- కిరణ్‌కూ ప్రజలే బుద్ధి చెబుతారు
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి
- మబ్బు చెంగారెడ్డిది గొప్ప మనసు : భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులపట్ల చూపుతున్న కపటప్రేమకు మోసపోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విద్యుత్, ఆర్టీసీ బస్సుచార్టీలను విపరీతంగా పెంచిన ఘనత ఆయనదేనని, వాటిని తగ్గించాలని కోరినందుకు రైతులు, మహిళలను లాఠీలతో కొట్టించి, తుపాకులతో కాల్పించిన విషయూన్ని ప్రజలు మరచిపోరాదని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నాయకులు, దివంగత నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు చెంగారెడ్డి శుక్రవారం ఉదయం రెండు వేలమందితో కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెంగారెడ్డికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హాజరైన పెద్దిరెడ్డి మాట్లాడుతూ కరెంట్ బిల్లులు చెల్లించలేదని రైతులపై కేసులు మోపించిన చంద్రబాబు ప్రస్తుతం వారిపై కపటప్రేమను చూపుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర బడ్జెట్‌ను మించిన విధంగా టీడీపీ మేనిఫెస్టోలో అలవికాని హామీలిస్తున్నారని, వీటికి ప్రజలు మోసపోవద్దన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచిన మరో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ పార్టీ పెట్టారని, ఆయనకు ఈ ఎన్నికల్లో ఁచెప్పురూ. గుర్తుతోనే తగిన బుద్ధిచెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న మబ్బు కుటుంబం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరడం శుభపరిణామన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (వైఎస్‌ఆర్ కాంగ్రెస్) పార్టీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా మంచి పథకాలన్ఙుమేనిఫెస్టోరూ.లో రూపొందించారని స్పష్టం చేశారు. జగన్ బాటలో పయనిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎంపీగా పోటీచేస్తున్న వరప్రసాద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గుండెలు హత్తుకునేలా ఆత్మీయుడైన తమ్ముడు మబ్బు చెంగారెడ్డిని హృదయపూర్వకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారూ. అని చెప్పారు. పది మందికి సాయం చేసే గొప్ప మనసు చెంగారెడ్డిదని, ఆయన పార్టీలోకి రావడం అభినందనీయమని తెలిపారు. ఆయన సేవలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించదని, భవిష్యత్‌లో ఆయనకు సమున్నత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు.
జగన్ నాయకత్వంలో స్వార్థ రాజకీయలకు అతీతంగా తిరుపతిని సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల పాటు మబ్బు కుటుంబాన్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మబ్బు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు.
మా అన్న మబ్బుదేవ నారాయణరెడ్డి అన్నా, మబ్బు కుటుంబం అన్నా ఎనలేని గౌరవం ఉందరూ.న్నారు. తాను తన అన్నను విభేదిస్తున్నట్టు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు. కాంగ్రెస్ పార్టీని, సిద్ధాంతాలను మాత్రమే విభేదించి బయటకు వచ్చా, మబ్బు కుటుంబం అన్నా, మా అన్న అన్నా ఎప్పటికీ గౌరవం ఉంటుందిరూ. అని స్పష్టం చేశారు. ఎంపీగా పోటీచేస్తున్న వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజానాయకుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చెంగారెడ్డి పార్టీలో చేరడం సంతోషమఅన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్‌కే బాబు, ఆదికేశవులురెడ్డి, అమరనాథరెడ్డి, మబ్బు యువసేన నాయకులు కాండ్ర సత్యనారాయణ, ఆర్‌ఆర్ శ్రీనివాసులు, వెంకటముని యాదవ్, పరందామ్, గుణశేఖర్, మహిళా నాయకురాలు పద్మజ తదితరులు పాల్గొన్నారు. మబ్బు యువసేన నాయకులు పెద్ద ఎత్తున పూలమాలలతో చెంగారెడ్డి, కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డిని సన్మానించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.