
వ్యభిచారం కేసులో క్రికెటర్ గాళ్ ఫ్రెండ్, నటి అరెస్ట్
పుణె: వ్యభిచారం కేసులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గాళ్ ఫ్రెండ్, ప్రముఖ ముంబై మోడల్, టీవీ నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి పుణెలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్పై పోలీసులు దాడి చేసి మోడల్తో పాటు కృష్ణ, విపుల్ దహల్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణ వ్యభిచార రాకెట్ను నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
పట్టుబడిన మోడల్ పలు జ్యువెలరీ బ్రాండ్ యాడ్స్లో నటించింది. ఆమె సొంతూరు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. ముంబైలో ఉంటూ మోడల్గా పనిచేస్తున్న ఆమెను పుణె తీసుకువచ్చి వ్యభిచార రాకెట్లో దించారు. విటుడితో 50 వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని నిర్వాహకులు ఆమెను పంపినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని మహిళల సంక్షేమ కేంద్రానికి పంపారు. అయితే సెంటర్ సిబ్బందిపై మోడల్ దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.