పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌పై దాడి చేసి హైటెక్ వ్యభిచారం గుట్టును రట్టు చేశారు.
హైదరాబాద్: పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌పై దాడి చేసి హైటెక్ వ్యభిచారం గుట్టును రట్టు చేశారు. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని ఓ హోటల్‌లోని రూం నం.407లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే స్పందించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి 10.30కి సదరు హోటల్‌పై దాడి చేయగా, ముంబైకి చెందిన మోడల్‌తో పాటు ఒక విటుడు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హోటల్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు.