కేసీఆర్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి | Kcr to ensure that the election to retain | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి

Published Mon, Sep 22 2014 2:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

కేసీఆర్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి - Sakshi

కేసీఆర్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి

మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ఆర్‌జేడీ నియామక ప్రభుత్వ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎస్.రాజీవ్ శర్మ అధ్యక్షతన వేసిన కమిటీ రెగ్యులరైజేషన్‌కు ఐదు సంవత్సరాలు ప్రామాణికంగా తీసుకుంటామని సూచనప్రాయంగా చెప్పడం సరికాదని అన్నారు.

1993-94సంవత్సరంలో 600 పనిదినాలు మాత్రమే పరిగణలోకి తీసుకొని క్రమబద్ధీకరణ చేశారని పేర్కొన్నారు. గోల్కొండ సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులందరిని క్రమబద్ధీకరిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. మానవతా ధృక్పదంతో కాంట్రాక్టు ఉద్యోగులందరిని క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో మారుతి, అరవింద్, రవికుమార్, బాలునాయక్, మహేష్‌శెట్టి, జైపాల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement