
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలు చేస్తున్నారని రాయదుర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. రాజకీయంగా ఎదర్కొనే దమ్ములేక వైఎస్సార్‌సీపీ నేతలను చంపతున్నారని విమర్శించారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌ను చంపాలని చూశారని, ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి ని హత్య చేయించారని ఆరోపించారు. వైఎస్ జగన్ తాత రాజారెడ్డిని హత్య చేయించింది కూడా చంద్రబాబే అన్నారు. రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాస్ రూ.600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చద్రబాబు రాష్ట్రానికి శనిబాబులా తయారయ్యారని ఎద్దేవా చేశారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు హాంద్రీనీవా నీరు ఇప్పటి వరకు తీసుకురాలేదన్నారు.
సామాన్యులకు టికెట్ కేటాయించన ఘనత జగన్‌దే
ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లో బీసీలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని అనంతపురం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తలారి రంగయ్య అన్నారు. వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసించారు. ఆర్థిక బలంలేని తనలాంటి సామాన్యులకు టిక్కెట్లు కేటాయించన ఘనత వైఎస్ జగన్‌కే చెందుతుందన్నారు. వెనుకబడిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. (నేనున్నాననే భరోసా ఇస్తున్నా: వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment