బాయ్ఫ్రెండ్సే రేపిస్టులు | 72 pc of rape accused in Mumbai are 'boyfriends' of victims | Sakshi
Sakshi News home page

బాయ్ఫ్రెండ్సే రేపిస్టులు

Published Fri, Nov 28 2014 9:58 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

బాయ్ఫ్రెండ్సే రేపిస్టులు - Sakshi

బాయ్ఫ్రెండ్సే రేపిస్టులు

మంబై: ముంబై మహానగరంలో బాయ్ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురవుతున్న యువతుల సంఖ్య నానాటికి అధికమవుతుందని నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు నగరంలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనపై ఆయన తాజా గణాంకాలను ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ... నగరంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 542 అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. వాటిలో 389 కేసులు బాయ్ఫ్రెండ్ చేతిలో యువతులు అత్యాచారానికి గురైయ్యారని చెప్పారు.

బాయ్ఫ్రెండ్లు చెప్పే మాయ మాటలను యువతలు వెంటనే నమ్మడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రాకేశ్ మారియా విశ్లేషించారు. మరో ఆరు శాతం మంది యువతులు ఆగంతకుల చేతిలో అత్యాచారానికి గురైయ్యారని తెలిపారు. మిగిలిన యువతులు మాత్రం బంధువులు లేక పరిచయస్థుల చేతిలో అత్యాచారానికి గురైనవారని ఆయన చెప్పారు. అయితే మొత్తం 542 అత్యాచార కేసుల్లో ఇప్పటివరకు 477 కేసులను ఛేదించినట్లు తెలిపారు. గత ఏడాదిలో ఇదే సమయంలో 333 అత్యాచార కేసులు నమోదయ్యాయని రాకేశ్ మారియా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement