వైఎస్‌ఆర్ సీపీకి అధికారం ఖాయం | Congress has the power to ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీకి అధికారం ఖాయం

Published Thu, Jan 2 2014 6:45 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

Congress has the power to ysrcp

సదుం, న్యూస్‌లైన్: నూతన సంవత్సరంలో వైఎస్‌ఆర్ సీపీ అధికారం చేపట్టడం ఖాయమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎర్రాతివారిపల్లెలోని అతిథి గృహంలో ఉన్న ఆయనను వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, అధికారులు బుధవారం కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ చల్లగా ఉండాలని అయ్యప్పను వేడుకుంటున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలి పారు.
 
వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం కొనసాగుతుంది
 
కొత్త సంవత్సరంలోనూ వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం కొనసాగుతుందని ఆ పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. స్వగ్రామమైన ఎర్రాతివారిపల్లెలో ఉన్న ఆయనను అభిమానులు, నాయకులు బుధవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహనరెడ్డి జిల్లాలో చేపట్టిన రెండో విడత సమైఖ్య శంఖారావం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. సమైక్య శంఖారావం మూడవ విడత పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 8, 9 తేదీల్లో సదుం మండలానికి రావొచ్చన్నారు. ఎర్రాతివారిపల్లెలోని అతిథి గృహంలో జగన్ బస చేస్తారన్నారు. నూతన ఏడాదిలో అందరికీ మేలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement