big robbery
-
బ్యాంకులో పట్టపగలే రూ.18.80 కోట్ల దోపిడీ
ఇంఫాల్: మణిపూర్‌లోని ఓ బ్యాంకులో గురువారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని సాయుధ దుండగులు సుమారు రూ.18.80 కోట్లను దోచుకెళ్లారు. ఉఖ్రుల్ పట్టణంలోని వ్యూలాండ్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. రిజర్వు బ్యాంకు అధికారులు ఉఖ్రుల్ జిల్లాలోని అన్ని ఏటీఎంలకు అవసరమైన నగదును వ్యూలాండ్ బ్రాంచిలో నిల్వ ఉంచుతుంటారు. గురువారం సాయంత్రం 5.40 గంటల సమయంలో అత్యాధునిక ఆయుధాలతో ముసుగులు ధరించిన దుండగులు బ్యాంకు సిబ్బంది ప్రవేశించే గేట్ గుండా లోపలికి ప్రవేశించారు. ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదిరించి వాష్‌రూంలో బంధించారు. క్యాషియర్‌కు తుపాకీ గురిపెట్టి, క్యాష్ వాల్ట్‌ను తెరిపించారు. మొత్తం రూ.18.80 కోట్లను ఎత్తుకెళ్లి పోయారు. -
కొత్తపేటలో భారీ చోరీ
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాలకు కూతవేటు దూరంలోని కొత్తపేటలో సోమవారం ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగలకొట్టి బీరువాను బద్దలు కొట్టి అందులోని 51 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. బాధితులు పోలీసులకు అందించిన వివరాల మేరకు...వేటపాలెం మండలం కొత్తపేట ప్రధాన కూడలి అయిన పంచాయతీరాజ్ శాఖ భవనాల సముదాయం వద్ద గోగినేని హనుమంతరావు, ధనలక్ష్మి వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. హనుమంతరావు కలప వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమారై ఉన్నారు. కుమారుడు వ్యాపారం నిమిత్తం చెన్నైలో నివసిస్తుండగా కుమారై అమెరికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో ధనలక్ష్మి అనారోగ్యంతో నెలన్నర క్రితం చెన్నైలోని తన కుమారుడి వద్దకు వెళ్లింది. ఆమె భర్త హనుమంతరావు మాత్రం ఇంటివద్దనే ఉన్నాడు. అయితే 15 రోజులు క్రితం హనుమంతరావు కూడా చెన్నైలోని కుమారుడి వద్దకు వెళ్లాడు. చెన్నైకి వెళ్లిన అతనికి కూడా అనారోగ్యంగా ఉండడంతో కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో వారికి శ్రేయోభిలాషిగా ఉండే వ్యక్తి ప్రతిరోజు హనుమంతరావు ఇంటికి వచ్చి బాగోగులు చూస్తుంటాడు. రోజు మాదిరిగా సోమవారం ఉదయం వచ్చిన అతనికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలకొట్టి ఉండడం గమనించాడు. దీంతో అతడు హనుమంతరావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన హనుమంతరావు తనకు ఉన్న పరిచయాలతో స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, సీఐలు నాగ మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, ఇంకొల్లు సీఐ రాంబాబు, ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సమాచారం అందుకున్న డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చీరాలకు చేరుకున్న బాధితులు. ఇంటిలో దొంగతనం జరిగిందన్న సమాచారం అందుకున్న బాధితులైన హనుమంతరావు, ధనలక్ష్మి దంపతులు సాయంత్రం 3 గంటలకు చెన్నై నుంచి చీరాలకు చేరుకున్నారు. అప్పటి వరకు ఆ ఇంట్లో కోటి రూపాయలు నగదు, బంగారం దొంగలు అపహరించారనే పుకార్లు పట్టణంలో షికార్లు చేశాయి. బాధితులు వచ్చే వరకు ఇతర వ్యక్తులు ఎవ్వరిని ఆ ఇంట్లోకి వెళ్లనీయలేదు. బాధితులు వచ్చి పగిలిన బీరువాను పరిశీలించారు. అలానే కొన్ని బ్యాంకులకు వారు స్వయంగా వెళ్లి లాకర్లను పరిశీలించుకున్నారు. అన్నింటినీ పరిశీలించుకున్న తరువాత 51 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదు చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఇంటికి కన్నం వేసేందుకు ప్రయత్నం.. దొంగతనం జరిగిన ఇంటికి కూత వేటు దూరంలోనే మరో ఇంట్లో చోరీకి దొంగలు విశ్వ ప్రయత్నం చేశారు. ఎవరూ ఇంట్లో లేరని గుర్తించిన దొంగలు ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతకూ తాళం పగలకపోవడంతో హనుమంతరావు ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. సీసీ కెమెరా లేకపోవడంతోనే.. కొత్తపేటలోని ప్రధాన కూడలిలో జనం నిత్యం జనసంచారం ఉండే ప్రదేశంలో దొంగతనం జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పెద్ద భవంతిలోనే దొంగలు పడి దోచుకుంటే సామాన్యుల ఇళ్లు దొంగలకు పెద్ద పనికాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పెద్ద భవంతికి సీసీ కెమెరా లేకపోవడం కూడా దొంగలకు కలిసి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయితే దొంగతనం జరిగిన ఇంటి ముందు పోలీసులు ఏర్పాటు చేసిన భారీ సీసీ కెమెరా ఉంది. దొంగలు సీసీ పుటేజీలో పడే అవకాశం ఉంది. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ప్రజలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే దొంగతనాలు జరుగుతున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. ఊరికి వెళ్లే సమయంలో లాక్డ్ మానిటరింగ్ సిస్టంను ఉపయోగించుకుని ఉంటే దొంగతనం జరిగి ఉండేది కాదని, పోలీసులు నిరంతరం ఆ ఇంటిని కాపాలా కాస్తుండేవారని డీఎస్పీ తెలిపారు. -
డోన్‌లో భారీ చోరీ
డోన్ రూరల్ :పట్టణంలోని ఇందిరానగర్‌కాలనీలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చొరబడి 60 తులాల బంగారు ఆభరణాలు, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల మేరకు..కాలనీలో నివాసముంటున్న గోపాల్‌శర్మ మల్కాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పాఠశాలకు సెలవులు రావడంతో ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా కుమార్తెను చూసేందుకు గురువారం హైదరాబాద్ వెళ్లాడు. ఆ తర్వాత విజయవాడలో సమీప బంధువు రిటైర్మెంట్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తలుపులు బలవంతంగా తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఆదివారం ఉదయం గోపాల్‌శర్మ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చాడు. అయితే తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి కిటికీలో తొంగి చూడగా బీరువాలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్లు అనుమానించి పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ రాజగోపాల్‌నాయుడు, ఎస్ఐ.చంద్రబాబునాయుడు అక్కడికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నల్లగొండలో భారీ దోపిడీ
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి నుంచి రూ.6.30 లక్షలను దొంగలు దోచుకెళ్లిన ఘటన వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. స్థానిక పెట్రోల్ బంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి క్యాష్ తీసుకుని ఇంటికెళ్తుండగా దొంగలు దాడికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లును తీవ్రంగా గాయపరచిన దొంగలు అతని వద్ద ఉన్న రూ.6.30 లక్షలను తీసుకుని ఉడాయించారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పిఠాపురంలో భారీ చోరీ
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో భారీ చోరీ జరిగింది. పిఠాపురం అగ్రహారానికి చెందిన నెల్లిపూడి వెంకటరమణ కటుంబం కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌కు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో వారు తిరిగి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తలుపులు తీసి ఉండగా లోపల ఓ వ్యక్తి కనిపించడంతో కేకలు వేశారు. దీంతో అతడు పరారయ్యాడు. 69 గ్రాముల బంగారు ఆభరణాలు, 288 గ్రాముల వెండి వస్తువులు, రూ.45వేల నగదు చోరీకి గురైనట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
కర్నూలులో భారీ దోపిడీ
ఆత్మకూరు: కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆత్మకూరు పట్టణం గాంధీపార్క్కు చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు భారీ చోరీకు పాల్పడ్డారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు మత్తు మందిచ్చి సొత్తును దోచుకుపోయారు. బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు ఉండడంతో రామచంద్రారెడ్డి దంపతులు సోమవారం బ్యాంకు లాకర్ నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు తీసుకువచ్చారు. సోమవారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. కుటుంబ యజమాని, ఆయన భార్యకు మేల్కువ రావడంతో వారికి మత్తు మందిచ్చారు. అనంతరం బీరువాలోని 70తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. అయితే, బీరువాలోనే ఉంచిన రూ.3 లక్షల నగదును మాత్రం వదిలి వెళ్లడం గమనార్హం. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. -
నెల్లూరులో భారీ చోరీ
నెల్లూరు: నెల్లూరు పట్టణంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక పోలీస్ కాలనీలో నివాసం ఉంటున్న మురళీకృష్ణ అనే బ్యాంకు ఉద్యోగి ఇంట్లో శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి రూ.25 లక్షల విలువైన 953 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లాట్లో భారీ లూటీ..
తిరుపతి: తిరుపతి ఓ సెల్‌ఫోన్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. స్థానిక తిలక్ రోడ్డు మున్సిపల్ ఆఫీసు జంక్షన్ వద్ద ఉన్న లాట్ మొబైల్స్‌లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సెక్యూరిటీ గార్డు ఆదివారం రాత్రి త్వరగా ఇంటికి వెళ్లిపోయాడు. ఇదే గమనించిన దుండగులు దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి రూ.8.50 లక్షల విలువైన సెల్ఫోన్లను దోచుకెళ్లారు. సోమవారం ఉదయం గమనించిన దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో ఈ భారీ చోరీ జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పండుగకు వెళ్లి వచ్చేసరికి.. భారీగా దోచేశారు
రామచంద్రాపురం: దసరా సెలవులకు బంధువుల ఇంటికి వెళ్లి పండుగ చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నవారి ఆనందాన్ని దొంగలు అడియాసలు చేశారు. ఇంటికి తాళాలు వేసి వెళ్లినవారు.. ఇంటికి వచ్చేసరికి తలుపులు బార్లా తెరిచి ఉండటంతో కంగుతినడం వాళ్ల వంతైంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రుమిల్లి గ్రామంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ శేషగిరిరావు నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం వారు ఇంటికి చేరుకునేసరికి తలుపులు పగులగొట్టి..ఇంటిలోని వస్తువులన్నీ చిందరబందరగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు కనిపించక పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బోయినపల్లిలో భారీ చోరీ
-
బోయినపల్లిలో భారీ చోరీ
హైదరాబాద్ : బోయినపల్లిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి ఓ ఇంట్లో భారీ చోరికి పాల్పడ్డారు. 60 తులాల బంగారం, రూ.60 వేల నగదును దోచుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో కుటుంబసభ్యులు అందరు ఇంట్లోనే నిద్రపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుస చోరీలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో భారీ చోరి