కరోనా భయంతో రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య | Nervous About Corona Retired Judge Commit Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

కరోనా భయంతో రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య

Published Fri, Oct 2 2020 7:16 PM | Last Updated on Fri, Oct 2 2020 8:22 PM

Nervous About Corona Retired Judge Commit Suicide In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా భయం ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో శుక్రవారం రిటైర్డ్‌ జడ్జి రామచంద్రారెడ్డి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మియాపూర్‌  పరిధిలో చోటుచేసుకుంది.

వివరాలు.. రిటైర్డ్‌ జడ్జి రామచంద్రారెడ్డి మియాపూర్‌లోని న్యూసైబర్‌ హిల్స్‌లో కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే తనకు కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న భయంతో రామచంద్రారెడ్డి తన ఇంట్లోని బెడ్‌రూంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా బెడ్‌రూంలో సూసైడ్‌ నోట్‌ కూడా లభ్యమైంది. తన వల్ల ఇంట్లో ఉన్న కుటుంబసభ్యలుకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్యహత్యకు పాల్పడుతున్నట్లు రామచంద్రారెడ్డి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement