
'ఆ కేసు నేను చూడను'
ముంబై: షీనా బోరా హత్యకేసు దర్యాప్తును పర్యవేక్షించబోనని ముంబై పోలీసు కమిషనర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన రాకేశ్ మారియా... ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. 'ముంబై పోలీసు కమిషనర్ గా ఒకరిని(అహ్మద్ జావేద్) నియమించిన తర్వాత సమాన హోదా కలిగిన మరో అధికారితో కేసును పర్యవేక్షించమనడం సమంజసం కాదు. ఇలా చేస్తే ముంబై పోలీసు వ్యవస్థలో కొత్తగా మరో పవర్ సెంటర్ ఏర్పాడే అవకాశముంది. కిందిస్థాయి సిబ్బందికి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది' అని ప్రభుత్వానికి మారియా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముంబై పోలీసు కమిషనర్ హోదాలో షీనా బోరా హత్యకేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించిన మారియాను మహారాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో డీజీపీ ర్యాంకు అధికారి అహ్మద్ జావేద్ ను నియమించింది. దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. షీనా బోరా హత్య కేసు దర్యాప్తు పూర్తయ్యేవరకు మారియా పర్యవేక్షిస్తారని ప్రకటించింది.
అయితే బదిలీ మింగుడు పడకపోవడంతో మారియా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని మారియా తోసిపుచ్చారు.