Rakesh Maria
-
తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్..
Mumbai Former Police Commissioner Rakesh Maria Biopic By Rohit Shetty: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి యాక్షన్ అండ్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల అక్షయ్ కుమార్‌తో సూర్యవంశీ తెరకెక్కించి హిట్ కొట్టాడు. అమెజాన్ ఓటీటీ కోసం ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనె వెబ్ సిరీస్‌ను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శెట్టి మరో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అది కూడా ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ రాకేష్ మారియా బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు రోహిత్. రాకేష్ మారియా తన కెరీర్లో సాధించిన విజయం ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు రోహిత్ శెట్టి అధికారికికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ 'రాకేష్ మారియా తన 36 ఏళ్ల అద్భుతమైన ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆయన 1993 ముంబైలో జరిగిన పేలుళ్ల నుంచి అండర్ వరల్డ్ ముప్పు, 2008లోని 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు ఎన్నో చూశారు. నిజ జీవితంలోని ఈ సూపర్ కాప్ ధైర్య, సాహసాల ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.' అని తెలిపారు. కాగా ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ మారియా 1981వ బ్యాచ్ నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1993లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా (ట్రాఫిక్) ఉన్న రాకేష్ మారియా ముంబై వరుస పేలుళ్ల కేసును ఛేదించారు. తర్వాత ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు డీసీపీగా, ఆ తర్వాత జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అధికారిగా మారారు. 2008లో 26/11 ముంబై దాడులను పరిశోధించే బాధ్యతను కూడా మారియాకు అప్పగించారు. చదవండి: ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం ! అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
సంచలన ‘ఆత్మకథ’
కీలక స్థానాల్లో పనిచేసి పదవులనుంచి తప్పుకున్న వారు రాసే పుస్తకాలకు మంచి గిరాకీ ఉంటుంది. వారు బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సంచలనాత్మకమైన ఘటనలు జరిగుంటే ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ తదితరులు రాసిన ఆత్మకథలు చెప్పుకోదగ్గ వివాదం రేపాయి. ఇందులో సంజయ బారు పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఆధారంగా అదే పేరుతో చలనచిత్రంగా కూడా వచ్చింది. కనుక ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా ‘లెట్ మీ సే ఇట్ నౌ’ పేరిట వెలు వరించిన గ్రంథం అందరిలోనూ ఆసక్తి కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ముంబై నగరం ఒకప్పుడు మాఫియా డాన్ల అడ్డా. వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను, సినీ నటుల్ని బెదిరించి డబ్బులు గుంజడం, మాట విననివారిని కిడ్నాప్ చేయడం, నేర సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసం పోరాటాలు అక్కడ నిత్యకృత్యం. 2008 నవంబర్ 26న ముంబై నగరంపై ఉగ్రవాదులు విరుచుకుపడి 173మంది పౌరులను పొట్టనబెట్టుకున్న ఘటన వీటన్నిటినీ తలదన్నింది. కన్నకూతురు షీనా బోరాను పథకం ప్రకారం రప్పించి, తన భర్తతో కలిసి ఆమెను పొట్టనబెట్టుకున్న ఇంద్రాణి ముఖర్జీ ఉదంతం కూడా అక్కడిదే. ఇలాంటి మహానగరంలోని పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా, ప్రత్యేకించి పోలీస్ కమిషనర్‌గా పని చేసిన రాకేష్ ఆత్మ కథ రాశారంటే ఆసక్తి అత్యంత సహజం. పైగా రాకేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా వున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారి అశోక్ కామ్టే భార్య వినీత తన భర్త మరణానికి రాకేష్ వ్యవహరించిన తీరే కారణమని ఆరోపించారు. ఆ రోజు పోలీస్ కంట్రోల్ రూం ఇన్చార్జిగా వున్న రాకేష్ సరిగా మార్గదర్శకత్వం చేయనందువల్లే అశోక్ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు బలయ్యారని ఒక పుస్తకంలో ఆమె చెప్పారు. అప్పట్లో రాకేష్ ఈ ఆరో పణలు కొట్టి పారేసినా తాజాగా ఆ ఎపిసోడ్ గురించి ఈ పుస్తకంలో ఏం రాసి వుంటారన్నది చూడా ల్సివుంది. అలాగే రాకేష్‌ను పదవీ విరమణకు చాలా ముందుగానే పోలీస్ కమిషనర్ పదవినుంచి తప్పించడం అప్పట్లో సంచలనం రేపింది. దాంతోపాటు బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఆయన కలవడం పెను వివాదమైంది. ఇంత నేపథ్యంవున్న రాకేష్ పుస్తకం రాశారంటే చదవకుండా ఎలావుంటారు? అయితే ఈ ఆత్మకథలో ఇతరత్రా అంశాలకంటే ఉగ్రవాది కసబ్ గురించి ఆయన చెప్పిన అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దాని చుట్టూ వివాదం రాజేసేందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ప్రయత్నించారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరేలు రెండూ కసబ్ పేరును దినేశ్ చౌధరి అని మార్చి, నకిలీ ఐడీ కార్డు సృష్టించి, అతనితో కాషాయ రంగు తాడు కట్టించి, మారణాయుధాలిచ్చి ఉగ్రవాద దాడులకు పంపాయని రాకేష్ తెలిపారు. పీయూష్ గోయెల్ అభ్యంతరమల్లా ఈ సంగతి ఇన్నాళ్లూ ఎందుకు దాచివుంచారన్నదే. అందుకాయన రాకేష్‌తోపాటు అప్పటి యూపీఏ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగుందన్నది గోయెల్ అనుమానం. వాస్తవానికి ఈ సమాచారం కొత్తదేమీ కాదు. ఆ దాడి జరిగిన మరుసటి రోజునుంచే ఉగ్రవాదుల గురించి, వారి పన్నాగాల గురించి పుంఖానుపుంఖాలుగా కథ నాలు వెలువడ్డాయి. కసబ్‌ను ప్రశ్నించే క్రమంలో వెల్లడైన అంశాలన్నీ మీడియాలో అప్పట్లోనే ప్రము ఖంగా వచ్చాయి. ఉగ్రవాదుల వద్ద హైదరాబాద్, బెంగళూరు కళాశాలల్లో చదువుకుంటున్నట్టు దొంగ గుర్తింపు కార్డులుండటం, వాటిపై హిందువుల పేర్లు వుండటం పాత కథే. ఉగ్రవాద దాడులకు పథక రచన చేసింది ఐఎస్ఐ కనుక, దాడులు చేసేది భారత్‌లో కనుక తమ సంగతి బయట పడకుండా వుండటం కోసం, దర్యాప్తు సంస్థలను పక్కదోవ పట్టించేందుకు, అయోమయం సృష్టిం చేందుకు ఇదంతా చేసివుంటారని సులభంగానే గ్రహించవచ్చు. ఇలాంటివి బయటపడినప్పుడు వెల్లడించడానికి ప్రభుత్వాలకు అభ్యంతరం ఎందుకుంటుంది? రాకేష్ మారియా కూడా దాన్ని తొలి సారి బయటపెడుతున్నట్టు ప్రకటించలేదు. కసబ్‌ను తానే స్వయంగా ప్రశ్నించారు గనుక, దర్యా ప్తును పక్కదోవ పట్టించే పన్నాగంతో ఐఎస్ఐ ఏమేం చేసిందో చెప్పడానికి ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రాణాలకు తెగించి కసబ్‌ను సజీవంగా పట్టుకున్న కానిస్టేబుల్ గురించి కూడా రాకేష్ ప్రస్తావించారు. కసబ్ సజీవంగా పట్టుబడకపోయివుంటే పాకి స్తాన్ కుట్రను రుజువు చేయడం కష్టమయ్యేది. దేశంలో అంతక్రితమూ, ఆ తర్వాత అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. వీటన్నిటిలో పాకిస్తాన్ ప్రమేయం వున్న సంగతి తెలుస్తూనే వున్నా అందుకు అవసరమైన పక్కా సాక్ష్యాలివ్వడం సాధ్యపడలేదు. ముంబై మహానగరం ఆర్థిక రాజధాని కనుక ఉగ్రవాదుల దాడి ఘటన గురించి తెలిసిన వెంటనే నగర పోలీసులు వారిని మట్టు బెడతారని పాకిస్తాన్ ఊహించింది. కానీ పాక్ అంచనాలకు భిన్నంగా అనుకోకుండా కసబ్ పోలీసులకు చిక్కాడు. ఒకప్పుడు తాము ఇష్టపడే నేతలు లేదా సెలబ్రిటీలు రాసిన ఆత్మకథల కోసం జనం ఆసక్తి కనబరిచేవారు. వారి జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది వుంటుందన్న భావనే అందుకు కారణం. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. పదవీకాలంలో వివాదాస్పదులుగా పేరు తెచ్చుకున్నవారు రాసినా, ఆత్మకథల్లో వివాదాల ప్రస్తావనవున్నా వాటికి పఠితలు అధికంగానే వుంటున్నారు. ఈ పుస్తకంలో రాకేష్ తన తదనంతరం పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అహ్మద్ జావేద్, మరో పోలీస్ అధికారి దేవేన్ భారతిల గురించి చేసిన ప్రస్తావనలు ఇప్పుడు ముంబై పోలీసుల్లో కాక పుట్టిస్తున్నాయి. తన గురించి వున్నవీ లేనివీ రాశారని జావేద్ అంటున్నారు. ఏదేమైనా మారియా పుస్తకం విడుదలైన రోజే కావలసినంత వివాదం రేపింది. -
షీనాబోరా హత్యకేసులో మరో మలుపు!
-
షీనాబోరా హత్యకేసులో మరో మలుపు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత కమిషనర్ జావేద్ అహ్మద్ ఈ కేసు విచారణ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడం, పాత కమిషనర్ రాకేష్ మారియాను దీన్నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరగడం లాంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ తలనొప్పి తమకెందుకని సర్కారు భావించినట్లు తెలుస్తోంది. షీనా బోరా హత్యకేసు గురించిన పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా తాను డీజీపీని కోరారని, ఆయన నుంచి నివేదిక రాగానే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి దీనిపై సమగ్రంగా చర్చించామని మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షీ తెలిపారు. ఈ హత్యకేసు దర్యాప్తు పూర్తి నిష్పక్షపాతంగా జరగాలని, స్థానిక పోలీసులు లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల జోక్యం ఏమాత్రం లేకుండా ఉండాలనే మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ చేతుల్లోనే షీనా బోరా హత్యకు గురైనట్లు కథనాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చూస్తున్న ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు మధ్యలో పదోన్నతి కల్పించి ఆయనను వేరే పదవిలోకి బదిలీ చేయడం, ఆ తర్వాత ఏ పదవిలో ఉన్నా.. మారియానే కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని చెప్పడం లాంటి అనేక మలుపులు తిరిగాయి. చివరకు ఈ కేసు ఇప్పుడు సీబీఐ చేతికి వెళ్లింది. -
'ఆ కేసు నేను చూడను'
ముంబై: షీనా బోరా హత్యకేసు దర్యాప్తును పర్యవేక్షించబోనని ముంబై పోలీసు కమిషనర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన రాకేశ్ మారియా... ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. 'ముంబై పోలీసు కమిషనర్ గా ఒకరిని(అహ్మద్ జావేద్) నియమించిన తర్వాత సమాన హోదా కలిగిన మరో అధికారితో కేసును పర్యవేక్షించమనడం సమంజసం కాదు. ఇలా చేస్తే ముంబై పోలీసు వ్యవస్థలో కొత్తగా మరో పవర్ సెంటర్ ఏర్పాడే అవకాశముంది. కిందిస్థాయి సిబ్బందికి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది' అని ప్రభుత్వానికి మారియా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముంబై పోలీసు కమిషనర్ హోదాలో షీనా బోరా హత్యకేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించిన మారియాను మహారాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో డీజీపీ ర్యాంకు అధికారి అహ్మద్ జావేద్ ను నియమించింది. దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. షీనా బోరా హత్య కేసు దర్యాప్తు పూర్తయ్యేవరకు మారియా పర్యవేక్షిస్తారని ప్రకటించింది. అయితే బదిలీ మింగుడు పడకపోవడంతో మారియా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని మారియా తోసిపుచ్చారు. -
స్క్రీన్ ప్లే ఒకటే...కథ వేరు
ముంబై: నగర పోలీసు కమిషనర్ పదవి నుంచి రాకేశ్ మారియాను తప్పించడంలో 20 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రే పునరావృతమైంది. అదే స్క్రీన్ ప్లే, అదే ఉద్వాసన పర్వం చోటుచేసుకుంది. 1992, డిసెంబర్ నెలలో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం జరిగిన అల్లర్లు, 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సంఘటనల మూలాలా కూపీని లాగేందుకు ప్రయత్నించడంతో నాడు ముంబై పోలీసు కమిషనర్‌గా ఉన్న అమరజీత్ సింగ్ సామ్రాను ఆ కుర్చి నుంచి తప్పించారు. ఇప్పుడు షీరా బోరా హత్య కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న రాకేశ్ మారియాను పదోన్నతి పేరిట పదవి నుంచి తప్పించారు. రాకేశ్ మారియా, సామ్రాలు ఇద్దరూ పబ్లిసిటీ పిచ్చోళ్లే. మీడియాకు మంచి మిత్రులే. ఇద్దరూ శాఖాపరంగా పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలను బహిరంగంగా ఒప్పుకోవడంలో ఎప్పుడూ సంశయించిన సందర్భాలు లేవు. పబ్లిసిటీ పిచ్చి తమ హక్కని, అది పోలీసులకు ఉండరాదన్నది రాజకీయ నేతల పిచ్చి నమ్మకం. విలేకర్ల సమావేశాల్లో నోరు మరీ అంతగా విప్పి మాట్లాడవద్దని 20 ఏళ్ల క్రితం నాడు కేంద్ర హోం మంత్రిగా ఉన్న ఎస్బీ చవాన్ బహిరంగంగా సామ్రాకు హితవు చెప్పారు. హోం మంత్రి, అందులోనూ హెడ్మాస్టర్ లాంటి ఎస్బీ చవాన్ లాంటి వ్యక్తి చెబితే వినాలా, వద్దా ? పర్వవసానంగా వారం రోజుల్లోనే సామ్రా కుర్చీని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో వచ్చిన సతీష్ సాహ్నీ పబ్లిసిటీ జోలికి వెళ్లకుండా తన పనేదో తాను కామ్‌గా చేసుకుపోయారు. అప్పటికి ముస్లింల హృదయాల్లో రగులుతున్న అగ్నిని చల్లార్చడంలో విజయం సాధించారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మొహల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అయినా ఆ ఘనత తనదేనంటూ సాహ్నీ ఎన్నడూ మీడియా ముందు గొంతు విప్పుకోలేదు. అయినప్పుటికీ ఆ రోజుల్లోని పరిస్థితులను చక్కదిద్దడంలో ఆయన చూపిన చొరవకు మీడియా ఎక్కువనే ప్రచారం ఇచ్చింది. ప్రస్తుత షీరా బోరా హత్య కేసులో రాకేశ్ మారియా అత్యుత్సాహం చూపించడం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఎందుకో నచ్చలేదు. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జియాను, ఇతర నిందితులను ఇంటరాగేట్ చేయడం కోసం మారియా ఖర్ పోలీసు స్టేషన్లోనే మకాం వేశారు. ఈ నెలాఖరులోగానే ఈ కేసును పూర్తిగా ఛేదించేస్తానని మీడియా ముందు సవాల్ కూడా చేశారు. ముంబై కమిషనర్‌గా ఆయన ఇచ్చిన ఆఖరి ప్రకటన బహూశ ఇదే కాబోలు. ఈలోగానే తనకు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ అంతగా ప్రాముఖ్యతలేని హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చాయని తెల్సింది. అప్పుడు క్రాఫోర్డ్ మార్కెట్లోని తన కార్యాలయానికి వెళ్లి ఆ ఉత్తర్వులను అందుకున్నారు. మీడియాకు మిత్రుడవడంతో మారియా బదిలీ వార్తకు పత్రికలన్నీ విశేష ప్రాధాన్యతనిచ్చాయి. దాంతో కంగుతిన్న ఫడ్నవీస్.....షీనా బోరా హత్య కేసును మాత్రం మారియానే పర్యవేక్షించేలా ఉత్తర్వులు జారీ చేశారు. మారియా బదిలీ వ్యవహారంలో షీనాబోరా కేసులోని నిందితులు ఫడ్నవీస్‌ను ప్రభావితం చేశారా ? అన్న ప్రశ్నకు ఆధారాలు మాత్రం ప్రస్తుతానికి లేవు. కానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు మారియా మంచి మిత్రుడన్న విషయం అందరికి తెల్సిందే. మీడియా ముందు మారియా అతిగా ప్రచారం పొందడం కూడా ఫడ్నవీస్‌కు నచ్చలేదన్నది ఆయన సన్నిహిత వర్గాల కథనం. మరి ప్రచారం ప్రజానాయకులకుండాలిగానీ పోలీసులకుంటే ఎలా ! -
'బాధగా ఉంది.. కానీ రాజీనామా చేయడం లేదు'
ముంబయి: తన బదిలీ చాలా బాధగా అనిపించిందని అయితే రాజీనామా చేసే ఆలోచనేది లేదని షీనా బోరా హత్య కేసును విచారించిన మాజీ ముంబయి పోలీస్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ మారియా అన్నారు. తన బదిలీ విషయంలో తాను రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. షీనా హత్య కేసును విచారిస్తున్న ఆయనను మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసి, డీజీపీ(హోంగార్డ్స్)గా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలోకి డీజీపీ ర్యాంక్ అధికారి అహ్మద్ జావెద్ ముంబై నూతన పోలీసు కమిషనర్‌గా నియమించారు. అయితే, ఈ నియామకం వెనుక రాజకీయ ప్రమేయం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పరోక్షంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు కూడా ఆయన నచ్చలేదని అందుకే ఆయనను వేరే శాఖకు బదిలీచేశారని కూడా విమర్శలు వినిపించాయి. ఆ నిర్ణయం హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకేననే విమర్శలు వెల్లువెత్తడంతో దిద్దుబాటుకు దిగి బదిలీతో సంబంధం లేకుండా ఈ కేసు దర్యాప్తును మారియానే పర్యవేక్షిస్తారని ప్రకటించింది. కానీ, బదిలీపై తీవ్ర ఆందోళనతో ఉన్న మారియా రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన బుధవారం ఈ వివరణ ఇచ్చారు. -
షీనా కేసులో మహారాష్ట్ర కీలక నిర్ణయం
షీనా బోరా హత్యకేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు ఉన్నట్టుండి పదోన్నతి ఇవ్వడంతో పలు వర్గాల నుంచి అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ఆయనకు డీజీపీగా పదోన్నతి కల్పించడం.. ఈ కేసు నుంచి పక్కకు తప్పించడానికేనా అని అనేకమంది ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ మహారాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. హోదా మారినా, పోస్టు మారినా కూడా.. షీనా బోరా హత్యకేసు పూర్తిగా ఓ కొలిక్కి వచ్చేవరకు ఆ కేసు దర్యాప్తు మొత్తం రాకేష్ మారియా సారథ్యంలోనే జరుగుతుందని మహారాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ (హోం వ్యవహారాలు) ఓ ప్రకటనలో తెలిపారు. -
షీనా బోరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం
-
షీనా బోరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం
హత్య జరిగిన తీరేకాదు.. దర్యాప్తు జరుగుతున్న తీరులోనూ సంచలనాలు సృష్టిస్తోన్న షీనా బోరా కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ప్రభుత్వం ఉన్నపళంగా పదోన్నతి కల్పించింది. మారియాను హోం గార్డ్స్ డీజీగా నియమిస్తూ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భారీ ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్న నేపథ్యంలో మారియా బదిలీపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనని, సాధారణ ప్రమోషన్లలో భాగంగానే మారియా డీజీగా నియమితులయ్యారని ముంబై పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయంపై మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షి మాట్లాడుతూ.. రాకేశ్ మారియా బదిలీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అహ్మద్ జావేద్‌ను ముంబై నగర నూతన కమిషనర్‌గా నియమించినట్లు, తక్షణమే ఈ నియమకాలు అమలులోకి రానున్నట్లు చెప్పారు. అయితే కొత్త కమిషనరే షీనా హత్య కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తారా? లేక ఏసీపీ స్థాయి అధికారులతోనే దర్యాప్తును ముగించేస్తారా? అనే విషయాలపై స్పష్టత రాలేదులేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. -
‘మోరల్ పోలీసింగ్’ కేసులో మలుపు
ముంబై : మధ్ ఐలాండ్ మోరల్ పోలీసింగ్ కేసు మలుపు తిరిగింది. మాల్వణీ పోలీసులకు స్థానికులు మద్దతుగా నిలిచారు. దాడుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను బదిలీ చేస్తే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం ఎదుట ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు తనిఖీ నిర్వహించడంతో ఇప్పుడు తాము సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నామని, రాక్షసుల కళ్ల నుంచి తమ ఆడవాళ్లు బయటపడినట్లుగా ఉందని అంటున్నారు. ‘పోలీసుల తీరును ఖండిస్తూ పత్రికలు రాయడం బాధించింది. పోలీసులు మాకు మద్దతుగా నిలిచారు. ఒకవేళ బాధ్యత సక్రమంగా నిర్వహించినందుకు పోలీసులపై చర్యలు తీసుకుంటే వారికి మేము మద్దతుగా నిలుస్తాం. ఆ అధికారులను బదిలీ చేస్తే సీఎం నివాసం ఎదుట ఆందోళన చేపడతాం’ అని ఉత్తర ముంబైలోని మలాడ్‌లో మధ్ గ్రామ నివాసి నరేశ్ జాదవ్ హెచ్చరించారు. ‘ఈ మోరల్ పోలీసింగ్ అనే అంశం లేవనెత్తడం వెనక హోటళ్ల యజమానులు ఉన్నారు. ఎందుకంటే ఈ దాడుల వల్ల వారి వ్యాపారం దెబ్బతిన్నది. అందుకే ఇలా చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు సకాలంలో దాడులు చేశారు’ అని జాదవ్ అన్నారు. ‘హోటళ్లు, లాడ్జీలు, కాట్టేజీల్లో వ్యభిచారం పెరిగిపోయింది. దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత ఐదేళ్లలో పోలీసులకు ఎన్నో సార్లు లేఖలు రాశాం. గతంలో మా ఆడవాళ్లు బయటకు తల వంచుకుని వెళ్లేవాళ్లు. ఇప్పుడు పోలీసుల దాడుల తర్వాత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారికి థ్యాంక్స్ చెబితే సరిపోదు’ అని డోంగార్పాడా గ్రామంలో నివసించే రాకేశ్ రాజ్‌పుత్ అన్నారు. మధ్ ఐలాండ్, ఆక్సా ప్రాంతాల్లో ఆగస్టు 6న పోలీసులు జరిపిన దాడుల్లో 13 జంటలతో పాటు మరో 35 మంది అరెస్టయ్యారు. ఈ వ్యవహారంపై 9వ తేదీన ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా విచారణకు ఆదేశించారు. ‘పోలీసులు చేసిన పనిని అభినందించాలి. వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకుని వారు మంచి పనిచేశారు’ అని కన్సారీ మాతా ఆదివాసీ సమాజ్ సేవా సంఘ్ అధ్యక్షులు రేణుకా దివే అన్నారు. దాడులు జరిపిన గ్రామాలు ఏ ప్రాంత పరిధిలో వస్తాయో తెలపాలని కోరుతూ మాల్వణీ పోలీస్ స్టేషన్‌కు లేఖ కూడా రాశామని, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. కానీ ఈ విషయంపై ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. ‘ఆటో రిక్షా వాళ్లతో లాడ్జీలు, హోటళ్ల వాళ్లు కుమ్మక్కై వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారని స్థానికులు చెప్పారు. అలా చేస్తున్న ఆటో రిక్షాలపై నిఘా ఉంచాలని పోలీసులను కోరాం. అలాగే ఈవ్ టీజింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పాం’ అని దివే పేర్కొన్నారు. అప్పుడే ఫిర్యాదులు అందాయి.. ‘ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్ ఎమ్మెల్యే అస్లాం షేక్ పోలీసులను కోరారు. మధ్ ఐలాండ్‌లోని డొంగార్పాడా, ఆక్సా, ఢార్వలీ గ్రామాల ప్రజలు కూడా పోలీసులకు పలు మార్లు విజ్ఞప్తి చేశారు. మొత్తం వ్యవహారానికి సంబంధించి కొందరు మహిళలను అరెస్టు చేశాం. వారు ముంబైలోని పలు ప్రాంతాల్లో వ్యభిచార గృహాలను నడుపుతున్నట్లు తెలిసింది’ అని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
'వారికో న్యాయం.. మరియాకు మరో న్యాయమా'
ముంబై: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారం ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య చిచ్చురాజేస్తోంది. ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మరియాకు శివసేన మద్దతుగా నిలిచింది. మోదీ వివాదంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మాదిరిగా రాకేష్‌కు ఎందుకు అండగా ఉండటం లేదని శివసేన పార్టీ పత్రిక సామ్నాలో బీజేపీని ప్రశ్నించింది. వీసా మంజూరు విషయంలో సాయం చేసిన సుష్మా, రాజెలకు బీజేపీ బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా లండన్‌లో సమావేశమైన ముంబై పోలీస్ చీఫ్ రాకేష్‌పై చర్యలు తీసుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో శివసేన స్పందించింది. 'లలిత్ మోదీ ఐపీఎల్లో అవతకవకలకు పాల్పడ్డాడు. ప్రభుత్వ యంత్రాంగం అనుమతితో మోదీ లండన్‌లో ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ముంబై పోలీస్ కమిషనర్‌కు మోదీని అరెస్ట్ చేసి భారత్‌కు తీసుకువచ్చే అధికారం లేదు. ఐపీఎల్ చైర్మన్‌గా మోదీకి చాలా మంది రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయి. వీరందరిపైనా చర్యలు తీసుకుంటారా' అని సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. -
లలిత్ మోదీతో భేటీపై మారియా వివరణ
ముంబై: మనీ లాండరింగ్ సహా ఇతర ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్‌కు పరారైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీతో భేటీపై మహారాష్ట్ర ప్రభుత్వానికి ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా వివరణ ఇచ్చారు. మరియా గతేడాది లండన్‌లో లలిత్ ను కలిసిన విషయం వెల్లడి కావడంతో ప్రభుత్వం ఆయనను వివరణ కోరింది. మోదీ న్యాయవాది పట్టుబట్టడంతో తాను లలిత్ మోదీని కలిసింది వాస్తవమేనని రాకేశ్ అంతకుముందు అంగీకరించారు. అయితే, తాను లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హోం మంత్రికి ఆ విషయం తెలియజేశానని తెలిపారు. లలిత్ మోదీ, రాకేశ్ మరియా కలిసి ఉన్న ఫొటోను శనివారం తొలుత ఓ టీవీ చానెల్ ప్రసారం చేయడంతో దుమారం రేగింది. -
లలిత్ మోదీని ఎందుకు కలిశారు?
ముంబై: మనీ లాండరింగ్ సహా ఇతర ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీని గతేడాది లండన్ లో ముంబై నగర పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా కలవడంపై మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. అసలు లలిత్ మోదీని ఎందుకు కలిశారో చెప్పాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం జూలై 17 వ తేదీన మోదీని మారియా కలిసిన సంఘటన ప్రస్తుత్తం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను ఓ న్యూస్ ఛానల్ విడుదల చేయడంతో మారియా-లలిత్ మోదీల భేటీ అంశం వెలుగు చూసింది. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇందులో అసంబద్ధతతో కూడిన ఏవైనా కారణాలు ముడిపడి ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. -
బాయ్‌ఫ్రెండ్సే రేపిస్టులు
మంబై: ముంబై మహానగరంలో బాయ్‌ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురవుతున్న యువతుల సంఖ్య నానాటికి అధికమవుతుందని నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు నగరంలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనపై ఆయన తాజా గణాంకాలను ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ... నగరంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 542 అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. వాటిలో 389 కేసులు బాయ్‌ఫ్రెండ్ చేతిలో యువతులు అత్యాచారానికి గురైయ్యారని చెప్పారు. బాయ్ఫ్రెండ్లు చెప్పే మాయ మాటలను యువతలు వెంటనే నమ్మడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రాకేశ్ మారియా విశ్లేషించారు. మరో ఆరు శాతం మంది యువతులు ఆగంతకుల చేతిలో అత్యాచారానికి గురైయ్యారని తెలిపారు. మిగిలిన యువతులు మాత్రం బంధువులు లేక పరిచయస్థుల చేతిలో అత్యాచారానికి గురైనవారని ఆయన చెప్పారు. అయితే మొత్తం 542 అత్యాచార కేసుల్లో ఇప్పటివరకు 477 కేసులను ఛేదించినట్లు తెలిపారు. గత ఏడాదిలో ఇదే సమయంలో 333 అత్యాచార కేసులు నమోదయ్యాయని రాకేశ్ మారియా వివరించారు. -
‘అదృశ్యం’ కేసులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, ముంబై: తప్పిపోయిన పిల్లలను వెదికేందుకు ముంబై పోలీసు శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాలు అన్ని పోలీసు స్టేషన్లలో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో చదుపుపై ఒత్తిడి, తల్లిదండ్రులపై ఉన్న అసంతృప్తి ఇలా వివిధ కారణాలవల్ల పిల్లలు ఇల్లు వదిలిపోతారు. ఇలాంటి పిల్లలను వెదికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పిల్లను వెదికే పని ముంబై పోలీసు శాఖకు చెందిన ‘మిస్సింగ్ పర్సన్ బ్యూరో’ చేస్తోంది. కాని ఇలా నగరంలోని పోలీసు స్టేషన్లలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని మారియా అన్నారు. ఈ బృందాలు నవంబర్, డిసెంబర్, జనవరి 31 వరకు పనిచేస్తాయి. ముంబై నుంచి ప్రతీ యేడాది దాదాపు వేయి మంది పిల్లలు అపహరణకు గురవుతారు. నగరంలో వివిధ పర్యాటక ప్రాంతాలతోపాటు బాలీవుడ్ ప్రముఖ నటీనటుల నివాసాలున్నాయి. వారిని చూసేందుకు ఇంట్లో చెప్పకుండా పిల్లలు పారిపోయి వస్తారు. ఇందులో అత్యధిక శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలే ఉంటారు. వీరంతా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో బస చేస్తారు. తర్వాత మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఇక్కడే ఉండిపోతారు. ఇలాంటి పిల్లలను వెదికే పని మిస్సింగ్ పర్సన్ బ్యూరో చేస్తుంది. కాని ఈ మూడు నెలల కాలవ్యవధిలో అన్ని పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు వారిని గాలించే పనులు చేపడతాయి. సాధ్యమైనంత మంది పిల్లలను వెదికి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారని డిప్యూటీ పోలీసు కమిషనర్ ధనంజయ్ కులకర్ణి చెప్పారు. 2007లో దాదాపు నాలుగు వేల మందికిపెగా పిల్లలు ముంబై, నవీముంబైలలో తప్పిపోయినట్లు రికార్డుల ద్వారా వెల్లడైంది. ఈ సంఖ్యపై మానవ హక్కుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పిల్లలను వెదికేందుకు ఒక మార్గదర్శన నియమావళిని అమలు చేయాలని సంఘం ఆదేశించింది. ఆ మేరకు అన్ని పోలీసు స్టేషన్లలో ప్రత్యేక బృందాలను నియమించినట్లు కులకర్ణి చెప్పారు. తప్పిపోయిన పిల్లల వివరాలు (18 సంవత్సరాల లోపు)..... సంవత్సరం బాలురు బాలికలు 2013 1,200 1,900 2014 600 900 దొరికిన వారి వివరాలు... 2013 1000 1,700 2014 450 700 -
సర్వం సిద్ధం
సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాలకు నగర పోలీసు శాఖ సన్నద్ధమైంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో భక్తులు, స్థానిక ప్రజలు, మండలి కార్యకర్తలు, స్వయం సేవా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా కోరారు. ఉత్సవాలను పురస్కరించుకుని పోలీసులకు వారాంతపు సెలవులు, దీర్ఘకాలిక సెలవులు రద్దుచేశారు. దీంతో నగర పోలీసు శాఖ ఆధీనంలో ఉన్న మొత్తం 45 వేల మంది పోలీసు సిబ్బంది విధులకు అందుబాటులో ఉన్నట్లే.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ఐదు రకాల పోలీసు బలగాలను మోహరించినట్లు మారియా చెప్పారు. ఇందులో నేర నిరోధక శాఖ, ఉగ్రవాద నిరోధక శాఖ, రద్దీ నియంత్రణ, అత్యవసర దళం, ధార్మక స్థలాల భద్రత దళాలు ఉన్నాయని ఆయన అన్నారు. రద్దీ సమయంలో అమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చే సే ఆకతాయిల ఆటకట్టించేందుకు సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిఘా వేయనున్నారు. ఇప్పటికే ముంబై వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉంది. ముష్కరులు ఎప్పుడు, ఏ రూపంలో వచ్చి దాడులు చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వివిధ రహదారులన్నింటిపై పోలీసులు నిఘావేశారు. సముద్రతీరాల వెంబడి గస్తీ నిర్వహించే కోస్టు గార్డులను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో వాహనాల తనఖీలు, నాకా బందీలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో సెప్టెంబర్ రెండు, నాలుగు, ఏడు, ఎనిమిది తేదీల్లో ఉదయం ఆరు గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగానికి పోలీసు శాఖ అనుమతినిచ్చింది. నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలు తప్పిపోతే వారి ఆచూకీ కోసం ఫిర్యాదు చేసేందుకు జూహూ, గిర్గావ్ (చర్నిరోడ్ చౌపాటి), బాంద్రా, పవాయి, శివాజీపార్క్ తదితర నిమజ్జన ఘాట్లవద్ద ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తమ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వాహనాల పార్కింగ్‌కు అనుమతినివ్వకూడదని వ్యాపారవర్గాలకు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ జి.కె.ఉపాధ్యాయ్ సూచించారు. బీఎంసీ ఏర్పాట్లు... విగ్రహాలు నిమజ్జన ం చేసే సముద్రతీరాల (ఘాట్ల) వద్ద మహానగర పాలక సంస్థ (బీఎంసీ) తగిన ఏర్పాట్లు పూర్తిచేసింది. సుమారు 10 వేల మంది బీఎంసీ సిబ్బందిని నియమించింది. వాచ్ టవర్లు, ఫ్లడ్ లైట్లు, 400 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాసన్ చెప్పారు. ప్రతి నిమజ్జన ఘాట్‌వద్ద 8-10 సీసీటీవీ కెమెరాల చొప్పున మొత్తం నిమజ్జన ఘాట్లవద్ద 258 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సముద్ర తీరాలకు వచ్చిన భక్తులకు సంచార టాయిలెట్లు, తాత్కాలిక తాగునీరు కుళాయిలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బీఎంసీ పరిపాలనా విభాగం రూ.13-15 కోట్లు ఖర్చుచేస్తోంది. -
ప్రాణాలను ఫణంగా పెట్టొద్దు
పోలీసు కొలువు కోసం వచ్చిన అభ్యర్థులకు మారియా హితవు సాక్షి, ముంబై: సర్ సలామత్ తో పగిడీ పచాస్.. పోలీసు కొలువు కోసం దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యేందుకు వచ్చిన అభ్యర్థులతో నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా అన్న మాటలివి. కొలువు కోసం ప్రాణాలను ఫణంగా పెట్టొద్దని, బతికుంటే ఇలాంటి అవకాశాలు ఎన్నో వస్తాయని, దానిని కాదని మొండిగా పరిగెత్తి ప్రాణాల మీదకు కొనితెచ్చుకోవద్దని అభ్యర్థులకు హితవు పలికారు. పోలీ సు భర్తీ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అపశ్రుతులపై మారియా తీవ్రంగా స్పందించారు. అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను, పరుగు పరీక్షలను సాధ్యమైనంత త్వరగా ఉదయమే పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మధ్యాహ్నం విరామం ఇచ్చిన తరువాత మళ్లీ సాయంత్రం నిర్వహించాలని మారియా ఆదేశాలు జారీచేశారు. భర్తీ ప్రక్రియ ప్రారంభమైన వారం రోజుల్లోనే నలుగురు అభ్యర్థులు చనిపోవడంలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోవడంతో మారియా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో అభ్యర్థులకు దేహదారుఢ్య, షార్ట్‌పుట్, పరుగు తదితర పరీక్షలు నిర్వహిస్తున్న మైదానాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హాజరైన అభ్యర్థులకు మార్గదర్శనం చేశారు. పోలీసు శాఖలో భర్తి అయ్యేందుకు వచ్చే అభ్యర్థులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టొద్దని సూచించారు. తల సక్రమంగా ఉంటే ఎన్ని తలపాగాలైన చుట్టుకోవచ్చు (సర్ సలామత్ తో పగిడి పచాస్). ఈ అవకాశం ఇప్పుడు చేజారిపోతే మళ్లీ ప్రయత్నం చేయవచ్చు. కాని పోయిన ప్రాణాలను తిరిగి తెచ్చుకోలేమని హితవు పలికారు. శాంతి భద్రతలను కాపాడాలన్నా, బందోబస్తూ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నా మానసికంగా, శరీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, అందుకే ఈ పరీక్షలు తప్పనిసరి నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎవరికైతే గుండే, ఊపిరి తిత్తులు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, మూత్రపిండంలో రాళ్లు, రక్తపోటు, చక్కెర, బ్రెయిన్ ట్యూమర్ లాంటి అనారోగ్య సమస్యలుంటే ఐదు కి.మీ. పరుగెత్తనవసరం లేదని, విషయాన్ని ముందే చెప్పాలని, ఒకవేళ మార్గమధ్యలో ఇబ్బందనిపిస్తే పరుగు అక్కడే ఆపేసి వెనకాలే వస్తున్న పోలీసులకు తెలిజేయాలని సూచించారు. వారు వెంటనే వైద్యం సహా యం అందిస్తారన్నారు. బలవంతంగా పరిగెత్తే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తెలిపా రు. ఇదిలాఉండగా ఐదు కి.మీ. దూరాన్ని కేవలం 70 శాతం అభ్యర్థులు మాత్రమే పూర్తిచేస్తున్నారు. దీంతో పరుగు పందెం ప్రారంభించే ముందు అక్కడున్న ైవె ద్యులతో పరీక్షలు నిర్వహించి ఆ తరువాత పంపిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలా చేయడంవల్ల ప్రాణ నష్టాన్ని ముందే అరికట్టవచ్చని రాకేశ్ మారియా కూడా అక్కడ విధు లు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు -
ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం
తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్న కమిషనర్ రాకేశ్ మారియా సాక్షి, ముంబై: పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా స్పష్టం చేశారు. అనేక మంది పోలీసు అధికారులు డిపార్టుమెంట్ వాహనాన్ని సొంత పనుల కోసం ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో మారియా ఈ ప్రకటన చేశారు. నియమాల ప్రకారం వాహనాల వినియోగంపై పోలీసుకు ఎంతమేరకు అధికారాలున్నాయి....? అనే వివరాలను సామాజిక కార్యకర్త అంకుర్ పాటిల్ సమాచార హక్కు చట్టం కింద సేకరించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... పోలీసు అధికారులకు అందజేసిన వాహనాన్ని కేసు దర్యాప్తు పనులకు, సంఘటన స్థలానికి వెళ్లడానికి, శాంతి భద్రతలను కాపాడేందుకు, అత్యవసర సమయంలో తమ పై అధికారుల వద్దకు వెళ్లేందుకు మాత్రమే ప్రభుత్వ వాహనాలను వినియోగించారు. కాని అనేక మంది అధికారులు విధులు పూర్తికాగానే ప్రభుత్వ వాహనాల్లోనే ఇంటికి వెళ్తున్నారు. అంతేకాక కుటుంబ సభ్యుల షాపింగ్‌కు, బంధువుల ఇంటికి వెళ్లేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మరికొందరు అధికారులు వాహనాలను తమ డ్రైవర్లకు అప్పగిస్తున్నారు. ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారు. నగరంలో 93 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. అందులో విధులు నిర్వహించే సీనియర్ అధికారులు ప్రతీ రోజూ కారును ఇంటికి తీసుకెళ్లడం, ఉదయం మళ్లీ తీసుకురావడం వల్ల రోజుకు కొన్ని వేల లీటర్ల ఇందనం, నిర్వహణ ఖర్చు వృథా అవుతోంది. ఇలా ప్రభుత్వ వాహనాలు దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటే ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకోవచ్చని అంకుర్ పాటిల్ అభిప్రాయపడ్డారు. -
ఆదివారం సెలవు తీసుకోవద్దు
సాక్షి, ముంబై: గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపాలని నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా నిర్ణయించారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు ఆదివారం ముంబై పోలీసులెవరూ సెలవు(వీక్లీ ఆఫ్) తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడం, సెలవురోజు కావడంతో నగరవాసు లు షాపింగ్ కోసం మార్కెట్లకు రావడంతో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. దీంతో వారి ఆటకట్టించేందుకు ఆదివారం నగరంలోని ప్రతీ వీధిలో, ప్రధాన మార్కెట్లలో పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయిం చారు. అందుకోసం ఆరోజు పోలీసులు ఎవరూ సెలవు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేశారు. ఆదివారానికి బదులుగా మరోరోజు సెలవు తీసుకోవాల న్నారు. తాము తీసుకుంటున్న చర్యల ఫలితంగా గత 60 రోజుల్లో గొలుసు దొంగతనాల సంఖ్య 60 శాతం తగ్గిందన్నారు. భద్రత మరింత పటిష్టం... నగరంలో భద్రతను మరింత పెంచాల్సి ఉందని కమిషనర్ పేర్కొన్నారు. కేవలం మహిళలకు మాత్రమేకాకుండా రాత్రి వేళ్లలో చీకట్లో ఒంటరిగా వెళ్లే ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకొని భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాత్రి వేళ్లలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుతున్నప్పుడు ఎవరైనా ద్విచక్రవాహనంపై వెంబడిస్తున్నారా? అని గమనించాలని సూచించారు. అయితే అన్ని పోలీస్టే షన్ల అధికారులు ఆదివారం కూడా విధులకు హాజ రై వీధుల్లో నాకాబందీ నిర్వహిస్తున్నారా? లేదా? గమనించాలని, ఏవైనా ఫిర్యాదులుంటే వెంటనే తెలియజేయాలన్నారు. దీంతో చైన్ స్నాచర్లు, దొంగ లు తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదని మారి యా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారాల్లో.. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నాకాబందీ నిర్వహించాల్సిందిగా మారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. 2013లో 2,090 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, గత రెండు నెలలు (మార్చి, ఏప్రిల్)గా వీటి సంఖ్య 60 శాతం మేర తగ్గినట్లు ఆయన తెలిపారు. పోలీసుల సంఖ్య పెంచడం, తరచూ నాకాబందీలు నిర్వహిస్తుండడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ముంబైలో చైన్ స్నాచింగ్ అతిపెద్ద సమస్యగా మారిందని డీసీపీ మహేష్ పాటిల్ అభిప్రాయపడ్డారు. అన్ని పోలీస్టే షన్లు ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసి తరచూ చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, సదరు ప్రాంతాలపై దృష్టి సారించాలని సూచించారు. -
అవినీతి ఖాకీల జాబితా ఇవ్వండి
సాక్షి, ముంబై: అవినీతి ఖాకీల అంతుచూసేందుకు పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా రంగం సిద్ధం చేస్తున్నారు.నగర పోలీసు శాఖలో ఎంతమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు? లంచాలు తీసుకుంటూ ఇప్పటిదాకా ఎంతమంది పట్టుబడ్డారు? తదితర వివరాలతో జాబితాను రూపొందించి తనకు అందజేయాలని సంబంధిత ఉన్నతాధికారులను మారియా ఆదేశించారు. ఆరోపణలు రుజువైనవారిపై కఠిన చర్యలు తీసుకునే విషయమై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే నిర్ణయంలో ఆయన ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు లంచాలు స్వీకరిస్తూ కనీసం ముగ్గురు లేదా నలుగురు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు. ఈ వివరాలు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు ఇటీవలే వెల్లడించారు. దీంతో అన్నిశాఖల అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసుశాఖను కూడా సంస్కరించాలని మారియా భావిస్తున్నారు. ఏసీబీ వెల్లడించిన జాబితాలో పోలీసుశాఖ అగ్రస్థానంలో ఉంది. ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. డిప్యూటీ, అదనపు, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి మొదలుకొని కానిస్టేబుల్, సిపాయిస్థాయి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు ఎవరైనాసరే వారిని జాబితాలో చేర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. టాప్‌టెన్‌లో ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. మొదటిసారి పట్టుబడిన కానిస్టేబుళ్లను హెచ్చరించి వదిలేయాలని, అయినప్పటికీ వారిలో మార్పురాని పక్షంలో బదిలీ లేదా వెంటనే చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనలను ఆయన రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక లంచాలు తీసుకుంటు కానిస్టేబుళ్లు పట్టుబడితే అతడి పైఅధికారి ఇన్స్పెక్టర్ను, ఇన్స్పెక్టర్లు పట్టుబడితే వారి పైఅధికారులను బాధ్యులుగా చేయనున్నారు. పోలీసులు అవినీతికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాకేశ్ మారియా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
అనూహ్య హంతుకుడి అరెస్ట్
- రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన ఆగంతుకుడే ఈ హంతకుడు - చంద్రభాన్ సానాప్ నాసిక్ నివాసి.. గతంలో రైల్వే కూలీ.. పాత నేరస్తుడు సాక్షి, ముంబై/మచిలీపట్నం: తెలుగమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన కేసును ఛేదించామని.. నిందితుడిని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు సోమవారం ప్రకటించారు. నిందితు డు పాత నేరస్థుడని.. అతడి పేరు చంద్రభాన్ సానాప్ అలియాస్ చౌక్యాసుదామ్ సానాప్ (28) అని గుర్తించామన్నారు. భాందూప్ సబర్బన్‌లోని కాంజూర్మార్గ్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ముంబైలోని ఖిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. నిందితుడిని ఈ నెల 15 వరకూ పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్మారియా చెప్పారు. అయితే.. తమ కుమార్తె హత్య కేసును ఛేదించినట్లు ముంబై పోలీసులు కట్టుకథ అల్లుతున్నారని అనూహ్య తండ్రి ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నివాసి అయిన సురేంద్రప్రసాద్ కుమార్తె, ముంబై సబర్బన్ గోరేగావ్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పనిచేస్తున్న ఎస్తేర్ అనూహ్య (23) జనవరి ఐదో తేదీన ముంబై కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) చేరుకున్న అనూహ్య అదృశ్యమై, ఆ తర్వాత శవమై కనిపించిన సంగతి తెలిసిందే. అనూహ్య అదృశ్యమైన 55 రోజుల తర్వాత, ఆమె మృతదేహం లభించిన 45 రోజుల తర్వాత.. సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిన అనుమానితుడిని చంద్రభాన్ సానాప్గా గుర్తించామని.. అతడిని ఆదివారం కంజూర్‌మార్గ్ ఈస్ట్‌లో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడు విచారణలో నేరం అంగీకరించాడన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు వాస్తవానికి కంజూర్‌మార్గ్‌లో స్లమ్ నివాసి. ప్రస్తుతం నాసిక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మఖమలాబాద్లో నివసిస్తున్నాడు. మద్యానికి బానిసై రైల్వేకూలీ బ్యాడ్జిని అమ్మేశాడు. ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ దొంగతనాలు, నేరాలకు పాల్పడుతుండేవాడు. అతడిపై.. ముంబైలోని గావ్‌దేవి పోలీస్‌స్టేషన్‌తో పాటు నాసిక్, మన్మాడ్, ఇటారసీ తదితర రైల్వే పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ట్యాక్సీ అని చెప్పి మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లాడు!: ‘‘చంద్రభాన్ జనవరి నాలుగో తేదీన తన మిత్రులతో కలిసి మద్యం సేవించాడు. ఐదో తేదీ వేకువజామునే కుర్లాలోని ఎల్టీటీకి వచ్చి దొంగతనం చేసేందుకు ప్రయత్నించసాగాడు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న అనూహ్యను చూశాడు. ఆమె అంధేరి వెళ్లనున్నట్లు తెలుసుకుని రూ. 300 చార్జీకి ఆమెను అంధేరిలో దింపుతానని చెప్పాడు. స్టేషన్ వెలుపల పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లాక.. ట్యాక్సీకి బదులు తన మోటారుసైకిల్ మీద అంధేరీ వెస్ట్‌కు తీసుకెళ్లి వదిలిపెడతానని నిందితుడు చెప్పాడు. అనూహ్య తొలుత నిరాకరించారు. అయితే నిందితుడు ఎలాంటి భయం అవసరం లేదంటూ ఆమెకు తన ఫోన్ నెంబరు, మోటర్ సైకిల్ నెంబరు ఇచ్చి ఒప్పించాడు. ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై గల కంజూర్‌మార్గ్ వరకు వెళ్లిన తర్వాత పెట్రోల్ అయిపోయినట్లుందని చెప్పి సర్సీస్ రోడ్డు పైకి బైకును మళ్లించాడు. అక్కడ నిర్జన ప్రదేశంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అనూహ్య తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆమె తలను నేలకేసి కొట్టి, చున్నీ/స్కార్ఫ్‌తో ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌తో ఉన్న బ్యాగ్‌ను తీసుకుని కంజూర్‌మార్గ్‌లోకి వెళ్లాడు. ఆమె వద్ద ఉన్న ఫోన్లో తన సెల్ నెంబరు ఉంటుందని భయపడి మళ్లీ ఘటనా స్థలానికి వచ్చాడు. అయితే ఆమె సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో మోటర్‌సైకిల్‌లోని పెట్రోల్‌ను కొంత తీసి ఆమె జీన్స్‌పై పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. అనంతరం అక్కడి నుంచి కంజూర్‌మార్గ్‌లోని మిత్రుడు నందకిషోర్‌ను కలిసి అతని మోటర్‌సైకిల్ అతనికి ఇచ్చేశాడు. నందకిషోర్‌కు జరిగిందంతా చెప్పి అదే రోజు నాసిక్‌కు వెళ్లిపోయాడు. అనూహ్యకు సంబంధించిన లగేజీని భిక్షాటన చేసే ఓ మహిళకు ఇచ్చేశాడు’’ అని పోలీసులు వివరించారు. దర్యాప్తులో.. నిందితుడి నుంచి హతురాలి ట్రాలీ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కూడా చెప్పారు. అలాగే.. నిందితుడు వినియోగించిన మోటర్ సైకిల్ యజమాని నందకిషోర్ షావును సోమవారం జార్ఖండ్‌లో అదుపులోకి తీసుకుని ముంబైకి తెచ్చామన్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు సుమారు 36 సీసీటీవి ఫుటేజ్‌లను పరిశీలించామని, 2,500 మందిని విచారించామని, ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడి ఆచూకీ కనుగొన్నామని పేర్కొన్నారు. అయితే.. చంద్రభాన్‌ను కేసు దర్యాప్తు మొదట్లోనే రైల్వే పోలీసులు విచారించి అనుమానం వ్యక్తంచేశారని.. దీనిపై కంజూర్‌మార్గ్ పోలీసులు స్పదించలేదని తెలుస్తోంది. ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించినప్పటికీ.. పోలీస్ కమిషనర్ మారియా దాటవేసేందుకు యత్నించారు. కట్టుకథ అల్లారు: అనూహ్య తండ్రి అనూహ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్ అంటూ ముంబై పోలీసులు కట్టు కథ అల్లారని ఆమె తండ్రి సురేంద్రప్రసాద్ ఆరోపించారు. ఆయన సోమవారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్య రైల్వేస్టేషన్ నుంచి గుర్తుతెలియని వ్యక్తితో మోటార్‌సైకిల్‌పై వెళ్లినట్లు చెప్పటం నమ్మశక్యంగా లేదన్నారు. అనూహ్య వద్ద రెండు బ్యాగులు ఉన్నాయని.. ఒకటి పది కిలోల బరువు ఉంటుందని, ల్యాప్‌టాప్ ఉన్న మరో బ్యాగు ఐదు కిలోల బరువు ఉందని.. ఈ రెండు బ్యాగులతో మోటార్‌సైకిల్‌పై వెళ్లటం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. అనూహ్యకు సంబంధించిన బ్యాగు లు, వాటిలోని వస్తువులు, ల్యాప్‌టాప్‌ను ముంబై పోలీసులు ఇంతవరకూ చూపలేదన్నారు. రైల్వేస్టేషన్ సీసీ కెమెరా ఫుటేజీలలో అనూహ్య ఫోన్లో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని.. ఆ సమయంలో ఆమె ఏ నంబరుతో మాట్లాడిందీ.. ఆ నంబరు ఎవరిదీ.. అనే విషయాలు కూడా పోలీసులు వెల్లడించలేదని పేర్కొన్నారు.