మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్ సాయం
సిద్దిపేట: కొండపాక మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డికి కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. అనారోగ్యం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన దీనస్థితిని చూసి కేసీఆర్ చలించిపోయారు.
ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయనకు ఇంటి స్థలం కూడా లేకపోవడంతో వెంటనే ఇంటి స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సాయం చేస్తానన్న మాట ప్రకారం రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని, డబుల్‌బెడ్ రూం ఇల్లు మంజూరు చేశారు. రూ.25 లక్షల చెక్కును మంత్రి హరీష్‌రావు రామచంద్రారెడ్డికి కొండపాకలో అందజేశారు. కాగా, కేసీఆర్ సాయానికి ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.