ramachandra reddy
-
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడి వివాహా రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్
-
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహా రిసెప్షన్లో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నేడు వైఎస్సార్ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహా రిసెప్షన్ హాజరయ్యారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కడప చేరుకున్నారు. అనంతరం, వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహా రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. నూతన దంపతులు సుధీర్ కుమార్ రెడ్డి, లక్ష్మి మౌనికలను ఆయన ఆశీర్వదించారు. అక్కడి నుంచి కాసేపట్లో వైఎస్ జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. -
మీ వెంటే.. మేమంటూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించడంతో పాటు సమాజంలో సమోన్నత గౌరవాన్ని తీసుకురావడంలో చెరగని ముద్ర వేశారు. రాజకీయ చరిత్రలో ఏనాయకుడు కనీసం ఊహించని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 99 శాతం చిత్తశుద్ధితో అమలు చేసి విశ్వసనీయతకు సరైన నిర్వచనాన్ని ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా టీడీపీ, జనసేన పార్టీల్లోని కార్యకర్తల నుంచి కీలక నేతలు వరకు వైఎస్సార్సీపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు క్యూ కట్టారు. వీరిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం సమక్షంలో చేరిన గోపాల్ యాదవ్ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గోరుముచ్చు గోపాల్ యాదవ్ మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో తణుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంటరీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ పాల్గొన్నారు. మరోవైపు.. రాజంపేట టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి గంటా నరహరి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పీవీ మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో తుని వైఎస్సార్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా, ఏలూరు పార్లమెంటరీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్, వైఎస్సార్సీపీ మైలవరం నేత జ్యేష్ట శ్రీనాథ్ పాల్గొన్నారు. పార్టీ కండువా కప్పుకున్న వేనాటి సూళ్లూరుపేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సీవీ మిథున్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. కాగా.. వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. జనసేన లక్ష్మీశివకుమారి చేరిక పాయకరావుపేటకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, జనసేన నాయకురాలు అంగూరి లక్ష్మీ శివకుమారి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పీవీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. జై భారత్ పార్టీ నుంచి.. జై భారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం సమక్షంలో చేరిన విజయవాడ నేతలు విజయవాడకు చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గండూరి మహేష్, నందెపు జగదీష్, కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ కోసూరు సుబ్రహ్మణ్యం (మణి), డివిజన్ మాజీ అధ్యక్షుడు గోరంట్ల శ్రీనివాసరావు, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి బత్తిన రాము వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాశ్ పాల్గొన్నారు. విశాఖ నేతల చేరిక విశాఖపట్నానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, జనసేన సీనియర్ నాయకులు జీవీ రవిరాజు, బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధకు సీఎం జగన్ వైఎస్సార్ïసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, గాజువాక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, విశాఖ నార్త్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన యలమంచిలి రవి, బత్తిన రాము లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని సీఎం జగన్ కోరారు. మంగళవారం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవినేని అవినాశ్‌తో పాటు యలమంచిలి రవి, గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన బత్తిన రాము, ఎంపీ కేశినేని నాని, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావులను పిలిపించి జగన్ మాట్లాడారు. అవినాష్ అధిక మెజార్టీతో విజయం సాధించేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జోష్ కొనసాగుతుండగా, సీఎం జగన్‌ను యలమంచిలి రవి, బత్తిన రాము కలవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక తూర్పులో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎంను కలిసిన వారిలో యలమంచిలి రవి తనయుడు రాజీవ్ కూడా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ వెంటే మేమంతా.. బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివరావు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరిస్తూ బుధవారం నుంచి బస్సు యాత్ర చేపడుతున్న సీఎం వైఎస్ జగన్ వెంటే మేమంతా సిద్ధమని బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నాగిడి సాంబశివరావు ప్రకటించారు. బీసీ సంఘం రాష్ట్ర నేతలు పోనమాల నాగరాజు, వల్లభూని మణికంఠ, వల్లభుని దుర్గాప్రసాద్, సైకం చినబాబు తదితరులతో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల సంక్షేమం కొనసాగాలంటే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభిస్తున్న బస్సు యాత్రలో తామంతా పాల్గొంటామన్నారు. -
వేనాటి రాజీనామా తో భూస్థాపితం ఐన టీడీపీ కంచుకోట
-
భారీ మెజారిటీతో మళ్లీ గెలుదాం
-
టీడీపీకి సీనియర్ నేత రాజీనమా..
-
వైఎస్ కుటుంబాన్ని చీల్చిన దుర్మార్గుడు చంద్రబాబు: పెద్దిరెడ్డి
-
అల్ప సంఖ్యాకులకు అగ్రపీఠం
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీలకు అండగా నిలుస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 50,07,259 మంది మైనార్టీలకు రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో డీబీటీ ద్వారా రూ. 12,366.91 కోట్లు, నాన్‌డీబీటీ ద్వారా రూ. 10,801.02 కోట్లు అందించింది. స్వతంత్ర భారతదేశంలో మైనార్టీలను ఓటు బ్యాంకు కోసమే వినియోగించుకున్నారు. కానీ మైనార్టీ సంక్షేమం కోసం గతంలో వైఎస్సార్, ఇప్పుడు జగన్ మాత్రమే కృషి చేశారు. మైనార్టీ సంక్షేమమంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరే. సీఎం వైఎస్ జగన్ కూడా మైనార్టీల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీల కోసం రూ. 2,665 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ ప్రభుత్వం 50 నెలల్లో రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసి, గత ప్రభుత్వం కంటే 10 రెట్లు అధికంగా నిధులు వెచ్చించింది. – డిప్యూటీ సీఎం అంజద్ బాషా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయండి ప్రభుత్వం మైనార్టీల కోసం 38 పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో ఇమామ్‌లు, మౌజమ్‌లకు, పాస్టర్లకు ఎలాంటి గుర్తింపుగాని, గౌరవ వేతనంగాని ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ అందరితోపాటు మైనార్టీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా చేశారు. పీలేరు చుట్టుపక్కల మైనార్టీ బాలికలు చదువుకునేందుకు దూరంలో ఉన్న కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. దాంతో చాలామంది చదువును మధ్యలోనే మానేస్తున్నారు. పీలేరులో మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ప్రారంభిస్తే వారికి మేలు జరుగుతుంది. – చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే విద్యా సంస్కరణల్లో మనమే మేటి ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి ప్రాధాన్య అంశాల్లో విద్య మొదటి స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నాం, విద్యార్థులకు టోఫెల్ బోధనకు కూడా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నాం. గతంలో అక్షరాస్యతపై అంటే కేరళ గుర్తుకువచ్చేది. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి సైతం ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారంటే మనం ఎంత ప్రగతి సాధించామో తెలుస్తుంది. మూడో విడత నాడు–నేడులో రూ. 8 వేల కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్స్ ఇవ్వనున్నాం. ప్రభుత్వ బడుల్లో సీబీఎస్సీ అమలుతో ఆ బోర్డు మన రాష్ట్రంలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యలో రూ. 15,600 కోట్ల నిధులను విద్యాదీవెన, వసతి దీవెన కింద ఖర్చు చేశాం. ఇంజినీరింగ్ చదువుతున్న 1.69 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నాం. వర్సిటీల్లో 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 3,268 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు విదేశీ వర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ కూడా అందించనున్నాం. దీనివల్ల మన విద్యార్థులకు అంతర్జాతీయంగా అవకాశాలు వేగంగా పొందుతారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించేందుకు కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. – మంత్రి బొత్స సత్యనారాయణ ఏజెన్సీ పాఠశాలలకు అధిక నిధులివ్వండి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ వంటివి మన విద్యారంగం గతిని మార్చాయి. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్‌ను బాగుచేస్తున్నారు. ఇందులో గిరిజన నియోజకవర్గాల్లో 1,400 స్కూళ్లు కూడా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 1,000 సింగిల్ టీచర్ పాఠశాలలకు భవనాలు లేవు. నాడు–నేడు కింద భవనాలు నిర్మిస్తే గిరిజన పిల్లలకు మేలు జరుగుతుంది. అదనపు గ్రాంట్ మంజూరు చేసి భవనాలు నిరి్మంచాలి. గతంలో ఆశ్రమ స్కూల్స్‌లో హెల్త్ వలంటీర్లు ఉండేవారు. రాత్రివేళ ఆయా పిల్లలకు ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు హెల్త్ వలంటీర్లను నియమించాలి. – నాగులపల్లి ధనలక్ష్మి , రంపచోడవరం ఎమ్మెల్యే విద్యలో విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో ఇటు తల్లిదండ్రులకు, అటు విద్యార్థులకు మేలు జరిగేలా అనేక పథకాలను సీఎం ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు కూడా మంజూరు చేశారు. మా నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ కాలేజీలు వచ్చాయి. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో ఎంపీపీ స్కూల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. నిడదవోలు టౌన్లో అంతర్భాగమైన లింగంపల్లి గ్రామం.. టౌన్‌కు దూరంగా ఉంది. ఇక్కడి స్కూల్‌ను మెర్జింగ్ చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూల్‌ను డీమెర్జింగ్ చేయాలి. – జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే మన విద్యార్థుల అంతర్జాతీయ ఖ్యాతి నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ నిర్ణయాలతో విద్యారంగం మెరుగుపడింది. మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌ను తీసుకువచ్చాం. అయితే ఉత్తమ ఫలితాలు రావాలంటే వాటిలో బోధకులకు శిక్షణ ఇవ్వాలి. సీఎం లక్ష్యం నెరవేరాలంటే శిక్షణ, బోధనపై పూర్తి అజమాయిషీ అవసరం. దీనికోసం సరైన కార్యాచరణ రూపొందించాలి. – డాక్టర్ ఎం.జగన్మోహన్రావు, నందిగామ ఎమ్మెల్యే పాఠశాలల్లో పిల్లలకు డైనింగ్ ఏర్పాటు చేయండి గత ప్రభుత్వం విద్యను వ్యాపారం చేయడంతో పేద కుటుంబాలు అక్షరానికి దూరమయ్యాయి. ఇప్పుడు సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాల ద్వారా 42 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టించారు. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్‌ను బాగుచేస్తున్నారు. సీబీఎస్సీ సిలబస్, బైలింగువల్ బుక్స్, పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసేందుకు పిల్లలకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలి. దీనికి స్కూల్లో ఓ గదిని కేటాయిస్తే మంచిది. విద్యారంగంలో మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. – కిలారి వెంకట రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే ఏపీలో బెస్ట్ విద్యా వ్యవస్థ ఉంది రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి నాడు–నేడు విధానాలు పరిశీలించేందుకు తెలంగాణ అధికారులు ఇక్కడకు వస్తున్నారు. చాలా స్కూల్స్‌లో ప్లస్ 2 అందుబాటులోకి తెచ్చాం. అయితే, టీచర్లకు సరైన శిక్షణ లేదని తల్లిదండ్రుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. దీనిపై అధికారులు, మంత్రులు దృష్టిపెట్టి, ఇంటర్ బోధించేవారికి శిక్షణ ఇవ్వాలి. నైపుణ్యం ఉన్నవారికే ఆ స్కూల్స్‌లో బోధనా అవకాశం ఇవ్వాలి. దీంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో విశాలమైన మైదానాలు ఉన్నాయి. స్పోర్ట్స్‌ను కూడా ప్రోత్సహించాలి. అన్ని స్కూళ్లలోను పీఈటీలను నియమించాలి. – సామినేని ఉదయభాను, జగ్గయ్యపేట ఎమ్మెల్యే విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్ పెంచండి స్వతంత్ర భారత చరిత్రలో విద్యలో ఇన్ని సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఆరు, ఏడు తరగతులకు రీడింగ్ స్కిల్స్ తక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తిచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప నైపుణ్యం పెంపుపై దృష్టి పెట్టలేదు. ఆరు నుంచి 8 తరగతులకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఇస్తే రెండేళ్లలో అద్భుతంగా రాణిస్తారు. దీంతోపాటు అన్ని స్కూళ్లకు వాచ్మెన్లను నియమించాలి. – కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే -
పుంగనూరు విధ్వంసం కేసుల్లో చల్లా బాబుకు లభించని ఊరట
సాక్షి, అమరావతి/మదనపల్లె: చిత్తూరు జిల్లా పుంగనూరులో సాగించిన విధ్వంసంపై పోలీసులు నమోదు చేసిన వివిధ కేసుల్లో కీలక నిందితుడుగా ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు)కు హైకోర్టులో పూర్తిస్థాయి ఊరట లభించలేదు. అన్నీ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏడు కేసులకు గాను మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ మూడింటిలో చల్లా బాబు పాత్రపై నిర్దిష్ట ఆరోపణలున్న నేపథ్యంలో అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయట్లేదని స్పష్టం చేసింది. మిగిలిన నాలుగు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 4 కేసుల్లో చల్లా బాబు పాత్రపై ఎలాంటి నిందారోపణలు లేవని, అందువల్ల అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. 10 రోజుల్లోపు పుంగనూరు పట్టణ పోలీసుల ముందు లొంగిపోవాలని ఆయన్ను ఆదేశించింది. రూ.లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. కాగా, బెయిల్‌పై విడుదలైన తరువాత నాలుగు వారాలపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని చల్లా బాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. పుంగనూరు విధ్వంసంపై పోలీసులు తనపై నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చల్లా బాబు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా.. వీటిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ సురే‹Ùరెడ్డి ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. వీటిపై సోమవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరించారు. అంగళ్లు కేసులో.. చంద్రబాబు యుద్ధభేరి పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు సృష్టించిన విధ్వంసంపై పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఆ పార్టీ నేత దేవినేని ఉమా, పీలేరు టీడీపీ ఇన్చార్జ్ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, పులివర్తి నానిలకు హైకోర్టు ఊరటనిచ్చింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 10 రోజుల్లోపు ముదివేడు పోలీసుల ముందు లొంగిపోవాలని ఉమా తదితరులను హైకోర్టు ఆదేశించింది. రూ.లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలంది. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాక 4 వారాలపాటు అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టకూడదని ఆదేశించింది. అలాగే నాలుగు వారాలపాటు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని తేలి్చచెప్పింది. దర్యాప్తులో జోక్యం చేసుకోవడం గానీ, సాక్ష్యాలను తారుమారు చేయడం గానీ చేయరాదంది. ఈ మేరకు జస్టిస్ సురే‹Ùరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులకు బెయిల్ నిరాకరణ పుంగనూరు, అంగళ్లులో 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్లు, పోలీసులపై దాడి కేసులో నిందితుల తరఫున బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీకి షాక్ తగిలింది. విధ్వంసకాండలో పాల్గొన్న 120 మంది నిందితుల తరఫున దాఖలు చేసిన అన్ని రెగ్యులర్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లను మదనపల్లె రెండో ఏడీజే కోర్టు తిరస్కరించింది. టీడీపీ నాయకులకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా టీడీపీ నేతల తరఫున పిటిషన్లు దాఖలు కాగా.. వీటిపై ఈ నెల 24న మదనపల్లె రెండో ఏడీజే కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. టీడీపీ నాయకులు దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు ఇచ్చింది. -
పుంగనూరు ఘటనపై దుష్ప్రచారం
అనంతపురం సిటీ: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఇటీవల జరిగిన ఘటనపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, ఎల్లోమీడియా కలిసికట్టుగా దుష్ప్రచారానికి ఒడిగట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి చంద్రబాబు విన్నవించిన అంశంపై స్పందించాలని ఓ విలేకరి అడగ్గా.. మంత్రి మాట్లాడుతూ ఈ ఘటన చంద్రబాబు నీచ సంస్కృతికి నిదర్శనమని చెప్పారు. పుంగనూరులో ఏం జరిగిందో ప్రజలంతా చూశారన్నారు. ఆ ఘటనను వైఎస్సార్సీపీకి ఆపాదించడం తగదని చెప్పారు. చంద్రబాబుకు మద్దతుగా ఎల్లోమీడియా కూడా పదేపదే అబద్ధాలు ప్రసారం చేయడం మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. టీడీపీ రాసిచ్చే స్క్రిప్ట్ ప్రకారం పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తన పాలనలో సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వనంటూ ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే సీబీఐ విచారణ కోరడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. -
సీఆర్ఆర్ మరణం తీరని లోటు!
ఆదిలాబాద్: మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి మర ణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు తీరని లో టని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. శనివారం సీఆర్ఆర్ నివాసంలో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం ఎంపీ మాట్లాడుతూ, సీఆర్ఆర్ మరణం తనను దిగ్బ్రాంతికి గురిచేందన్నారు. ఆదివాసుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి పోయారని తెలిపారు. రాజకీయాలు శాశ్వతం కాదని, చేసిన అభివృద్ధి పనులు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. బోథ్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఆదివాసీల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి మరవలేనిదని కొనియాడారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రమణ, డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, జెడ్పీటీసీ మల్లెపూల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు నరేష్ జాదవ్, తదితరులున్నారు. -
సీఎం కేసీఆర్‌కు రామచంద్రారెడ్డి రాజకీయ గురువు
దుబ్బాకటౌన్: తొలితరం కమ్యూనిస్టునేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సోలిపేట రామచంద్రారెడ్డిని 70 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు వరించాయి. మట్టిమనుషులతో కలిసి తిరిగిన జమీన్ లీడర్‌గా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రజల మేలు కోసం పరితపించే సిసలైన నాయకుడు. స్థానిక సంస్థల దగ్గరి నుంచి విదేశీ విధానాల వరకు ప్రత్యక్ష అవగాహన కలిగిన నేతగా పేరుంది. ఇప్పుడు గొప్పగా చెప్పకుంటున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నూతనచట్టాలపై కొన్ని దశాబ్దాల కిత్రమే రామచంద్రారెడ్డి ఎలుగెత్తి చాటిన విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. రామచంద్రారెడ్డి అనార్యోగంతో హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామమైన చిట్టాపూర్‌తోపాటు, ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ● ఎమ్మెల్యేగా పనిచేసే కాలంలోనే రామచంద్రారెడ్డి దొమ్మాట నియోజకవర్గపరిధిలో వ్యవసాయం, రోడ్ల అభివృద్ధికి విశేష కృషి చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడవెల్లివాగుపై చెక్ డ్యాంలు నిర్మించేందుకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించారు. ● రామచంద్రారెడ్డి వాలీబాల్ ప్లేయర్. బాల్యంలో తోటి స్నేహితులతో కలిసి వాలీబాల్ బాగా ఆడేవారని చిట్టాపూర్వాసులు గుర్తుచేసుకుంటు న్నారు. ● పుస్తక పఠనం ఆయనకు ఎంతో ఇష్టం. వారంలో నాలుగు రోజులు లైబ్రరీలో గడిపేవారు. ఎనిమిదిపదుల వయస్సులోనూ రోజు నాలుౖ గెదు దినపత్రికలు చదివేవారు. సాహిత్య కార్య క్రమాలకు ఎవరు ఆహ్వానించినా తప్పకుండా వెళ్లేవారు. సొంతూరి నుంచే... దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో మాలిపటేల్ సోలిపేట గాలిరెడ్డి– సుందరమ్మ దంపతులకు 1935లో రామచంద్రారెడ్డి జన్మించారు. సొంతూరిలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆపై సిద్దిపేటలో పదోతరగతి వరకు చదివారు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ సిటీకాలేజీలో చదివారు. ఈ సమయంలోనే 1951లో సిటీ కాలేజీకి స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. అప్పుడే జరిగిన పరిణామాలతో అతడిలో కమ్యూనిజం బీజాలు మొలకెత్తాయి. దీంతో చదువుకు స్వస్తి చెప్పి స్వగ్రామానికి వచ్చాడు. ● చిట్టాపూర్ మొట్టమొదటిసర్పంచ్గా 1955లో ఎన్నికై 1964 వరకు అదే పదవిలో కొనసాగారు. ● 1964 నుంచి దుబ్బాక సమితి ప్రెసిడెంట్‌గా, 1970–72 వరకు సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ● 1972లో దొమ్మాట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ● 1978 నుంచి మెదక్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేశారు. ● 1988 –89లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ● 1996 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యు డిగా, రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా, రాజ్య సభ అస్సూరెన్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ● ఉమ్మడి మెదక్‌కు కాంగ్రెస్, టీడీపీల తరఫున పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ● ఇండియా –చైనా మిత్రమండలి అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ● సీఆర్ ఫౌండేషన్ తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టుతో ఇతర సంస్థలకు సభ్యుడిగా సేవలు అందించారు. ● లోక్‌సత్తాలో సైతం పనిచేసి అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. ● గత కొన్నేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ● మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో మొదలుకొని, మాజీ సీఎంలు చెన్నారెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. నక్సల్స్ ఇంటిని పేల్చడంతో కలత ప్రగతిశీల వామపక్ష భావాలతో ఉండే రామచంద్రారెడ్డి గ్రామంలోని దళితులు, వెనుకబడిన కులాల వారిని ఎంతగానో ప్రోత్సహించారు. గ్రామంలో సమానత్వం తీసుకొచ్చే సమయంలోనే నక్సలైట్ ఉద్యమం మొదలైంది. అప్పటికే జిల్లాలో చాలా నక్సలైట్ గ్రూపులు ఉండేవి. భూస్వాములు, రాజకీయ నేతలను టార్గెట్ చేసి వారి ఇళ్లు పేల్చేవారు. 1997లో రామచంద్రారెడ్డి పుట్టిపెరిగిన ఇంటిని నక్సలైట్లు పేల్చివేయడంతో తీవ్రంగా కలత చెందాడు. దీంతో కొంతకాలం ఆయన స్వగ్రామానికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. నక్సలైట్ల దాడిలో ఇంట్లోని విలువైన ఫొటోలు, పుస్తకాలు, చిన్నతనంలోని జ్ఞాపకాలు కాలి బూడిద అయ్యాయని చాలా బాధపడ్డారు. పేదలు, ఎస్సీలు కోసం తనకున్న 20 ఎకరాలకు పైగా భూమి ఇస్తే..నక్సల్స్ ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి అప్పుడు నక్సల్ వివరణ ఇస్తూ రామచంద్రారెడ్డి టీడీపీలో ఉన్నందునే ఇంటిని పేల్చామన్నారు. సినారెతో బంధుత్వం ప్రముఖకవి, రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డితో రామచంద్రారెడ్డికి దగ్గరి బంధుత్వం ఉంది. రామచంద్రారెడ్డి అమ్మమ్మ ఊరు మరిగడ్డ, సినారే స్వగ్రామం హన్మాజీపేట పక్కపక్క గ్రామాలే. ఇస్కస్ తదితర అభ్యుదయ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వీరిద్దరికి మంచి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే 1986లో సినారే నాలుగో కుమార్తె కృష్ణవేణిని రామచందారెడ్డి పెద్ద కుమారుడు (రాష్ట్ర గ్రామీణ బ్యాంకుల అసోషియేషన్ అధ్యక్షుడు) వెంకటేశ్వర్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేయడంతో ఇద్దరు వియ్యం అందుకున్నారు.1996 నుంచి 2002 వరకు రామచంద్రారెడ్డి, సినారె ఒకే సమయంలో రాజ్యసభ సభ్యులుగా కొనసాగడం మరో విశేషం. కేసీఆర్‌కు రాజకీయగురువు ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు రామచంద్రారెడ్డి రాజకీయ గురువు. సీఎం స్వగ్రామమైన చింతమడక దుబ్బాక సమితి పరిధిలోనే ఉండేది. సమితి ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యేగా రామచంద్రారెడ్డి గెలుపొందినప్పటి నుంచి కేసీఆర్ తరచు కలిసేవారు. 1988లో టీడీపీ నాయకులకు రామచంద్రారెడ్డి నేతృత్వంలో రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి రామచంద్రారెడ్డి వరుసకు సోదరుడు అవుతాడు. రామలింగారెడ్డి, రామచంద్రారెడ్డిల తాతలు అన్నదమ్ముళ్లు. రామలింగారెడ్డి మృతి చెందినప్పుడు చిట్టాపూర్‌కు వచ్చి రామచంద్రారెడ్డి కంటతడి పెట్టారు. -
జై కొట్టిన టీచర్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి/ చిత్తూరు కలెక్టరేట్/సాక్షి ప్రతినిధి, అనంతపురం :రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించింది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల ఆధిక్యంతో ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహరెడ్డి మూడో స్థానంలో నిలవడం గమనార్హం. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1043 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిపై ఘన విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో.. విభజన తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 13న ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. ఓట్ల లెక్కింపును గురువారం ప్రారంభించింది. పశ్చిమ రాయలసీమలో.. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ స్థానానికి 25,272 ఓట్లు పోలయ్యాయి. నిబంధనల మేరకు ఓట్లు వేయకపోవడంతో లెక్కింపు సమయంలో 3,867 ఓట్లు చెల్లకుండా పోయాయి. తర్వాత మిగతా ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి మంచి ఆధిక్యం చాటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి 8,846 ఓట్లు వచ్చాయి. ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 6,853 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి 4,162 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి ఎవరూ 50 శాతం ఓట్లను సాధించకపోవడంతో.. తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను ఒక్కొక్కరిని తొలగిస్తూ.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. లెక్కింపు ముగిసే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు రాగా.. ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 10,618 ఓట్లు వచ్చాయి. అప్పటికీ 50 శాతం ఓట్లు సాధించక పోవడంతో ఎన్నికల సంఘం అనుమతితో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ ప్రకటించారు. తూర్పు రాయలసీమలో.. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ స్థానానికి నిర్వహించిన పోలింగ్‌లో 24,291 ఓట్లు పోలయ్యాయి. 2,356 ఓట్లు చెల్లలేదు. మిగతా ఓట్లలో మొదటి ప్రాధాన్యతలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 10,892 ఓట్లు సాధించారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డికి 8,908 ఓట్లు వచ్చాయి. ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో తక్కువ ఓట్లు వచ్చిన ఆరుగురు అభ్యర్థులను వరుస క్రమంలో తొలగిస్తూ.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి 11,714 ఓట్లు, టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డికి 10,671 ఓట్లు వచ్చాయి. దాంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1,043 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారని రిటర్నింగ్ అధికారి హరినారాయణన్ ప్రకటించారు. కాగా, చిత్తూరు, అనంతపురంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద తుది ఫలితం వెల్లడికాగానే వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి సంతోషం వ్యక్తపరిచారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ విజయం టీచర్ల సమస్యల పరిష్కారానికి దోహదం తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా తాము మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపొందడంపై ఉద్యోగ సంఘాల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు శ్రీధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం వారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ఏపీ జీఈఎఫ్, వైఎస్సార్సీపీ, పీఆర్టీయూ ఏపీ అపుస్మా, వైఎస్సార్‌టీఎఫ్ తదితర 36 సంఘాల మద్దతుతో పోటీ చేసిన తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ అధికార పార్టీ అభ్యర్థులు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, ఎం. వి.రామచంద్రారెడ్డి గెలుపు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సుల వల్లే సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ విజయం దోహద పడుతుందని చెప్పారు. వారధిగా పనిచేస్తా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతోనే గెలుపొందాను. ప్రభుత్వానికి, ప్రభుత్వ.. ప్రైవేట్ ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. విద్యా రంగం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. – ఎంవీ రామచంద్రారెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీచర్ల పక్షాన ఉంటా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విద్యా రంగ అభివృద్ధే నన్ను ఎమ్మెల్సీని చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్ల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో విద్యాభివృద్ధి జరుగుతోంది. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
తెరపైకి వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం
తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి జీవితాన్ని ప్రముఖ దర్శకుడు నీలకంఠ తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ) నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబా భావే పేదలకు భూ పంపిణీ కోసం అడగ్గానే ప్రథమ భూదాతగా వంద ఎకరాల భూమిని వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన ఆయన జీవిత కథతో సినిమా తెరకెక్కించనున్నాం. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయాలనుకున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: తోలుపునూరి కృష్ణగౌడ్, గడ్డం రవికుమార్. -
‘పంచాయతీ’లో విజయం మాదే
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఉదారంగా ఆలోచించి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చారని.. దాని ప్రకారం ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఎన్నిక ఏకగ్రీవమైన పంచాయతీలకు రెండు వేల వరకూ జనాభా ఉంటే రూ.5 లక్షలు, ఐదు వేల జనాభా ఉంటే రూ.10 లక్షలు, 10 వేల పైన జనాభా ఉంటే రూ.15 లక్షలు, ఆ పైన జనాభాను బట్టి రూ.20 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయని, గ్రామీణ ప్రజలంతా ఏకమై ఏకగ్రీవం చేసుకోవాలన్నారు. ఈ సారి చట్టంలో మార్పులు చేసి ధనం, మద్యం, డబ్బు, ప్రలోభాలతో ఎవరైనా ఎన్నికైతే అనర్హుల్ని చేయడమే కాకుండా రెండేళ్ల వరకూ శిక్ష పడేలా చట్టంలో మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ ప్రజలు గమనించి శాంతియుతంగా ఎన్నికలకు వెళదామనే ఆలోచన చేయాలన్నారు. కేంద్రానికి లేఖ రాస్తున్నాం సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం మేరకు కేంద్రానికి లేఖ రాస్తున్నామని చెప్పారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తరువాత కొంత అబ్జర్వేషన్ చేయాల్సిన పరిస్ధితి ఉందని, ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ఏ విధంగా చేయాలి, ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే విషయాలను లేఖ ద్వారా కేంద్రానికి తెలియజేస్తామన్నారు. కేంద్రం నుంచి వచ్చిన సమాధానం మేరకు ముందుకెళతామని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ తాపత్రయమని, ప్రజల భద్రత తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. -
కొండా రెడ్డి బెదిరింపుల కేసు: నిందితుడికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: సినిమా పంపిణీదారుడు శివ గణేష్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి దౌర్జన్యం చేసిన కేసులో నిందితుడు రామచంద్రారెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. ఈయన కొండారెడ్డి, శివగణేష్‌ల మధ్యవర్తిగా ఉన్నారు. శివగణేష్‌ను బెదిరించిన కేసులో రామచంద్రారెడ్డి మూడవ నిందితుడిగా ఉన్నాడు. కాగా.. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొండారెడ్డి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాధితుడు శివ గణేష్‌కు కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ బెదిరింపు కాల్స్ వస్తుండటం గమనార్హం. ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డిపై కేసు నమోదైంది. డిస్ట్రిబ్యూటర్ శివగణేష్‌ను బెదిరించిన కేసులో బంజారాహిల్స్ పీఎస్‌లో కొండారెడ్డిపై కేసునమోదు చేశారు. ప్రొద్దుటూరు నుంచి తండ్రి వరదరాజులరెడ్డి హైదరాబాద్ వచ్చారు. కొండారెడ్డి, అతని అనుచరుల కోసం గాలింపు కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో భాగంగా కొండాపూర్‌లోని రవిరెడ్డి విల్లాలో బంజారాహిల్స్ పోలీసులు తనికీలు నిర్వహించారు. కాగా.. కొండారెడ్డి, రవిరెడ్డి, రామచంద్రారెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడైన కొండారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. (తుపాకులతో టీడీపీ నేత కుమారుడి హల్చల్) -
కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కరోనా భయం ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో శుక్రవారం రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మియాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి మియాపూర్‌లోని న్యూసైబర్ హిల్స్‌లో కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే తనకు కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న భయంతో రామచంద్రారెడ్డి తన ఇంట్లోని బెడ్రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా బెడ్రూంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తన వల్ల ఇంట్లో ఉన్న కుటుంబసభ్యలుకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్యహత్యకు పాల్పడుతున్నట్లు రామచంద్రారెడ్డి సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘సభలో కేసీఆర్ మా నోరు నొక్కుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఈ రోజు నుంచి ఆసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్లకార్టు ప్రదర్శనతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు ఎమ్మెల్సీ రామచంద్రారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారని, కేసీఆర్‌కు దమ్ముంటే తమకు సభలో సమయం ఇవ్వాలన్నారు. ఎంఐఎంకు ఎంత సమయం ఇస్తున్నారో తమకు అంతే సమయం ఇవ్వాలన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని, డబుల్ బెడ్రూం, టీజర్లు, రైతుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతామని పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ రామచంద్రారావు మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎన్పై వాయిదా తీర్మాణం పెట్టామని, దానిపై చర్చ జరగాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పీఆర్పీ, ఐఆర్ సమస్యలపై ఉభయ సభల్లో గళవ విప్పుతామన్నారు. అంతేగాక నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డిలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ లోపలికి ప్రవేశించారు. -
దొడ్డీదారిన మండలికి వచ్చి ప్రజానిర్ణయాలను అడ్డుకుంటున్నారు
-
చంద్రబాబు.. రాష్ట్రానికి శనిబాబు
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలు చేస్తున్నారని రాయదుర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. రాజకీయంగా ఎదర్కొనే దమ్ములేక వైఎస్సార్సీపీ నేతలను చంపతున్నారని విమర్శించారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌ను చంపాలని చూశారని, ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి ని హత్య చేయించారని ఆరోపించారు. వైఎస్ జగన్ తాత రాజారెడ్డిని హత్య చేయించింది కూడా చంద్రబాబే అన్నారు. రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాస్ రూ.600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చద్రబాబు రాష్ట్రానికి శనిబాబులా తయారయ్యారని ఎద్దేవా చేశారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు హాంద్రీనీవా నీరు ఇప్పటి వరకు తీసుకురాలేదన్నారు. సామాన్యులకు టికెట్ కేటాయించన ఘనత జగన్‌దే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లో బీసీలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని అనంతపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య అన్నారు. వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసించారు. ఆర్థిక బలంలేని తనలాంటి సామాన్యులకు టిక్కెట్లు కేటాయించన ఘనత వైఎస్ జగన్‌కే చెందుతుందన్నారు. వెనుకబడిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. (నేనున్నాననే భరోసా ఇస్తున్నా: వైఎస్ జగన్) -
వేదికపైనే తన్నుకున్న రెండు వర్గాలు
-
పిడిగుద్దులతో కాంగ్రెస్ కార్యకర్తల యుద్ధం
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. బుధవారం పట్టణంలోని గాయత్రి గార్డెన్లో నిర్వహించిన ఆదిలాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కాలర్లు పట్టుకున్నారు. సమావేశంలో మొదట కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి వర్గీయుడైన నదీమ్‌ఖాన్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్‌ఖాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడంతో వేదిక ముందు కూర్చున్న సాజిద్‌ఖాన్ వర్గీయులు కొంతమంది ఆయనపై దాడికి దిగారు. కాలర్లు పట్టుకొని బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేదికపై ఉన్న మాజీ మంత్రి సీఆర్ఆర్, గండ్రత్ సుజాత, సాజిద్‌ఖాన్ నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఏ సమావేశంలోనైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగడం శరమామూలేనని పలువురు చర్చించుకున్నారు. డబ్బులు పంచి.. ట్యాంపరింగ్‌తో గెలిచారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయడంతోపాటు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంతోనే గెలుపు సాధించిందని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేశ్‌జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి భార్గవ్ దేశ్‌పాండే ఆరోపించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఓటమి చెందడంతో కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచారని, ఈసారి సైతం అదే రీతిలో ఎన్నికలు జరిగాయన్నారు. గతంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ప్రజా తీర్పును శిరస వహిస్తామని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఉద్యమిస్తామన్నారు. గ్రూపు రాజకీయాలు లేకుండా కార్యకర్తలకు అండగా ఉండి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటామని భరోసానిచ్చారు. రానున్నగ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకుందామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రధానమంత్రిగా రాహుల్‌గాంధీ ఉంటారని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడం అధిష్టానం ఆలస్యం చేయడంతో ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లలేక పోయామన్నారు. ప్రచారానికి తక్కువ సమయం ఉండడం కూడా ఓటమికి ఒక కారణమని చెప్పుకొచ్చారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కార్యకర్తలు విన్నవించగా, త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్‌ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్‌రావు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దుర్గం శేఖర్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి, కళ్లెం భూమారెడ్డి, సంజీవ్‌రెడ్డి, రాందాస్నాక్లే, బాపురావు, శ్రీకాంత్‌రెడ్డి, నగేశ్ పాల్గొన్నారు. -
బాబు అడుగడుగునా అడ్డుపడ్డారు
సాక్షి, పీలేరు : ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన మహానేత వైస్ రాజశేఖర్ రెడ్డి అని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మికీపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబునాయుడు అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మైనార్టీలను వైఎస్సార్సీపీ దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, అందుకే వైఎస్ జగన్, బీజేపీతో కలిసాడని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ బీజేపీతో కలవదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 100కు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. -
గురువు గారు ఇకలేరు
సంగారెడ్డి జోన్/కొండాపూర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే పి.రామచంద్రారెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. సంగారెడ్డి శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో లక్ష్మారెడ్డి, వీరమ్మ దంపతులకు మూడో సంతానంగా రామచంద్రారెడ్డి 1929 డిసెంబర్ 3న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా సంగారెడ్డిలోనే కొనసాగింది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్బీ చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు నిరూప్‌రెడ్డి మేఘాలయ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఈయన గతంలోనే మెదక్ జిల్లా నుంచి ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో కుమారుడు స్వరూప్‌రెడ్డి ముంబైలో వ్యాపారవేత్త. రాజకీయ నేపథ్యం.. 1957లో పటాన్చెరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రామచంద్రారెడ్డి రాజకీయల పట్ల ఆకర్షితులై 1962లో తొలిసారి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1971, 1983, 1985, 1989లో సంగారెడ్డి నుంచి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో (1989) అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. స్పీకర్‌గా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. జిల్లాలో ఎందరికో స్ఫూర్తి ప్రదాత.. రామచంద్రారెడ్డి జిల్లాలో ఎందరో నాయకులకు రాజకీయ గురువుగా, స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆయన నాయకత్వంలో ఎదిగిన వారే. సంగారెడ్డిలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల స్థాపనలో రామచంద్రారెడ్డి పాత్ర కీలకం. బాగారెడ్డి సమకాలికుడిగా ఉండి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలోనూ బీహెచ్ఈఎల్, హత్నూర మండలంలోని వివిధ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటులోనూ ఆయన పాత్ర ఎంతో ఉంది. సంగారెడ్డిలోని నటరాజ్ థియేటర్ రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిందే. ఆయన మృతికి సంతాప సూచకంగా ఆదివారం సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. ఆయన శిష్యులు వీరే... సంగారెడ్డి మండలానికి చెందిన చిద్రుప్ప మల్లికార్జున్‌గౌడ్, కోత్లాపూర్‌కు చెందిన ప్రతాప్‌రెడ్డి, కంది రఘురాంరెడ్డి, గొల్లపల్లి మాణిక్‌రెడ్డి, వెట్టూర్ నర్సింహారెడ్డి, పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ జైపాల్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, వెలమల విఠల్‌రెడ్డి, పటాన్‌చెరుకు చెందిన నర్సింగరావు తదితరులు రామచంద్రారెడ్డి అనుయాయులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వివిధ పార్టీల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. రామచంద్రారెడ్డి మృతి పట్ల చిద్రుప్పకు చెందిన సీడీసీ మాజీ చైర్మన్ ప్రభుగౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మొదటి నుంచీ తమ కుటుంబం మొత్తం రామచంద్రారెడ్డి అనుయాయులుగానే ఉందన్నారు. తాను 2014లో వైస్సార్ సీపీ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు మద్దతిచ్చారని, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు తెచ్చుకున్నారు. గ్రామానికి చేసిన సేవలు 1973లో అప్పటి గవర్నర్‌తో మొదటిæసారి గ్రామానికి వచ్చి బస్సును ప్రారంభించారు. ఆయన హయాంలోనే గ్రామానికి రోడ్లతో పాటు కొత్త కాలనీ ఏర్పాటు జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు గ్రామానికి మంచి నీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. స్వగ్రామంలో గ్రామ ప్రజలకు వైద్య సహాయం అందిచాలని, ఇందుకోసం ఆయుర్వేదిక్ ఆస్పత్రి ఉండాలనే ఆశయంతో తన తల్లి పేరు మీద ఆస్పత్రికి స్థలం విరాళంగా ఇచ్చారు. వీరమ్మ స్మారక ఆయుర్వేదిక్ ఆస్పత్రిని నిర్మించారు. అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కోదాటి రాజమల్లు 1975లో శంకుస్థాపన చేయగా, అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి పి. నర్సారెడ్డి ఆస్పత్రిని ప్రారంభించారు. గ్రామంలో ఉన్నత పాఠశాల ఉండాలని 20 గుంటల భూమిని విరాళంగా ఇవ్వడంతో పాటు గ్రామంలో వైకుంఠధామం నిమిత్తం రెండు ఎకరాల భూమిని కేటాయించారు. చిరునవ్వుతో పలకరించేవారు ఎప్పుడూ నవ్వుతూ పేరు పెట్టి పిలిచేవారు. గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆయన హయాంలోనే గ్రామంలో మంచినీటి ట్యాంకు, రోడ్లు, బస్సు సౌకర్యం, ఆస్పత్రి, కొత్త కాలనీ ఏర్పాటయ్యాయి. పాఠశాలకు, గ్రామంలో శ్మశాన వాటికకు సైతం భూమిని విరాళంగా ఇచ్చారు. ఆయన ఇక లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. – అనంతయ్య గౌడ్, గ్రామస్తుడు సేవలు మరువలేనివి మాజీ ఎమ్మెల్యేగా కాకుండా గ్రామస్తుడిగా గ్రామానికి ఎన్నో సేవలు చేశారు. మృదుస్వభావి. ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పలకరించడం ఆయన నైజం. చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కడా బస్సు ఉండేది కాదు. కానీ 1973లోనే అప్పటి గవర్నర్‌ను మా గ్రామానికి తీసుకువచ్చి బస్సును ప్రారంభించారు. – గాల్‌రెడ్డి, గ్రామస్తుడు -
మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి కన్నుమూత
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని స్వగృహంలో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం ఇంట్లోని బాత్రూంలో ఆయన జారిపడ్డారు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆçస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి చెందారు. ఆయనకు భార్య శాంతారెడ్డి, ఇద్దరు కుమారులు నిరూప్‌రెడ్డి, స్వరూప్‌రెడ్డి, కూతురు శ్రీదేవి ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో 1929 డిసెంబర్ 3న ఆయన జన్మించారు.ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. హైదరాబాద్, సంగారెడ్డిలలో న్యాయవాదవృత్తి నిర్వహించా రు. 1957లో పటాన్చెరువు పంచాయతీ సమి తి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1989 వరకు ఐదుసార్లు సంగారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో 1989లో శాసనసభ స్పీకర్‌గా పని చేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్లో భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 2004 లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యా రు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరం గా ఉన్నారు. రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు నిరూప్‌రెడ్డి సుప్రీంకోర్టులో న్యాయవాది. చిన్న కుమారుడు స్వరూప్‌రెడ్డి కెమికల్ ఇంజనీరింగ్ వృత్తిలో కొనసాగుతున్నారు. కూతురు శ్రీదేవి కూడా న్యాయవిద్యను అభ్యసించారు. లోకా యుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, గుజరాత్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఎంపీలు డాక్టర్ కె.కేశవరావు, కె.ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీ కర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితోపాటు పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు రామచంద్రారెడ్డి నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. సాయంత్రం రాయదుర్గం శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన తొలితరం నాయకుడు రామచంద్రారెడ్డి అని కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు రామచంద్రారెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. -
అసెంబ్లీ మాజీ స్పీకర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, మంత్రి పి.రామచంద్రా రెడ్డి (89) శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రమాదవశాత్తు బాత్రూంలో జారి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన స్వస్థలం మెదక్ జిల్లా మారేపల్లి గ్రామం. రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. మెదక్ జిల్లా కోర్టులో కొంతకాలం పనిచేశారు. ఆయన చదువుకునే రోజుల్లో స్వామి రామానందతీర్థ ప్రసంగాలకు ఆకర్షితుడయ్యారు. అప్పట్లోనే నిజాం నిరంకుశ పాలనకు ఎదురెళ్లి జైలుకెళ్లారు. 1957లో పటాన్చెరు పంచాయత్ సమితికి అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. మొదటిసారిగా 1962లో సంగారెడ్డి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత 1971, 83, 85, 89లలో ఎమ్మెల్యేగా గెలిచారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో (1989) అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. స్పీకర్‌గా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. నేదురుమల్లి జనార్ధన్ హయాంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. ఎన్నో పరిశ్రమలు నెలకొల్పడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో ముఖ్యపాత్ర పోషించారు. చివరిగా 2004లో ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. -
మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్ సాయం
సిద్దిపేట: కొండపాక మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డికి కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. అనారోగ్యం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన దీనస్థితిని చూసి కేసీఆర్ చలించిపోయారు. ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయనకు ఇంటి స్థలం కూడా లేకపోవడంతో వెంటనే ఇంటి స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సాయం చేస్తానన్న మాట ప్రకారం రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని, డబుల్‌బెడ్ రూం ఇల్లు మంజూరు చేశారు. రూ.25 లక్షల చెక్కును మంత్రి హరీష్‌రావు రామచంద్రారెడ్డికి కొండపాకలో అందజేశారు. కాగా, కేసీఆర్ సాయానికి ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
డాక్యుమెంట్ రైటర్ ఇంటిపై దాడులు
హైదరాబాద్: ఎల్బీనగర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పనిచేసే డాక్యుమెంట్ రైటర్ మేకల వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. ఉప్పల్ లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి గురువారం ఉదయం వెళ్ళిన అధికారులు తనిఖీలు పట్టారు. వెంకట్‌రెడ్డి ఎల్బీనగర్లో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డికి బినామీగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక దస్తావేజులు గుర్తించినట్లు సమాచారం. కాగా ఎల్బీనగర్ సబ్‌రిజిస్ట్రార్ రమేశ్‌చంద్రారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో రమేశ్‌చంద్రారెడ్డి ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రమేశ్ చంద్రారెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నాగోల్‌తో పాటు సరూర్‌నగర్, కొత్తపేట్, ఉప్పల్‌లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రమేశ్చంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు రామ చంద్రారెడ్డి సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరవనున్నారు. -
గుండెపోటుతో వరుడు హఠాన్మరణం
-
గుండెపోటుతో వరుడు హఠాన్మరణం
కొర్రపాడు(రాజుపాళెం): వివాహమైన కొద్ది గంటల వ్యవధిలోనే నవవరుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామంలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. కొర్రపాడు గ్రామానికి చెందిన సూరా రామచంద్రారెడ్డి (26)కి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన యువతితో ఆదివారం దేవుని కడపలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగించుకుని పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు స్వగ్రామమైన కొర్రపాడులోని ఇంటికి చేరుకున్నారు. అంతలోనే పెళ్లి కుమారుడికి ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని పెళ్లి మంటపంలో బంధుమిత్రుల ఆశీస్సులు అందుకున్న వరుడు ఇలా గుండెపోటుతో మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, రామచంద్రారెడ్డి తండ్రి కూడా రెండేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. -
కర్నూలులో భారీ దోపిడీ
ఆత్మకూరు: కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆత్మకూరు పట్టణం గాంధీపార్క్కు చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు భారీ చోరీకు పాల్పడ్డారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు మత్తు మందిచ్చి సొత్తును దోచుకుపోయారు. బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు ఉండడంతో రామచంద్రారెడ్డి దంపతులు సోమవారం బ్యాంకు లాకర్ నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు తీసుకువచ్చారు. సోమవారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. కుటుంబ యజమాని, ఆయన భార్యకు మేల్కువ రావడంతో వారికి మత్తు మందిచ్చారు. అనంతరం బీరువాలోని 70తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. అయితే, బీరువాలోనే ఉంచిన రూ.3 లక్షల నగదును మాత్రం వదిలి వెళ్లడం గమనార్హం. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ లో కార్డెన్ సర్చ్
- 56 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కృష్ణానగర్, జవహర్ నగర్, ఇందిరా నగర్, నేరేడ్ మెట్, వినాయక నగర్ లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా 56 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది పాత నేరస్తులు, రౌడీ షీటర్లు ఉన్నారు. 1328 ఇళ్లు, 15 లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 93 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఏడు ఆటోలు, ఒక తల్వార్, ఒక గ్యాస్ సిలిండర్, రూ.7.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ లో మల్కాజ్ గిరి డీసీపీ రామ చంద్రారెడ్డితో పాటు.. నలుగురు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్ ఐలు పాల్గొన్నారు. -
ఈసీ నాగిరెడ్డిపై ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: ఎలక్షన్ కమిషన్ నాగిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గులాబీ చొక్కా వేసుకోమంటూ నాగిరెడ్డిపై రామచంద్రారెడ్డి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ నేత వి.హనుమంతురావు ఆయనను వారించారు. దాంతో వీహెచ్‌పైనా కూడా రామచంద్రారెడ్డి రుసరుసలాడినట్టు సమాచారం. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాలని వీహెచ్ ఈ సందర్భంగా సూచించినట్టు తెలిసింది. -
పాము కాటుతో రైతు మృతి
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లాలో ఓ రైతు పాము కాటుకు గురై మృతి చెందాడు. బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి(60) అనే రైతును సోమవారం పొలం పనులు చేస్తుండగా పాము కరిచింది. అయితే, ఆయన ఏదో పురుగు కుట్టిందని కుటుంబసభ్యులకు చెప్పాడు. రాత్రి భోజనం చేసి నిద్రపోయిన ఆయనకు... అర్థరాత్రి సమయానికి విషం వ్యాపించి చనిపోయాడు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
రైతులను దగా చేస్తున్న బాబు
తిరుపతి: రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామితో కలసి మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణ మాఫీ చేయలేదన్నారు. దీంతో రైతులు బ్యాంకుల్లో కొత్త రుణాలు పొందలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ పూర్తి అవుతున్నా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా పుంగనూరుకు శాశ్వతంగా నీళ్లు అందిస్తానని పదే పదే గొప్పలు చెబుతున్నారన్నారు. నీళ్లు రావాలంటే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి కావాలని, అందుకు రూ.1,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కేవలం కోట్లు దండుకోవడానికే అని విమర్శించారు. నారాయణస్వామి మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. నమ్మిన వాళ్లు, నమ్ముకున్న వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. -
'చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి'
పీలేరు (చిత్తూరు జిల్లా) :శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ప్రధాన కారకుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన చిత్తూరు జిల్లా పీలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌కు బాధ్యత వహించి సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు. కేంద్ర హోంశాఖ నిష్పక్షపాతంగా విచారణ జరిపి చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు సీఎం మోదీ నాయకత్వానికి బంట్రోతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు.. మంత్రులుగా, భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే దమ్ము ధైర్యం సీఎంకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. అదిగో ఇదిగో రాజధాని నిర్మాణం అంటూ రైతుల వద్ద బలవంతంగా లాక్కున్న భూములతో సీఎం, ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన మొదటి ఐదు సంతకాలకు దిక్కులేకుండా పోయిందని దుయ్యబట్టారు. -
జనవరిలో 4 రాష్ట్రాల్లో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి: శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టీటీడీ జనవరిలో శ్రీనివాస కల్యాణాలను నిర్వహించనున్నట్టు టీటీడీ పీఆర్వో రవి శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో 12 చోట్ల శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని, ఈ ఏర్పాట్లను శ్రీనివాస కల్యాణ ప్రాజెక్టు ఓఎస్డీ రామచంద్రారెడ్డి పరిశీలిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో.. జనవరి 3వ తేదీ అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌లో సాయంత్రం 6 గంటలకు, 6న పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, 7న జీలుగుమల్లిలో, 8న పోలవరం, 9న గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, 17న విశాఖ జిల్లా గాజువాక, జనవరి 18న అరకులో ఉదయం 11గంటలకు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో.. జనవరి 23న మెదక్ జిల్లా సంగారెడ్డి మం డలం వైకుంఠపురంలో సాయంత్రం 6గంటలకు శ్రీవారి కల్యాణం జరుగుతుంది. కర్ణాటకలో.. జనవరి 22న బీదర్ జిల్లా బసవకల్యాణ్ మండలంలో బసవేశ్వర కన్నడ ప్రాథమికోన్నత పాఠశాలలో, 24న దావణ్గెరెలో సా యంత్రం 6 గంటలకు శ్రీనివాస కల్యాణాలు జరగనున్నాయి. మహారాష్ట్రలో.. జనవరి 30న నాందేడ్, 31న నాగపూర్‌లో సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కల్యాణాలు నిర్వహించనున్నారు. -
కేసీఆర్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ఆర్జేడీ నియామక ప్రభుత్వ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎస్.రాజీవ్ శర్మ అధ్యక్షతన వేసిన కమిటీ రెగ్యులరైజేషన్‌కు ఐదు సంవత్సరాలు ప్రామాణికంగా తీసుకుంటామని సూచనప్రాయంగా చెప్పడం సరికాదని అన్నారు. 1993-94సంవత్సరంలో 600 పనిదినాలు మాత్రమే పరిగణలోకి తీసుకొని క్రమబద్ధీకరణ చేశారని పేర్కొన్నారు. గోల్కొండ సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులందరిని క్రమబద్ధీకరిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. మానవతా ధృక్పదంతో కాంట్రాక్టు ఉద్యోగులందరిని క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో మారుతి, అరవింద్, రవికుమార్, బాలునాయక్, మహేష్‌శెట్టి, జైపాల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి ఒడిలో నివాసం!
సాక్షి, హైదరాబాద్: మనిషి ప్రకృతిలో అంతర్భాగం. ప్రకృతిలో పుట్టి.. పెరిగి.. చివరకు ప్రకృతిలోనే కలిసిపోవాల్సిందే. సాంకేతిక సౌకర్యాలెన్నున్నా.. పచ్చని ప్రకృతిలో నివసిస్తే కలిగే ఆనందమే వేరు. అందుకే నేటితరం ప్రకృతిలో నివసించేందుకే ఇష్టపడుతున్నార ంటున్నారు ఆర్వీ నిర్మాణ్ ఎండీ రామచంద్రా రెడ్డి. నగరంలో నిర్మిస్తున్న పలు గ్రీనరీ ప్రాజెక్ట్‌ల గురించి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. కొండాపూర్‌లో 3.6 ఎకరాల్లో ‘ఆర్వీ పాంచజన్య’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మూడు బ్లాకుల్లో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య 310. మొదటి బ్లాకును వచ్చే ఏడాది మార్చి, రెండో బ్లాకును జూన్ కల్లా పూర్తి చేస్తాం. మూడో బ్లాకును ఈ ఏడాది దసరాకు ప్రారంభిస్తాం. ఇక ధర విషయానికొస్తే ఈ మధ్య చ.అ.కు రూ.200లు పెంచి రూ.4,000లుగా చెబుతున్నాం. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రాజెక్ట్ చుట్టూ దాదాపు వెయ్యి ఎకరాల్లో ఇండియన్ ఇమ్యూనాలజీ లిమిటెడ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బొటానికల్ గార్డెన్ ఉండటంతో పచ్చని ప్రకృతి మధ్య ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఫ్లాట్ల డిజైన్ చూస్తే రో హౌజ్ కాన్సెప్ట్ విత్ లో లెవెల్ కారిడార్‌తో ఆద్యంతం ఆహ్లాదభరితంగా ఉంటుంది. సుచిత్ర సర్కిల్ పైప్‌లైన్ రోడ్లో 2 ఎకరాల్లో ‘ఆర్వీ ఆద్విక్’ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. రెండు బ్లాకుల్లోని మొత్తం ఫ్లాట్ల సంఖ్య 140. ఇప్పటికే ‘అముక్త’ బ్లాక్ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంది. ‘అవ్యక్త’ బ్లాక్‌ను వచ్చే ఏడాది ప్రారంభిస్తాం. చ.అ. ధర రూ.2,400లుగా నిర్ణయించాం. గచ్చిబౌలిలో 1.5 ఎకరాల్లో ‘ఆర్వీ శిల్పా హిల్ టాప్’ ప్రాజెక్ట్ చివరి దశ నిర్మాణంలో ఉంది. డిలాయిట్, రహేజా మైండ్ స్పేస్, గచ్చిబౌలి క్రాస్ రోడ్ల నుంచి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లోని మొత్తం ఫ్లాట్ల సంఖ్య 128. ఇప్పటికే 60 శాతం గృహ ప్రవేశం చేసి ఆహ్లాదభరిత వాతావరణంలో జీవిస్తున్నారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో 2, 3 పడక గదుల ఫ్లాట్లు, 2,200 చ.అ. నుంచి 2,900 చ.అ. విస్తీర్ణం గల డ్యూప్లెక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ధర చూస్తే చ.అ.కు రూ.4,500లుగా చెబుతున్నాం. ఆర్వీ నిర్మాణ్లోని అన్ని ప్రాజెక్టుల్లో విశాలమైన క్లబ్ హౌజ్‌తో పాటు అన్ని రకాల ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నాం.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం శివానగర్‌లో మరో బిల్డర్‌తో కలిసి ఓ జాయింట్ వెంచర్‌ను త్వరలోనే ప్రారంభిస్తున్నాం. -
రోడ్ల విస్తరణకు టీడీపీ నేతల మోకాలడ్డు
నంద్యాల టౌన్: పట్టణంలో రోడ్ల విస్తరణ, ఆక్రమణ తొలగింపుపై రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. ఆక్రమణదారులకు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుంది. రోడ్ల విస్తరణలో ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి లక్ష్యం నెరవేరుతుందా.. మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ ఆక్రమణదారులకు అండగా ఉంటారా? కమిషనర్ రామచంద్రారెడ్డి ధైర్యం చేస్తారా, మొహం చాటేస్తారా.. ఇలా ప్రజల్లో చర్చ సాగుతుంది. నేడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రోడ్ల విస్తరణే భూమా లక్ష్యం.. పట్టణంలో రోడ్ల విస్తరణే లక్ష్యంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రణాళిక రూపొందించారు. ఈ విషయమై అధికారులతో పలుమార్లు చర్చించి ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ నెల 14న ఆయన మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డితో చర్చించారు. రోడ్ల విస్తరణ చేపట్టకపోతే 16వ తేదీ నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని భూమా ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే చర్యలను అడ్డుకునేందుకు చైర్పర్సన్ దేశం సులోచన, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ వాయిదా మంత్రాన్ని పఠించారు. 2009లో చేసిన తీర్మానానికి కాలా తీతమైందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి నిధులను సాధించి, రోడ్లను విస్తరిస్తామని ప్రకటించారు. భూమాకు పేరు వస్తుందనే కారణంతో టీడీపీ నేతలు రోడ్ల విస్తరణకు మోకాలడ్డుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణల తొలగింపుపై అనుమానాలు టీడీపీ నేతలు ధ్వందవైఖరి, కమిషనర్ వెనుకగుడుతో ఆక్రమణ కూల్చివేతపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. కమిషనర్ రామచంద్రారెడ్డి ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆక్రమణలు తొలగిస్తామని చెప్పిన కమిషనర్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి తోడు ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగే సమావేశాలకు వెళ్లారు. దీంతో ఆక్రమణల కూల్చివేతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా ఆక్రమణల కూల్చివేతకు గడువు ఇచ్చామన్నారు. అయితే వ్యాపారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎప్పుడైనా తొలగించే అవకాశం ఉందని చెప్పారు. -
ప్రజలను మోసగించడం బాబుకు అలవాటే
పుంగనూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజలను మోసగిం చడం వెన్నతో పెట్టిన విద్య అని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను నూతన ఎంపీపీలు, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీల ప్రమాణస్వీకారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుంగనూరులోని కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలను నమ్మి ప్రజలందరు ఓట్లు వేసి గెలిపించారన్నారు. కానీ పదవిని చేపట్టి నెలరోజులు గడుస్తున్నా చంద్రబాబునాయుడు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన ఇవ్వక, కమిటీలతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు 1994లో ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రెండురూపాయల కిలో బియ్యాన్ని ఐదు రూపాయలకు పెంచారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు రైతుల అన్నిరకాల రుణాలను, మహిళల డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని ప్రకటించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రుణ మాఫీపై ప్రజలు తిరగబడుతూ తెలుగుదేశం పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రైతాంగం వెంటనే స్పందించి రుణమాఫీలపై పోరాటం చేయాలన్నారు. అలా పోరాటం చేసే వారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నింటికీ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదుల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నూతన ఎంపీపీ నరసింహులు, నూతన వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, లీడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మాజీ ఏఎంసీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ ఆవుల అమరేంద్రతో పాటు నూతన ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
పీలేరు గెలుపులో పెద్దిరెడ్డి కీలకపాత్ర
పీలేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి ఘన విజయం వెనుక మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర కీలకమైంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ సీఎం కిరణ్‌ను పీలేరులో ఓడించడమే ఏకైక లక్ష్యంగా పెద్దిరెడ్డి పావులు కదిపారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించారు. దీంతో చింతల 15,250 ఓట్ల ఆధిక్యతతో జేఎస్పీ అభ్యర్థి నల్లారి కిషన్‌కుమార్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు. నల్లారి కుటుంబానికి గుర్రంకొండ మండలంలో అత్యంత విధేయుడు, మైనారిటీల్లో బలమైన నేత అయిన జమీర్‌ఆలీఖాన్‌ను వైఎస్సార్ సీపీలో చేర్చుకోవడంతో గుర్రంకొండలో ఆధిక్యతను చాటారు. అలాగే కేవీపల్లె మండల మాజీ ఉపాధ్యక్షుడు ఎం.వెంకట్రమణారెడ్డి మాజీ సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుడు, మండలంలో ప్రజా బలం ఉన్న నేత. ఆయన్ను సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో కిరణ్ కోటకు బీటలు వారాయి. అంతటితో ఆగని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కిరణ్‌కు అత్యంత సన్నిహితుడైన గుడిబండ రవికుమార్‌రెడ్డిని సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేర్చుకున్నారు. పీలేరు మండలంలో మాజీ ఎంపీపీ ఎం.వెంకట్రమణారెడ్డితోపాటు జాండ్ల, వేపులబైలు సర్పం చ్‌లు శ్రీనివాసులు, ఆదినారాయణలను పార్టీలో చేర్చుకున్నారు. వేపులబైలు పంచాయతీలో కీలకమైన వ్యక్తి అయిన భవనం వెంకట్రామిరెడ్డి మరికొంతమంది ప్రముఖలను పార్టీలో చేర్చుకోవడం గమనార్హం. పీలేరు పట్టణంలో అత్యంత ప్రజాదరణ కల్గివున్న మాజీ సర్పంచ్ ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి సూచనలు, ఆదేశాల మేరకు ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి పార్టీ బలోపేతం కోసం పట్టణంలో శక్తివంచనలేకుండా కృషి చేశారు. మూడన్నరేళ్లు అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారంలో మాజీ సీఎం కిరణ్ విఫలమయ్యారని పెద్దఎత్తున ప్రజలకు వివరించి అత్యధికంగా ఓట్లు రాబట్టడంలో సఫలీకృతులయ్యారు. మరోవైపు నియోజకవర్గ పరిధిలోని కలికిరి మినహా ఐదు మండలాల్లో బలమైన పార్టీ కేడర్ ఉండడం గెలుపునకు ప్రధాన కారణమైంది. ఇటీవల వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడంతోపాటు జెడ్పీటీసీల్లో పీలేరు, కేవీపల్లె, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో విజేతలుగా నిలిచారు. మాజీ సీఎం కిరణ్ తన సోదరుడు కిషన్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా పెద్దిరెడ్డి ఎత్తుల ముందు చిత్తుకాక తప్పలేదు. అలాగే టీడీపీ మూడో స్థానానికే పరిమితం కావడం, కాంగ్రెస్ గల్లంతు కావడంతో చింతల గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేకపోయింది. -
ఆదిలాబాద్‌లో ‘జోగు’ హ్యాట్రిక్
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొదటి సారిగా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న రికార్డు సృష్టించారు. శుక్రవారం వెలువడిన శాసనసభ ఫలితాల్లో రామన్న మరోసారి విజయదుందుభి మోగించారు. 2009లో టీడీపీ, టీఆర్ఎస్ మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రారెడ్డిపై 27వేల ఓట్ల మెజార్టీతో మొదటిసారి గెలుపొందారు. 2011లో టీడీపీ రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన 2012 మార్చి 18న జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంచంద్రారెడ్డిపై 33వేల ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయం సాధించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. టీఆర్ఎస్ హవా కొనసాగినా గతంలో కంటే మెజార్టీ తగ్గడం గమనార్హం. ప్రతీ రౌండ్లోనూ ఆధిక్యం.. ఆదిలాబాద్ శాసనసభ స్థానానికి 15 మంది పోటీ పడ్టారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, సీపీఎం, ఆమ్ఆద్మీ పార్టీలతోపాటు పలువురు స్వత్రంత్ర అభ్యర్థు లు బరిలో నిలిచారు. ఏప్రిల్ 30న జరిగిన పో లింగ్లో నియోజకవర్గంలోని 2,23,175 మంది ఓటర్లకు గాను పోస్టల్ బ్యాలెట్ కలుపుకుని 1,45,098 మంది ఓటు వేశారు. ఓట్ల లెక్కింపు శుక్రవారం ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ బాలుర కళాశాలలో నిర్వహించారు. మొత్తం 18 రౌండ్లలో ఓట్లు లెక్కించారు. మూడో రౌండ్ మినహా ప్రతి రౌండ్లోనూ జోగు రామన్న ఆధిక్యత కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకొని రామన్నకు 58,705 ఓట్లు రాగా, తన సమీ ప ప్రత్యర్థి బీజేపీకి చెందిన పాయల శంకర్‌కు 43,994 ఓట్లు వచ్చాయి. 14,711 ఓట్ల మెజార్టీతో రామన్న విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి 30,298 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ‘పాయల’కు మరోసారి చుక్కెదురు.. పాయల శంకర్‌కు మరోసారి చుక్కెదురైంది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసి మూడోస్థానంతో సరిపెట్టుకున్నా రు. టీడీపీలో ఉన్నప్పుడు జోగు రామన్నకు పాయల శంకర్ అనంగు అనుచరుడుగా ఉన్నారు. రామన్న టీఆర్ఎస్లో చేరడం, ఆ తర్వాత శంకర్ కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో విజయంపై ఆశలు పెంచుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. గతంలో మూడో స్థానంలో నిలువగా ఈసారి రెండవ స్థానం సాధించడం ఆయనకు కొంత ఊరటనిచ్చింది. దీనికి తోడు గతం కంటే ఓట్ల శాతం పెరగడం గమనార్హం. ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌పాండే ఆది లాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ సాధించినప్పటికీ గెలుపు మాత్రం ఆయనను వరించలేదు. రాంచంద్రారెడ్డిని కాదని భార్గవ్‌దేశ్‌పాండేకు అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. మొదటి ప్రయత్నంలో 30 వేల ఓట్లు సాధించడంతో భార్గవ్ వర్గీయుల్లో కొంత సంతోషం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో రాజకీయంగా ఎదిగేందుకు ఈ ఓట్లు తోడ్పడుతాయని వారిలో ఆశాభావం వ్యక్తమవుతోంది. నోటా.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీకి 813 మంది నోటాను ఉపయోగించుకున్నారు. పార్లమెంట్లు పరిధిలో 1975 మంది పార్లమెంటు అభ్యర్థులెవరికీ ఓటు వేయకుండా నోటా బటన్ నొక్కారు. -
మోడీ నరహంతకుడు
బీజేపీకి ఓటేస్తే గోద్రా ఘటనలు పునరావృత్తం వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్న జగన్‌కు ఓటెయ్యండి రోడ్ షోలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లె, మదనపల్లె రూరల్ న్యూస్‌లైన్ : ‘‘నరహంతకుడు నరేంద్ర మోడి. బీజేపీకి ఓటేస్తే గోద్రా ఘటనలు పునరావృత్తమవుతాయి. మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటెయ్యండి’’ అని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. మదనపల్లె రూరల్ మండలంలోని కాశీరావుపేట, సీటీఎం, గుడిసివారిపల్లె, పోతపోలు, బాలాజీనగర్, అంకిశెట్టిపల్లె, చిప్పిలి, అంకిశెట్టిపల్లె, వలసపల్లె, వేంపల్లె, చీకలబైలు, బండకిందపల్లె తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఆయన మదనపల్లె అభ్యర్థి దేశాయ్తిప్పారెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. మొదటగా కాశీరావుపేటకు చేరుకున్న పెద్దిరెడ్డికి ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరి సీటీఎం, గుడిసివారిపల్లె, పోతపోలులో జరిగిన సభల్లో ప్రసంగించారు. మైనారిటీలను ఊచకోత కోసిన బీజేపీ నాయకుడు నరేంద్రమోడి నరహంతకుడన్నారు. పార్లమెంటు సభ్యులు ఉన్న ఇంటికి నిప్పంటించి 11 మంది సజీవదహనానికి కారకుడయ్యాడని ధ్వజమెత్తారు. ప్రజలు బీజేపీకి ఓట్లువేస్తే 2002లో జరిగిన గోద్రా ఘటనలు సీమాంధ్ర, మదనపల్లెల్లో పునరావృత్తమవుతాయన్నారు. బీజేపీతో రాక్షస పాలన కావాలో వైఎస్ఆర్ సీపీతో సువర్ణపాలన కావాలో ప్రజ లే తేల్చుకోవాలని సూచించారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్ల పాటు సీమాంధ్రలో సువర్ణపాలన అందిస్తారని భరో సా ఇచ్చారు. ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబునాయు డు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర కరువుతో అల్లాడాల్సి వచ్చిందన్నారు. అప్పటి తెలుదేశం పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయా..? మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందాయో ఒకసారి ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు, మహిళలు, మైనారిటీలు, రైతుల సంక్షమానికి వైఎస్ పెద్దపీట వేశారని గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రానికి ఆమె ఒరగబెట్టిందేమీ లేదు ‘‘బీజేపీ రాజంపేట పార్లమెంటు అభ్యర్థి పురందేశ్వరి ఇంతకాలం ఎక్కడున్నారు?. కేంద్ర మంత్రిగా ఉండి సమైక్య రాష్ట్రానికి ఆమె ఏం ఒరగబెట్టారు?. రాష్ట్రం విడిపోకుండా ఉండేం దుకు మంత్రి పదవికి రాజీమానా చేయాలని కోట్లాది గొంతులు నినదించినా పట్టించుకోలేదు.. మాట వరసకైనా రాజీనామా చేస్తామని చెప్పలేదు.. ఇప్పుడు ఐదు జిల్లాలు దాటి అధికార వాంఛతో ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ మదనపల్లె అభ్యర్థి దేశాయ్‌తిప్పారెడ్డి ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడుపై వారు నిప్పులు చెరిగారు. బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివస్రాద్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. -
మోడీ రాకతో రాహుకేతు పూజల నిలిపివేత
శ్రీకాళహస్తి ఆలయ చరిత్రలో ఇదే ప్రథమం భద్రత కోసమేనన్న ఈవో శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వచ్చిన సందర్భంగా మూడు గంటల పాటు రాహుకేతు పూజలు నిలిపివేశారు. గురువారం నరేంద్రమోడీ, బీజేపీ నేత వెంకయ్యనాయుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తీశ్వరాలయానికి వి చ్చేశారు. వారి వెంట మరో 50మందిని ఆలయంలోకి అనుమతించారు. భద్రత పేరుతో భక్తులు ఎవర్నీ అనుమతించలేదు. మూడు గంటల పాటు రాహుకేతు పూజలు నిలిపివేశారు. శ్రీకాళహస్తిలో కేవలం శివరాత్రి సందర్భంగా ఒక్కరోజు మాత్రమే రాహుకేతు పూజ లు నిలిపివేస్తారనీ, మిగిలిన రోజుల్లో నిలిపివేయడం ఆలయ చరిత్రలోనే ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. గతంలో ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ, దేవెగౌడతో పా టు అనేకమంది ముఖ్యమంత్రులు ఆలయానికి విచ్చేశారు. కానీ ఇలాంటి ఘటనలు చో టు చేసుకోలేదని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో ఆలయ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మండుటెండలో భక్తులు అష్టకష్టాలు పడ్డారు. గంటసేపు నిలుపుదల చేశాం: ఈవో నరేంద్రమోదీ ఆలయానికి రావడంతో గంట సేపు మాత్రమే రాహుకేతుపూజలతో పాటు ఇతర పూజలు నిలువుదల చేశామని ఆలయ ఈవో రామచంద్రారెడ్డి తెలిపారు. మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో పాటు 50 మంది దర్శన టికెట్లు కొనుగోలు చేశారు. వారిని మాత్రమే అనుమతించామని చెప్పారు. మోడీ రూ.2,500 రాహుకేతు పూజా టికెట్ కొనుగోలు చేసి పూజ చేసుకున్నారు. ఇతర భక్తులను ఆలయంలోకి అనమతించలేదని ఆయన వివరించారు. శ్రీవారిని దర్శించుకున్న మోడీ సాక్షి, తిరుమల: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నటుడు పవన్‌కల్యాణ్, బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, ప్రకాష్ జవదేకర్ ఉన్నారు. మోడీ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం ఆలయంలో పచ్చకర్పూరపు వెలుగుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకున్నారు. శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొందారు. పట్టువస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
బాబు కపటప్రేమను నమ్మొద్దు
కిరణ్కూ ప్రజలే బుద్ధి చెబుతారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి మబ్బు చెంగారెడ్డిది గొప్ప మనసు : భూమన కరుణాకరరెడ్డి తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులపట్ల చూపుతున్న కపటప్రేమకు మోసపోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విద్యుత్, ఆర్టీసీ బస్సుచార్టీలను విపరీతంగా పెంచిన ఘనత ఆయనదేనని, వాటిని తగ్గించాలని కోరినందుకు రైతులు, మహిళలను లాఠీలతో కొట్టించి, తుపాకులతో కాల్పించిన విషయూన్ని ప్రజలు మరచిపోరాదని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, దివంగత నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు చెంగారెడ్డి శుక్రవారం ఉదయం రెండు వేలమందితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెంగారెడ్డికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హాజరైన పెద్దిరెడ్డి మాట్లాడుతూ కరెంట్ బిల్లులు చెల్లించలేదని రైతులపై కేసులు మోపించిన చంద్రబాబు ప్రస్తుతం వారిపై కపటప్రేమను చూపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌ను మించిన విధంగా టీడీపీ మేనిఫెస్టోలో అలవికాని హామీలిస్తున్నారని, వీటికి ప్రజలు మోసపోవద్దన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచిన మరో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ పార్టీ పెట్టారని, ఆయనకు ఈ ఎన్నికల్లో ఁచెప్పురూ. గుర్తుతోనే తగిన బుద్ధిచెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న మబ్బు కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం శుభపరిణామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్) పార్టీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా మంచి పథకాలన్ఙుమేనిఫెస్టోరూ.లో రూపొందించారని స్పష్టం చేశారు. జగన్ బాటలో పయనిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎంపీగా పోటీచేస్తున్న వరప్రసాద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గుండెలు హత్తుకునేలా ఆత్మీయుడైన తమ్ముడు మబ్బు చెంగారెడ్డిని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారూ. అని చెప్పారు. పది మందికి సాయం చేసే గొప్ప మనసు చెంగారెడ్డిదని, ఆయన పార్టీలోకి రావడం అభినందనీయమని తెలిపారు. ఆయన సేవలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించదని, భవిష్యత్‌లో ఆయనకు సమున్నత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో స్వార్థ రాజకీయలకు అతీతంగా తిరుపతిని సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల పాటు మబ్బు కుటుంబాన్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మబ్బు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. మా అన్న మబ్బుదేవ నారాయణరెడ్డి అన్నా, మబ్బు కుటుంబం అన్నా ఎనలేని గౌరవం ఉందరూ.న్నారు. తాను తన అన్నను విభేదిస్తున్నట్టు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు. కాంగ్రెస్ పార్టీని, సిద్ధాంతాలను మాత్రమే విభేదించి బయటకు వచ్చా, మబ్బు కుటుంబం అన్నా, మా అన్న అన్నా ఎప్పటికీ గౌరవం ఉంటుందిరూ. అని స్పష్టం చేశారు. ఎంపీగా పోటీచేస్తున్న వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజానాయకుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చెంగారెడ్డి పార్టీలో చేరడం సంతోషమఅన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కే బాబు, ఆదికేశవులురెడ్డి, అమరనాథరెడ్డి, మబ్బు యువసేన నాయకులు కాండ్ర సత్యనారాయణ, ఆర్ఆర్ శ్రీనివాసులు, వెంకటముని యాదవ్, పరందామ్, గుణశేఖర్, మహిళా నాయకురాలు పద్మజ తదితరులు పాల్గొన్నారు. మబ్బు యువసేన నాయకులు పెద్ద ఎత్తున పూలమాలలతో చెంగారెడ్డి, కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డిని సన్మానించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. -
స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలి
స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పుత్తూరు, న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిండ్ర మండలం కొప్పేడు గ్రామం లో షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డివారి భాస్కర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు పెద్దిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడనుందని, అందుకే అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. 25 ఎంపీ స్థానాలు దక్కించుకుంటే కేంద్రంలోనూ జగన్మోహన్రెడ్డి రాజకీయాలను ప్రభావితం చేయగలరన్నారు. వైఎస్సార్సీపీ ప్రారంభంలోనే జెడ్పీటీసీ మాజీ సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి పార్టీలో చేరినట్టు గుర్తుచేశారు. కొప్పేడుతో ఉన్న అనుబంధాన్ని పెద్దిరెడ్డి గుర్తుచేసుకున్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కోసం శ్రమించే వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. మహానేత మృతిపై ఇప్పటికీ అనుమానాలే: రోజా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్కే రోజా అన్నారు. కాంగ్రెస్ పాలకులు దీనిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. రెడ్డివారి భాస్కర్‌రెడ్డి పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భీరేంద్రవర్మ, జిల్లా స్టీరిం గ్కమిటీ సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, లక్ష్మీపతి రాజు, శ్యాంలాల్, పార్టీ మండల కన్వీనర్ మనోహర్‌నాయుడు, పుత్తూరు నాయకులు మహేంద్రన్రెడ్డి, మైనారిటీ నాయకుడు మాహిన్ పాల్గొన్నారు. -
కొత్త పార్టీలు ఎన్నొచ్చినా జగన్‌కు ఎదురు లేదు
చరిత్రలో అసమర్థ ముఖ్యమంత్రి కిరణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చౌడేపల్లె, న్యూస్‌లైన్: కొత్త పార్టీలు ఎన్ని పుట్టుకొచ్చి నా వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఎదురులేదని, ఖచ్చితం గా ముఖ్యమంత్రి అవుతారని మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చౌడేపల్లె మండలంలో నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం బుధవారం ఐదవ రోజుకు చేరింది. పర్యటనలో భాగంగా కొలింపల్లెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెట్టినా అభ్యర్థులను గెలిపించుకునే సత్తా లేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఏనాడు వేల ఓట్ల మెజారిటీ సాధించలేదని గుర్తుచేశారు. అసమర్థత పాలన కొనసాగించి రాష్ట్రా న్ని రెండు ముక్కలుగా చేయడానికి కేంద్రంలోని పెద్దలకు సహకరించారని ఆరోపించారు. ఓట్ల కోసం ఏమార్చడానికి చూస్తున్న నాయకులకు ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చరిత్రలో అసమర్థ సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి నిలిచిపోయారన్నారు. మూడు నెలల కాలంలో అనేక ఫైళ్లపై సంతకాలు చేసి అధికారం ముసుగులో వేల కోట్లు అక్ర మం గా కూడబెట్టారని ఆరోపించారు. ఇప్పటికే కేంద్రం నుంచి తనిఖీ బృందం గవర్నర్ సమక్షంలో తనిఖీలు చేస్తున్నారని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయన్నారు. ఎన్ని కొత్త పార్టీలొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని, టీడీపీకి అప్పుడే గుబు లు పట్టుకుందని ఎద్దేవా చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం తధ్యమని, అన్ని ప్రాం తాలను సమానంగా అభివృద్ధి చేసి చూపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, సీడీసీఎంఎస్ మాజీ చైర్మన్ ద్వారకనాథరెడ్డి, నాయకులు ఎన్.రెడ్డెప్ప, ఇంకా రుక్మిణమ్మ, రెడ్డిప్రకాష్, మునస్వామిరాజు, గాజుల రామ్మూర్తి, పద్మనాభరెడ్డి, లడ్డూరమణ, నాగభూషణరెడ్డి, ప్రవీణ్‌కుమార్, వెంకటరెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య బంద్ సక్సెస్
మిన్నంటిన నిరసనలు స్తంభించిన ఆర్టీసీ సేవలు మూతపడిన బ్యాంకులు, థియేటర్లు, విద్యా సంస్థలు తిరుమలకు బస్సుల రాకపోకలమినహాయింపు జాతీయ రహదారుల్లో నిలిచిన ప్రైవేట్ వాహనాలు సాక్షి, చిత్తూరు: సమైక్య బంద్ జిల్లాలో సక్సెస్ అయ్యింది. ఏపీఎన్జీవోలు, వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు గురువారం జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, పుంగనూరు, నగరి పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాలను ఏపీఎన్జీవోలు దగ్గరుండి మూయించారు. వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. నగరిలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కే.రోజా, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి బంద్‌లో పాల్గొని నిరసన తెలిపారు. కార్యకర్తలతో కలిసి రోడ్లపై తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. పుంగనూరు, మదనపల్లె, తిరుపతి, చిత్తూరు నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మదనపల్లెలో వైఎస్సార్సీపీ నాయకులు నీరుగట్టుపల్లెలో బంద్ నిర్వహించారు. ఎపీఎన్జీవోల ఆధ్వర్యంలో మానవహారాలు చేపట్టారు. నీరుగట్టువారిపల్లె మార్కెట్‌యార్డు వద్ద విద్యార్థులు, ఎన్జీవోలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం వరకు దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు అక్కడక్కడా తిరిగాయి. పుంగనూరులో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్ జరిగింది. అన్ని రహదారులు దిగ్బంధ నం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జేఏసీ చైర్మన్ వరదారెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. టీడీపీ నాయకుడు శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. నగరిలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కే .రోజా ఆధ్వర్యంలో ఉయ్యాల కాలువవద్ద రాస్తారోకో చేశారు. రాకపోకలు స్తంభించాయి. పలమనేరు ఎన్జీవోలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పట్టణ సరిహద్దుల్లో వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. రోడ్లపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నాయకులు బంద్ పాటించారు. బంద్‌లో మాజీ ఎమ్మేల్యే అమరనాథరెడ్డి పాల్గొని ఆందోళనకారుల నుద్దేశించి ప్రసంగించారు. కుప్పంలో వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. ఏపీ ఎన్జీవోలు తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సాయంత్రం వరకు బ్యాంకులు, దుకాణాలు, వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. శ్రీకాళహస్తిలో ఎపీఎన్జీవోలు బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. మున్సిపల్, రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. దుకాణాలు మూత పడ్డాయి. చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద తమిళనాడు, కర్ణాటకల నుంచి వచ్చే వాహనాలను ఆపేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలీసులు జోక్యం చేసుకుని కొన్ని వాహనాలను వదిలారు. నగరంలోకి ఇతర వాహనాలను అనుమతించలేదు. తిరుమలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు, డిపార్టుమెంట్ పరీక్షలకు మినహాయింపు ఇచ్చారు. వాణిజ్య సంస్థలు, బ్యాంక్‌లు, థియేటర్లు మూతపడ్డాయి. కలెక్టరేట్ మూతపడింది. ప్రభుత్వకార్యాలయాలూ పనిచేయలేదు. తిరుపతిలో సాప్స్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎం.ఆర్.పల్లె సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. ఆర్డీవో, ఎం.ఆర్.వో కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఎస్వీయూలోనూ తరగతులు బహిష్కరించారు. తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. -
వైఎస్ఆర్ సీపీకి అధికారం ఖాయం
సదుం, న్యూస్‌లైన్: నూతన సంవత్సరంలో వైఎస్ఆర్ సీపీ అధికారం చేపట్టడం ఖాయమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎర్రాతివారిపల్లెలోని అతిథి గృహంలో ఉన్న ఆయనను వైఎస్ఆర్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, అధికారులు బుధవారం కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ చల్లగా ఉండాలని అయ్యప్పను వేడుకుంటున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలి పారు. వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం కొనసాగుతుంది కొత్త సంవత్సరంలోనూ వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం కొనసాగుతుందని ఆ పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. స్వగ్రామమైన ఎర్రాతివారిపల్లెలో ఉన్న ఆయనను అభిమానులు, నాయకులు బుధవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి జిల్లాలో చేపట్టిన రెండో విడత సమైఖ్య శంఖారావం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. సమైక్య శంఖారావం మూడవ విడత పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 8, 9 తేదీల్లో సదుం మండలానికి రావొచ్చన్నారు. ఎర్రాతివారిపల్లెలోని అతిథి గృహంలో జగన్ బస చేస్తారన్నారు. నూతన ఏడాదిలో అందరికీ మేలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
ఇప్పుడా విచారణ?
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉంది ప్రభుత్వ అధికారుల తీరు. సంగారెడ్డి మున్సిపల్ భవన నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపణలు వచ్చిన ఏడాది తరువాత అధికారులు స్పందించారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇదో మచ్చుతునకగా చెప్పవచ్చు. ‘బీటలు వారిన మున్సిపల్ భవనం’ అనే శీర్షికతో గత ఏడాది సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ఏడాది తరువాత స్పందించిన విజిలెన్స్ అధికారులు మంగళవారం సంగారెడ్డికి వచ్చి మున్సిపల్ కార్యాలయ భవన నాణ్యతను పరిశీలించారు. భవ నంలోని వివిధ భాగాల్లోని స్లాబులో నుంచి నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము భవన నిర్మాణ నాణ్యతను పరిశీలించేందుకు వచ్చినట్టు తెలిపారు. టెండర్ కాలంలో చూపిన మాదిరిగా స్లాబు వేశారా? లేదా, ఎంబీ రికార్డులో తక్కువ మోతాదులో స్లాబు వేసి ఎక్కువ రికార్డు చేశారని ఫిర్యాదులు వచ్చాయని, వాస్తవాన్ని తెలుసుకునేందుకే తనిఖీలు చేశామన్నారు. తాము సేకరించిన నమూనాలను క్వాలిటీ కంట్రోల్ బోర్డుకు పంపిస్తామన్నారు. ఇసుక, కంకర, సిమెంట్ తగిన మోతాదులో వాడలేదని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవన నిర్మాణంలో పది శాతం నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్ నుంచి, 15 శాతం నాణ్యత లోపిస్తే అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి, 20 శాతం నాణ్యత లోపిస్తే డిప్యూటీ ఈఈ నుంచి రికవరీ చేస్తామన్నారు. కాగా ఈ భవన నిర్మాణానికి 2005లో రాజీవ్ నగర బాటలో భాగంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 2010 సెప్టెంబర్ 30న అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి భవన నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభించారు. అప్పటికే భవనం ఇరు వైపులా బీటలు వారింది. ఈ విషయాన్ని ‘సాక్షి’లో పతాక శీర్షికన ప్రచురించినప్పటికీ అధికారులు ఏడాది తరువాత విచారణకు రావడంపై స్థానికులు వారిపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ యాత్రతో బాబుకు దిమ్మతిరగడం ఖాయం
=మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి =రేపు కుప్పం నుంచి ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర =అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపు పీలేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టే సమైక్య శంఖారావంతో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు దిమ్మతిరగడం ఖాయమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. శనివారం కుప్పం నుంచి ప్రారంభించనున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం పీలేరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణవార్త విని గుండెపగిలి చనిపోయిన కుటుంబాలను జగన్ ఓదారుస్తారని తెలిపారు. అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్య వాదులు వేలాదిగా తరలివచ్చి యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యాత్రను అడ్డుకునే విధంగా ప్రజలను రెచ్చగొట్టడం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దిగజారు డు తనానికి నిదర్శనమన్నారు. తనస్థాయి మరచి వార్డు సభ్యునికన్నా హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ సమైక్య యాత్ర రాయలసీమతో పాటు తెలంగాణ , కొస్తాంధ్రలోనూ సాగుతుందన్నారు. ఆయన యాత్రను చూసి చంద్రబాబుకు దిమ్మతిరగడం ఖాయమన్నారు. జగన్‌తోనే రాజన్న సువర్ణ యుగం సాధ్యమన్నారు. సీఎం కిరణ్, చంద్రబాబులు ఇక ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టలేరని, వచ్చే ఎన్నికల్లో ఇరువురూ తట్టాబుట్టా సర్దుకోక తప్పదని జోస్యం చెప్పారు. ఆ రెండు పార్టీలూ ఎన్ని అవాంతరాలు సృష్టిం చినా కాబోయే సీఎం జగనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డాక్టర్ లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్ కదిరి వెంకట్రామయ్య, డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ ఓ.లక్ష్మీనారాయణ, బీడీ.నారాయణరెడ్డి, షామియాన షఫీ, రమేష్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, జనార్దన్‌రెడ్డి, ఎల్ఐసీ ద్వారకనాథరెడ్డి, చక్రపాణిరెడ్డి, కేశవరెడ్డి, చినబాబు, భాస్కర్‌రెడ్డి, విక్టరీ వెంకట్రమణారెడ్డి, మోహన్‌రెడ్డి, సదుం నాగరాజ, కాలనీ చిన్న, ఉదయ్‌కుమార్, పూల కుమార్, కత్తి రామలింగారెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సమైక్య శంఖారావానికి తరలిరండి పుత్తూరు: జగన్ చేపట్టనున్న సమైక్య శంఖారావానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి పిలుపునిచ్చారు. గురువారం పుత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. జగన్ యాత్రతో టీడీపీ కంచుకోట బద్ధలవడం ఖాయమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు ఇచ్చిన లేఖను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
రామచంద్రారెడ్డి ఆసుపత్రికి బాంబ్ బెదిరింపు
నగరంలోని రామచంద్రారెడ్డి ఆసుపత్రికి మంగళవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలు, బాంబ్ స్క్వాడులు అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో అటు ఆసుపత్రి వైద్యులు, ఇటు రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రికి వచ్చిన ఫోన్ కాల్ నిజమైనదా కాదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. -
24న శ్రీవారికి మరోసారి సమైక్య సెగ
తిరుమలలో శ్రీవారికి మరోసారి సమైక్యాంధ్ర సెగ తగలనుంది. ఈ నెల 24న ప్రైవేట్ వాహనాలను సైతం తిరమల కొండపైకి వెళ్లనివ్వమని ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ రామచంద్రారెడ్డి శనివారం తిరుపతిలో వెల్లడించారు. అందుకు శ్రీవారి భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను సైతం అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. తిరుమలలోని కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు 24వ తేదీ తిరుపతిలోనే ఉండాల్సి వస్తుందన్నారు. అవసరమైతే వారికి తిరుపతిలోనే ఉచిత వసతి సౌకర్యం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని రామచంద్రారెడ్డి వెల్లడించారు. -
'చిత్తూరు జిల్లాలో సమైక్యా ఉద్యమం ఉధృతం చేస్తాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు తిరుపతి ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్లు చెప్పారు. అలాగే 14 నుంచి 48 గంటలపాటు తిరుపతి, తిరుమల ఇరు ప్రాంతాల్లో సంపూర్ణ బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే16వ తేదీన జిల్లాలోని ఉపాధ్యాయులతో ఉపాధ్యాయుల గర్జన, 17న మున్సిపల్ ఉద్యోగులతో మహా గర్జనను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటితోపాటు18 నుంచి ఆమరణ దీక్షలు చేపట్టనున్నట్లు రాంచంద్రారెడ్డి వివరించారు.