ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు | Divyanka Tripathi Robbed In Italy Tour; Details Inside | Sakshi
Sakshi News home page

Divyanka Tripathi: ఎంజాయ్ చేద్దామని ఫారెన్ వెళ్తే నటికి చేదు అనుభవం!

Published Fri, Jul 12 2024 9:00 AM | Last Updated on Fri, Jul 12 2024 10:22 AM

Divyanka Tripathi Robbed In Italy Tour; Details Inside

ప్రముఖ నటికి ఫారెన్ ట్రిప్‌లో చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుని, కొన్నిరోజులు ఎంజాయ్ చేద్దామని టూర్‌కి వెళ్తే దొంగలు మొత్తం దోచేశారు. పాస్‌పోర్ట్స్‌తో పాటు డబ్బులు, విలువైన వస్తువుల్ని పట్టపగలే దొంగతనం చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎవరా నటి?

యే హై మొహబత్తీన్ అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి.. ప్రస్తుతం పలు రియాలిటీ షోల్లో నటిస్తూ బిజీగా ఉంది. 2016లో తోటి నటుడు వివేక దహియాని పెళ్లి చేసుకున్న ఈమె.. తాజాగా పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు యూరప్ వెళ్లారు. స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేసిన కొన్ని ఫొటోలని ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: రామ్‌ చరణ్‌ కొత్త కారు.. దేశంలోనే రెండోది.. ఎన్ని కోట్ల ఖరీదంటే?

అయితే ఫ్లోరెన్స్ అనే ఊరిలో ఓ రోజు ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఉండేందుకు ఇల్లు చూసే క్రమంలోనే ఓ చోటుకి వెళ్లి వచ్చే లోపు కారులో ఉన్న పాస్‌పోర్ట్, విలువైన వస్తువులు, డబ్బులని దొంగలు దోచుకున్నారు. దీంతో నటి దివ్యాంకతో పాటు ఆమె భర్త రోడ్డున పడ్డారు. సమీప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో తాము ఏం చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు.

ప్రస్తుతం తాత్కాలిక పాస్‌పోర్ట్స్ పొందే ప్రయత్నంలో దివ్యాంక-ఆమె భర్త ఉన్నారు. దొంగతనం జరిగిన రోజు ఎంబసీకి వెళ్లగా అది మూసి ఉంది. తాజాగా అక్కడికి వెళ్లి తమ పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో తిరిగి వీళ్లిద్దరూ స్వదేశానికి తిరిగి రావొచ్చని సమాచారం.

(ఇదీ చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement