ముంబై మోడల్‌కు ‘సినిమా’ ఎర | Mumbai Model accuses agent of cheating, robbery | Sakshi
Sakshi News home page

ముంబై మోడల్‌కు ‘సినిమా’ ఎర

Published Fri, Jul 11 2014 9:36 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Mumbai Model accuses agent of cheating, robbery

సికింద్రాబాద్:  సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానంటూ ముంబై యువతిని నగరానికి రప్పించిన యువకుడు.. మత్తు మందిచ్చి ఆమె ఆభరణాలను దోచుకున్నాడు. గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం...ముంబైకి చెందిన మోడల్ సుబ్రతా దత్తా (25)కు నెట్ ద్వారా సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన రాజు పరిచయమయ్యాడు. తనకు సినిమా వాళ్లతో సంబంధాలున్నాయని, ఇక్కడికి వస్తే సినిమా చాన్స్‌లు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆ యువతి పుణే నుంచి నగరానికి వచ్చింది. కార్ఖానాలోని తన నివాసంలోనే రెండు రోజులు ఆశ్రయమిచ్చిన రాజు.. నిత్యం మద్యం తాను సేవించడంతోపాటు యువతికి తాగించాడు.

గురువారం బ్యూటీపార్లర్‌కు తీసుకెళ్లి కారులో వస్తుండగానే ఆమెకు మద్యం ఇచ్చాడు. అందులో మత్తు మందు కలపడంతో యువతి స్పృహ కోల్పోయింది. దీంతో ఆమె వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని మత్తులో ఉండగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఆటోలో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. కొద్దిగంటల తరువాత స్పహలోకి వచ్చిన యువతి.. రాజుపై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపించి, రాజు కోసం గాలిస్తున్నారు. యువతి ఆభరణాలు మాత్రమే దొంగిలించాడా? ఆమెపై అత్యాచారం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement