నగరంలోని రామచంద్రారెడ్డి ఆసుపత్రికి మంగళవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలు, బాంబ్ స్క్వాడులు అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
బాంబు బెదిరింపు నేపథ్యంలో అటు ఆసుపత్రి వైద్యులు, ఇటు రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రికి వచ్చిన ఫోన్ కాల్ నిజమైనదా కాదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.