కర్నూలులో భారీ దోపిడీ | big robbery in kurnool district atmakur | Sakshi
Sakshi News home page

కర్నూలులో భారీ దోపిడీ

Published Tue, Apr 26 2016 10:06 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

big robbery in kurnool district atmakur

ఆత్మకూరు: కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆత్మకూరు పట్టణం గాంధీపార్క్కు చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు భారీ చోరీకు పాల్పడ్డారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు మత్తు మందిచ్చి సొత్తును దోచుకుపోయారు.

బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు ఉండడంతో రామచంద్రారెడ్డి దంపతులు సోమవారం బ్యాంకు లాకర్ నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు తీసుకువచ్చారు. సోమవారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. కుటుంబ యజమాని, ఆయన భార్యకు మేల్కువ రావడంతో వారికి మత్తు మందిచ్చారు. అనంతరం బీరువాలోని 70తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. అయితే, బీరువాలోనే ఉంచిన రూ.3 లక్షల నగదును మాత్రం వదిలి వెళ్లడం గమనార్హం. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement