నా బాయ్‌ఫ్రెండ్‌ మోసం చేశాడు! | Nivetha Pethuraj Emotional On Her Boyfriend Cheating | Sakshi
Sakshi News home page

నా బాయ్‌ఫ్రెండ్‌ మోసం చేశాడు!

Published Wed, Jul 3 2024 11:34 AM | Last Updated on Wed, Jul 3 2024 11:34 AM

Nivetha Pethuraj Emotional On Her Boyfriend Cheating

తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్‌. తమిళంలో తిరునాళ్‌ కూత్తు చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈమె ఆ తర్వాత టిక్‌ టిక్‌ టిక్, సంఘతమిళన్‌ వంటి పలు చిత్రాల్లో నటించారు. అలా విజయ్‌ సేతుపతి, విజయ్‌ ఆంటోని వంటి హీరోల సరసన నటించినా ఇప్పటికీ స్టార్‌ ఇమేజ్‌ కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో వెబ్‌ సిరీస్‌లలో నటిస్తున్నారు. ఈమె నటించిన పరువు అనే వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

అయితే తమిళంలో కొత్త చిత్రాలకు కమిట్‌ అయినట్టు చెబుతున్న నివేద పేతురాజ్‌ ఇటీవల కారులో వెళుతూ ఒక ట్రాఫిక్‌ పోలీస్‌తో గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అయితే అది తాను నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో ఒక భాగం అని ఆ తర్వాత తెలిసింది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ఇలా పేర్కొన్నారు. తన నెగెటివ్‌ ఆలోచనలన్నీ వాస్తవ రూపం దాల్చుతున్నాయని చెప్పారు. 

ఒకరోజు తన బాయ్‌ఫ్రెండ్‌ తన మోసం చేశాడని ఊహించుకున్నానన్నారు. ఆ తర్వాత అదే విధంగా జరిగిందన్నారు .తన బాయ్‌ఫ్రెండ్‌ మరెవరినో తీసుకుని వెళ్లిపోయాడని చెప్పారు. లేకపోతే ప్రస్తుతం తాను వాడుతున్న కారు నుంచి భవిష్యత్తులో కొనుక్కు పోయే కారు వరకు తన నెగటివ్‌ ఆలోచనలలేనని నటి నివేద పేతురాజు పేర్కొన్నారు. కాగా ఈ 32 ఏళ్ల పరువాలగుమ్మలో మంచి నటినే కాకుండా బైక్‌ రేసర్‌ క్రీడాకారిణి కూడా ఉన్నారన్నది గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement