మీ వెంటే.. మేమంటూ | Massive joinings in YSRCP: Andhra pradesh | Sakshi
Sakshi News home page

మీ వెంటే.. మేమంటూ

Published Wed, Mar 27 2024 5:20 AM | Last Updated on Wed, Mar 27 2024 9:39 AM

Massive joinings in YSRCP: Andhra pradesh - Sakshi

సీఎం సమక్షంలో పారీ్టలో చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య. చిత్రంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, వైఎస్సార్‌సీపీ మైలవరం నేత జ్యేష్ట శ్రీనాథ్‌

సీఎం జగన్‌ సమక్షంలో చేరిన ఏలూరు టీడీపీ పార్లమెంటరీ ఇన్‌చార్జి గోపాల్‌ యాదవ్‌

పార్టీ తీర్థం పుచ్చుకున్న రాజంపేట పార్లమెంటరీ టీడీపీ ఇన్‌చార్జి గంటా నరహరి, జనసేన విజయవాడ ఈస్ట్‌ ఇన్‌చార్జి బత్తిన రాము

మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సైతం చేరిక 

పార్టీలో చేరిన సూళ్లూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి, వెంకటగిరి సీనియర్‌ నేత మస్తాన్‌ యాదవ్‌

పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించడంతో పాటు సమాజంలో సమోన్నత గౌరవాన్ని తీసుకురావడంలో చెరగని ముద్ర వేశారు. రాజకీయ చరిత్రలో ఏనాయకుడు కనీసం ఊహించని విధంగా మేనిఫె­స్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 99 శాతం చిత్తశుద్ధితో అమలు చేసి విశ్వసనీయతకు సరైన నిర్వచనాన్ని ఇచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా టీడీపీ, జనసేన పార్టీల్లోని కార్యకర్తల నుంచి కీలక నేతలు వరకు వైఎస్సార్‌సీపీలోకి చేరికలు వెల్లువెత్తుతు­న్నాయి. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు క్యూ కట్టారు. వీరిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

సీఎం సమక్షంలో చేరిన గోపాల్‌ యాదవ్‌
ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌ మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో తణుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంటరీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ పాల్గొ­న్నారు. మరోవైపు.. రాజంపేట టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి గంటా నరహరి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పీవీ మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య
నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో తుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా, ఏలూరు పార్లమెంటరీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్, వైఎస్సార్‌సీపీ మైలవరం నేత జ్యేష్ట శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

పార్టీ కండువా కప్పుకున్న వేనాటి
సూళ్లూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామ­చంద్రారెడ్డి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం జగన్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ సీవీ మిథున్‌రెడ్డి, సూళ్లూరు­పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌­రెడ్డి, నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారా­య­ణరెడ్డి పాల్గొన్నారు. కాగా.. వెంకటగిరి నియోజ­కవర్గ టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. 

జనసేన లక్ష్మీశివకుమారి చేరిక
పాయకరావుపేటకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, జనసేన నాయకురాలు అంగూరి లక్ష్మీ శివకుమారి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పీవీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.

జై భారత్‌ పార్టీ నుంచి..
జై భారత్‌ నేషనల్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. 
సీఎం సమక్షంలో చేరిన 

విజయవాడ నేతలు
విజయవాడకు చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. గండూరి మహేష్, నందెపు జగదీష్, కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ సెక్రటరీ కోసూరు సుబ్రహ్మణ్యం (మణి), డివిజన్‌ మాజీ అధ్యక్షుడు గోరంట్ల శ్రీనివాసరావు, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తిన రాము వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాశ్‌ పాల్గొన్నారు.

విశాఖ నేతల చేరిక
విశాఖపట్నానికి చెందిన పలువురు సీనియర్‌ నాయకులు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్య­మంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, జనసేన సీనియర్‌ నాయ­కులు జీవీ రవిరాజు, బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అను­రాధకు సీఎం జగన్‌ వైఎస్సార్‌ïసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌­సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, గాజువాక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్, విశాఖ నార్త్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. 


విజయవాడ తూర్పు నేతలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన యలమంచిలి రవి, బత్తిన రాము
లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని సీఎం జగన్‌ కోరారు. మంగళవా­రం నియోజక­వర్గ పార్టీ ఇన్‌చార్జి దేవి­నేని అవినాశ్‌­తో పాటు యలమంచిలి రవి, గత ఎన్నికల్లో జన­సేన తర­ఫున పోటీ చేసిన బత్తిన రాము, ఎంపీ కేశినేని నాని, పార్టీ జిల్లా అధ్య­క్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావులను పిలిపించి జగన్‌ మాట్లా­డారు. అవినాష్‌ అధిక మెజార్టీతో విజ­యం సాధిం­చేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జోష్‌ కొనసాగుతుండగా, సీఎం జగన్‌ను యలమంచిలి రవి, బత్తిన రాము  కలవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక తూర్పులో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎంను కలిసిన వారిలో యలమంచిలి రవి తనయుడు రాజీవ్‌ కూడా ఉన్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ వెంటే మేమంతా..
బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివరావు  
సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరిస్తూ బుధవారం నుంచి బస్సు యాత్ర చేపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ వెంటే మేమంతా సిద్ధ­మని బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నాగిడి సాంబశివరావు ప్రకటించారు. బీసీ సంఘం రాష్ట్ర నేతలు పోనమాల నాగరాజు, వల్లభూని మణికంఠ, వల్లభుని దుర్గాప్రసాద్, సైకం చినబాబు తదిత­రులతో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల సంక్షేమం కొనసాగాలంటే జగన్‌ను మళ్లీ ముఖ్య­మంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభిస్తున్న బస్సు యాత్రలో తామంతా పాల్గొంటామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement