తిరుపతి: తిరుపతి ఓ సెల్‌ఫోన్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. స్థానిక తిలక్ రోడ్డు మున్సిపల్ ఆఫీసు జంక్షన్ వద్ద ఉన్న లాట్ మొబైల్స్‌లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
సెక్యూరిటీ గార్డు ఆదివారం రాత్రి త్వరగా ఇంటికి వెళ్లిపోయాడు. ఇదే గమనించిన దుండగులు దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి రూ.8.50 లక్షల విలువైన సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు. సోమవారం ఉదయం గమనించిన దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో ఈ భారీ చోరీ జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.