
'డబ్బుకోసం ఏమైనా చేస్తా'
మాన్సా: డ్రగ్స్ బారినపడి కన్నతల్లిని హత్య చేశాడు ఓ మైనర్. మత్తుపదార్థాలకు బానిసగా మారిన అతడు డ్రగ్స్ కొనుగోలుచేసేందుకు డబ్బు ఇవ్వడానికి తల్లి నిరాకరించడంతో అతడు ఇంట్లోని లైసెన్స్డ్ తుపాకీతో కాల్చి చంపాడు. మైనర్ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, తుపాకీని కుమారుడికి అందుబాటులో ఉండేలా ఉంచినందుకు తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చుట్టుపక్కలవారు చెప్పిన ప్రకారం పదహారేళ్లేకే డ్రగ్స్ బానిస అయిన ఆ కుర్రాడు డబ్బులు ఇవ్వాలని ప్రతిరోజు తన తల్లిని వేధించేవాడు. చేయి కూడా చేసుకునేవాడు. ఘర్షణపడని రోజే లేదంట. అంతేకాదు.. డబ్బుకోసం తాను ఎలాంటి దారుణాలైనా చేస్తానని గట్టిగా అరిచిమరి కన్నతల్లిపై కాల్పులు జరిపి కడతేర్చాడట. కడుపులో కాల్పులు జరిపిన అనంతరం పారిపోయి తిరిగి ఇంటికి రాగా పోలీసులు అరెస్టు చేశారు. అతడికి కనీసం 25 ఏళ్లపాటు జైలు శిక్ష వేయాలని ఇరుగుపొరుగు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.