లలిత్ మోదీని ఎందుకు కలిశారు? | Maharashtra Government Asks Top Cop Rakesh Maria | Sakshi
Sakshi News home page

లలిత్ మోదీని ఎందుకు కలిశారు?

Published Sun, Jun 21 2015 7:21 PM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

లలిత్ మోదీని ఎందుకు  కలిశారు?

లలిత్ మోదీని ఎందుకు కలిశారు?

ముంబై: మనీ లాండరింగ్ సహా ఇతర ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీని గతేడాది లండన్ లో ముంబై నగర పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా కలవడంపై మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది.  అసలు లలిత్ మోదీని ఎందుకు కలిశారో చెప్పాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం జూలై 17 వ తేదీన మోదీని మారియా కలిసిన సంఘటన ప్రస్తుత్తం అనేక అనుమానాలకు తావిస్తోంది.  దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను ఓ న్యూస్ ఛానల్ విడుదల చేయడంతో మారియా-లలిత్ మోదీల భేటీ అంశం వెలుగు చూసింది.

 

దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇందులో అసంబద్ధతతో కూడిన ఏవైనా కారణాలు ముడిపడి ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement