కొడుకు చేతిలో తల్లి హతం | son killed his mother | Sakshi
Sakshi News home page

కొడుకు చేతిలో తల్లి హతం

Published Thu, May 14 2015 9:09 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

కొడుకు చేతిలో తల్లి హతం

కొడుకు చేతిలో తల్లి హతం

రూ.5వేల కోసం ప్రాణం తీశాడు
నడింపల్లిలో ఓ కొడుకు ఘాతుకం

 
అచ్చంపేట రూరల్ : మద్యం తాగేందుకు బానిసగా మారిన ఓ కొడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని విచక్షణారహితంగా కొట్టిచంపాడు. ఈ విషాదకర సంఘటన మంగళవా రం రాత్రి అచ్చంపేట మండలం నడిం పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోడ జంగమ్మ(52)కు కొడుకు గోపాల్, ఇద్దరు కూతుళ్లు ఉన్నా రు. భర్త చెన్నయ్య 25 ఏళ్ల క్రితమే చనిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ ఊళ్లోనే ఉంటుంది.

గోపాల్ భార్యాపిల్లలతో హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుం టూ అక్కడే ఉంటున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో గోపాల్ సెల్‌ఫోన్ దొంగిలించడంతో గమనించి కొందరు చితకబాదారు. 15రోజుల క్రితం నడింపల్లికి వ చ్చాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడం తో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మం గళవారం ఉదయం నుంచి మద్యం తాగుతూనే ఉన్నాడు. రాత్రి ఇంటికొచ్చిన తల్లిని రూ.ఐదువేలు ఇవ్వాలని అడిగాడు. నిరాకరించడంతో తల్లిపై కక్ష పెంచుకున్నాడు.

జంగమ్మ నిద్రిస్తున్న సమయంలో ఇంటిలో ఉన్న కర్రతో తలపై బలంగా బాదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అ క్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గోపాల్ ఇంటినుంచి బయటకు వచ్చి మా అ మ్మకు తలనొప్పిగా ఉందని ఇరుగుపొరు గు వారికి చెప్పాడు. ఇది గమనించిన స్థా నికులు గోపాల్ తల్లిని చంపాడని భావిం చి ఇంటిలో బంధించారు. బుధవారం ఉ దయం పోలీసులకు అప్పజెప్పారు.

మృతురాలి చిన్నకూతురు లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మణిదీప్ తెలిపారు. కాగా, గ్రామంలో వి చ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని, మద్యానికి బానిసైన యువకులు తల్లిదండ్రులను, భార్యలను వేధిస్తున్నారని చర్య లు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement