షీనా కేసులో మహారాష్ట్ర కీలక నిర్ణయం | rakesh maria to head sheena bora murder case, says maharashtra government | Sakshi
Sakshi News home page

షీనా కేసులో మహారాష్ట్ర కీలక నిర్ణయం

Published Tue, Sep 8 2015 8:05 PM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM

షీనా కేసులో మహారాష్ట్ర కీలక నిర్ణయం - Sakshi

షీనా కేసులో మహారాష్ట్ర కీలక నిర్ణయం

షీనా బోరా హత్యకేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు ఉన్నట్టుండి పదోన్నతి ఇవ్వడంతో పలు వర్గాల నుంచి అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ఆయనకు డీజీపీగా పదోన్నతి కల్పించడం.. ఈ కేసు నుంచి పక్కకు తప్పించడానికేనా అని అనేకమంది ప్రశ్నలు సంధించారు.

వాటన్నింటికీ మహారాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. హోదా మారినా, పోస్టు మారినా కూడా.. షీనా బోరా హత్యకేసు పూర్తిగా ఓ కొలిక్కి వచ్చేవరకు ఆ కేసు దర్యాప్తు మొత్తం రాకేష్ మారియా సారథ్యంలోనే జరుగుతుందని మహారాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ (హోం వ్యవహారాలు) ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement