boyfriends
-
నా బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడు!
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్. తమిళంలో తిరునాళ్ కూత్తు చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈమె ఆ తర్వాత టిక్ టిక్ టిక్, సంఘతమిళన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అలా విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని వంటి హీరోల సరసన నటించినా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. ఈమె నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తమిళంలో కొత్త చిత్రాలకు కమిట్ అయినట్టు చెబుతున్న నివేద పేతురాజ్ ఇటీవల కారులో వెళుతూ ఒక ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది తాను నటిస్తున్న వెబ్ సిరీస్ ప్రమోషన్లో ఒక భాగం అని ఆ తర్వాత తెలిసింది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ఇలా పేర్కొన్నారు. తన నెగెటివ్ ఆలోచనలన్నీ వాస్తవ రూపం దాల్చుతున్నాయని చెప్పారు. ఒకరోజు తన బాయ్‌ఫ్రెండ్ తన మోసం చేశాడని ఊహించుకున్నానన్నారు. ఆ తర్వాత అదే విధంగా జరిగిందన్నారు .తన బాయ్‌ఫ్రెండ్ మరెవరినో తీసుకుని వెళ్లిపోయాడని చెప్పారు. లేకపోతే ప్రస్తుతం తాను వాడుతున్న కారు నుంచి భవిష్యత్తులో కొనుక్కు పోయే కారు వరకు తన నెగటివ్ ఆలోచనలలేనని నటి నివేద పేతురాజు పేర్కొన్నారు. కాగా ఈ 32 ఏళ్ల పరువాలగుమ్మలో మంచి నటినే కాకుండా బైక్ రేసర్ క్రీడాకారిణి కూడా ఉన్నారన్నది గమనార్హం. -
బాయ్ ఫ్రెండ్ బర్త్ డే.. హగ్గులతో 'బిగ్‌బాస్' కీర్తి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
హీరోయిన్ కోసం బాయ్‌ఫ్రెండ్స్ ఫైట్
బనశంకరి : హీరోయిన్ రాగిణి ద్వివేది కోసం ఆమె ఇద్దరు స్నేహితులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన ఆదివారం వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి నగరంలోని రిట్జ్ కార్టన్ హోటల్‌కు హీరోయిన్ రాగిణి ఆర్టీఓ శాఖలో అధికారిగా పని చేస్తున్న రవి అనే వ్యక్తితో కలసి వెళ్లారు. అదే సమయంలో అదే హోటల్లో రాగిణి మాజీ స్నేహితుడు, వ్యాపారి శివప్రకాశ్ స్నేహితులతో కలసి పార్టీ చేసుకుంటున్నాడు. కాగా తమ మధ్య తలెత్తిన మనస్పర్థలతో తనను వదిలేసిందనే కారణంగా రాగిణిపై ద్వేషం పెంచుకున్న శివప్రకాశ్, రాగిణి అదే హోటల్‌కు రవితో రావడాన్ని చూసి కోపాన్ని అదుపు చేసుకోలేక రాగిణితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో రవి, శివప్రకాశ్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఇరువురి మధ్య వాగ్వాదం శృతి మించడంతో శివప్రకాశ్ బీర్ బాటిల్‌తో రవిపై దాడి చేశాడు. గమనించిన హోటల్ సిబ్బంది ఇరువురిని విడిపించడంతో గొడవ సద్దుమణిగింది. గొడవపై రాగిణి, రవిలు అశోకనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి తనకు కనపడితే చంపేస్తానంటూ శివప్రకాశ్ బెదిరించాడంటూ రవి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్లో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి శివప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. వెలుగు చూసిన కొత్తకోణం.. కాగా హోటల్‌కు వెళ్లే సమయంలో రవి భార్య రవికి ఫోన్ చేసి రాగిణితో తిరుగుతుండడంపై గొడవ పడినట్లు తెలుస్తోంది. ‘నువ్వు రాగిణితో తిరుగుతున్నావనే విషయం నాకు తెలిసిపోయింది రాగిణి కోసం నా జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను ఏంచేసినా నీకు బుద్ధి రాదు. ఇప్పుడు రాగిణితో కలసి ఎక్కడున్నావనే విషయం కూడా తెలుసు. చూస్తుండు ఎవరో ఒకరు వచ్చి నిన్ను కసితీరా కొడతారు. నిన్ను ఊరికే వదిలేసే ప్రసక్తే లేదు. నువ్వు ఉన్న చోటుకే వచ్చి నిన్నుకొట్టి మరీ బుద్ధి చెబుతార’ంటూ రవి భార్య రవిని బెదిరించినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన కొద్ది సేపటికే రవిపై హోటల్లో రాగిణి మాజీ స్నేహితుడు శివప్రకాశ్ బాటిల్‌తో దాడి చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్
చిన్నప్పట్నుంచీ నాన్నే ఆ అమ్మాయి జీవితం. వయసొచ్చిన తర్వాత ముగ్గురు అబ్బాయిలు బాయ్‌ఫ్రెండ్స్ పేరుతో ఆమె జీవితంలోకి వస్తారు. ఎవరా ముగ్గురు? వాళ్లపై ఆమె తండ్రి అభిప్రాయం ఏంటి? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘నాన్న.. నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్’. బండి భాస్కర్ దర్శకత్వంలో రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, పార్వతీశం, అశ్విన్‌బాబు, నోయెల్ ముఖ్యతారలుగా బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘సినిమా బాగా నచ్చి ‘దిల్’ రాజుగారు విడుదల చేయడానికి ముందుకొచ్చారు. అన్ని వర్గాలవారూ చూడదగ్గ చిత్రం ఇది’’ అని నిర్మాత తెలిపారు. -
ప్రస్తుతానికి ఒంటరే!
సినిమాల కంటే ఎప్పుడూ ఏదో ఒక గాసిప్‌తో వార్తల్లో ఉంటుంది మలయాళ తార విమలారామన్. ఈ మధ్య ఎవరితోనో క్లోజ్ రిలేషన్ మెయిన్టేన్ చేస్తోందని మల్లువుడ్ కోడై కూసింది. అయితే వీటన్నింటికీ సింపుల్‌గా ఫుల్స్టాప్ పెట్టేసిందీ సుందరి. తనకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని... ఒకవేళ ఉంటే తప్పకుండా అందరికీ పరిచయం చేస్తానని ఓ సందర్భంలో తేల్చి చెప్పింది విమల. ‘ప్రస్తుతానికైతే ఒంటరినే. ఇలానే ఎంతో హ్యాపీగా ఉంది’ అంటున్న విమలారామన్... తన ధ్యాసంతా పనిమీదే ఉందని... అందులోనే ఎడతెరిపి లేనంత బిజీగా ఉన్నానని సెలవిచ్చింది. కానీ... నిప్పు లేనిదే పొగ రాదంటున్నారు కొందరు ఇండస్ట్రీ జనం. ఎవరేమనుకున్నా... మొత్తానికి అమ్మడు సింగిల్ అని సభాముఖంగా తెలియజేసి... కుర్రకారు గుండెల్లో మంటల్ని చల్లార్చింది! -
బాయ్‌ఫ్రెండ్సే రేపిస్టులు
మంబై: ముంబై మహానగరంలో బాయ్‌ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురవుతున్న యువతుల సంఖ్య నానాటికి అధికమవుతుందని నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు నగరంలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనపై ఆయన తాజా గణాంకాలను ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ... నగరంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 542 అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. వాటిలో 389 కేసులు బాయ్‌ఫ్రెండ్ చేతిలో యువతులు అత్యాచారానికి గురైయ్యారని చెప్పారు. బాయ్ఫ్రెండ్లు చెప్పే మాయ మాటలను యువతలు వెంటనే నమ్మడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రాకేశ్ మారియా విశ్లేషించారు. మరో ఆరు శాతం మంది యువతులు ఆగంతకుల చేతిలో అత్యాచారానికి గురైయ్యారని తెలిపారు. మిగిలిన యువతులు మాత్రం బంధువులు లేక పరిచయస్థుల చేతిలో అత్యాచారానికి గురైనవారని ఆయన చెప్పారు. అయితే మొత్తం 542 అత్యాచార కేసుల్లో ఇప్పటివరకు 477 కేసులను ఛేదించినట్లు తెలిపారు. గత ఏడాదిలో ఇదే సమయంలో 333 అత్యాచార కేసులు నమోదయ్యాయని రాకేశ్ మారియా వివరించారు.