అంతటి నొప్పిని ఎలా తట్టుకుందో.. కంటతడి పెట్టిస్తున్న కీర్తి సురేష్ మాటలు | Keerthi Suresh Comment Her Friend Health Issue | Sakshi
Sakshi News home page

అంతటి నొప్పిని ఎలా తట్టుకుందో.. కంటతడి పెట్టిస్తున్న కీర్తి సురేష్ మాటలు

Published Tue, Aug 6 2024 9:20 AM | Last Updated on Tue, Aug 6 2024 10:02 AM

Keerthi Suresh Comment Her Friend Health Issue

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌  కీర్తి సురేష్ తన స్నేహితురాలిని గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్‌ అయింది. ఈమేరకు సోషల్‌ మీడియాలో ఆమె ఒక పోస్ట్‌ చేసింది. ఇటీవల బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించిన తన బెస్ట్ ఫ్రెండ్ మనీషా గురించి కీర్తి పలు విషయాలను  పంచుకుంది. తన స్నేహితురాలితో  ఉన్న బంధాన్ని సుదీర్ఘ పోస్ట్‌తో తెలిపింది.  ఆసుపత్రిలో  మనీషాను చూసినప్పుడు ఎలా ఏడ్చిందో గుర్తుచేసుకుంది. అలా తన స్నేహితురాలి గురించి షేర్ చేసిన పోస్టు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

కీర్తి సురేష్ ప్రాణ స్నేహితురాలు మనీషా కొద్దిరోజుల క్రితమే బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయింది. ఇదే విషయాన్ని ఆమె పుట్టినరోజు సందర్భంగా కీర్తి ఇలా గుర్తు చేసుకుంది. ' కొన్ని వారాలుగా నేను చాలా బాధను అనుభవిస్తున్నాను. నా చిన్ననాటి స్నేహితురాలు మనీషా  ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లుతుందని అనుకోలేదు. ఈ సంఘటన నమ్మశక్యంగా లేదు. 21 ఏళ్ల వయసులో తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె గత నెల వరకు దాదాపు 8 ఏళ్ల పాటు పోరాడింది. గతేడాది నవంబర్‌లో ఆమెకు మూడో సర్జరీ జరిగింది. అంతటి బాధను తట్టుకునే శక్తి ఆమెకు ఎలా వచ్చిందో.. అలాంటి సంకల్ప శక్తి ఉన్నవారిని నేను ఇప్పటి వరకు చూడలేదు. 

కానీ ఒక్కోసారి నొప్పిని భరించలేకపోతున్నానంటూ ఆ బాధను తట్టుకుంటూనే కన్నీళ్లు పెట్టుకునేది. ఆ సమయంలో ఆసుపత్రి కారిడార్ వద్ద నేను కూడా ఏడ్చేశాను. కన్నీటితో నిండిన ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఈ ప్రపంచాన్ని వదిలేసి పోయింది.  ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నేను చివరిసారిగా కలిశాను. చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయిన నా స్నేహితురాలు భవిష్యత్‌పై ఎన్నో కలలు కనేది. బతాకాలనే ఆశతో నా మనీషా చివరి శ్వాస వరకు పోరాడింది. కానీ దేవుడు దయ చూపలేదు.  ఆమె దూరమై సరిగ్గా నెలరోజులు అవుతుంది. తన గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదు. మనీషా లేకుండానే తన పుట్టినరోజు జరుపుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.' అని తన ప్రాణస్నేహితురాలి మరణం గురించి  కీర్తి చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement