లలిత్ మోదీతో భేటీపై మహారాష్ట్ర ప్రభుత్వానికి ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా వివరణ ఇచ్చారు.
ముంబై: మనీ లాండరింగ్ సహా ఇతర ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్‌కు పరారైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీతో భేటీపై మహారాష్ట్ర ప్రభుత్వానికి ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా వివరణ ఇచ్చారు. మరియా గతేడాది లండన్‌లో లలిత్ ను కలిసిన విషయం వెల్లడి కావడంతో ప్రభుత్వం ఆయనను వివరణ కోరింది.
మోదీ న్యాయవాది పట్టుబట్టడంతో తాను లలిత్ మోదీని కలిసింది వాస్తవమేనని రాకేశ్ అంతకుముందు అంగీకరించారు. అయితే, తాను లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హోం మంత్రికి ఆ విషయం తెలియజేశానని తెలిపారు. లలిత్ మోదీ, రాకేశ్ మరియా కలిసి ఉన్న ఫొటోను శనివారం తొలుత ఓ టీవీ చానెల్ ప్రసారం చేయడంతో దుమారం రేగింది.