రామచంద్రాపురం: దసరా సెలవులకు బంధువుల ఇంటికి వెళ్లి పండుగ చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నవారి ఆనందాన్ని దొంగలు అడియాసలు చేశారు. ఇంటికి తాళాలు వేసి వెళ్లినవారు.. ఇంటికి వచ్చేసరికి తలుపులు బార్లా తెరిచి ఉండటంతో కంగుతినడం వాళ్ల వంతైంది.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రుమిల్లి గ్రామంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్ శేషగిరిరావు నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం వారు ఇంటికి చేరుకునేసరికి తలుపులు పగులగొట్టి..ఇంటిలోని వస్తువులన్నీ చిందరబందరగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు కనిపించక పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పండుగకు వెళ్లి వచ్చేసరికి.. భారీగా దోచేశారు
Published Mon, Oct 26 2015 11:10 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM
Advertisement
Advertisement