తిరుమలలో శ్రీవారికి మరోసారి సమైక్యాంధ్ర సెగ తగలనుంది. ఈ నెల 24న ప్రైవేట్ వాహనాలను సైతం తిరమల కొండపైకి వెళ్లనివ్వమని ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ రామచంద్రారెడ్డి శనివారం తిరుపతిలో వెల్లడించారు. అందుకు శ్రీవారి భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను సైతం అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. తిరుమలలోని కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు 24వ తేదీ తిరుపతిలోనే ఉండాల్సి వస్తుందన్నారు. అవసరమైతే వారికి తిరుపతిలోనే ఉచిత వసతి సౌకర్యం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని రామచంద్రారెడ్డి వెల్లడించారు.