగ్యంతో ఉన్న బాధపడుతున్న తల్లిని చూసేందుకు వెళ్లాల్సివుంది. -
వ్యభిచారం కేసులో క్రికెటర్ గాళ్ ఫ్రెండ్, నటి అరెస్ట్
పుణె: వ్యభిచారం కేసులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గాళ్ ఫ్రెండ్, ప్రముఖ ముంబై మోడల్, టీవీ నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి పుణెలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌పై పోలీసులు దాడి చేసి మోడల్‌తో పాటు కృష్ణ, విపుల్ దహల్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణ వ్యభిచార రాకెట్‌ను నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన మోడల్ పలు జ్యువెలరీ బ్రాండ్ యాడ్స్‌లో నటించింది. ఆమె సొంతూరు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. ముంబైలో ఉంటూ మోడల్‌గా పనిచేస్తున్న ఆమెను పుణె తీసుకువచ్చి వ్యభిచార రాకెట్లో దించారు. విటుడితో 50 వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని నిర్వాహకులు ఆమెను పంపినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని మహిళల సంక్షేమ కేంద్రానికి పంపారు. అయితే సెంటర్ సిబ్బందిపై మోడల్ దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ముంబై మోడల్స్‌తో వ్యభిచారం
విజయవాడ సిటీ : ముంబై మోడళ్లతో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్నట్టు చెపుతూ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఓ హాస్యనటుని బంధువును కూడా అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెపుతున్నారు. అయితే ఆ వ్యక్తి మాత్రం తాను విటుణ్ణి మాత్రమేనంటూ పోలీసుల ఎదుట వాదిస్తున్నట్టు తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నున్న రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి మోడళ్లను రప్పించి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నట్టు కొందరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యభిచార గృహాన్ని ఓ హాస్య నటుని సమీప బంధువుగా చెప్పుకుంటున్న వ్యక్తి నిర్వహిస్తున్నట్టు కొందరు వ్యక్తులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గత కొద్ది రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే బుధవారం ముంబైకి చెందిన ఓ మోడల్‌ను కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చినట్టు తెలిసింది. పక్కా సమాచారంపై టాస్క్‌ఫోర్స్ ఎసీపీ పి.వి.ఆర్.పి.బి.ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ జి.శ్రీనివాస్, సిబ్బంది గురువారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి ఇద్దరు యువతులతో పాటు రాజమండ్రికి చెందిన రాజేష్, నగరంలో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం నిర్వహిస్తున్న మొయినుద్దీన్ మహ్మద్‌ను అదుపులోకి తీసుకొని నున్న రూరల్ పోలీసులకు అప్పగించారు. వీరిలో మహ్మద్ నిర్వాహకునిగా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఉంది. అయితే తాను కేవలం విటుణ్ణి మాత్రమేనంటూ ఆయన చెపుతున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొంటున్నారు. రాజేష్ మాత్రమే నిర్వహకుడని చెప్పడంతో పూర్తి వివరాలు సేకరించేందుకు నున్న పోలీసులకు అప్పగించారు. నున్న పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ జరుపుతున్నారు. అదుపులోకి తీసుకున్న యువతుల్లో ఓ యువతి తాను బాంబేలో మోడలింగ్ చేస్తుంటానని తెలిపింది. రోజుకు రూ.10వేల చొప్పున కాంట్రాక్టుతో పాటు విమానం చార్జీలు, బస ఏర్పాటు చేయడంతో ఇక్కడికి వచ్చినట్లు ఆమె పేర్కొంది. హాస్యనటుని బంధువేనా? పట్టుబడిన వారిలో ఒకరు హాస్యనటుని బంధువుగా చెపుతున్నారు. నిజంగా బంధువా? లేక వీరు ఆ పేరు ఉపయోగించుకుంటున్నారా? అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ముంబై మోడల్‌కు ‘సినిమా’ ఎర
సికింద్రాబాద్: సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానంటూ ముంబై యువతిని నగరానికి రప్పించిన యువకుడు.. మత్తు మందిచ్చి ఆమె ఆభరణాలను దోచుకున్నాడు. గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం...ముంబైకి చెందిన మోడల్ సుబ్రతా దత్తా (25)కు నెట్ ద్వారా సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన రాజు పరిచయమయ్యాడు. తనకు సినిమా వాళ్లతో సంబంధాలున్నాయని, ఇక్కడికి వస్తే సినిమా చాన్స్‌లు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆ యువతి పుణే నుంచి నగరానికి వచ్చింది. కార్ఖానాలోని తన నివాసంలోనే రెండు రోజులు ఆశ్రయమిచ్చిన రాజు.. నిత్యం మద్యం తాను సేవించడంతోపాటు యువతికి తాగించాడు. గురువారం బ్యూటీపార్లర్‌కు తీసుకెళ్లి కారులో వస్తుండగానే ఆమెకు మద్యం ఇచ్చాడు. అందులో మత్తు మందు కలపడంతో యువతి స్పృహ కోల్పోయింది. దీంతో ఆమె వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని మత్తులో ఉండగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఆటోలో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. కొద్దిగంటల తరువాత స్పహలోకి వచ్చిన యువతి.. రాజుపై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపించి, రాజు కోసం గాలిస్తున్నారు. యువతి ఆభరణాలు మాత్రమే దొంగిలించాడా? ఆమెపై అత్యాచారం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వ్యభిచారం గుట్టు రట్టు.. అదుపులో ముంబై మోడల్
హైదరాబాద్: పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌పై దాడి చేసి హైటెక్ వ్యభిచారం గుట్టును రట్టు చేశారు. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని ఓ హోటల్లోని రూం నం.407లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి 10.30కి సదరు హోటల్‌పై దాడి చేయగా, ముంబైకి చెందిన మోడల్‌తో పాటు ఒక విటుడు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హోటల్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. -
మోడల్ హత్యకేసులో రాజేశ్వరయ్యకు జీవిత ఖైదు
హైదరాబాద్: ముంబై మోడల్ అరోజ్ హత్యకేసులో నిందితుడు రాజేశ్వరయ్యకు కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసు విచారించిన సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు ఈ శిక్ష విధించింది. రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో 2009లో అరోజ్ను రాజేశ్వరయ్య హత్యచేసినట్లు నేరం రుజువైంది. దాంతో కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. -
ముంబై మోడల్ గ్యాంగ్ రేప్ కేసు విచారణ వేగవంతం