నల్లగొండలో భారీ దోపిడీ | attack on petrol bank cashier in nalgonda six lakhs robbery | Sakshi
Sakshi News home page

నల్లగొండలో భారీ దోపిడీ

Published Sat, Jul 2 2016 11:21 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

attack on petrol bank cashier in nalgonda six lakhs robbery

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి నుంచి రూ.6.30 లక్షలను దొంగలు దోచుకెళ్లిన ఘటన వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెంలో చోటుచేసుకుంది.

స్థానిక పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి క్యాష్ తీసుకుని ఇంటికెళ్తుండగా దొంగలు దాడికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లును తీవ్రంగా గాయపరచిన దొంగలు అతని వద్ద ఉన్న రూ.6.30 లక్షలను తీసుకుని ఉడాయించారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement